
తరతరాల తెలంగాణ అస్థిత్వ సంపద అది. కొండల్లో గుట్టల్లో పచ్చని ప్రకృతిలో ఒదిగిపోయిన చరిత్ర ఆదారాలకు సాక్ష్యం అది. ప్రదాన పట్టణానికి కూతవేటు దూరంలోనే ఉన్న ఇప్పటి వరకు ప్రపంచానికి తెలిసింది కొంతే. తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి చరిత్రకు సాక్ష్యమే ఈ అద్బుత గుట్టలు.
చుట్టు పచ్చని ప్రకృతి ఎటు చూసిన అద్భుతమైన కళారూపాలు, చరిత్ర పుటల్లో నిశబ్దంగా ఒదిగిపోయిన శిల్ప సంపద, ఇదంతా ఎక్కడ ఉందా అని అనుకుంటున్నార. ఎక్కడో కాదు తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ మంచిర్యాల జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలోనే ఉంది ఈ అద్భుత ప్రాంతం. పేరు గాంధారి ఖిల్లా, నిన్నటి ఉమ్మడి జిల్లాలో గోండుల రాజుల పాలనలో వైభవాన్ని మూటగట్టుకున్న పచ్చని ప్రకృతి పుట్టినిల్లే ఈ గాంధారి ఖిల్లా.
చరిత్ర చెపుతున్న సాక్ష్యాలు.. పరిసర ప్రాంతాల ప్రజలు చెపుతున్న ఆధారాల ప్రకారం గాంధారి ఖిల్లా చరిత్ర ఇదే.
- మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బొక్కలగుట్ట సమీపంలో ఉంది గాంధారి ఖిల్లా
- కాకతీయ సామంత రాజులైన గోండు రాజుల పాలనలో 12వ శతాబ్దంలో నిర్శితమైందని చరిత్ర కారుల కథనం.
- ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చెబుతున్న దాని ప్రకారం క్రీ.శ. 1200లో రాష్ట్ర కూటుల కాలంలో గాంధారీ ఖిల్లా ఏర్పడినట్లు తెలుస్తుంది.
- మరో కథనం ప్రకారం పాండవులు, కౌరవుల ఆనవాళ్లకు సాక్ష్యం ఈ ఖిల్లా అని అంటారు.
- దుర్యోధనుడు తన పాలనలో ఈ ప్రాంతాన్ని సందర్శించాడని తన తల్లి పేరున ఈ ఖిల్లాను నిర్మించాడని ఓ కథ ప్రాచుర్యంలో ఉంది.
- దుర్యోధనుడి తల్లి గాంధారి పేరు మీదుగా ఈ ఖిల్లా నిర్మాణం జరిగిందని.. అందుకే ఈ ఖిల్లాను గాంధారీ ఖిల్లాగా పిలుస్తారని కథనం.
- చరిత్రకారులు చెపుతున్న వివరాల ప్రకారం, అక్కడి ఆధారాల ప్రకారం గాంధారీ ఖిల్లా అతి పురాతమైన చారిత్రాత్మక కట్టడం
- కాకతీయుల ఆనవాళ్లకు కేంద్రబిందువుగా కనిపిస్తున్న అధ్భుత ప్రదేశం ఈ గాంధారీ ఖిల్లా
- ఇక్కడ పాలించిన గోండు రాజులు కాకతీయుల సామంతులు కావడంతో కాకతీయ రాజు, గోండు వంశస్థుల వారికి పుట్టిన ఆడబిడ్డే గాంధారి అని ఆమే పేరు మీదుగానే ఈ ఖిల్లాకు ఈ పేరు వచ్చిందని స్థానికులు చెపుతూ ఉంటారు.
- శివుని ఆరాద్యదైవంగా పాలన సాగించిన కాకతీయుల ఆనవాళ్లు అడుగడుగునా ఈ ఖిల్లాలో కనిపిస్తున్నాయి.
- గోండుల పాలనలో అపూర్వ వైభవాన్ని సొంతం చేసుకున్న ఈ ప్రాంతం వారి పాలన అనంతరం
ఒద్దిరాజు అనంతరాజులు ఆక్రమించుకున్నట్లుగా తెలుస్తోంది. - తిరిగి రెడ్డి రాజులు ఈ ఖిల్లాకు పూర్వవైభవాన్ని తీసుకు వచ్చే ప్రయత్నం చేశారని చరిత్ర చెపుతోంది.
అద్భుతాలకు శిల్పసంపదకు పుట్టినిళ్లు..
- గాంధారి ఖిల్లాలో అడుగడుగున అద్భుత శిల్ప సంపద కనిపిస్తుంది.
- శత్రువుల రాకను పసిగట్టేందుకు నగారా గుండు(రక్షణ దుర్గం) ఖిల్లా మీద దర్శనమిస్తుంది.
- ఖిల్లాపైకి చేరుకునేందుకు ప్రత్యేకమైన మార్గ నిర్మాణం కనిపిస్తుంది. ఈ మార్గం గుండానే రక్షణ సైన్యం పైకి చేరుకునేదని తెలుస్తుంది.
- కొండ పై భాగంలో బండను తొలచి చేసిన నాగశేషుని ఆలయం దర్శనం ఇస్తుంది.
- ఆలయానికి ఎదురుగా ఉన్న కొండకు వొద్ది రాజుల శిలా శాసనం కనిపిస్తుంది.
- దీని ఆదారంగా చరిత్రకారులు వొద్ది రాజుల ఖిల్లా గా దీనిని పరిగణిస్తున్నారు.
- ప్రతి యేటా మాఘ పౌర్ణమికి గిరిజనులు లక్ష్మీ దేవతకి, భీమన్న దేవుడికి ఇక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు.
- నాయకపోడ్లో రొడ్డ వంశీయులైన పూజారులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు.
- పచ్చని ప్రకృతి దుప్పటి కప్పుకున్న ఈ ఖిల్లా గత సీమాంధ్ర పాలకుల పాలనలో అస్థిత్వాన్ని కోల్పోయింది.
- ప్రాచుర్య లేక చరిత్ర పుటాల్లో మాత్రమే నిలిచిపోయింది. తెలంగాణ రాష్ట్ర సిద్దించిన తరువాత తిరిగి కళను సంతరించుకుంటోంది గాంధారి ఖిల్లా.
























