You are here
Home > రాజకీయం > తెలంగాణ ప్రజలు స్వేఛ్చా వాయువు పీల్చిన రోజు.. 

తెలంగాణ ప్రజలు స్వేఛ్చా వాయువు పీల్చిన రోజు.. 

1947 ఆగస్ట్ 15న యావత్ భారతదేశం బ్రిటిష్ కబంధ హస్తాల నుండి స్వాతంత్రం పొంది ఆనందోత్సాహాలు జరుపుకుంటుంటే.. హైద్రాబాద్ సంస్థాన్ లో ఆ పరిస్థితి లేదు, తెలంగాణ జిల్లాలతో పాటు కర్నాటకకు చెందిన మూడు జిల్లాలు మహారాష్ట్ర కు చెందిన ఐదు జిల్లాలు మొత్తం కలిపి హైద్రాబాద్ సంస్థాన్ గా ఉండేది.

అయితే భారతదేశం మద్యలో నడిబొడ్డులా ఉండే హైద్రాబాద్ సంస్తాన్ లో మాత్రం జనాలు మాన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కు మంటూ దుర్భరమైన బానిస బతుకుల్లోనే బతుకీడుస్తున్నారు.. కారణం ఒకే ఒక్కడు వాడే నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. హైద్రాబాద్ సంస్థాన్ ని ఏలుతున్నాడు.

వలసవాద బ్రిటిష్ పాలకులకు అనునాయుడిగా సామంతుడిగా వ్యవహరిస్తున్న నిజాం నవాబ్.. నేను కూడా స్వతంత్రున్ని అయ్యాను హైద్రాబాద్ సంస్థాన్ ఏ దేశానికి కూడా చెందదని స్వీయ ప్రకటన చేసుకున్నాడు. కానీ ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన తెలంగాణ ప్రాంతంలో ఎందరో ఉద్యమకారులు గలమెత్తడం జరిగింది. కొమరం భీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య లాంటి వారు నిజాం ను ఎదుర్కొన్నవారు. ఇక నిజాం నవాబ్ సపోర్టు తో ఖాసీం రజ్వీ ఆద్వర్యంలో రాజాకార్లు ప్రజలను పీడించడం దొరికినోల్లను దొరికినట్టే దోపిడీ చేయడం.. స్త్రీ ల పై అత్యాచారాలు విచ్చలవిడి హత్యలతో నాడు తెలంగాణ హైద్రాబాద్ సంస్థాన్ పూర్తిగా ఒక రాక్షస పాలనగా సాగుతున్న దశలో అప్పటికే చిన్న చిన్న సంస్థానాలను భారత్ లో విలీనం చేస్తున్న భారత హోంశాఖ మంత్రి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ హైద్రాబాద్ ని సవాల్ స్వీకరించారు.

హైద్రాబాద్ విలీనం కావాలన్నా నిజాం పీచమనచాలన్నా సైనిక చర్య తప్పదని నిర్ణయానికొచ్చారు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయి పటేల్. ఈ సైనిక చర్యకు “ఆపరేషన్ పోలో”  అనే పేరుతో 1948 సెప్టెంబర్ 13న హైద్రాబాద్ సంస్థాన్ ని ముట్టడించింది భారత సైన్యం. ఈ పరిణామాన్ని ముందుగానే ఊహించిన నిజాం నవాబ్ అప్పటికే పాకిస్తాన్ మద్దతును కూడా అడిగినా సర్దార్ పటేల్ వ్యూహం ముందు నిజాం ఎత్తుగడలు పనిచేయలేదు. ఇంక చేసేదేంలేక తప్పని పరిస్థితిలో 1948 సెప్టెంబర్ 17న నిజాం లొంగిపోవడంతో తెలంగాణ తో పాటు మహారాష్ట్ర నుండి ఐదు జిల్లాలు కర్నాటక నుండి మూడు జిల్లాలు మొత్తం సంస్థాన్ భారత్ లో విలీనం అయింది.

అంటే భారతదేశం స్వాతంత్ర్యం పొందిన దాదాపు 400 రోజుల తర్వాత తెలంగాణ ప్రాంతం స్వేఛ్చను పొందింది. అప్పటిదాకా తెలంగాణ ప్రజలు నిజాం రజాకార్ల పాలనలో అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు.

*ఈ గేయంలో నైజాం పాలనను చూడండి

ఈ నరకానికి ప్రతీకగా ఓ రచయిత రాసిన గేయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి..! బండెనక బండికట్టి పదహార్లు బండ్లు కట్టీ.. ఏ బండ్లె పోతవ్ కొడుకో.. నైజాము సర్కరోడా.. నాజీల మించినవ్రో నైజాము సర్కరోడా అనే గేయం నైజాం పాలనను కల్లకు కడుతున్నది. ఈ గేయంలో నైజాం నవాబ్ ను హిట్లర్ కంటే దుర్మార్గుడిగా పెర్కొనడం గమనించొచ్చు.

*తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అవమానించిన నిజాం నవాబ్

తెలంగాణ లో బతుకమ్మ ఉత్సవాలు అనాది కాలం నుండి వస్తున్న గొప్ప సాంప్రదాయం. తెలంగాణ చరిత్రకు ఆనవాల్లు, ప్రపంచంలో పూలతో భగవంతుడిని ఆరాధిస్తే తెలంగాణలో ఆ పూలనే భగవంతుడిగా ఆరాదించే అరుదైన అధ్భుత సాంప్రదాయం, అలాంటి బతుకమ్మ పండుగను నిజాం నవాబ్ వీలనైంత వరకు తన రాక్షస బుద్దికి తట్టినంతవరకూ అవమానించాడు.  తెలంగాణ స్త్రీ లను వివస్త్రలను చేసి బలవంతంగా బతుకమ్మ ఆడించి చిత్రహింసలు పెట్టి చంపడం. గర్బినీ స్త్రీ లను కూడా బలవంతంగా బతుకమ్మ ఆడించి చంపడం లాంటి ఘటనలు మచ్చుతునకలు. ఇంతటి ఘోరమైన సమాజం నుండి ఉద్భవించిన రణనినాదాలే నాటి ఉద్యమసారదులు కొమరం భీం, చాకలి ఐలమ్మ, లాంటి ఉద్యమ వీరులు. నిజాం నిరంకుశత్వం నుండి ప్రజల మాన ప్రాణాలని కాపాడడానికే వీరి జీవితాన్ని త్యాగం చేసారు. ఎన్ని పోరాటాలు ఎంతమంది ఉద్యమ వీరులు వారి జీవితాలను త్యాగం చేసినా భారత్ పోలీస్ యాక్షన్ జరిగేంతవరకూ నిజాం తన నిరంకుశత్వాన్ని నిర్వహించాడు. అందుకే తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ 17 విమోచన దినం అంటే ఆత్మగౌరవంగా భావిస్తారు. నేటికీ కర్నాటకలోని మూడు జిల్లాలు, మహారాష్ట్ర లోని ఐదు జిల్లాల ప్రజలు ఘనంగా విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆరోజు భారత మువ్వెన్నెల పతాకాన్ని ఎగిరేసి జెండావందనం చేస్తున్నారు. వారి ఆత్మగౌరవాన్ని చాటుకుంటున్నారు. మరి మన తెలంగాణ లో ఎందుకీ దౌర్భాగ్యం దాపురించింది.??

ఇంతకాలం తెలంగాణ కోసం కొట్లాడినం, మలిదశ ఉద్యమంలో1400 మంది ఉద్యమ వీరులు ప్రాణ త్యాగం చేసారు ఇందుకేనా..??

తెలంగాణ సాదించి మూడేల్లైనా ఎందుకోసం విమోచన దినం జరగడం లేదు తెలంగాణ లో.. ఎవరికోసం నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం తాకట్టుపెట్టబడుతోంది..?? ఈ ప్రశ్నలకు సమాదానాలు ఎవరియ్యాలి..??

తెలంగాణ కు నిజాం రాక్షసుడి చెర వదిలినప్పటికీ ఆ తర్వాత నాటి భారత ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ కు చెందిన నాయకత్వం కలిసి బలవంతంగా మద్రాసు నుండి విడిపోయిన ఆంద్రప్రదేశ్ లో తెలంగాణ ను కలపడం వలన మహా అంటే పెనంలో నుండి కాకుండా పోయిలో నుండే పెనం పైన పడ్డట్టు అయింది తెలంగాణ పని. ఇక నాటి నుండి మరో ఆత్మగౌరవ పోరాటం మొదలై 2014 జూన్ 2 వరకు సాగింది. అయినా ఇంకా తెలంగాణ జనాలు దొరలు పాలకుల చేతిలో మోసపోతూనే ఉన్నారు.

మాది ఉద్యమ పార్టీ మేం తెలంగాణ కోసం కొట్లాడుతున్నం అంటూ విమోచన దినోత్సవాన్ని ఎట్ల జరుపరంటూ నాడు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ఆంద్రా పాలకులను ప్రశ్నించిన వారు నేడు అధికారం రాగానే మౌనం పాటించడం మొహం చాటేయడం ఎంతటి దారుణం కదా..?? నాడు నిజాం పాలనలో వంచించబడ్డారు తెలంగాణ ప్రజలు, తర్వాత ఆంధ్ర పాలకుల చెరలోనూ వంచించబడ్డారు తెలంగాణ ప్రజలు, నేడు సొంత రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కూడా ఇంకా వంచించబడుతూనే ఉన్నారు తెలంగాణ ప్రజలు.

ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ముందుగా.. ఆత్మగౌరవమైన పాలన అవసరం.. ఇక ఆ ఆత్మగౌరవమే తాకట్టు పెట్టబడినప్పుడు ఏ దశలో అభివృద్ధి సాద్యం.?? అందుకే తెలంగాణలో సామాజిక ప్రజల పాలన రావాలి.. దళిత బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే నాయకుడు కావాలి. అక్రమ దారుల గుండెల్లో వణుకు పుట్టించగల ధమ్ము ధైర్యం ఉన్న మొనగాడు కావాలి.. వంచకులకే తలొంచి అడుగులకు మడుగులొత్తే వారి పాలనలో తెలంగాణ మరలా నిజాం పాలనను గుర్తుచేసే ప్రమాదం ఉంది. కావున తాను అవినీతి చేయకా ఇతరులకు లొంగక నిప్పులాంటి నాయకత్వ పరిపాలనా దక్షత కలిగిన బాహుబలి కావాలి.. అప్పుడే యావత్ తెలంగాణ బంగారు తెలంగాణ వైపు అడుగులేయగలదు.

– కొండెరు రాకెష్ (రీసర్చ్ స్కాలర్ జర్నలిజం డిపార్ట్మెంట్ ఓయూ తెలంగాణ) 

Related Posts
సింగరేణి సమ్మె సక్సెస్.. ఇరకాటంలో తెలంగాణ సర్కార్.
సింగరేణి బొగ్గుబావుల్లో శనివారం కూడా సమ్మె కొనసాగుతోంది. మూడో రోజు సమ్మెను మరింత ఉదృతం చేసేందుకు జాతీయ కార్మిక సంఘాలు నడుం బిగించాయి. అధికారులు చెపుతున్నవి కాకిలెక్కలంటూ మాములు పని దినాల్లోనే కానీ ఉత్పత్తి కేవలం 30 శాతం హజరుతో ఎలా ...
READ MORE
పంజాబ్ కాంగ్రెస్ లో లుకలుకలు మంత్రి పదవికి సిద్దూ రాజీనామా.!!
పంజాబ్ రాష్ట్రం లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లో లుకలుకలు బయటపడ్డాయి.ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీ కి దెబ్బ మీద దెబ్బ తాకినట్టైంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా బలహీనపడ్డ కాంగ్రెస్ కి ఈ పరిస్థితి మరింత కుంగదీసినట్టైంది.అయితే మొన్నటి పార్లమెంట్ ...
READ MORE
మళ్లీ మొదటికొచ్చిన పంచాయితీ.. గ్రూప్ 2 విషయంలో మౌనంవహిస్తున్న టీఎస్పీఎస్సీ.
ఎంసెట్.. సింగరేణి అసిస్టెంట్ పోస్టులు.. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. తాజాగా గ్రూప్ 2. ఉద్యోగం ఏదైనా ప్రభుత్వ మీద నింద మాత్రం పడకుండా పోవడం లేదు. నిష్పక్షపాతంగా నిర్వహించామని డబ్బా కొట్టుకుంటున్న టీఎస్పిఎస్సీ గ్రూప్ 2 విషయంలో అవకతవకలు జరిగాయని వాదిస్తున్నా ...
READ MORE
డిగ్రీ చదివిన ముస్లిం అమ్మాయిలకు ప్రధాని మోడీ వరం. “షాదీ షగున్’  పేరిట రూ. 51వేలు పెళ్లికానుక
బాలికా విద్యను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు మరో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. డిగ్రీ విద్యను పూర్తి చేసిన ముస్లిం యువతులకు 'షాదీ షగున్' పేరిట పెళ్లి కానుకగా రూ. 51 వేలను అందించాలని నిర్ణయం తీసుకోనుంది. మౌలానా ...
READ MORE
నేను TRS ఎమ్మెల్యే అయ్యాక నాకు చాలా మంది దూరమయ్యారు.
అధికార TRS పార్టీ మానకొండురు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య నే స్థానికంగా ఓ ప్రతిపక్ష పార్టీ కార్యకర్తను దుర్భాషలాడి వివాదంలో ఇరుక్కున్న ఎమ్మెల్యే బాలకిషన్ తాజాగా సొంత పార్టీ పైనే తన అసంతృప్తి ఘాటు ...
READ MORE
పాల్వాయి ఇకలేరు. కులుమనాలిలో గుండెపోటుతో మృతి.
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ పాల్వాయి గోవర్దన్‌ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ పర్యటనలో ప్రస్తుతం కులుమనాలిలో ఉన్న ఆయనకు శుక్రవారం ఉదయం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దాంతో పాల్వాయిని చికిత్స నిమిత్తం సిమ్లాలోని ...
READ MORE
నెత్తురు దాహం తీరని కేరళలో మరో హత్యా.!!
కేరళ రాష్ట్రం అంటే అదొక భూతల స్వర్గం పర్యాటకులకు అహ్లాదాన్ని పంచే అద్భుత ప్రకృతి సౌందర్యం. ఇదంతా నాణానికి ఒకవైపే మరో వైపు ఊహకందని నరమేధం రక్త పాతం హత్యా రాజకీయాలు. కేరళ రాష్ట్రం లో దశాబ్దాలుగా మారణకాండ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఎందరో ...
READ MORE
మళ్లీ దెబ్బ తిన్న సీపిఐ నారయణ.
సీపిఐ పార్టీ సీనియర్ నేత నారయణ దెబ్బల మీద దెబ్బలు తింటున్నాడు. ఇంతకీ అంత పెద్దాయన్నీ ఎవరు తంతున్నారని కదా మీ డౌంటు.. అయన్నెవరు తన్నడం లేదు. ఆయనే కోడలను , బండలను తంతు గాయాల పాలవుతున్నాతు. తాజాగా మరో సారి ...
READ MORE
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ నామినేషన్‌ను దాఖలు.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైన రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ రోజు తన నామినేషన్‌ను దాఖలు చేశారు. పార్లమెంట్‌ భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ కురవృద్ధుడు ఎల్‌.కే. అద్వానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తదితరులు హాజరయ్యారు. ...
READ MORE
కుల రిజర్వేషన్లకు ఓకే.. మత రిజర్వేషన్లకు నో..
తెలంగాణలో ముస్లీం, గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లును ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం ఉదయం అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా చర్చ జరిగింది. బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి మాట్లాడారు. ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫరుక్ అబ్దుల్లా ఫోబియా..!!
జమ్ము కాశ్మిర్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన ప్రసంగం పైనే దేశవ్యాప్తం గ సంచలన చర్చలు సాగుతున్నై. జమ్ము కాశ్మిర్ చరిత్రలో ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగ పాలించిన ఫరూక్ అబ్దుల్లా రెండు రోజుల క్రితం భారత రత్న అటల్ ...
READ MORE
పాకిస్తాన్ బంగ్లాదేశ్ లోని హిందూ, క్రైస్తవుల కోసం బీజేపీ తాపత్రయం ఎందుకు..??
ఇప్పుడు దేశమంతా ఒకటే చర్చ.. పౌరసత్వ సవరణ బిల్లు.వాస్తవానికి ఈ బిల్లును సమర్థించే మెజారిటీ ప్రజలకు దాదాపు ఒక అవగాహన ఉంది. కానీ వ్యతిరేకిస్తున్న కొందరికి ఈ బిల్లుపై సరైన అవగాహన లేక, మరో వర్గం అయితే బీజేపీ ప్రభుత్వం ఏం ...
READ MORE
కరోనా వైరస్ కంటే కేసీఆర్ ప్రమాదకరం- మంద కృష్ణ మాదిగ
ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు ఎంఆర్పిఎస్ మంద కృష్ణ మాదిగ. రాష్ట్రంలో కరోనా వైరస్ కంటే సీఎం కేసీఆర్ ప్రమాదకరమన్నారు. కేసీఆర్ కు ప్రజాప్రతినిధుల ప్రాణాలపై ఉన్న ప్రేమ… సామాన్య ప్రజలపై లేదన్నారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ ...
READ MORE
రోజు రోజుకు దిగ‌జారిపోతున్న ఎమ్మెల్యేలు.. నోటి దూళ‌తో అడ్డంగా దొరికిపోతున్న‌ నేత‌లు.
మొన్న ఆంధ్ర‌లో ఓ ఎమ్మెల్యే.. నిన్న క‌రీంన‌గ‌ర్ లో అధికార పార్టీ  ఎమ్మెల్యే.. ఈ రోజు ప‌రిగిలో  కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఆ పక్షం ఈ ప‌క్షం అన్న తేడా లేదు ఎమ్మెల్యే అన్న పొగ‌రుతో ఎంత కంటే అంత‌కు దిగ‌జారుతున్నారు మ‌న నేత‌లు. ...
READ MORE
కల్వకుంట్ల కవిత 5 ఏండ్లలో సాధించలేనిది, అర్వింద్ 8 నెలల్లో సాధించాడు.!!
2019 లోకసభ ఎన్నకల్లో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన స్థానం నిజామాబాద్ లోకసభ నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ పసుపు బోర్డ్ ఏర్పాటు కోసం అంతకు ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత ను ఎంపీ గ గెలిపించారు ఇక్కడి ప్రజలు. ...
READ MORE
కొసరు కోసం పోతే అసలుకే ఎసరొస్తుంది… కాస్త చూసుకో బాబు..!
ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ అప్పుడే హడా విడి మొదలైపోయింది. ఒక వైపు కుల రాజకీయాలు ఊపందుకున్నాయి. మరో వైపు కేంద్రంతో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు ఒకటి రెండు చిన్నా చితకా ఎన్నికలు రాబోతున్నాయి. అంచ ...
READ MORE
గ్రేటర్ పోరు లో చేతులెత్తేసిన కమ్యూనిస్టులు. కేవలం యూనివర్సిటీలకే పరిమితమా?
డిసెంబర్ 1 న జరగబోయే GHMC ఎన్నికల కోసం ప్రస్తుతం బీజేపీ మరియు TRS మధ్య నువ్వా నేనా అనే విధంగా రణరంగం తలపిస్తోంది. ఒకరి పై ఒకరు ధీటుగా విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ ఎన్నికల కాక రాజేస్తున్నారు. ఈ రెండు పార్టీ ...
READ MORE
మై హోం రామేశ్వర్ రావు దోపిడీ వల్ల కనీసం దేశ సంపదకు 4 లక్షల కోట్ల నష్టం.!!
అధికార పార్టీ టీఆర్ఎస్ పై, 'మై హోమ్ రామేశ్వరరావు పై సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ ఫైర్ బ్రాండ్ ధర్మపురి అర్వింద్. మై హోం’ సంస్థ వయలేషన్ ఆఫ్​ ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్​కు అడ్డాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ...
READ MORE
భార‌త 13 వ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా  ఎం. వెంక‌య్య నాయుడు..
భార‌త 13 వ ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎం. వెంక‌య్య నాయుడు ఎన్నిక‌య్యారు. ఎన్డీఏ అభ్యర్థిగా బ‌రిలోకి దిగిన ఆయ‌న అపూర్వ విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సంధ‌ర్భంగా ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు గారికి జ‌ర్న‌లిజంప‌వ‌ర్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తోంది. భార‌త దేశ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతు న్నా ...
READ MORE
CAB కి వ్యతిరేకంగ ర్యాలీలు చేస్తున్న వారిలో 99% అవగాహన లేనివారే..!!
ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా పౌరసత్వం సవరణ బిల్లు(CAB) పైనే చర్చ. ముస్లిం సంఘాలు కమ్యునిస్టులు కాంగ్రెస్ నాయకులు అక్కడక్కడ ఈ CAB కి వ్యతిరేకంగ ర్యాలీలు నిరసనలు చేస్తున్నారు. ఇక CAB కి వ్యతిరేకంగ కేరళా మరియు బెంగాల్ ...
READ MORE
ఆద‌ర్శ రైతుకు అరుదైన‌ అవార్డ్.. సీఎం కేసీఆర్ కు వ్యవసాయ నాయకత్వ అవార్డు.
ఉద్య‌మ నాయ‌కుడు స్వ‌యంగా రైతుగా విజ‌యాలు అందుకున్న తెలంగాన ముఖ్య‌మంత్రికి మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. భారత ఆహార, వ్యవసాయ మండలి ఆయనను ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్-2017 అవార్డుకు ఎంపిక చేసింది. కేసీఆర్ అంటే ఫాం హౌజ్, ఫాం హౌజ్ ...
READ MORE
ఆయేషా హత్య కేసు.. సత్యం నిర్దోషి..! మరి దోషులెవరు..?
న్యాయం గెలిచింది. ఎన్నాళ్లకు గెలిచిందనే దానికంటే ఎట్టకేలకు గెలిచింది అని చెప్పడమే ఉత్తమం. తొమ్మిదేళ్ల సుదీర్ఘ పోరాటంలో కఠిన శిక్షను అనుభవించి చేయని తప్పుకు శిక్ష పడి కాళ్లు చేతులు చచ్చుబడిపోయి చివరికి ప్రాణాలతోనే సత్యం న్యాయాన్ని గెలిచాడు. మరీ ఇక్కడ ...
READ MORE
అవినీతి ర(స)హిత రాజకీయాల కోసం ఆవిర్భవించిన ఆప్..?
అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రముఖ ఉద్యమకారుడు అన్నా హజారేతో కలిసి ఉద్యమాలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ని పెట్టి బలమైన భాజపా ను ఢిల్లీలో ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన కేజ్రీవాల్ నేడు పూర్తిగా ఆయన చెప్పిన నీతి సూత్రాలకు ...
READ MORE
నటి కవిత టీడీపీ ని వదిలి భాజపా లో చేరిక.!
టాలివుడ్ నటి కవిత చాలా కాలం నుండి టీడీపీ లో పని చేస్తున్నారు. ఆమె రాష్ట్ర స్థాయిలో అధికార ప్రతినిధి గ పని చేసారు. ఎన్నికల్లోనూ టీడీపీ నుండి స్టార్ క్యాంపేయినర్ గ కూడా ప్రచారం చేసారు. కాగా కొంత కాలంగ ...
READ MORE
కేంద్రంలో చంద్రబాబుకు ధీమా లేదు..ఉపాది హామీ నిధుల్లేవు.
మోడీతో స్నేహం బలే గమ్మత్తుగా ఉంటుంది. హద్దు మీరనివ్వడు. అలాగని హక్కున చేర్చుకోడు. ప్రతి ఒక్కరినీ ఆప్షన్ గానే వాడుకుంటాడు. ఎందుకుంటే బీజేపీకి పూర్తిగా స్థాయిలో మద్దతు ఉంది. ఎన్డీఏ భాగస్వామ్యాలతో కూడా పనిలేదు. దీంతో తన మిత్ర పార్టీలతో దొంగాట ...
READ MORE
సింగరేణి సమ్మె సక్సెస్.. ఇరకాటంలో తెలంగాణ సర్కార్.
పంజాబ్ కాంగ్రెస్ లో లుకలుకలు మంత్రి పదవికి సిద్దూ రాజీనామా.!!
మళ్లీ మొదటికొచ్చిన పంచాయితీ.. గ్రూప్ 2 విషయంలో మౌనంవహిస్తున్న టీఎస్పీఎస్సీ.
డిగ్రీ చదివిన ముస్లిం అమ్మాయిలకు ప్రధాని మోడీ వరం. “షాదీ
నేను TRS ఎమ్మెల్యే అయ్యాక నాకు చాలా మంది దూరమయ్యారు.
పాల్వాయి ఇకలేరు. కులుమనాలిలో గుండెపోటుతో మృతి.
నెత్తురు దాహం తీరని కేరళలో మరో హత్యా.!!
మళ్లీ దెబ్బ తిన్న సీపిఐ నారయణ.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ నామినేషన్‌ను దాఖలు.
కుల రిజర్వేషన్లకు ఓకే.. మత రిజర్వేషన్లకు నో..
కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫరుక్ అబ్దుల్లా ఫోబియా..!!
పాకిస్తాన్ బంగ్లాదేశ్ లోని హిందూ, క్రైస్తవుల కోసం బీజేపీ తాపత్రయం
కరోనా వైరస్ కంటే కేసీఆర్ ప్రమాదకరం- మంద కృష్ణ మాదిగ
రోజు రోజుకు దిగ‌జారిపోతున్న ఎమ్మెల్యేలు.. నోటి దూళ‌తో అడ్డంగా దొరికిపోతున్న‌
కల్వకుంట్ల కవిత 5 ఏండ్లలో సాధించలేనిది, అర్వింద్ 8 నెలల్లో
కొసరు కోసం పోతే అసలుకే ఎసరొస్తుంది… కాస్త చూసుకో బాబు..!
గ్రేటర్ పోరు లో చేతులెత్తేసిన కమ్యూనిస్టులు. కేవలం యూనివర్సిటీలకే పరిమితమా?
మై హోం రామేశ్వర్ రావు దోపిడీ వల్ల కనీసం దేశ
భార‌త 13 వ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఎం. వెంక‌య్య నాయుడు..
CAB కి వ్యతిరేకంగ ర్యాలీలు చేస్తున్న వారిలో 99% అవగాహన
ఆద‌ర్శ రైతుకు అరుదైన‌ అవార్డ్.. సీఎం కేసీఆర్ కు వ్యవసాయ
ఆయేషా హత్య కేసు.. సత్యం నిర్దోషి..! మరి దోషులెవరు..?
అవినీతి ర(స)హిత రాజకీయాల కోసం ఆవిర్భవించిన ఆప్..?
నటి కవిత టీడీపీ ని వదిలి భాజపా లో చేరిక.!
కేంద్రంలో చంద్రబాబుకు ధీమా లేదు..ఉపాది హామీ నిధుల్లేవు.
Facebook Comments
Top
error: Content is protected !!