
తన నరహంతక చర్యలతో ప్రపంచాన్ని వణికించిన ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ తన ఓటమిని అంగీకరించింది. ఇన్నాళ్లు ప్రపంచాన్ని గడగడలాడించిన అత్యంత రాక్షస సంస్థ తన దుకాణాన్ని మూసి వేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ దేశం ఆ దేశం అని తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలను తీసిన అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఇక తన ఆటలు సాగవని తెలిసి పూర్తిగా వెనక్కి తగ్గింది. ఇందుకు సంబందించిన ప్రకటనను ఆ సంస్థ చీఫ్ అబూ బాకర్ అల్ బగ్దాది స్వయంగా ప్రకటన చేశాడు. ఇరాక్‌లో తమ పనైపోయినట్లుగా ఆ సంస్థ అధినేత అబూబకర్ అల్ బాగ్దాది ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలను చెపుతున్నాయి. ఉగ్రవాదానికి వీడ్కోలు అంటూ బాకర్ అల్ బగ్ధాది చేసిన ప్రసంగం ఇప్పుడు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతుంది. ప్రపంచ మీడియా అంతా ఈ విషయాన్ని తేల్చే పనిలో పడింది.
ఇన్నాళ్లు కలిఫా కోసం యుద్ధం చేస్తున్నట్లు ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తమ ప్రయత్నాలను ఈ రోజుతో నిలిపివేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనం. ఐసిస్ ఛీప్ ప్రకటనతో ఇన్నాళ్లు ఐఎస్ఐఎస్ కు అనుబంధంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలన్ని వెనక్కి తగ్గాలని అబూబకర్ చెప్పినట్టు సమాచారం. కలిఫా కోసం పోరాటం చేసిన నాన్-అరబ్ ఫైటర్లు తమ దేశాలకు వెళ్లిపోవాలని, లేదా తమను తాము పేల్చుకోవాలని బగ్దాది తన సందేశంలో కోరినట్టు తెలుస్తోంది. ఫేర్వెల్ స్పీచ్ టైటిల్‌తో అల్-బగ్దాది ఈ ప్రకటన చేసినట్లు ఇరాక్‌కు చెందిన అల్సుమెరియా టీవీ ఛానల్ పేర్కొంది. ఇప్పుడు ఇదే విషయాన్ని తేల్చేందుకు అంతర్జాతీయ మీడియా ఇరాక్ పై దృష్టి పెట్టింది. బగ్దాది చేసిన ప్రసంగాన్ని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద ప్రచారకులు, పూజారులకు చేరినట్టు తెలుస్తోంది. అయితే అప్పట్లో అబుబకర్ చనిపోయినట్టు వచ్చిన వార్తల్లాగే ఇది కూడా బూటకమే అయిండవచ్చన్నది కొందరి వాదన.
మరోవైపు ఇరాక్ దళాలు మాత్రం ఐసిస్‌పై పట్టుబిగిస్తున్నాయి. మోసుల్ నగరాన్ని చేజిక్కించుకునేందుకు ఇరాక్ భద్రతా దళాలు భీకరంగా దాడులు చేస్తున్నాయి. బగ్దాది తలపై అమెరికా కోటి డాలర్ల వెలను ప్రకటించారు. ఒక వేళ తనను తాను రక్షించుకునేందుకు బగ్దాది ఈ ప్రకటన చేసి ఉండవచ్చేనేది అంతర్జాతీయ మీడియా వాదన. అబూబకర్ బగ్ధాది ఎక్కడ దాక్కున్నాడన్న విషయాన్ని మాత్రం ఇరాక్ భద్రతా దళాలు ఇప్పటి వరకు పసిగట్టలేకపోయాయి. అయితే ఇరాక్‌లో ఉన్న ఐసిస్ దళాలు మాత్రం సిరియా దిశగా పారిపోతున్నట్టు సమాచారం. ఇరాక్, సిరియాలో ఐసిస్ ఖేల్ కథమ్ అవడంతో కాస్త కుదుటు పడ్డట్టు కానే కనిపిస్తుంది. అయితే ఇరాక్ లో ప్రశాంత వాతావరణం ఏర్పడాలంటే ఇంకా కొన్ని రోజులు పట్ట వచ్చు. ఏది ఏమైనా ఐసిస్ ఖేల్ కథమ్ దుకాణ్ బంధ్ అవడం ప్రపంచానికి ఓ మంచి శుభవార్తే.