“ప్రతీ క్షణం ప్రత్యక్ష ప్రసారం” అంటూ ఆగస్టు 30 2007లో పురుడు పోసుకున్న ఎన్టీవీ మీడియా రంగంలో తనదైన ముద్రను వేసుకుంది. ఛానల్ ప్రారంభానికి నాలుగు రోజుల ముందే లుంబినీ పార్క్, గోపుల్ ఛాట్ బండార్ వద్ద జరిగిన బాంబు పేలుళ్ళ దృశ్యాలను ఇతర మీడియా సంస్థలన్నింటికంటే ముందే ప్రసారం చేసి టెస్ట్ సిగ్నల్ లోనే సంచనాలు సృష్టించింది. 16 డీఎస్ఎన్జీలతో దేశంలోని మరే సంస్థకు లేనన్ని లైవ్ వ్యాన్ లతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఎన్టీవీ లైవ్ ప్రసారాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. హైదరాబాద్ బాంబు పేలుడుకు సంబంధించి ఎన్టీవీ నాడు ప్రసారం చేసిన దృశ్యాలను భారత జాతీయ ఛానళ్లతో పాటుగా బీబీసీ లాంటి అంతర్జాతీయ ఛానళ్లుకూడా వాడుకున్నాయి. ప్రత్యక్ష ప్రసారాల విషయంలో ఎన్టీవీ ఒక ట్రెండ్ సెట్టర్ గా నిల్చింది. హైదరబాద్ ఫ్లైఓవర్ కూలిన ఘటన కావచ్చు, ముంబాయి బాంబు మారణహోమంకావచ్చు ప్రతీ దృశ్యాన్ని ఒడిసిపట్టుకుని ప్రేక్షకులకు ప్రత్యక్షంగా అందించిన ఎన్టీవీ ఇతర ఛానళ్లకు మార్గదర్శకంగా నిల్చింది. ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు ఏవైనా సరే ఎన్టీవి అందరికంటే ముందుగానే ప్రేక్షకులకు ఖచ్చితమైన సమాచారన్ని ఇచ్చి వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వచ్చింది.
సర్వేలు:
సర్వేలు ప్రజల అభిప్రాయాలకు ప్రామాణికాలు. సర్వేలు చేయించడంలోనూ, సొంతగా సర్వేలు చేయడంలోనూ దేశంలోని ఎన్టీవీ అగ్రగణ్యురాలని చెప్పవచ్చు. ఛానల్ ఏర్పాటుకు పూర్వమే ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ సర్వేలకు పెట్టింది పేరైన నీల్సన్-ఓఆర్జీ మార్గ్ సంస్థతో చేసుకున్న అవగాహన ప్రకారం ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ వచ్చిన ఎన్టీవీ ఖచ్చితత్వానికి చిరునామాగా మారింది. 2008 మొదలుకొని ఎన్టీవీ నిర్వహించిన సర్వేలు ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించాయి. ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పడంతో పాటుగా ఎవరికి ఎంత శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందే కూడా ఖచ్చితంగా చెప్పగలిగిన ఎన్టీవీ సర్వేలు నూటికి నూరు శాతం నిజమయ్యాయి. 2009 ఎన్నికల్లో మహాకూటమిదే విజయం అంటూ ఇతర ఛానళ్లు, వార్తా సంస్థలు ఊదరగొడుతున్న సందర్భాల్లోనూ ఎన్టీవీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పిన సర్వేపై అనేక విమర్శలు వచ్చినప్పటికీ తాను చెప్పిన దానికి ఎన్టీవీ కట్టుబడి ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఎన్టీవీ చెప్పిన విషయం నూటికి నూరు శాతం నిజమైందని అంతా ఒప్పుకోక తప్పలేదు. నామమాత్రపు శాంపిళ్లతో కాకుండా ఏకకాలంలో వేలాది మంది ప్రజలను ఎంపిక చేసుకుని వాటి ద్వారా నిర్వహించిన సర్వేలు ప్రజల నాడిని పట్టడంలో పూర్తి విజయాన్ని సాధించాయి. అయితే 2014 ఎన్నికల్లో తెలంగాణాలో ఎన్టీవీ సర్వే వాస్తవ రూపం దాల్చగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. అయితే సర్వే ఫలితాలు వాస్తవ ఫలితాలకు విరుద్దంగా రావడంతో ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పిన ఎన్టీవీ అటు తర్వాత కూడా ఈ పరంపరను కొనసాగిస్తోంది.
ప్రపంచంలోనే పేరెన్నికగన్న సంస్థలతో సర్వేలు చేయించడం ద్వారా అందులోని నైపుణ్యాన్ని ఒడిసిపట్టుకున్న ఎన్టీవీ సొంతగా ఎన్జీ మైండ్ ఫ్రేమ్స్ పేరుతో ప్రజల నాడిని పసిగట్టే సర్వేలను నిర్వహిస్తోంది. ఈ సంస్థ బీహార్ ఎన్నికల సమయంలో నిర్వహించిన సర్వే ప్రజల నాడిని పసి గట్టడంలో పూర్తిగా సఫలం అయింది. తుది ఫలితాలు సర్వే అంచానాలకు అనుగుణంగా వచ్చాయి.
సామాజిక బాధ్యత:
ఎన్టీవీ ఎన్నడూ తన సామాజిక బాధ్యతను మరవలేదు. ప్రజాహితమే లక్ష్యంగా ముందుకు సాగిన ఎన్టీవీ అనేక సామాజిక రుగ్మతలపై సమరం సాగించింది. ప్రజా సమస్యలపై గళమెత్తింది. కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా ప్రతీ మారు మూల ప్రాంతం నుండి రోడ్ షోలను నిర్వహించడం ద్వారా స్థానిక సమస్యలపై ప్రజా గళాన్ని వినిపించింది. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా అనునిత్యం ప్రజలతో మమేకం అవుతూ రోడ్ షోల ద్వారా ప్రజల అభిప్రాయాలను వారి సమస్యలను పాలకుల ముందు ఉంచింది. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న ర్యాగింగ్ భూతానికి వ్యతిరేకంగా కాలేజీల్లో అవగాహనా కార్యక్రమాలతో పాటుగా విశాఖపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించిన ఎన్టీవీ ర్యాగింగ్ పై యుద్ధమే చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు రాష్ట్ర వనరులను బడా కార్పోరేట్ సంస్థలు దోచుకుని పోయే ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకుంది. గోదావరి ప్రాంతంలోని చమురు నిక్షేపాలను రిలయన్స్ సంస్థకు గుజరాత్ కు తరలించే ప్రయత్నం చేస్తున్న సమయంలో “ఈ నేల మనది – ఈ గ్యాస్ మనది” అంటూ నినదించిన ఎన్టీవీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ షోలు నిర్వహించడంతో పాటుగా విశాఖలో ప్రజలతో భాగస్వామ్యంతో భారీ సభను ఏర్పాటు చేసి ప్రజల మనోగతాన్ని నాటి పాలకుల ముందు పెట్టింది.
పబ్బుల్లోని గబ్బును, పేకాట క్లబ్బులపై ఎన్టీవి సమర శంఖాన్ని పూరించి వాటిలో జరుగుతున్న అసాంఘీక కార్యక్రమాలను ప్రజల ముందు పెట్టింది. పబ్బుల్లో జరుగుతున్న అసాంఘీక కార్యక్రమాలను గురించి ఎన్టీవీ అప్పుడే చెప్పింది. ఈ క్రమంలో వచ్చిన ఒత్తిడులను బెదిరింపులను ఏ మాత్రం ఖాతర చేయకుండా క్లబ్బుల ముందు నుండే వాటి కార్యకలాపాలను ఎండగట్టింది. ఈ క్రమంలో ఎన్టీవీ ప్రతినిధిపై లైవ్ లోనే పేకాట క్లబ్ యజమానులు చేసిన దాడిని ప్రపంచమంతా ప్రత్యక్షంగా చూసింది.
మనదేశం మన గీతం:
జాతీయ గీతాన్ని పూర్తిగా పాడలేని దుస్తితిలో భావి పౌరులు ఉన్న విషయాన్ని గుర్తించిన ఎన్టీవీ “మన దేశం-మన గీతం” పేరుతో జాతీయ గీయాలాపన కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలోని నగరాలు, పట్టణాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. అనేక వ్యయ, ప్రయాలకు ఓర్చి ఎన్టీవీ మారుమూల ప్రాంతాల్లో సైతం “మన దేశం-మన గీతం” కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా జాతీయగీత ఔన్నత్యాన్ని చాటిచెప్పింది.వరంగల్ పట్టణంలో మొదలైన ఈ కార్యక్రమాన్ని పొరుగు రాష్ట్రాలతో పాటుగా విదేశాల్లో సైతం జరుపుకున్నారు. ఇప్పటివరకు 100 చోట్ల “మన దేశం-మన గీతం” కార్యక్రమాన్ని ఎన్టీవీ పూర్తి చేసింది. హైదరాబాద్ లో భారీ ఎత్తున నిర్వహించిన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తో పాటుగా ముఖ్యమంత్రి కూడా హజరై ఎన్టీవీ సాగిస్తున్న యజ్ఞానికి తమ మద్దతు తెలిపారు.
భక్తి:
తెలుగు ప్రజల ఇళ్లలో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్న భక్తీ టీవీ తెలుగులో మొట్టమొదటి ఆధ్యాత్మిక ఛానల్. ఎన్టీవీతో పాటు ప్రారంభమైన ఈ ఛానల్ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా హింధూ జాతీ జౌన్నత్యాన్ని చాటుతోంది. కేవలం ఆధ్యాత్మిక ప్రసంగాలకు పరిమిత కాకుండా దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక గురువులను, పీఠాధిపతులను ఒక్క వేదికపైకి తీసుకుని వచ్చి ధార్మిక సమ్మెళనాన్ని ఘనంగా నిర్వహించిన ఘనత భక్తీ టీవీదే… తిరుమల పవిత్రతతను కాపాడే ఉద్దేశంతో “తిరుమల మనదే” అంటూ నినదించింది భక్తీ టీవి.
దీపోత్సవం:
దీపం అంటేనే భక్తీ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే దోపోత్సవంగా తెలుగువారి మనసుల్లో ముద్ర వేసుకున్న కోటి దీపోత్సవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే…కార్తీక మాసంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. లక్ష దీపోత్సవంగా ప్రారంభమై ఇప్పుడు శత కోటి కాంతులను విరజిమ్ముతున్న కోటి దీపోత్సవం ఒక ఆధ్యాత్మిక యజ్ఞం. కోటిదీపోత్సవం కోట్లాది దీపకాంతులతో ఇల కైలాసంగా విరాజిల్లుతుంది. ఆధ్యాత్మిక వేత్తల, పిఠాధి పతుల ప్రసంగాలతో ప్రముఖ దేశాలయాల నుండి భక్తులకోసం విచ్చేసిన దేవతా మూర్తుల సమక్షంలో వెలిగించిన దీప కాంతులను చూడడానికి రెండు కళ్లూ చాలవు. ఇంతటి అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించడం కేవలం భక్తీ టీవీకే సాధ్యం అన్నది ఏ మాత్రం అతిశయోక్తి కాదు.
ఈ ఆధ్యత్మిక మహా క్రతువులోని ప్రతీ దృశ్యాన్ని ప్రేక్షకుల మదిలో నింపేందుకు దేశంలోనే అందుబాటు లో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దీప మహా యజ్ఞాన్ని ప్రపంచానికి చూపుతోంది భక్తీ టీవీ. 10 ఏళ్లలో ఎన్నో మైలు రాళ్లను దాటుకుంటూ విజ యాలతో ముందుకు దూసుకుపోతున్న ఎన్టీవీ మరిన్ని మైలు రాళ్లను దాటాలని కోరుకుంటోంది “జర్నలిజం పవర్”. ఆల్ ది బెస్ట్ ఎన్.టి.వి.
Related Posts
రెస్పాన్సిబుల్ జర్నలిజం అంటూ తెలుగు మీడియా ప్రపంచంలోకి అడుగు పెట్టి ప్రారంభం లో ఓ వెలుగు వెలిగిన ఎక్స్ ప్రెస్ ఛానల్ రోడ్డున పడే పరిస్థితికి దిగజారింది. యువత కోసం భవిత కోసం అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పి చివరకు ...
READ MORE
అక్రెడిటేషన్ కార్డులతో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది,ఇవ్వాళ సమాచార శాఖ కమీషనరు కార్యాలయం లో అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశం లో వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు అందించాలని కమిటీ నిర్ణయించింది. ...
READ MORE
తెలంగాణ కన్నీళ్లను కష్టాలను తమ రాతలతో మాటలతో ప్రపంచానికి తెలియచెప్పి అలుపెరుగని పోరాటాన్ని చేశారు తెలంగాణ జర్నలిస్టులు. తెలంగాణ పోరాటంలో జర్నలిస్ట్ ల పాత్ర అనిర్వచనీయం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల యుద్దంలో సమిధలుగా మారిన కలం వీరుల కష్టాలను ...
READ MORE
కలాన్నే తన బలంగ మార్చుకున్న సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్ర జ్యోతి రిపోర్టర్ సురేష్ ఉప్పల్ ప్రెస్ క్లబ్ కి అధ్యక్షులుగ ఎన్నికయ్యారు. అందరికీ ఆత్మీయుడు సుపరిచితుడు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పోరాడే సురేష్.. నూతనంగ ఉప్పల్ ప్రెస్ క్లబ్ కి ...
READ MORE
తాడికొండ ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం అధికార పార్టీ వైసీపీ ఎంఎల్ఏ శ్రీదేవీ ప్రవర్తన మరోసారి వివాదస్పదం అయింది. ఇప్పటికే ఆమె తాను క్రిస్టియన్ అని చెప్పి ఎస్సి రిజర్వుడు స్థానంలో పోటీ చేసి గెలవడంతో ఈ విషయమై చర్యలు ...
READ MORE
మొగల్తూరు ఆనంద ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ పొట్టన పెట్టుకున్న యువకుల మరణాలపై ప్రశ్నించే పార్టీ సమాధానం ఏది.. ప్రశ్నించేందుకే తమ పార్టీ అని.. ఎక్కడ ఎప్పుడు ఏ అన్యాయం జరిగినా నిగ్గదీసి అడుగుతానని.. నినదించడం.. నిలదీయడమే.. జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశ్యం ...
READ MORE
ఈ వారం బార్క్ రేటింగ్స్ లో ఊహించని మార్పులు జరిగాయి. గతవారం నెంబర్ వన్ గా ఉన్న ఎన్ టీవి ఏకంగా రెండు స్థానాలకు దిగజారి ముచ్చటగా మూడో ర్యాంక్ దగ్గర ఆగిపోయింది. గత వారం మూడో స్థానంలో ఉన్న ఏబిఎన్ ...
READ MORE
కేరళ మలప్పురం లో జరిగిన గర్భం తో ఉన్న ఏనుగు ను చంపిన ఘటన యావత్ దేశాన్ని కదిలిస్తున్నది. సాధారణంగా ఏనుగు కు ఆకలి ఎక్కువ అందులోనూ ఆ టస్కర్ అనే ఏనుగు 20 నెలల గర్భం తో ఉండడంతో తీవ్ర ...
READ MORE
జర్నలిస్ట్ లకి దసరా కానుకగా బంఫర్ బొనాంజా ఆఫర్ ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. నెలరోజుల్లోగా జర్నలిస్ట్ లందరికి ఇళ్ళ స్థలాలు అందిస్తామని హామీ ఇచ్చారు. దసరా అయిపోగానే మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణతో సమావేశo ఏర్పాటు చేసి అర్హులైన జర్నిలిస్ట్ ...
READ MORE
తెలుగు మీడియా పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారయింది. కుప్పలు కుప్పలుగా వస్తున్న తెలుగు న్యూస్ ఛానల్లు ఏడాది తిరక్కుండానే బిస్తరి కట్టేస్తున్నాయి. డక్క ముక్కిలి తిని కింద మీద పడి ఉన్నామ అంటే ఉన్నాం అనేలా మరి కొన్ని ...
READ MORE
ప్రభుత్వం తప్పు చేస్తే ఎండగట్టాల్సిన బాధ్యత మీడియాదే. నిజాన్ని నిర్భయంగా, నిజాయితీగా ప్రజలకు అందజేయాల్సిన బాధ్యత కలిగిన మీడియా అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. సాయంత్రం అయితే చాలు ప్రెస్ క్లబ్ ని బార్ గా మార్చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రెస్ క్లబ్ ...
READ MORE
మీకు ఇప్పుడు ఓ బ్రహ్మండమైనా.. చిత్ర విచిత్ర అద్బుత అమోఘమైన పరీక్ష పెడతాం. పాసయ్యారో బలి బలి బలిరా బలి మీరే తెలుగులో నిజమైన నిఘంటువని కీర్తిస్తాం. యెహే ఈ సోదంతా ఏంటి పాయింట్‌కి రా అనేగా.. అక్కడికే వస్తున్నా. తెలుగును ...
READ MORE
ఏంటి డ్రగ్స్ కేసులో జర్నలిస్ట్ లా..? కేసులను ఛేదించే రిపోర్టర్లకు మత్తు మందు అంటిందా..? మత్తులింకుల్లో రాతగాళ్లు కూడా ఉన్నారా..? బయటకి ఇచ్చిన లీకులు నిజమా..? అవును నిజమేనని చెపుతున్నాయి ఉత్తుత్తి లీక్ లు. రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల ఏం ...
READ MORE
తెలుగు మీడియా పరిస్థితి మూడు కష్టాలు, ఆరు అష్ట దరిద్రాలు అన్నట్టుగా ఉంది. ఏ ఛానల్ చూసిన ఏమున్నది గర్వ కారణం అంతా ఉద్యోగులను ముంచే ప్రయత్నమే.. జీతాలు ఎగ్గొట్టే ఆలోచననే. ఇప్పుడు తెలుగు మీడియాలో సాగుతున్న తంతు ఇదే. ఎక్స్ ...
READ MORE
సినీ పరిశ్రమలో చాలా మందే స్టార్లు ఉన్నారు కాని అందులో కొంత మందే రియల్ స్టార్లు అనిపించుకుంటారు. అందులో ప్రముఖంగా నిలిచే వ్యక్తి బాలివుడ్ స్టార్ అక్షయ్ కుమార్.ఇప్పటికే ఎన్నో సార్లు సమాజం కోసం తన సంపాదనను విరాళంగ ఇచ్చిన అక్షయ్, ...
READ MORE
హైదరాబాద్ నడిబొడ్డున పంజాగుట్టలో ఉన్న Nizam's Institute Of Medical Sciences (NIMS) అక్రమాలకు అడ్డాగా మారిందని, నిమ్స్ ఆస్పత్రిలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని గ్రేటర్ హైదరాబాద్ మహానగర ABVP కార్యదర్శి శ్రీహరి డిమాండ్ చేస్తూ ఒక ...
READ MORE
శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య ఆలయం స్థల వివాదం మలుపులు తిరుగుతూనె ఉంది. గతంలో ఈ కేసు లో పలుమార్లు కీలక తీర్పులు ఇచ్చిన న్యాయస్థానం గతంలో.. ఈ కేసు పరిష్కారం కొరకు ఒక మధ్యవర్తిత్వం కమిటీ ని వేసిన విషయం తెలిసిందే. ...
READ MORE
తెలుగు మీడియాలోకి సరికొత్త అస్త్రంగా దూసుకు వస్తున్న కోమటి రెడ్డి బ్రదర్స్ రాజ్ న్యూస్ అభ్యర్థుల ఎంపికలో వేగాన్నిపెంచింది. మెరికల్లాంటి అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈనెల 17న ఇంటర్వ్యూలను నిర్వహించింది. తెలంగాణ వ్యాప్తంగా జిల్లా స్టాఫర్ల కోసం.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ...
READ MORE
పేదోటండే రోజు రోజుకు ప్రభుత్వ అధికారుల్లో నిర్లక్ష్య ధోరణి, విసుక్కునే ధోరణి, చిన్నచూపు చూసే ధోరణి పెరిగిపోతుంది.రెక్కాడితే గాని డొక్కాడని పేదల పట్ల కనికరం మానవత్వం చూపించాలనే ఇంగిత జ్ఞానం మరిచిపోయి, లంచాలు ఇస్తే గానీ పనిచెయ్యం అంటూ సిగ్గు విడిచి ...
READ MORE
తెలుగు మీడియాలో 2019 ఎన్నికల ఫీవర్ ముందే మొదలైంది. జెమిని , నెం. 1 , ఎక్స్ ప్రెస్ లు మూతపడటంతో తలో దారి చూసుకున్న జర్నలిస్ట్ లకు కొత్త ఊపుతో ప్రసారాలు చేసేందుకు సిద్దమైన మహా , రాజ్ న్యూస్ ...
READ MORE
సిరిసిల్ల దళిత గిరిజన ప్రభుత్వ హాస్టల్లో చదువుకునే ఆడపిల్లలంతా నిరుపేద దళిత గిరిజన విద్యార్థినులు. అందులో చాలామందికి తల్లి దండ్రులు కూడా లేని పరిస్తితి.అంతే కాదు వారు ఇంట్లో ఉండి ఆర్థిక పరిస్థితిని తట్టుకుని రోజూ రెండు పూటలా కడుపు నిండా ...
READ MORE
బీసీ సంఘం జాతీయ అద్యక్షుడు టీటీడిపి ఎమ్ఎల్ఏ ఆర్ క్రిష్ణయ్య భాజపా లో కి చేరుతున్నాడని జర్నలిజం పవర్ ఛానెల్ లో కథనాలు రావడం అందరికీ విదితమే. ఈ అనుమానానికి బలం చేకూరుస్తూ మూడేల్ల తర్వాత ప్రతిష్టాత్మకంగ చేపట్టిన మహానాడుకు ఆర్ ...
READ MORE
ప్రముఖ జర్నలిస్ట్ రిపబ్లిక్ ఛానల్ ఎడిటర్ అర్నాబ్ గో స్వామి దంపతులు ప్రయాణిస్తున్న కారు పై బుధవారం రాత్రి కొందరు దుండగులు దాడికి యత్నించిన ఘటన సంచలనం కలిగిస్తోంది. ఈ ఘటన కు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసారు అర్నాబ్.
అయితే ఈ ...
READ MORE
దేశం లో ప్రస్తుతం ఒక విచిత్రకర పరిస్తితి దాపురించింది.ఎవడికైనా గుర్తింపు రావాలి, అది కూడా షార్ట్ కట్ దారిలో రావాలి అనుకుంటే వెంటనే ఏదో చిల్లర మీటింగులో కావాలనే మైకు పట్టేసుకుని హిందూ దేవుళ్ళ ను నోటికొచ్చినట్టు తిట్టడం లేదా హిందూ ...
READ MORE
ఛాంపియన్షిప్ ట్రోపి ఫైనల్ లో పాకిస్తాన్ పై భారత్ చిత్తుగా ఓడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. యుద్దం చేస్తారనుకుంటే అప్పన్నంగా మ్యాచ్ ని సమర్పించేది వచ్చింది. ఓకే ఇదంతా బాగానే ఉంది మరీ ఇదే సమయంలో ...
READ MORE
రోడ్డున పడ్డ మరో మీడియా సంస్థ.. నిలిచిపోయిన ప్రసారాలు.
అక్రెడిటేషన్ లేని జర్నలిస్టులకు శుభవార్త… అందరికి హెల్త్ కార్డులు.
ప్రగతి భవన్ సాక్షిగా.. జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన
ఉప్పల్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గ ఎన్నికైన సీనియర్ జర్నలిస్ట్
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని గుర్తుపట్టని ycp ఎంఎల్ఏ, SC
సొంత ఊర్లో యువకుల మరణాలపై జనసేన నోరు మెదపడా…?
అగ్ర స్థానం టీవి 9 దే.. దిగజారిన ఎన్ టీవి
దేవతలు నడయాడిన భూమి పై రాక్షసులు జీవిస్తున్నారు.. ఏనుగు హత్య
జర్నలిస్టులకు కేసిఆర్ తీపి కబురు. దసరాకి బంఫర్ బొనాంజ ప్రకటన.
తెలుగు మీడియాలో కొనసాగుతున్న జీతాల కష్టాలు.. 5 రోజులుగా నిరసన
“ప్రెస్ క్లబ్ ఏరులై పారుతున్న మధ్యం.. కండిషన్స్ అఫ్లై”
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
డ్రగ్స్ కేసుతో జర్నలిస్ట్ లకు లింక్.. లాగుతున్న తీగతో కదులుతున్న
ఎడారిలో ఒయాసిస్సులా రాజ్ న్యూస్..
కోటిన్నర విరాళం మరోసారి రియల్ స్టార్ అనిపించుకున్న అక్షయ్ కుమార్.!!
నిమ్స్ లో జరుగుతున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలి
ఆయోధ్య కేసు.. రేపే విచారణ.!!
వేగం పెంచిన రాజ్ న్యూస్.. మొదటి దశ ఇంటర్వ్యూలు పూర్తి.
పేదోడంటే అధికారులకు ఎందుకంత అలుసు? పన్నులు కట్టి జీతమిస్తున్నందుకా.??
పెద్ద టీవిలో పెద్ద తలకాయలకు స్థానచలనం.. మార్పు చేర్పులతో కొత్త
అభాగ్యులైన పేద దళిత గిరిజన ఆడపిల్లలపై కామాంధుడి కీచకపర్వం.
మహానాడుకు డుమ్మా కొట్టిన ఆర్. క్రిష్ణయ్య.. జర్నలిజం పవర్ చెప్పిందే
ప్రశ్నించే గొంతు పై కత్తి పెడతారా..!జర్నలిస్ట్ అర్నాబ్ దంపతుల పై
చిల్లర గాల్లకందరికీ ఫ్రీ పబ్లిసిటీ కావాలంటే హిందూ దేవుళ్ళను తిట్టాలా.!!
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.