You are here
Home > రాజకీయం > బ‌య‌ట‌ప‌డ్డ అద్దె ఛాన‌ళ్ల అస‌లు భాగోతం.. కొస‌రు పేరుతో ఇక ప్ర‌సారాలు న‌డ‌వ‌వు.. కేంద్ర సమాచార శాఖ హెచ్చ‌రిక‌..?

బ‌య‌ట‌ప‌డ్డ అద్దె ఛాన‌ళ్ల అస‌లు భాగోతం.. కొస‌రు పేరుతో ఇక ప్ర‌సారాలు న‌డ‌వ‌వు.. కేంద్ర సమాచార శాఖ హెచ్చ‌రిక‌..?

పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్న చానల్స్ అనే మాట‌ ఈ మద్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. క‌ర్ణుడి చావుకు స‌వాల‌క్ష కార‌ణాలు అన్న‌ట్టు పుట్టుకొస్తున్న ఛాన‌ల్ల‌కు కూడా అన్నే కార‌ణాలున్నాయి. అయితే కొత్త‌గా వ‌చ్చే ఛాన‌ల్ పుట్టుక వెనుక ఎన్నో గంద‌ర‌గోళాలు, ఇక అది తెర మీద‌కి ఎలా వ‌చ్చిందో ఏంటి అన్న‌ది త‌వ్విన కొద్ది తేలే చ‌రిత్రే. ఇక వ‌చ్చాక దాని జీవిత కాలం ఎంతా అంటే వేళ్ల మీద లెక్క‌పెట్టే అంత‌. పుట్ట‌గొడుగుల్ల పుట్టుకొస్తున్న కొత్త ఛాన‌ళ్లు అంతే వేగంగా ఎందుకు పుటుక్కు మంటున్నాయి. అస‌లు తెర మీద‌కి వ‌చ్చాక పేర్లు తెల్లారే స‌రికే ఎందుకు మారీ పోతున్నాయి. రాబోయే ఛాన‌ళ్ల‌కు ఎదుర‌య్యే గ‌డ్డు ప‌రిస్థితి లేంటి..? ఈ క‌థ‌లోకి వెళితే తెలుస్తుంది.

ఆ టీవీ, ఈ టీవీ, ఊ టీవీ, మా టీవీ, నా టీవీ ఇలా పేర్లు చెప్పుకుంటు పోతే లెక్కకు దొర‌క‌ని ప‌క్క‌గా క‌నిపించ‌ని మీడియా ఛాన‌ళ్లు తెలుగు తెర‌పై కోకొల్ల‌లు. ఇదెప్పుడు వచ్చిందిరా బాబు అనుకునే లోపే తెర మీద త్వ‌ర‌లో మీ ముందుకు అని మరో కొత్త ఛానల్ ప్ర‌త్య‌క్షం అవుతున్న కాలం ఇది. చూసే జనాలకు బుర్ర హీటెక్కిపోయి ఛాన‌ల్ గీన‌ల్ జాన్తా నై అని నెట్టింట్లోకి ప‌రుగులు పెడుతున్న ప‌రిస్థితి. ఆ ప‌రిస్థితి పూర్తిగా త‌గ్గించేందుకు ప్రామాణికంగా ఉన్న ఛాన‌ల్స్ ని మాత్రమే బుల్లి తెర‌పై క‌నిపించేలా చేసేందుకు స‌రికొత్త అస్త్రం సందించింది కేంద్ర స‌మాచారశాఖ‌. అద్దెకు తీసుకుని అడ్డ‌దిడ్డంగా న‌డిపే ఎలక్ట్రానిక్ మీడియాకు ముక్కు తాడి వేసింది కేంద్ర స‌మాచార శాఖ‌. ఇక నుండి ఇంటిని అద్దెకు ఇచ్చినట్లు ఛాన‌ల్స్ హ‌క్కుల‌ను అద్దెక్కిచ్చి నెల నెల ల‌క్ష‌లు సంపాదించుకుందామ‌ని అనుకునే వారికి కాలం చెల్లిన‌ట్లే అని చెపుతోంది స‌మాచార శాఖ‌. అద్దె సంస్కృతికి చరణగీతం పాడలన్నది తాజా ఆదేశం.

అదేంటి చానల్స్ అద్దెకిస్తారా.. అలా అయితే మ‌నం కూడా ఓ ఛాన‌ల్ అద్దెకు తీసుకుని మీడియా రంగంలోకి ఎంట్రీ ఇస్తే పోలా అని అనుకుంటున్నార‌. అలా అయితే పప్పులో కాదు నిప్పులో కాలేసిన‌ట్లే. ఉన్న ఛాన‌ల్స్ కే దిక్కు లేదు అద్దె ఛానల్స్ లొల్లి ఏంది అనుకుంటున్నార అయితే పాయింట్ కి వ‌చ్చేస్తున్నా..

ఒక శాటిలైట్ చానల్ పెట్టాలంటే కేంద్ర ప్రసార శాఖ కు 20 కోట్ల నెట్ వర్త్ చూపించాలి. ఇది అంత ఆశామాసి కాదు. కాబట్టి గతంలో పర్మిషన్ తెచ్చుకుని మూసేసిన ఛానల్స్ ఏమన్నా ఉన్నాయా ఆరా తీయ‌డం కామ‌న్. అలా ఉన్న వాటి ప‌ర్మిష‌న్ తీసుకుని ఆ ప‌ర్మిష‌న్ మీద తెర మీద‌కు కొత్త ఛాన‌ల్ అని భాజ‌బజంత్రీలు మోగిస్తున్నారు మ‌న తెలుగు మీడియా మొన‌గాళ్లు. వాటి లిస్ట్ చెపితే వామ్మో ఇవి అద్దె ఛాన‌ళ్ల అని ముక్కున వేలేసుకోక త‌ప్ప‌దు. స్టూడియో వన్ , భారత్ టుడే, నెంబర్ న్యూస్, పూజా టీవీ, 6 టివి ఇవ‌న్నీ ఆ కోవ‌లోనివే. ఇంతకాలం అలానడిచినవే. స్కూడియో వన్ ఛానల్ ఆశీర్వాద్ గోల్డ్ పేరు మీద నడుస్తోంద‌న్న విష‌యం ఎంత మందికి తెలుసు. నెంబ‌ర్ వ‌న్ అని చెప్పుకుంటు వ‌చ్చిన నెం.1 న్యూస్ ఛాన‌ల్ ప‌రిస్థితి కూడా అదే మొన్న‌టి వ‌ర‌కు వార్త పేరు మీద న‌డిచింది ఇప్పుడు ఆ అవ‌కాశం లేకపోవ‌డంతో బిచాన ఎత్తేయాల్సిన ప‌రిస్థితి. తాజాగా కేంద్ర స‌మాచార శాఖ ఇచ్చిన నోటీసుల‌తో తెలుగు జ‌ర్న‌లిజం తెరపై ఇక కొత్త పేర్లు ద‌ర్శ‌నం ఇవ్వ‌డం ఖాయం. అయితే అదేమి కొత్త పేర్లు కాదు వాటి నిజ‌మైన హ‌క్కులున్న పేర్లు అవే.

 

ఇక అద్దెకు తీసుకొని ఛాన‌ల్స్ న‌డ‌ప‌డం కుద‌ర‌దు క‌నుక చ‌చ్చిన‌ట్టు పేరు మార్చుకోక త‌ప్ప‌దు. అయితే ఇందులో కొన్ని ఛాన‌ళ్లు త‌మ హ‌క్కుల‌ను ప‌క్క సంస్థ‌ల‌కు అమ్ముకుని ఉమ్మ‌డి ఛాన‌ళ్లుగా కూడా మారాయి. దీంతో వాటి లోగోలో కూడా మార‌క త‌ప్ప‌ని ప‌రిస్థి వ‌చ్చింది.  ఇక ఈ నిర్ణ‌యంతో స్టూడియో వ‌న్ ఆశీర్వాద్ గోల్డ్ పేరుతో క‌నిపించ‌డానికి కార‌ణం కూడా అదే. పూజా టీవీ దాని అసలు పేరు సత్కార్ తో రానుంది. ఇక మిగిలినవి కూడా పేరు మార్చుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి. అదే జ‌రిగితే అస‌లు బండార‌ల‌న్నీ బ‌య‌ట‌ప‌డి నిజ‌రూపాలు తెర మీద క‌నిపిస్తాయి అంతే. అలా లేదు మా పేరుతో మేమే న‌డిపించ‌కుంటా అంటే ఇక కుద‌ర‌దు. అద్దెకిచ్చిన వాళ్లు ఒప్పుకొకపోతే ఇక ఆ ఛాన‌ల్ డ‌బ్బా మూసుకోక త‌ప్ప‌దు. అలా మూత ప‌డే ఛాన‌ళ్ల లిస్ట్ మీ ముందుకు త్వ‌ర‌లో. 

Related Posts
మళ్లీ మొదటికొచ్చిన పంచాయితీ.. గ్రూప్ 2 విషయంలో మౌనంవహిస్తున్న టీఎస్పీఎస్సీ.
ఎంసెట్.. సింగరేణి అసిస్టెంట్ పోస్టులు.. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. తాజాగా గ్రూప్ 2. ఉద్యోగం ఏదైనా ప్రభుత్వ మీద నింద మాత్రం పడకుండా పోవడం లేదు. నిష్పక్షపాతంగా నిర్వహించామని డబ్బా కొట్టుకుంటున్న టీఎస్పిఎస్సీ గ్రూప్ 2 విషయంలో అవకతవకలు జరిగాయని వాదిస్తున్నా ...
READ MORE
హైద్రాబాద్ బెస్ట్ ఎంఎల్ఏ అవార్డ్ సొంతం చేసుకున్న డా.లక్ష్మణ్
తెలంగాణ భాజపా అధ్యక్షులు ముషీరాబాద్ ఎంఎల్ఏ డా.కె.లక్ష్మణ్ కు బెస్ట్ ఎంఎల్ఏ అవార్డ్ ఇచ్చారు రాజధాని ఓటర్లు. తాజాగా తెలంగాణ కబుర్లు అనే వెబ్ ఛానెల్ వారు నిర్వహించిన ఆన్ లైన్ ఓటింగ్ పోల్ లో యాభై శాతం ఓట్లతో ది బెస్ట్ ...
READ MORE
స‌బ్బండ వ‌ర్గాల బ‌డ్జెట్
తెలంగాణ బడ్జెట్‌ -2017-18ను ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిగా రాష్ట్ర బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్ట‌డం ఈటల‌కు ఇది నాలుగోసారి. బడుగు బలహీనవర్గాల వారికి బడ్జెట్‌లో పెద్దపీట వేశామని ఆర్థికమంత్రి ఈట‌ల తెలిపారు. ఈసారి బడ్జెట్‌ రూపకల్పనలో కొత్త పద్దతులు ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ అవమానించింది కానీ బ్రిటీష్ సర్కార్ గౌరవించింది.!!
భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి గారు స్వర్గస్థులు కావడంతో అందుకు సంతాపంగ దేశమంతా రాజకీయాలకు అతీతంగ కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నేడు అధికారికంగ సెలవు దినం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఒక్క టీడీపీ అధికారంలో ...
READ MORE
హోంమంత్రి చెప్పాడు.. రాజకీయాలు వద్దంట.
సెప్టెంబర్ 17 పై రాజకీయాలు చేయద్దన్నారు హోంమంత్రి సాబ్. విమోచనం విలీనం విద్రోహం అంటూ రాజకీయాలు చేస్తున్నారని కేసీఆర్ కానీ టీఆర్ ఎస్ కానీ ఎప్పుడు అదికారికంగా విలీన దినోత్సవాన్ని జరుపుతామని చెప్పలేదన్నారు తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి. తెలంగాణ ...
READ MORE
మోడీ పర్యటనను అడ్డుకునే నైతిక హక్కు చంద్రబాబు కు లేదు..!!
ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు అండ్ కో ను వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేసారు.నాలుగేల్లు మోడీతో అంటకాగిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటున్నాడు ...
READ MORE
సర్వే టైం.. తెలంగాణలో  జోరుగా సొంత డబ్బాలు.
తెలంగాణకు సర్వేల జ్వరం పట్టుకుంది. ఏ పార్టీ చూసినా మా పార్టీ అంటే మా పార్టీనే గెలుస్తుందని బల్ల గుద్ది చెపుతయన్నాయి. ప్రభుత్వ పార్టీ టీఆర్ ఎస్ అయితే ఏకంగా 111 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుంది కేవలం ...
READ MORE
కేజ్రీవా(డా)ల్.. అసలే తిక్క.. దానికో లెక్క కూడా లేదు.
అసలే తిక్క.. దానికో లెక్క కూడా లేదు.. బాసలెన్నో చేసి ఆశలు పెంచాడు. అవన్నీ అడియాశలైపోయాయి. ఈయన అరవింద కాదు, గురవింద అని తెలుసుకున్నారు హస్తిన జనం.. ఎంసీడీ ఎన్నికల్లో  చెంప పెట్టులాంటి తీర్పు ఇచ్చారు. ఏదో చేస్తానని వచ్చింది ఆమ్ ...
READ MORE
సభ్యత్వ నమోదు ప్రోగ్రాం లో మంత్రి ముందే నేతల డిష్యూం డిష్యూం..!!
తెలంగాణ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి కి చేదు అనుభవం ఎదురైంది. మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ లో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి ముందే పార్టీ నేతలు బాహాబాహికి దిగడంతో విసుగు చెందిన మంత్రి కార్యక్రమం మధ్యలోనుంచే వెల్లిపోయారు.కాగా ఘటనపై ...
READ MORE
నెత్తురు దాహం తీరని కేరళలో మరో హత్యా.!!
కేరళ రాష్ట్రం అంటే అదొక భూతల స్వర్గం పర్యాటకులకు అహ్లాదాన్ని పంచే అద్భుత ప్రకృతి సౌందర్యం. ఇదంతా నాణానికి ఒకవైపే మరో వైపు ఊహకందని నరమేధం రక్త పాతం హత్యా రాజకీయాలు. కేరళ రాష్ట్రం లో దశాబ్దాలుగా మారణకాండ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఎందరో ...
READ MORE
లిక్క‌ర్ కింగ్ విజయ్ మాల్యా అరెస్ట్..
లిక్క‌ర్ కింగ్, బ‌డా వ్యాపార వేత్త విజ‌య్ మాల్యాను లండన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. విజ‌య్‌మాల్యా గ‌త ఏడాది భార‌తీయ బ్యాంకుల‌కు 9 వేల కోట్లు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయాడు. లండ‌న్‌కి ఇండియాకి మ‌ధ్య ఓ ఒప్పందం కుదుర్చుకోవ‌డంతో ఈ ...
READ MORE
ఆన్ లైన్లో సంచ‌ల‌నంగా మారిన “పాకిస్తాన్ చంప‌లేదు యుద్దం బ‌లితీసుకుంది” క‌థ‌నం..
ఓ మాజీ అమ‌ర‌జ‌వాన్ కూతురు చేసిన కామెంట్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ఓ ఊపు ఊపుతున్నాయి. ఎక్క‌డ చూసినా గురు మెహ‌ర్ వ్యాఖ్య‌లే క‌నిపిస్తున్నాయి. నిన్న‌ ఆ అమ్మాయి కామెంట్ల పై ఘాటుగా స‌మాధానం ఇచ్చిన క్రికెటర్ వీరేంధ్ర సెవాగ్ వ‌రుస‌లో ...
READ MORE
ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఏపీ CM జగన్ మోహన్ రెడ్డి మార్క్.!!
మన దేశంలో పలు కుటుంబ నేపథ్యంలో సాగే రాజకీయ పార్టీల తీరు పలు విమర్శలకు తావిస్తున్నది. సెక్యులర్ అంటూనే పూర్తిగా ఒక వర్గం వారికి ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు కొమ్ము కాసే ధోరణిలో ఈ రాజకీయ పార్టీల నిర్ణయాలు ఉన్నాయంటున్నారు పలువురు ...
READ MORE
తెలంగాణ సర్కార్ తో యుద్దానికి సిద్దమైన జర్నలిస్టులు..
తెలంగాణ రాష్ట్ర వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టుల సంఘం ముఖ్య స‌ల‌హాదారుడు కె. శ్రీ‌నివాస్‌రెడ్డి, ఐజేయూ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ దేవుల‌ప‌ల్లి అమ‌ర్‌ తెలంగాణ సర్కారు తీరును  ఎండగట్టారు. జ‌ర్న‌లిస్టుల‌కు ముఖ్య సౌక‌ర్యాలైన అక్రెడిటేష‌న్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ ప్ర‌క్రియ అస్త‌వ్య‌స్తంగా మారింద‌ని వారు ...
READ MORE
కాబోయే భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కు యావత్ తెలంగాణ ఘనస్వాగతం .!!
రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో వివిధ పార్టీ నాయకుల మద్దతు కోరడం కొరకు తెలంగాణ పర్యటన చేస్తున్నరు రాంనాధ్ కోవింద్. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల కోసం విధిగా ఏ పార్టీకూడా విప్ జారీ చేయొద్దని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ విదివిదానాలను పేర్కొనడం ...
READ MORE
కాంగ్రెస్ ఎన్సీపీ లకు షాక్.. ప్రధాని నరేంద్ర మోడీని ని కలిసిన సీఎం ఉద్ధవ్ థాక్రే.!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత హైడ్రామా జరిగిందో అసలు సిసలు రాజకీయాలు ఎలా ఉంటాయో దేశ ప్రజలు చూసారు.ఎన్నికలకు ముందే ఒప్పందం కుదుర్చుకుని అనుకున్న విధం గానే ఎన్నికల్లో కూటమి గెలిచినా కూటమి రూల్స్ బ్రేక్ చేసి పూర్తిగ వ్యతిరేక సిద్ధాంత ...
READ MORE
2006 లో GST ని వ్యతిరేకించిన మోడీ ఇప్పుడెందుకు తెచ్చాడు..??
గత రెండు రోజులుగా నరేంద్ర మోడీ GST కి వ్యతిరేకంగ మాట్లాడిన వీడియో సోషల్ సైట్లలో చక్కర్లు కొడుతోంది. ఆనాడు వ్యతిరేకించినప్పుడు మోడీ నాటి గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ హయాంలోని UPA సర్కార్. వామపక్షాలు అప్పుడు కాంగ్రెస్ కు ...
READ MORE
సీమలో ప్యామిలీ డ్రామాలు .. వెలుగులోకి వస్తున్న గబ్బు రాజకీయాలు.
పొజీషన్లో ఉండాలన్నా ,అపోజీషన్ ఉండాలన్నా ఆ కొన్ని ప్యామిలీలే ఉండాలి. కొత్తగా తెరపైకి వచ్చే దమ్ము నాయకులకు లేదు. తెచ్చే దమ్ము పార్టీలకు లేదు. ఇందులో కాకపోతే అందులో. అధికారం పంచుకున్నా, కొట్టుకు చచ్చినా మేమే చేయాలి అన్నంతగా సీమ రాజకీయాలు ...
READ MORE
భూమా కుటుంబంలో మరో విషాదం…
జిల్లాలో కీలక నేతగా గుర్తింపు పొందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను నంద్యాలలోని ఓ ఆసుపత్రికి తరలించారు. వైద్యానికి భూమా దేహం స్పందించలేదు. దీంతో చికిత్స పొందుతూ ...
READ MORE
ప్రపంచంలోనే అత్యంత చెడ్డ ముఖ్యమంత్రి ఎవరో గూగుల్ చెప్పేసింది.. ఎవరో తెలుసా.??
అందరి ముఖ్యమంత్రులలో కంటే అత్యంత చెడ్డ ముఖ్యమంత్రి ఎవరు అంటే గూగుల్ సంస్థ చెప్తున్న పేరు కేరళ రాష్ట్రం కమ్యునిస్టు సర్కార్ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అంట. అయితే.. దీనికంతటికీ కారణం రాష్ట్రంలో గత కొంత కాలం నుండి నెలకొన్న శబరిమల ...
READ MORE
కర్నాటకలో కాంగ్రెస్ మార్క్ పాలన.. గుమాస్తాగా మారిన ముఖ్యమంత్రి కుమార స్వామి.!!
దేశంలో 60 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం అతికష్టం మీద నడుస్తోంది. త్వరలో రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైన విజయం సాధించాలని పరితపిస్తోన్నా ఈసారి కూడా అధికారం దక్కడం కాంగ్రెస్ పార్టీ కి ఎండమావిగానే మిగిలిపోనున్నదని విశ్లేషకుల అంచనా.. అయితే.. ...
READ MORE
జనసేన కు రాజీనామా చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీజేపీ లోకి.?
జనసేనా పార్టీ కి రాజీనామా చేసిన కీలక నేత మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తర్వాత ఏ రాజకీయ పార్టీ లో చేరతారో అనే చర్చ జరుగుతోంది.అయితే లక్ష్మీనారాయణ తొందర్లోనే జాతీయ పార్టీ అయిన బీజేపీ లో చేరే అవకాశం కనిపిస్తోంది. ...
READ MORE
మళ్లీ దెబ్బ తిన్న సీపిఐ నారయణ.
సీపిఐ పార్టీ సీనియర్ నేత నారయణ దెబ్బల మీద దెబ్బలు తింటున్నాడు. ఇంతకీ అంత పెద్దాయన్నీ ఎవరు తంతున్నారని కదా మీ డౌంటు.. అయన్నెవరు తన్నడం లేదు. ఆయనే కోడలను , బండలను తంతు గాయాల పాలవుతున్నాతు. తాజాగా మరో సారి ...
READ MORE
కల్వకుంట్ల కవిత 5 ఏండ్లలో సాధించలేనిది, అర్వింద్ 8 నెలల్లో సాధించాడు.!!
2019 లోకసభ ఎన్నకల్లో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన స్థానం నిజామాబాద్ లోకసభ నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ పసుపు బోర్డ్ ఏర్పాటు కోసం అంతకు ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత ను ఎంపీ గ గెలిపించారు ఇక్కడి ప్రజలు. ...
READ MORE
అడుగడుగునా అరెస్ట్ ల పర్వం.. రిజర్వేషన్ జాన్తానై అంటున్న బీజేపి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముస్లిం లకు 12% రిజర్వేషన్  ఎట్టి పరిస్తితిల్లో చేసి తీరుతామని చెప్పడంతో బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగానికి విరుద్దంగా రిజర్వేషన్లు కుదరవని సుప్రీం కోర్టు చెపుతున్నా వినకుండా కేసీఆర్ సర్కార్ మొండి వైఖరి ...
READ MORE
మళ్లీ మొదటికొచ్చిన పంచాయితీ.. గ్రూప్ 2 విషయంలో మౌనంవహిస్తున్న టీఎస్పీఎస్సీ.
హైద్రాబాద్ బెస్ట్ ఎంఎల్ఏ అవార్డ్ సొంతం చేసుకున్న డా.లక్ష్మణ్
స‌బ్బండ వ‌ర్గాల బ‌డ్జెట్
ఆంధ్రప్రదేశ్ అవమానించింది కానీ బ్రిటీష్ సర్కార్ గౌరవించింది.!!
హోంమంత్రి చెప్పాడు.. రాజకీయాలు వద్దంట.
మోడీ పర్యటనను అడ్డుకునే నైతిక హక్కు చంద్రబాబు కు లేదు..!!
సర్వే టైం.. తెలంగాణలో  జోరుగా సొంత డబ్బాలు.
కేజ్రీవా(డా)ల్.. అసలే తిక్క.. దానికో లెక్క కూడా లేదు.
సభ్యత్వ నమోదు ప్రోగ్రాం లో మంత్రి ముందే నేతల డిష్యూం
నెత్తురు దాహం తీరని కేరళలో మరో హత్యా.!!
లిక్క‌ర్ కింగ్ విజయ్ మాల్యా అరెస్ట్..
ఆన్ లైన్లో సంచ‌ల‌నంగా మారిన “పాకిస్తాన్ చంప‌లేదు యుద్దం బ‌లితీసుకుంది”
ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఏపీ CM జగన్ మోహన్ రెడ్డి
తెలంగాణ సర్కార్ తో యుద్దానికి సిద్దమైన జర్నలిస్టులు..
కాబోయే భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కు యావత్ తెలంగాణ
కాంగ్రెస్ ఎన్సీపీ లకు షాక్.. ప్రధాని నరేంద్ర మోడీని ని
2006 లో GST ని వ్యతిరేకించిన మోడీ ఇప్పుడెందుకు తెచ్చాడు..??
సీమలో ప్యామిలీ డ్రామాలు .. వెలుగులోకి వస్తున్న గబ్బు రాజకీయాలు.
భూమా కుటుంబంలో మరో విషాదం…
ప్రపంచంలోనే అత్యంత చెడ్డ ముఖ్యమంత్రి ఎవరో గూగుల్ చెప్పేసింది.. ఎవరో
కర్నాటకలో కాంగ్రెస్ మార్క్ పాలన.. గుమాస్తాగా మారిన ముఖ్యమంత్రి కుమార
జనసేన కు రాజీనామా చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీజేపీ
మళ్లీ దెబ్బ తిన్న సీపిఐ నారయణ.
కల్వకుంట్ల కవిత 5 ఏండ్లలో సాధించలేనిది, అర్వింద్ 8 నెలల్లో
అడుగడుగునా అరెస్ట్ ల పర్వం.. రిజర్వేషన్ జాన్తానై అంటున్న బీజేపి.
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!