
రాను రాను ఖాకీలకు కండకావరం ఎక్కువ అవుతుంది. ఒంటి మీదకి డ్రెస్ రాగనే ఎక్కడలేని మదం ఒంటికి ఎక్కుతుంది. నోటికి ఎంతొస్తే అంత.. చేతికి ఎలా అనిపిస్తే అలా ప్రవర్తిస్తూ అభాసుపాలవుతున్నారు. కన్ను మిన్ను మరచి బిహేవ్ చేస్తున్నారు కొందరు ఖాకీలు. తాజాగా చోటు చేసుకుంటున్న వరుస ఘటనలే అందుకు సాక్ష్యం. ఓ పక్క ప్రభుత్వం ఫ్రెండ్లి పోలిసింగ్ అని చెపుతున్న ప్రెండ్లి గిండ్లి జాన్తానై అంటున్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సైలు. మరి వారి ఖండకావరం ఎంతుందో మీరే చూడండి.
పెద్దపల్లి జిల్లా బొంపెల్లి గ్రామానికి చెందిన అరికెల్లి మధునయ్యకు ధర్మారం ప్రధాన రోడ్డుకు ఆనుకుని రెండెకరాల పొలం ఉంది. అందులో మధునయ్య వరి పంట వేసుకున్నాడు. శనివారం రాత్రి పొలానికి నీళ్లు పెట్టమని రాత్రి 9 గంటల సమయంలో తన కొడుకు దేవేందర్ కు చెప్పాడు. దీంతో ఆయన తన సొంత ఆటోలో పొలానికి నీళ్లు పెట్టేందుకు బయలుదేరాడు.. పిల్లలు తాము పొలానికి వస్తాం అంటు మారం చేయడంతో తప్పని పరిస్థితిల్లో తీసుకెళ్లాడు.. దేవేందర్ భార్య శ్యామల కూడా పిల్లలు ఇబ్బందుపడుతారని తాను బయలు దేరింది. కుటుంబం అంతా కలిసి ఆటోలో వెళ్లి తండ్రి దేవేందర్ పొలానికి నీళ్లు పెడుతుంటే రోడ్డు మీద ఆటోలో ఉండిపోయారు.
అదే సమయంలో ఎస్సై హరిబాబు పెట్రోలింగ్ కని అటు వైపుగా వచ్చాడు. ఆటోలో ఉన్న శ్యామల ను చూసి ఇంత రాత్రి ఇక్కడే చేస్తున్నాం.. ఈ పిల్లలెవరు.. కేసుల కనిపిస్తున్నాం దుకాణం నడుపుతున్నావా అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడాడు.. లేదండి పొలానికి నీళ్లు పెట్టడానికి వచ్చాం అని చెప్పిన వినిపించికోలేదు. అదే సమయంలో అక్కడికి వచ్చిన భర్త దేవేందర్ ఎస్సై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏం రా ఎస్సై మీదకే వస్తావా.. అంత బలుపా.. అంటూ చేతి వాటం చూపించాడు ఎస్సై హరిబాబు. తాము అలాంటి వాళ్లం కాదండి అంటూ దేవేందర్ ఓ వైపు ప్రాదేయపడుతున్నా వినిపించుకోకుండా… నన్నే ఎదురిస్తావ్ రా అంటూ ఎస్సై హరిబాబు దేవేందర్ దాడికి దిగాడు. అదే రాత్రి కుటుంబ సభ్యులందరిని పెద్దపల్లి స్టేషన్ కు తరలించాడు ఎస్సై హరిబాబు. పెద్దపల్లి స్టేషన్ కు తరలించిన తరువాత అక్కడ డ్యూటిలో ఉన్న మరో ఎస్సై తన విశ్వరూపం చూపించాడు. దేవేందర్ పై తిరిగి దాడికి దిగాడు. ఎస్సై ని పట్టుకుని మారు మాట్లాడుతావురా నీకెంత ధైర్యం అంటూ భూతులు తిడుతూ దేవేందర్ పై దాడికి దిగాడు మరో ఎస్సై శ్రీనివాస్. భర్తను అలా కొడుతుండటంతో భార్య శ్యామల ఎస్సై కాళ్లా వేళ్ల పడింది తన భర్తను కొట్టొదంటు వేడుకుంది. అయినా వినకుండా దాడి చేశాడు ఎస్సై శ్రీనివాస్. ఇక లాభం లేదని శ్యామల పెద్దగా అరుపులు పెట్టడంతో పక్కనే ఉన్న పోలీసులు ఆమె నోరు నొక్కారు. దీంతో అస్వస్థకు గురైన శ్యామల అక్కడే కుప్ప కూలిపోయింది. ఆ తరువాత ఏం తెలియనట్టు ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అయితే తప్పంతా పోలీసుల వైపే ఉన్నా అధికార మదంతో తిరిగి దేవేందర్- శ్యామల పైనే కేసు నమోదు చేసాడు ఎస్సై శ్రీనివాస్. ప్రస్తుతం శ్యామల ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. దేవేందర్ ఎక్కడున్నాడన్న విషయం మాత్రం తనకు తెలియదని చెబుతోంది. వెంటనే దేవేందర్ ఆచూకి తెలుపాలని పోలీసులను వేడుకుంటోంది.
ఇదంతా చూశాక మానవత్వం ఉన్న ఏ మనిషైనా ఆ ఖాకీల రుబాబుకు ఛీ అనక మానరు. అయితే ఇంత దారుణానికి దిగిన ఆ ఇద్దరు ఎస్సైలు మాత్రం దర్జాగా తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడే ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి సదరు ఎస్సై శ్రీనివాస్ పెద్దపల్లి లో గబ్బర్ సింగ్ లా ఫీలవుతాడని సమాచారం. రాత్రి 7 గంటలు అయితే చాలు రోడ్ల మీద యువకులు కనిపించడమే ఆలస్యం తన లాఠీకి పని చెపుతున్నాడంట. ఈ మధ్యే ఓ విద్యార్థిని అందునా ఎస్సైకి క్వాలిఫై అయి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న యువకునిపై చేయి చేసుకున్నాడంట. ఇదేంటని ప్రశ్నిస్తే ఏం రా ఎక్కువ మాట్లాడుతున్నావ్ పోలీస్ అంటే ఏం అనుకుంటున్నావ్ అని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎస్సైలు హరిబాబు, శ్రీనివాసుల దోరణితో ఖాకీ చొక్కాకున్న విలువ మంటగలిసిపోతుందని వాపోతున్నారు పలువురు పోలీసులు.మరో వైపు ఫ్రెండ్లీ పోలిస్ అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. దేవేందర్ – శ్యామల కుటుంబం పై దాడి చేసి ఉల్టా తప్పుడు కేసులు పెట్టిన ఈ ఇద్దరు ఎస్సైలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పెద్దపల్లి ప్రజలు. ప్రభుత్వ పార్టీ కార్యకర్తలకు కూడా ఈ బలుపు బాసుల చేతిలో ఇబ్బందులు తప్పడం లేదంట. తమ తిక్కకు, బలుపుకు అందరు సమానమే అంటూ నానా బూతులతో గబ్బర్ సింగ్ ల్లా ఫీలవుతున్నారంట. మరి ఈ ఖాకీలకు డిపార్ట్ మెంట్ ఏ అవార్డు ప్రకటిస్తుందో చూడాలి. ఎందుకంటే మన ఖాకీ పెద్ద బాసులకు ఇలాంటి ఖాకీలంటేనా కదా అమితమైన ప్రేమ. ఫ్రెండ్లీ పోలిసింగా మజాకా.
























