
హైద్రాబాద్ నగరంలో 28 వేల అక్రమ కట్టడాలున్నై వాటన్నిటినీ కూల్చేదాక నిద్రపోయేదే లేదని పోయినేడాది మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నాడు. గీ మాట అన్నదీ అక్రమ నిర్మాణాల వల్ల నాలాలు మురుగునీటి కాల్వలు మూసుకపోయి వాన కాలం అంతా ఇండ్లు బస్తీలు మునిగినప్పుడు.
మరి ఇప్పటి దాక ఎన్ని అక్రమ నిర్మాణాలను కూల్చిండ్రో చెప్పండని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ జనాలు.
*రామోజి ఫిలింసిటీని లక్ష నాగల్లతో దున్నేసి తెలంగాణోల్లకు పంచుత అని చెప్పిన కేసిఆర్ గారు ఎందుకు సైలెంట్ అయ్యారో చెప్పాల్సిన బాద్యత ఉందంటున్నారు సామాజిక విశ్లేషకులు.
ఆనాడు అక్రమంగ ఉన్న రామోజీ ఫిలింసిటీ సడన్ గా ఎలా సక్రమం అయిందోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.
అంతేకాదు పద్మాలయ స్టూడియో పైన కూడా కేసిఆర్ గతంలో విమర్శలు చేసిన సందర్బం ఉంది. కానీ ఆ స్టూడియో లో కొత్తగా నిర్మాణాలకు కూడా తెలంగాణ సర్కార్ అనుమతినిచ్చిందని విమర్శలొస్తున్నై..
*ల్యాంకో హిల్స్ కూడా పెద్ద అవినీతి అన్నారు మన సిఎం ఆనాడు, మరి ల్యాంకో హిల్స్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో.. ఇంతవరకు ఎటువంటి సమాదానం లేదు.. ఇక ఇవే కాక మాదాపూర్ లో వందల సంఖ్యలో భవనాలకు రెడ్ మార్క్ వేయడం జరిగింది.. అంతేకాదు అదే మాదాపూర్ లో ఉన్న సినీనటుడు నాగార్జున ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణం ఎన్ కన్వెన్షన్ పై కూడా ఇదే కేసిఆర్ సర్కార్ రెడ్ మార్క్ ను వేసింది.. మరి ఏం చర్యలు తీసుకున్నారని సమాధానం ఆశిస్తే భంగపడక తప్పదేమో..!!
ధనవంతులు ఆక్రమించి నిర్మించిన భారీ భవనాల విషయంలో ఇలా కాంప్రమైజ్ అయిపోతూ పేదల పిట్టగూల్లను నిమిషాల్లో కూల్చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు సామాణ్యులు.
ఈ తతంగం అంతా చూసినోల్లు సర్కార్ అధికారుల పై అధికార పార్టీ నేతల పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో లేనప్పుడు ఆంధ్రోల్ల అక్రమాస్తులు అని.. అధికారంలోకొచ్చిన తర్వాత వారితో చీకటి ఒప్పందం చేసుకోవడమేనా బంగారు తెలంగాణ అంటే అని ఉద్యకారులు ప్రశ్నిస్తున్నారు.
చిత్తశుద్ది ఉంటే వెంటనే అక్రమ నిర్మాణాలపై అధికారికంగ శ్వేతపత్రం విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పేదలకు కేవలం హామీ తప్ప డబుల్ బెడ్రూం లు లేవని.. బస్తీలలో పేదల గుడిసెలను కూల్చుతున్నారంటూ ప్రతిపక్షాలు ఓ పక్క ఆందోళనలు తీవ్రతరం చేస్తుంటే ఈ సర్కార్ చీమకుట్టైనా లేకపోవడం ఖచ్చితంగా ప్రభుత్వం బాద్యతారహితమే కనీసం ఇప్పటికైనా హామీ ఇచ్చినట్టు అక్రమ నిర్మాణాలను కూల్చి పేదల ఇల్లను రెగ్యులరైజ్ చేయాలని అంటున్నారు ప్రతిపక్ష నేతలు.



