You are here
Home > రాజకీయం > రచ్చ గెలిచింది చాలు ఇక ఇంటగెలుద్దాం అంటున్న నేతలు..

రచ్చ గెలిచింది చాలు ఇక ఇంటగెలుద్దాం అంటున్న నేతలు..

తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపిలుగా పార్లమెంట్ లో అడుగు పెట్టిన నేతలు ఇక ఇంటి బాట పట్టేందుకు రెడీ అవుతున్నారు. 2014 లో ఎంపిలుగా ఎన్నికై రచ్చ గెలిచిన నేతలు ఇక ఇంట గెలిచేందుకు పక్కా ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఎన్నాళ్లుగానో తమ తమ మనసుల్లో ఉన్న కోరికలను నిజం చేసుకునేందుకు రెండేళ్ల ముందు నుండే స్కెచ్ లు రెడీ చేసుకుంటున్నట్టు సమాచారం. ఇంతకీ ఆ నేతలెవరు ఇంట గెలవాలన్న వారి ఆశల వెనుకున్న కథేంటి చదివేస్తే పోలా.

సల్ల కొచ్చి ముంత దాయడం ఎందుకు డైరక్ట్ గా పాయింట్ లోకే వెళ్దాం. సెంట్రల్ పోస్టే అయినా స్టేట్ లో తమకు అంతగా ప్రాదాన్యం ఉండటం లేదని ఇటు పార్టీలో అటు ప్రజల్లో పూర్తి స్థాయిలో పట్టులేదనే బావనలో ఉన్నారంటా తెలంగాణ సర్కార్ ఎంపీలు. లోకల్ లో ఎమ్మెల్యేలకు ఉన్నంత పలుకుబడి తమకు ఉండటం లేదని ఒకింత నిరుత్సాహంగా ఉన్నట్టు కూడా సమాచారం. నిజానికి ఎంపీలంటే కేంద్రంలో సత్తా చాటి రాష్ట్రానికి నిధుల ప్రవాహాన్ని తీసుకు వచ్చే దూతలు కానీ తెలంగాణలో ఇప్పుడున్న ఎంపీలకు ఢిల్లీ కంటే గల్లీలో రాజకీయమే రంజుగా ఉంటుందని పిక్స్ అవుతున్నారంట. సార్ దగ్గర ఎంపీల కంటే ఎమ్మెల్యేలకు పట్టు ఎక్కువ పెరుగుతుండటం అటు అదికారులు సైతం తమ పార్లమెంట్ పరిదిలోని నియోజక వర్గాల ఎమ్మెల్యేలకు దక్కే గౌరవం కూడా దక్కడం లేదని నిరాశలో ఉన్నారంట. ఇక ఇలా అయితే కుదరదని బావించిన సదరు ఎంపీలు రానున్న 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే లుగా పోటీ చేసి నేను లోకల్ అని కాలర్ ఎగరవేయాలని పిక్స్ అయినట్టు తెలుస్తోంది. అందుకు గాను ఇప్పటి నుండే రూట్స్ క్లియర్ చేసుకుంటున్నారంటా. ఇక వారేవరో కూడా ఓ లుక్కేద్దాం పదండి.

తమ పరిధిలో ఉండే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాకుండా కొందరు ఎంపీలు తమకు దూరంగా ఉన్న అసెంబ్లీ సీట్లపై కూడా గురి పెట్టారంట. తమకు అనుకూలమైన అసెంబ్లీ సెగ్మెంట్లపై ఇప్పటి నుంచే టార్గెట్‌ పెట్టారని కీలక సమాచారం. ఆ లిస్ట్ లో యువ ఎంపీ ముందు వరుసలో ఉన్నారంట. ఇక ఇప్పటి నుండే ఆయా స్థానాలని తమ ఆదీనంలోకి తెచ్చుకునేందుకు పావులు కదుపుతున్నారని టాక్. ఎంపీ కోటా నిధులలో ఎక్కువ మొత్తాన్ని ఈ సెగ్మెంట్లకు కేటాయించి తమ లోగుట్టును బయటపెడుతున్నారంట. ఎమ్మెల్యేలుగా గెలిచేందుకు కొందరు.. ఏకంగా రాష్ట్రంలో మంత్రి కావాలనే బిగ్‌ టాస్క్‌తో మరికొందరు ఎంపీలు ఇప్పటికే పావులు కదిపుతునట్లు కనిపిస్తోంది. మరోవైపు ఎంపీల పక్క చూపులు అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోందంట. దీంతో రెండేళ్ల ముందే తెలంగాణ రాజకీయం రసవత్తంగా మారుతోందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.

ఇక అసలు విషయంలోకి వస్తే… తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా కీలకంగా పని చేసిన బాల్కసుమన్‌ 2014 ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌ససభ స్థానం నుంచి గెలుపొందారు. విద్యార్థి నాయకుడి నుంచి ఎంపీగా ఎన్నికైనా ఆయన లక్ష్యం మాత్రం మొదటి నుంచి అసెంబ్లీ వైపే అని సమాచారం. రానున్న 2019 ఎన్నికల్లో ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలనే ఆలోచనతో ఉన్నారంట ఈ యువ నేత. అందుకోసం కరీంనగర్‌ జిల్లాలోని చొప్పదండి స్థానంలో అవకాశం కోసం వేచిచూస్తున్నారని తెలుస్తోంది. ఇక్కడ కుదరకుంటే, ప్రస్తుతం ఎంపీగా ఉన్న పెద్దపల్లి సెగ్మెంట్‌లోని ఏదైనా ఓ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలిచి రాష్ట్రంలో ఓ మంత్రి పదవిని అందుకోవాలనే అలోచనలో ఉన్నారంట యువ ఎంపీ బాల్కం. ఇక మరో ఎంపీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ పోస్టుకు రాజీనామా చేసి 2014 ఎన్నికల్లో మహబూబాబాద్‌ ఎంపీగా గెలిచిన అజ్మీరా సీతారాంనాయక్‌కు ఎమ్మెల్యే పదవిపైనే మక్కువ ఎక్కువ ఉందంట. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలనే ఉద్దేశంతో ఈయన కూడా ఉన్నట్టు సమాచారం. సొంత అసెంబ్లీ సెగ్మెంట్‌ ములుగులోగానీ , మహబూబాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లోగానీ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం వస్తుందని భావిస్తున్నారంట సీతారాం. ఇటీవల మహబూబాబాద్‌లో ప్రజాప్రతినిధి, ఉన్నతాధికారుల మధ్య జరిగిన వ్యవహారం తనకు అవకాశం వచ్చేలా చేస్తుందని భావిస్తున్నారు.

మరో సీనియర్ నాయకుడు కరీంనగర్‌ లోక్‌సభ సభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన బొగ్గు గని కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ సంఘానికి భూపాలపల్లిలో ఓటమి ఎదురైంది. గతంలో వినోద్‌కుమార్‌ హన్మకొండ ఎంపీగా ఉన్నప్పుడు ఈ సెగ్మెంట్‌ ఆయన పరిధిలో ఉండేది. ఇదే కారణంతో 2014 ఎన్నికల్లో వినోద్‌కుమార్‌ ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. సింగరేణి ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ సెగ్మెంట్‌లో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధిపై వ్యతిరేకత ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పార్టీ అధిష్టానం వినోద్‌కుమార్‌ను ఇక్కడికి పంపే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వినోద్‌కుమార్‌ హుస్నాబాద్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సైతం జరుగుతోంది. ఈ సెగ్మెంట్‌ ప్రస్తుతం వినోద్‌కుమార్‌ ఎంపీగా ఉన్న కరీంనగర్‌ లోక్‌సభ సెగ్మెంట్‌లోనే ఉంది.

గత ఎన్నికల్లో వైస్సాఆర్‌సీపీ తరుపున ఖమ్మం ఎంపీగా గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చూపు సైతం రాష్ట్ర అసెంబ్లీవైపే ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలనేది శ్రీనివాస్‌రెడ్డి అంతరంగంగా ఆయన సన్నిహితులలో చర్చ జరుగుతోంది. అయితే ఖమ్మం జిల్లాల్లో రిజర్వుడు స్థానాలే ఎక్కువగా ఉండడం శ్రీనివాస్‌రెడ్డి లక్ష్యానికి అడ్డంకిగా మారుతోంది. అయినా టీఆర్‌ఎస్‌ అధిష్టానం వద్ద తన మనసులోని మాటను బయటపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

నల్లగొండ లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి రాజకీయ ప్రయాణంలో ఎమ్మెల్యే పదవి అందకుండానే పోతోంది. ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలనే లక్ష్యంతో ఆయన ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. టీడీపీలో, కాంగ్రెస్‌లో ఈ లక్ష్యం నెరవేరలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరుపున నల్లగొండ లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాష్ట్రంలో మంత్రి కావాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ చేరినట్లు ప్రచారంలో ఉంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తాజాగా ఏర్పాటు చేస్తున్న రైతు సమన్వయ సమితి ప్రక్రియ అంతా సుఖేందర్‌రెడ్డి చుట్టే జరుగుతున్నట్లు ప్రచారం జరిగింది. నల్లగొండ లోక్‌సభకు సుఖేందర్‌రెడ్డి రాజీనామా చేస్తే… మళ్లీ ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరనే చర్చ కొనసాగుతోంది. టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఉప ఎన్నికలో మరొకరికి అవకాశం కల్పిస్తే సుఖేందర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి కావాలనే లక్ష్యంతో ఉంటారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సుఖేందర్‌రెడ్డి మిర్యాలగూడలో పోటీ చేస్తారా? మరేదైనా అసెంబ్లీ సెగ్మెంట్‌ను ఎంచుకుంటారనేది ఆసక్తికరంగా ఉండనుంది. ఇలా ఎంపీలంతా ఎమ్మెల్యేలుగా మారి మంత్రులవ్వాలనే ఆశలో ఊగిసలాడుతుండటంతో ప్రస్తుతం ఉన్న సిట్డింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక 2019 సంగ్రామంలో కొందరు ఎమ్మెల్యేలకు ఉద్వాసన తప్పదనే ప్రచారం నేపథ్యంలో ఎంపీల ఆశలకు ఆసరా లభించినట్టే. చూడాలి ఢిల్లీ వదిలి గల్లీకి రావాలనుకుంటున్న నేతల భవిష్యత్ ఎలా ఉండబోతుందో..?

Related Posts
తెలంగాణలో కాంగ్రెస్ కు కోలుకోలేని ఎదురుదెబ్బ..
2014 లో అధికారం కోల్పోయి దేశ వ్యాప్తంగా డౌన్ ఫాల్ అవుతున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా నరేంద్ర మోడి ని అడ్డుకుని అధికారంలోకి రావాలని గల్లీ పార్టీ లను కూడా కలుపుకుంటూ ఒక ప్రతిపక్షంగ ప్రజా సమస్య లపై ఫోకస్ ...
READ MORE
ఆ డబ్బూ బాబు జేబులోదా.. లేక జనాలదా..??
ధర్మ పోరాట దీక్ష పేరుతో ఆంధ్ర ప్రదేశ్ లో కార్యక్రమాలు నిర్వహించీ.. ఇతాజాగా ఢిల్లీ లో నిరసన దీక్ష నిర్వహించిన చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలపై వైసీపీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండి పడ్డారు. ఢిల్లీ దీక్షలో ఖర్చు ...
READ MORE
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
ఉత్తర ప్రదేశ్ లో రాజకీయ బలం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతకు ముందు బీఎస్పీ ఎస్పీ స్థానిక పార్టీలుగ అధికారం సాధించాయి. కానీ నరేంద్ర మోడి అమిత్ షా యోగీ ఆదిత్యానాథ్ ల ఆధ్వర్యంలో ఉత్తర ప్రదేశ్ ఇప్పుడు ...
READ MORE
నోరు జారింది ఓటు మారింది.. ఓవర్ కాన్పిడెన్ష్ కొంప ముంచింది. వైసిపికీ ఓటమిని కట్టబెట్టిన నంద్యాల ఓటర్లు. 
నంద్యాల నందుల ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోను చర్చకు దారి తీసింది. రాయలసీమలో తిరుగు లేదని ప్రగాల్భాలు పలికిన వైసిపికి ఓటర్లు మొండి చేయే చూపారని ఫలితాలు చెపుతున్నాయి. స్థానికత, భూమా సానుభూతి అంతకు మించి వైసిపి ...
READ MORE
మొన్న రైతులు, నిన్న దళితులు, నేడు మహిళలపై కేసులు? తెలంగాణ లో దుస్థితి
తెలంగాణ లో ఎప్పుడూ ఏదో ఒక ఘటనతో రాజకీయాలు వేడెక్కుతున్నై.. ఒక అంశం చల్లారకముందే మరో వివాదం ప్రజల్లో చర్చకు దారితీస్తున్నది. మొదట మిర్చి రైతుల ఉద్యమంలో పాల్గొన్న రైతుల చేతులకు సంకెల్లు వేసి దోపిడీ దొంగలుగా నరరూప ఉగ్రవాదులను దేశ ...
READ MORE
బీజేపీ లోకి మరో మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!!
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆకర్ష్ పథకం ఒక రేంజ్ లో దూలుకెల్తోంది. ఆ పార్టీ ఈ పార్టీ అనేదే లేదు, అన్ని పార్టీల నుండి వలసలు కొనసాగుతున్నై. ఆంధ్రప్రదేశ్ లో అయితే మరింత దూకుడుగ వెల్తోంది కమలదళం. ఇప్పటికే టీడీపీ నుండి ...
READ MORE
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
కుకునూర్ పల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి హత్య..? ఆత్మహత్య అని చెప్పడాని కంటే హత్య అని చెప్పేందుకే ఆదారాలు ఎక్కువున్నాయన్నది ఆఫ్ ది రికార్డ్. హైదరబాద్ బ్యూటిషన్ శిరిషా ఆత్మహత్య..? సేమ్ టూ సేమ్ ఇక్కడ కూడా హత్య అని చెప్పేందుకే ...
READ MORE
కేరళలో కమ్యునిస్టులకు భారీ షాక్.. భాజపాలో చేరిన ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్.!!
దేశంలో భాజపా ఎదుగుదల రోజురోజుకు పెరుగుతూవస్తోంది, ప్రముఖులు సమాజంలో మంచి ప్రతిష్ఠ కలవారు ఒక్కొక్కరుగా కాషాయ కండువా కప్పుకుంటున్నారు. దేశంలో మూసధోరని రాజకీయాలను మారుస్తూ నూతన రాజకీయాలను శుభారంభం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ భాజపా ...
READ MORE
ఆస్ర్టేలియా సంచలన నిర్ణయం… వీసా 457 ను రద్దు.
ఆస్ట్రేలియా పిడుగులాంటి వార్త వినిపించింది. అమెరికాలో సవరించిన హెచ్‌1బీ వీసాల నిబంధనలపై మంగళవారం ట్రంప్‌ సంతకం చేయనుండగా అదే దారిలో ఆస్ర్టేలియా సైతం భారత టెక్కీలకు షాకిచ్చింది. విదేశీయులకు ఉద్యోగాలు కల్పించే కీలక వీసా విధానం 'వీసా 457'ను రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ...
READ MORE
తెలంగాణ‌లో మ‌ళ్లీ అధికారం టీఆర్ఎస్ దే.. 106 స్థానాలు ప‌క్కాగా గెలుస్తాంః కేసీఆర్
ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లొచ్చినా టీఆర్ఎస్ పార్టీ ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శేఖ‌ర్ రావు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా 106 స్థానాలు మ‌న‌మే గెలుస్తామ‌ని పార్టీ నేత‌ల‌తో తెలిపారు. గురువారం జ‌రిగిన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడుతూ అన్ని ...
READ MORE
కమ్యూనిస్ట్ లకు బీజేపీ నేత రాజాసింగ్ సీరియస్ వార్నింగ్.. భాగ్యనగరంలో అడుగు పెట్టొద్దు.
కేరళలలో హిందువులపై జరిగిన అమానుష కాండ దేశ వ్యాప్తంగా అల్లర్లకు దారి తీసేలా కనిపిస్తోంది. ఇప్పటికే యావత్ భారతంలో కమ్యూనిస్ట్ వ‌ర్సెస్ హిందూ సంఘాల మ‌ధ్య వార్ తీవ్ర రూపం దాల్చింది. కేర‌ళ‌లో ఆర్ ఎస్ ఎస్ నేత‌ల‌పై జ‌రుగుతున్న దాడులపై ...
READ MORE
2019 లో టీడీపీ బద్ద శత్రువు ఇప్పటి మిత్రుడేనా..?
'ఇప్పటికైతే మేం తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో మిత్రపక్షంగానే వున్నాం. 2019 ఎన్నిలకు సంబంధించి పొత్తుల విషయమై ఇప్పుడే ఏమీ మాట్లాడలేం. కానీ, మా పార్టీకి 15 నుంచి 20 శాతం వరకూ ఓటు బ్యాంకు స్పష్టంగా కన్పిస్తోంది. ఇంకో ఐదు శాతం ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ కు మొదలైన అసంతృప్తుల సెగ.. కమలం గూటికి చేరిన బాబు మోహన్.!!
ముందస్తు ఎన్నికలకు పోతూనే 105 మంది పోటీ చేసే అభ్యర్థుల లిస్టును బహిర్గతం చేసి ఎన్నికల నగారా మోగించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్. ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోతున్నారో ఇంతవరకు సరైన సమాధానం చెప్పకుండానే ప్రచారం కూడా మొదలుపెట్టేసారు. అయితే.. దాదాపు అన్ని ...
READ MORE
అమ్మాయిలను వేధించిన కేసులో “షీ”టీంకు చిక్కిన TRS కార్పోరేటర్ కొడుకు
రోజు రోజుకు అధికార తెరాస పార్టీ నాయకులు మరియు కార్పోరేటర్ల కొడుకులు అనుచరుల ఆగడాలు హద్దులు మీరిపోతున్నై.. పార్టీ అధిష్టానానికి కొత్త కొత్త తలనొప్పులు తెస్తున్నై.. మొన్నటికి మొన్న మంత్రి పద్మారావు కుమారుడు సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో ఓ వ్యక్తి ...
READ MORE
కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించిన యువకుడు.!!
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల ప్రచారంలో అవమానం జరిగింది. ఎరుపు రంగు టీషర్ట్ వేసుకున్న ఒక యువకుడు హఠాత్తుగ కాన్వాయ్ పైకి ఎక్కి మరీ కేజ్రీవాల్ చెంప పై గట్టిగ కొట్టడంతో వెనక్కి పడిపోయాడు కేజ్రీవాల్, ...
READ MORE
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
అక్క చుట్టమైతే లెక్క చుట్టం కాదన్నది సామెత. కానీ వీళ్లు మాత్రం ఇష్టం ఉన్నట్టుగా రెచ్చిపోతున్నారు. యుగయుగాల చరిత్రకి రక్తపు మరకలంటిస్తున్నారు. అహింస బాటలో సాగిన ఆనాటి రక్షణను.. హింసే పరమో ధర్మం అంటూ సాగుతున్నారు. గోరక్షకుల పేరుతో కిరాతానికి ఒడిగడుతున్న వారి ...
READ MORE
రైతులకు సంకెళ్లు.. ఇది పోలీసుల ఓవర్ యాక్షనా.. ప్రభుత్వం చేజేతుల చేసినా రియాక్షనా..?
అన్నం పెట్టే అన్నదాతను జైళ్లో పెట్టారు.. కడుపు మండి చేసిన తప్పుకు ఉగ్రవాదులకంటే దారుణంగా చూశారు. ఖమ్మం మిర్చి రైతుల కుటుంబాల గుండెల్లో ఆరని మంటలను రగిలించారు. నిదింతులను అప్పుడే దోషులను చేసి కోర్టుకు తీసుకొచ్చారు. భూమిని దున్నే చేతులకు సంకెళ్లేసి ...
READ MORE
ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం.. సీఎం కేసీఆర్‌కు విద్యార్థుల వార్నింగ్.
ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది వేడులను బుధవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఘనంగా ప్రారంభించారు.   దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ఓయూ చేరుకున్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన ...
READ MORE
నటి కవిత టీడీపీ ని వదిలి భాజపా లో చేరిక.!
టాలివుడ్ నటి కవిత చాలా కాలం నుండి టీడీపీ లో పని చేస్తున్నారు. ఆమె రాష్ట్ర స్థాయిలో అధికార ప్రతినిధి గ పని చేసారు. ఎన్నికల్లోనూ టీడీపీ నుండి స్టార్ క్యాంపేయినర్ గ కూడా ప్రచారం చేసారు. కాగా కొంత కాలంగ ...
READ MORE
తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.
తెలంగాణ రాష్ట్రం మూడేళ్లు పూర్తి చేసుకుని జూన్ 2 న ఘనంగా నాలుగవ ఏడాదిలోకి అడుగు పెట్టింది. మన స్వరాష్ట్ర వేడుకలు, ఆవిర్భావ దినోత్సవం పండుగా సంబురాలు ఘనంగానే సాగాయి. కానీ అక్కడక్కడ కొన్ని అనుకోని ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని ...
READ MORE
వైసీపీ తో టీఆర్ఎస్ దోస్తీ.. ఇది అంతర్గతంగ కేసిఆర్ చంద్రబాబుల వ్యూహం అంటున్న విశ్లేషకులు.!!
వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ తో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో టీఆర్ఎస్ నేతలు చర్చలు జరపడం పై ఇరు పార్టీలు చంద్రబాబు నాయుడు కు వ్యతిరేకంగ జాతీయ స్థాయి లో రాష్ట్రాల హక్కుల అమలు కోసమే ...
READ MORE
పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన సెవ్వాగ్, మహ్మద్ కైప్. కుల్ భూషణ్ ను ఉరి కలలో కూడా జరగదు.
కుల్‌భూషణ్ జాదవ్ ఉరి అంశంపై సోషల్ మీడియాలో హర్షం వ్యక్తమవుతోంది. హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం భారత్‌కు అనుకూలంగా తీర్పు చెప్పడంతో పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్నారు ఇండియన్ నెటిజన్లయ. తుది తీర్పును వెల్లడించే వరకూ జాదవ్‌ ఉరిశిక్షను ఆపేయాలని పాకిస్థాన్‌ను అంతర్జాతీయ ...
READ MORE
కేసీఆర్ పెట్టే భోజ‌నం కోసం వెళ్లే ర‌కం కాదు..
టీటీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్య‌వ‌హారం చిలికి చిలికి గాలి వాన‌గా మారింది. సొంత పార్టీ నేత‌లు వ‌ద్దు పొమ్మంటుంటే మీరు పొమ్మ‌నేది ఏంది నేనే వెళ్లిపోతున్న అంటున్నారు రేవంత్ రెడ్డి. పార్టీ అద్య‌క్షుడు వ‌చ్చేంత వ‌ర‌కు కూడా ఓపిక ...
READ MORE
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపి మంత్రి నారాయణ కుమారుడు మృతి
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ సహా అతడి స్నేహితుడు రాజా రవివర్మ మరణించారు. నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.36లో ఈ ప్రమాదం జరిగింది. మంత్రి కుమారుడు ప్రయాణిస్తున్న బెంజ్ కారు అతి ...
READ MORE
అజాత శత్రువు దత్తన్న
అలయ్ బలయ్ అనగానే గుర్తుకు వచ్చే పేరు బండారు దత్తాత్రేయ. హైదరాబాద్ సిటీలో ఏ పార్టీ లీడరైనా అలయ్ బలయ్ కు రావాల్సిందే, దత్తన్న ను కలవాల్సిందే. అందరి వాడుగా పేరు తెచ్చుకున్న బండారు దత్తాత్రేయ నూటికి నూరు శాతం ప్రజల ...
READ MORE
తెలంగాణలో కాంగ్రెస్ కు కోలుకోలేని ఎదురుదెబ్బ..
ఆ డబ్బూ బాబు జేబులోదా.. లేక జనాలదా..??
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
నోరు జారింది ఓటు మారింది.. ఓవర్ కాన్పిడెన్ష్ కొంప ముంచింది.
మొన్న రైతులు, నిన్న దళితులు, నేడు మహిళలపై కేసులు? తెలంగాణ
బీజేపీ లోకి మరో మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!!
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
కేరళలో కమ్యునిస్టులకు భారీ షాక్.. భాజపాలో చేరిన ఇస్రో మాజీ
ఆస్ర్టేలియా సంచలన నిర్ణయం… వీసా 457 ను రద్దు.
తెలంగాణ‌లో మ‌ళ్లీ అధికారం టీఆర్ఎస్ దే.. 106 స్థానాలు ప‌క్కాగా
కమ్యూనిస్ట్ లకు బీజేపీ నేత రాజాసింగ్ సీరియస్ వార్నింగ్.. భాగ్యనగరంలో
2019 లో టీడీపీ బద్ద శత్రువు ఇప్పటి మిత్రుడేనా..?
బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ కు మొదలైన అసంతృప్తుల సెగ.. కమలం
అమ్మాయిలను వేధించిన కేసులో “షీ”టీంకు చిక్కిన TRS కార్పోరేటర్ కొడుకు
కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించిన యువకుడు.!!
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
రైతులకు సంకెళ్లు.. ఇది పోలీసుల ఓవర్ యాక్షనా.. ప్రభుత్వం చేజేతుల
ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం.. సీఎం కేసీఆర్‌కు విద్యార్థుల వార్నింగ్.
నటి కవిత టీడీపీ ని వదిలి భాజపా లో చేరిక.!
తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.
వైసీపీ తో టీఆర్ఎస్ దోస్తీ.. ఇది అంతర్గతంగ కేసిఆర్ చంద్రబాబుల
పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన సెవ్వాగ్, మహ్మద్ కైప్. కుల్
కేసీఆర్ పెట్టే భోజ‌నం కోసం వెళ్లే ర‌కం కాదు..
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపి మంత్రి నారాయణ కుమారుడు మృతి
అజాత శత్రువు దత్తన్న
Facebook Comments
Top
error: Content is protected !!