You are here
Home > ది ఫోర్త్ ఎస్టేట్ > సొంత ఊర్లో యువకుల మరణాలపై జనసేన నోరు మెదపడా…?

సొంత ఊర్లో యువకుల మరణాలపై జనసేన నోరు మెదపడా…?

మొగల్తూరు ఆనంద ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ పొట్టన పెట్టుకున్న యువకుల మరణాలపై ప్రశ్నించే పార్టీ సమాధానం ఏది.. ప్రశ్నించేందుకే తమ పార్టీ అని.. ఎక్కడ ఎప్పుడు ఏ అన్యాయం జరిగినా నిగ్గదీసి అడుగుతానని.. నినదించడం.. నిలదీయడమే.. జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశ్యం అని చెప్పిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంత గ్రామంలోనే జరిగిన మారణహోమానికి ఏ సమాధానం ఇస్తారు..?ఈ మారణహోమం జరుగుద్ది అని ముందే ఊహించి ఓ విఫ్లవంలా ఓ యువకుడు పల్లెలను.. ప్రజలను కాపాడాలని పోరాటం చేస్తే అతడిని కటకటాల పాలు చేశారు. ప్రభుత్వానికి ఎదురు తిరిగితే ప్రాణాలు పోవాల్సిందేనా..? అన్యాయంగా కేసుల పాలు కావాల్సిందేనా..? అన్ని ప్రశ్నలలాగే అంతా అయిపోయాక తీరిగ్గా వచ్చి ప్రశ్నిస్తారా..? లేక అభిమానులను గుండెల్లో పెట్టి చూసుకునే రియల్ హీరోలా వెంటనే స్పందించి నిజాన్ని నిగ్గుతేలుస్తారా..? పవనుడి ముందు ఇప్పుడు వంద ప్రశ్నలు ఉప్పెనలా ముంచెత్తేందుకు సిద్దంగా ఉన్నాయి. ఇక రీలో.. రియలో తేల్చుకోవాల్సింది పవర్ స్టారే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు….. ఓ సీనియర్ జర్నలిస్ట్ లేఖ

పవన్ జీ… మీరి మధ్య అనంతపురం సభలో మాట్లాడుతూ మీకు ఎలాంటి నాయకులు కావాలో చెప్పారు. యుద్ధట్యాంకులు ఎదురొచ్చినా, ఫిరంగులు దూసుకొచ్చినా నిలబడి పోరాడే యువనాయకుల కోసమే ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. అలాంటి యువకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. నాకు తెలిసిన ఓ యువవిప్లవకారుడి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలనిపించింది. మీకే ఎందుకు చెప్పాలనిపించిందంటే.. అతని ప్రస్తుత కారాగార పరిస్థితికి మీరూ పరోక్ష కారణం కనుక..!!
అవును అతను మీరు కోరుకున్న లక్షణాలున్న యువకుడే. పదేళ్లక్రితం జర్నలిస్టుగా కెరియర్ ప్రారంభించినప్పట్నుంచి తన అణువణువునూ విశ్వమానవుడు ‘చె గెవారా’తో నింపుకున్న అరుదైన యువకుడు. చె గెవారాను శ్వాసించడం కాదు.. ఆ విప్లవకారుడి అడుగుజాడల్లో నడిచాడు. జర్నలిస్టుగా అణగారిన వర్గాల గొంతుక తానయ్యాడు. నాటి అమాత్యులు కన్నెధారకొండపై కన్నేస్తే గిరిజనులకు అండగా ఆ కొండకు తన కథనాలతో రక్షణకవచమయ్యాడు. జర్నలిస్టుగా తాను అనుకున్నది పూర్తిగా చెయ్యలేకపోతున్నానని భావించినప్పుడు ఆ వృత్తి నుంచి బయటికొచ్చి ‘చె గెవారా’ సిద్ధాంతాలను యువతలోకి ఎక్కించడమే లక్ష్యంగా పాలకొల్లులో విశ్వమానవ వేదిక స్థాపించాడు. సేవా కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై పోరాటాలు రెండేళ్లలో ఆ వ్యక్తిని ఓ శక్తిగా మార్చాయి.
ఈ క్రమంలోనే తన కళ్లముందే మెగా ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ రావటం.. అది ప్రకృతికీ, ప్రజలకూ తీరని నష్టమని భావించి ఉద్యమించాడు. అప్పటిదాకా సేవాకార్యక్రమాలతో యువతనంతా ముందుండి నడిపిన వ్యక్తి ఏకంగా జనంలోకి వెళ్లి ఉద్యమించడంతో అధికాపార్టీ ఎమ్మెల్యేకి ఈ యువ ఉద్యమకారుడు రాజకీయ ప్రత్యర్థిలా కనిపించాడు.

మీరు చెప్పిన అధికారమనే యుద్ధ ట్యాంకులు దాడి చేశాయి. కేసులు ఫిరంగుల్లా వేధిస్తే అతను వెనక్కి తగ్గలేదు. ప్రధాన మీడియా అటువైపు దృష్టి పెట్టకముందే మెగా ఆక్వాపుడ్ పార్క్ ఎంతటి ప్రమాదకరమో ఫేస్ బుక్ వేదికగా నిజానిజాలను బయటపెట్టాడు. ఆ ప్రాంత జనంపై జరుగుతున్న దాడులు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా నినదించాడు. ఆ క్రమంలోనే స్థానిక పరిస్థితుల్ని ఎదురించేందుకు తన శక్తి సరిపోదని భావించి బాధిత గ్రామస్తుల్ని తీసుకొని నేరుగా హైదరాబాద్ వచ్చి మిమ్మల్ని కలిశారు. అతను ఏం చెప్పాడో, మీరు ఏం నమ్మారో అంతా మీకు తెలుసు. నాడు మిమ్మల్ని కలవడమే అధికారపక్షం దృష్టిలో అతను చేసిన ప్రధాన తప్పు. పశ్చిమ గోదావరి జిల్లా జోన్ పేజీలను దాటని ఆక్వా ఫుడ్ పార్క్ సమస్య రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశం కావడంతో అతన్నో ప్రమాదకరమైన వ్యక్తిగా భావించి వేటాడటం మొదలుపెట్టారు. ఈ విశ్వమానవుడు తాగి దాడి చేశాడంటూ ఓ అమాయక ఎస్సీ కుర్రాడు అట్రాసిటీ కేసు పెట్టాడు. దారిన పోయే వ్యక్తి తనను ఆశ్రమంలో చేరమని వేధిస్తున్నారని కేసు పెట్టాడు. పాలకొల్లులో వీధివీధినా ఆ యువకుడు దళిత వ్యతిరేకి, అభివృద్ధి నిరోధక శక్తి అనే ఫ్లెక్సీలు వెలిశాయ్.

ప్రపంచ మానవులంతా సమానమేనన్న సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి కుల సంఘాలను రెచ్చగొడుతున్నాడనే కేసు పెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు.. రోజుకో కేసు ఇప్పటికీ పెడుతూనే ఉన్నారు. మీరు గమనించారా.. ఈ కేసుల్లో ఎక్కడా ఆక్వాఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాడిన కేసు మాత్రం లేదు. ఎందుకో తెలుసా.. ఆ కేసులో అరెస్ట్ చేస్తే ‘నేనూ తుందుర్రు వచ్చి అరెస్టవుతా’నని ఆ రోజు ప్రెస్ మీట్ లో మీరన్న మాటలే కారణం. అందుకే అది తప్ప సర్వ కేసులూ పెట్టి అరెస్ట్ చేసి ఇప్పుడు నరసాపురం సబ్-జైల్లో పెట్టారు. అదే సమయంలో విశ్వమానవ వేదికను మూయించే ప్రయత్నం చేస్తున్నారు.


ఇప్పటికే వృద్ధాశ్రమాన్ని ఎందుకు మూసి వేయకూడదో చెప్పాలంటూ కలెక్టర్ నోటీసులిచ్చారు. పెట్టిన కేసులన్నీ చూపుతూ అతి త్వరలోనే రౌడీషీట్ తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే రౌడీషీట్ ఓపెన్ అయిన వ్యక్తి ఎలాంటి స్వచ్ఛంద సంస్థలూ నిర్వహించడానికి వీల్లేదు. విశ్వమానవ వేదికను లేకుండా చేస్తే ఆ విశ్వమానవుడిని లేకుండా చేయడం తేలికని భావిస్తున్నారు. మీకు ఈ లేఖ రాయడానికి ప్రధాన కారణం ఇదే. ఓ మహోన్నత లక్ష్యంతో పనిచేస్తున్న వ్యక్తిని జైల్లో పెట్టి.. అతను స్థాపించిన విశ్వమానవ వేదికను మూసేస్తే ఎవరికి లాభం..? వందలాది మంది యువతలో స్ఫూర్తి నింపుతున్న వ్యక్తిపై కక్ష సాధింపు దేనికి సంకేతం..?
ఇప్పుడు చెప్పండి.. యుద్ధ ట్యాంకులకూ, ఫిరంగులకూ ఎదురొడ్డి నిలబడ్డ యువకుల్ని ఎవరు కాపాడగలరు..? విశ్వమానవుడు మల్లుల సురేష్ కి మీరిచ్చే సలహా, సందేశాలను వినాలని ఉంది. అతను జైల్లో ఉన్నా వేలాది మెదళ్లలో జ్వలిస్తూనే ఉన్నాడు. ఆ ప్రభావంతోనే అడుగుతున్నా.. జనం మధ్య జనం కోసం నిలబడ్డ రియల్ హీరోలను అక్రమ కేసుల నుంచి కాపాడే శక్తి జనసేనకు ఉందా..? ఎలాంటి తప్పు చెయ్యకపోయినా 8 ఏళ్లు జైల్లో పెట్టి అతని జీవితం సర్వనాశనమయ్యాక నిర్దోషివంటూ విడుదల చేసే శక్తి ఈ వ్యవస్థకు ఉందనేందుకు సత్యంబాబే ఉదాహరణ. ఇలాంటి ఇనుప చక్రాల వ్యవస్థ కింద నలిగిపోకుండా మల్లుల సురేష్ లాంటి శక్తివంతమైన యువకుల్ని ఎలా కాపాడుకోవాలి..??? పవన్ ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరా.. ఇస్తే ఈ లేఖకు సమాధానం ఎంత త్వరగా వస్తుందో చూద్దాం. 

Related Posts
5 రూపాయల డాక్టరు ఇకలేడు.. నివాలి అర్పించిన అశేషజనవాహిని.!!
చెన్నై లోని వాషర్ మెన్ పేట లో ఉండే ఒక సాధారణ డాక్టర్ వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజల అభిమానం సొంతం చేసుకున్నాడంటే నమ్మశక్యం కాదేమో కానీ, ఆ ఘనత సొంతం చేసుకున్నాడు 5 రూపాయల డాక్టర్ జయచంద్రన్. అవును ...
READ MORE
తెలంగాణ మిస్సైల్  “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
కల్వకుంట్ల తారక రామరావు.. జర్నలిజంపవర్ చూసిన కోణంలో ఈ పుట్టిన రోజు శుభాకాంక్షల్లు ప్రత్యేకమైన విషెస్ లు ఆయనకు నచ్చవు. అయినా జనం మెచ్చే యువ నేతకు మా వంతు అక్షర శుభకాంక్షలు. కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పరిచే మహత్తర ...
READ MORE
పాకిస్తాన్ లో హిందువులపై ఆగని హింసాకాండ.!!
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువుల పరిస్తితి రోజు రోజుకు మరింత అధ్వాన్నంగా తయారైతుండడం ఆందోళన కలిగిస్తున్నది. హిందువుల పై ఈ దారుణ వివక్ష స్వయంగా పాకిస్తాన్ అధికారిక నాయకుల సమక్షం లోనే జరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే ఎన్నో సార్లు పాకిస్తాన్ ...
READ MORE
హద్దులు దాటుతున్న కుటుంబ పాలన, ప్రభుత్వ ఇళ్ల కాలనీలకు చంద్రబాబు మనవడి పేరు.!!
పాలకుల్లో కుటుంబ పాలన పెచ్చుమీరితే ఎంతటి పరిస్థితులు ఏర్పడుతాయో ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పాలన అలాగే ఉంది.సాధారణంగ కుటుంబ పాలన అంటే కొడుకుకో కూతురుకో స్థాయి లేకున్నా పదవులను కట్టబెడుతుంటారు.కానీ కుటుంబ పాలనలో ఆనాటి దొరలు నవాబుల పాలనను తలదన్నేలా ...
READ MORE
అంబర్ పేట్ నియోజకవర్గం భాజపా కన్వీనర్ గ ఏడెల్లి అజయ్ కుమార్..!!
భాజపా తెలంగాణ రాష్ట్రం ముఖ్య నేత ఎంఎల్ఏ జి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్ పేట్ నియోజకవర్గానికి పార్టీ కన్వీనర్ గ ఏడెల్లి అజయ్ కుమార్ నియమితులయ్యారు. గత మూడు దఫాలుగ ఇక్కడ కిషన్ రెడ్డి భాజపా గుర్తు ...
READ MORE
చైనా యాప్ టిక్ టాక్ పై నిషేధం విధించిన ప్రభుత్వం.!!
చైనా కు సంబంధించిన టిక్ టాక్ యాప్ ను తమ స్టోర్ల నుండి నిషేధించాలని గూగుల్ మరియు యాపిల్ సంస్థ లకు ఆదేశాలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ యాప్ వల్ల పలువురు ప్రాణాలు కోల్పోవడం జరిగిన కాపణంగ ఇప్పటికే తమిళనాడు హైకోర్ట్ ...
READ MORE
ఎన్ని కష్టాలొచ్చాయో.. కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది.
జీవితం ఎన్నో కష్టాలను దిగమింగి ఎన్నో నష్టాలను చూసి చివరికైతే ఆనందాన్ని సంతోషాన్ని పంచుతుందంటారు.. కానీ ఓ కుటుంబంలో మాత్రం కష్టాలకే కన్నీలొచ్చే కష్టాలు ఎదురొచ్చాయి.. నష్టాలను పూడ్చలేని బాధలొచ్చాయి. కుటుంబానికి కుటుంబమే శ్వాసను ఆపుకునేంత దుర్బర పరిస్థితిల్లో చావే శరణ్యం ...
READ MORE
కారు కి నై చెప్పి కమలానికి జై కొట్టిన కేసిఆర్ సొంత అత్తగారి ఊరు.. ఆసక్తికర విషయం.!!
మొన్నటి పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల సంధర్భంగ తెలంగాణ రాష్ట్రం లో ఓ ఇంట్రస్టింగ్ వార్త వైరల్ గ మారింది. కరింనగర్ పార్లమెంట్ నియోజకవర్గం లోని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కుదురుపాక గ్రామం ప్రత్యేకమైనది ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ...
READ MORE
మళ్లీ మొదటికొచ్చిన పంచాయితీ.. గ్రూప్ 2 విషయంలో మౌనంవహిస్తున్న టీఎస్పీఎస్సీ.
ఎంసెట్.. సింగరేణి అసిస్టెంట్ పోస్టులు.. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. తాజాగా గ్రూప్ 2. ఉద్యోగం ఏదైనా ప్రభుత్వ మీద నింద మాత్రం పడకుండా పోవడం లేదు. నిష్పక్షపాతంగా నిర్వహించామని డబ్బా కొట్టుకుంటున్న టీఎస్పిఎస్సీ గ్రూప్ 2 విషయంలో అవకతవకలు జరిగాయని వాదిస్తున్నా ...
READ MORE
కమ్ముకుంటున్న అనుమానాలు.. పాప ప్రాణాలతో క్షేమంగా బయటకి వస్తుందా..?
రంగారెడ్డి జిల్లా బోరు బావి ఘటన రాష్ట్రంలో ఉత్కంఠతకు తెరలేపుతోంది. క్షణం క్షణం గడుస్తున్నకొద్ది ఆశలు మెల్లి మెల్లిగా సన్న గిల్లుతున్నాయి. ఇప్పటికే 50 గంటలు గడిచిపోవడంతో పాప ప్రాణాలపై ఆశలు కోల్పోయేలా చేస్తోంది. గంట గంటకు సిట్యువేషన్ మారిపోతుంది. మొత్తం ...
READ MORE
సొసైటీ కి బిగ్ బాస్ షో లు ఎంతవరకు అవసరం.? యూత్ ఏమంటోంది.??
టీవీ ఛానల్ వారు వారి రేటింగ్ పెరగడం కోసం రకరకాలుగా ప్రోగ్రాములు చేస్తూ ఉంటారు. వారి టార్గెట్ ఎప్పుడూ ఇంట్లో ఉండే మహిళలు యువత మరియు స్టూడెంట్స్. ఈ కోవలోనే మొదలైన రియాలిటీ షో బిగ్ బాస్ షో. ఈ రియాలిటీ షో లు ...
READ MORE
త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ కి అటల్ బిహారీ వాజ్ పేయి నామకరణం.!!
భారతదేశం గర్వించదగ్గ నేత ఆధునిక అభినవ జాతిపిత భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి స్మారకార్థం, ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న పూర్తి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరానికి కేంద్ర ప్రభుత్వం అటల్ జి పేరును పెట్టనున్నటు రాజకీయ వర్గాల్లో చర్చ ...
READ MORE
మహారాష్ట్ర లో హిందూ సాధువుల పై రాక్షస దాడి ఆపై హత్య.! ఉద్ధవ్ సర్కార్ పై సర్వత్రా ఆగ్రహం.!!
మహారాష్ట్ర లో ఒక అంత్యక్రియల కార్యక్రమానికి హాజరై వస్తున్న హిందూ సాధువుల వాహనం పాల్గర్ జిల్లా లో మొరయించగా.. అక్కడ ఆ వాహనంలో ఉన్న ఇద్దరు సాధువులు మహరాజ్ కల్ప వృక్ష గిరి, మహరాజ్ సుశీల్ గిరి మరియు వారి వాహనం ...
READ MORE
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ కాదేవి భావవ్యక్తీకరణ కు అడ్టు. అయితే శృతిమించితే మాత్రం తిప్పలు తప్పవంటున్నారు పోలీస్ లు. తాజాగా వరుస పెట్టి జరుగుతున్న సోషల్ మీడియా ఘటనలతో వేగం పెంచారు. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా అందుకు ...
READ MORE
సామాన్యుడి సంపాద‌న‌కి ఎస‌రు పెడుతున్న బ్యాంకులు.. స‌ర్ ఛార్జ్ తీరు చూస్తే దిమ్మ తిర‌గాల్సిందే.
బ్యాంకులు స‌ర్ ఛార్జ్ లు విధించేందుంకు సిద్ద‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ బ్యాంకు ఆ బ్యాంకు అని తేడా లేకుండా అన్ని బ్యాంకులు త‌మకు న‌చ్చిన తీరుగా సేవా రుసుం విధించి సామాన్యుడి క‌ష్టార్జితానికి శ‌ఠ‌గోపం పెట్టేసాయి. మ‌రీ ఏ బ్యాంకు ...
READ MORE
సగం తాగి ఉమ్మేసిన పాలను జనాలకు అమ్ముతున్న మహ్మద్ సోహైల్ అరెస్ట్.!!
హైదరాబాద్ డబిర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో జహంగీర్ డైరీ ఫాం నీ నడిపిస్తున్న మహ్మద్ సోహైల్ అనే వ్యక్తి రోజూ జనాలకు అమ్మే పాలను అపరిశుభ్రం చేస్తూ పాలు పితకగానే ఆ పాలను ఎంగిలి చేసి అంతే కాకుండా పశువులు ...
READ MORE
అవినీతిలో అగ్ర స్థానం భారత్ దే…
అవును అవినీతిలో మనమే టాప్.. ఎందులో టాప్ లో లేకపోయిన ఇందులో మాత్రం భారత్ ను అగ్ర స్థానం లో మనమే స్థానం దక్కేలా చేస్తాం. అడిగినంత లంచం ఇచ్చి మరీ టాప్ ర్యాంక్ దక్కించుకుంటాం. ఇది  మన దౌర్భాగ్యం. ఆసియా ...
READ MORE
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అజాత శత్రువు రచ్చ శ్రీనన్న.!!
ఎటువంటి సామాజిక సంస్థ అయినా లేదా రాజకీయ సంస్థ అయినా సరే అందరినీ మెప్పించడం అసాధ్యం, ఎంత మంచి మార్గం ఎంచుకున్నా ఎవరో ఒకరు వ్యతిరేకిస్తారు. కానీ నిజంగానే అందరినీ ఒప్పించి మెప్పించి అందరి మనసులో స్థానం సంపాదించడం జరిగితే అది ...
READ MORE
ఏబీవీపీ నగర కార్యదర్శిగ పగిడిపల్లి శ్రీహరి
ABVP గ్రేటర్ హైదరాబాద్ మహా సభలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.ఈ మహా సభలలో గ్రేటర్ హైదరాబాద్ కార్యవర్గాన్ని ఎన్నుకోవటం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మహా నగర అద్యక్షులు గా ఆచార్య శంకర్ (ఓయూ అధ్యాపకులు ) గ్రేటర్ హైదరాబాద్ మహా ...
READ MORE
ఇంట్లో ఒంట్లో అంతా కల్తీనే.. కాదేదీ “కల్తీ”త్వానికి అనర్హం.!!
మీ ఇంట్లో స్వఛ్ఛమైన నెయ్యి వాడుతున్నారా..! బహుశా అది జంతువుల కొవ్వుతో తయారై ఉండొచ్చు.? మీ పిల్లలు ప్రతిరోజూ స్వచ్చమైన ఆవు పాలే తాగుతారా..! బహుశా ఆ పాలు యూరియా, నూనే, కెమికల్స్ తో చేసి ఉండొచ్చు.? ఇలా ఒకటి రెండు వస్తువులు కాదు దాదాపు అన్ని ...
READ MORE
మహనీయుల జయంతి సందర్భంగా సెలవులు అవసరమా…?
గాంధీ జయంతి సెలవు.. గాంధీ వర్దంతి సెలవు అంబెద్కర్ జయంతి సెలవు.. అంబెద్కర్ వర్దంతి సెలవు.. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ల నుండి మొన్నటి అబ్దుల్ కలాం జీ వరకు మహనీయుల పుట్టిన రోజులు.. అమరులైన రోజులు ప్రభుత్వాలకు సెలవు. ...
READ MORE
ఎమ్మెల్యే టిక్కెట్లు మంత్రి పదవులు ఎవరికి దక్కాయి? సోషల్ మీడియా లో రచ్చ రచ్చ.!
నేడు జూన్ 2 మలిదశ ఉద్యమం విజయం సాధించడం తో నాటి కేంద్రం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి రాష్ట్రం సాధించారు తెలంగాణ ఉద్యమకారులు. ఆ తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో లోకల్ సెంటిమెంట్ వల్ల తెరాస పార్టీ అధికారం ...
READ MORE
డా. సౌమ్యకు యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్-2019 అవార్డ్ ప్రదానం.!!
ఉస్మానియా యూనివర్శిటీ లో ఫోరేన్సిక్ సైన్స్ విభాగంలో పని చేస్తున్న డా. సౌమ్యకు 2019 సంవత్సరానికి గాను యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్ ప్రదానం చేస్తున్నటు వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ సంధర్భంగ వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ...
READ MORE
ఎంజీబీఎస్‌ (ఇమ్లీబన్) లో కొత్త ప్లాట్‌ఫారం వివరాలివే..
ఎంజిబీఎస్.. మహాత్మాగాంధీ బస్ స్టేషన్.. ఇమ్లీబన్ ఏ పేర పలికినా తెలంగాణ రాజదాని హైదరబాద్ లో ఉన్న అతిపెద్ద బస్టాండ్ ఇదే. తెలంగాణ ఆర్టీసీకి మణిహారంగా నిలుస్తోంది ఈ బస్ స్టేషన్. దేశంలోని వివిధ రాష్టాలకు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుండే ...
READ MORE
కరోనా వైరస్ దెబ్బకు విల విల్లాడుతున్న చైనా.!!
ఇప్పుడు ప్రపంచమంతా ఎక్కడ చూసినా ఒకటే చర్చ ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్.ఈ వైరస్ చైనా లో పుట్టి మిగతా దేశాలకు పాకుతోంది. ప్రస్తుతానికి ఈ వైరస్ కు మందు లేదు. దాంతో ఈ వైరస్ బారిన పడిన జనం మృత్యువు ...
READ MORE
5 రూపాయల డాక్టరు ఇకలేడు.. నివాలి అర్పించిన అశేషజనవాహిని.!!
తెలంగాణ మిస్సైల్ “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
పాకిస్తాన్ లో హిందువులపై ఆగని హింసాకాండ.!!
హద్దులు దాటుతున్న కుటుంబ పాలన, ప్రభుత్వ ఇళ్ల కాలనీలకు చంద్రబాబు
అంబర్ పేట్ నియోజకవర్గం భాజపా కన్వీనర్ గ ఏడెల్లి అజయ్
చైనా యాప్ టిక్ టాక్ పై నిషేధం విధించిన ప్రభుత్వం.!!
ఎన్ని కష్టాలొచ్చాయో.. కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది.
కారు కి నై చెప్పి కమలానికి జై కొట్టిన కేసిఆర్
మళ్లీ మొదటికొచ్చిన పంచాయితీ.. గ్రూప్ 2 విషయంలో మౌనంవహిస్తున్న టీఎస్పీఎస్సీ.
కమ్ముకుంటున్న అనుమానాలు.. పాప ప్రాణాలతో క్షేమంగా బయటకి వస్తుందా..?
సొసైటీ కి బిగ్ బాస్ షో లు ఎంతవరకు అవసరం.?
త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ కి అటల్ బిహారీ వాజ్ పేయి
మహారాష్ట్ర లో హిందూ సాధువుల పై రాక్షస దాడి ఆపై
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
సామాన్యుడి సంపాద‌న‌కి ఎస‌రు పెడుతున్న బ్యాంకులు.. స‌ర్ ఛార్జ్ తీరు
సగం తాగి ఉమ్మేసిన పాలను జనాలకు అమ్ముతున్న మహ్మద్ సోహైల్
అవినీతిలో అగ్ర స్థానం భారత్ దే…
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అజాత శత్రువు రచ్చ శ్రీనన్న.!!
ఏబీవీపీ నగర కార్యదర్శిగ పగిడిపల్లి శ్రీహరి
ఇంట్లో ఒంట్లో అంతా కల్తీనే.. కాదేదీ “కల్తీ”త్వానికి అనర్హం.!!
మహనీయుల జయంతి సందర్భంగా సెలవులు అవసరమా…?
ఎమ్మెల్యే టిక్కెట్లు మంత్రి పదవులు ఎవరికి దక్కాయి? సోషల్ మీడియా
డా. సౌమ్యకు యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్-2019 అవార్డ్
ఎంజీబీఎస్‌ (ఇమ్లీబన్) లో కొత్త ప్లాట్‌ఫారం వివరాలివే..
కరోనా వైరస్ దెబ్బకు విల విల్లాడుతున్న చైనా.!!
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!