రేవంత్ రెడ్డి అంటే పరిచయం అక్కర్లేని పేరు.. తెలంగాణ లో టీడీపీకి నాయకులు కార్యకర్తలు దూరమవుతున్నారేమో కానీ రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగ గట్టిగానే ఉన్న నాయకుడు, తెలంగాణ టీడీపీలో మిగిలిపోయిన ఏకైక రాష్ట్ర స్థాయి గుర్తింపు కలిగిన నేత. ప్రస్తుతం కొడంగల్ నియొజకవర్గ ఎంఎల్ఏ.
ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని జైలుకెల్లొచ్చినా కూడా 2019లో మరోసారి ఎంఎల్ఏ అవుతాడని చెప్పడంలో తప్పు లేదు. టీడీపీలో గెలిచిన ఎంఎల్ఏలంతా ఒక్కరొక్కరుగా అధికార టీఆర్ఎస్ పార్టీ గొడుగు కిందకు చేరిపోయారు, ఆఖరికి టీఆర్ఎస్ ను మగతనం లేని పార్టీ అని తీవ్ర విమర్శలు చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి మోస్ట్ సీనియర్ లు కూడా కేసిఆర్ కు జిందాబాద్ కొట్టక తప్పని పరిస్థితి. అయినా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తీసుకుని ఒక్కడే టీడీపీ పార్టీ జెండా ను పట్టుకుని తెలంగాణ గల్లీలలో తిప్పుతున్నాడు.ఇక టీడీపీ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి కి ఫుల్ ఫ్రీడం ఇచ్చేసింది ఎందుకంటే.. రేవంత్ రెడ్డి విమర్శించి పక్కకు పోయే తత్వం కాదు అవసరం అయితే చట్టపరంగ ఎదుర్కోవడానికైనా సిద్దం అంటాడు. అందుకే ఆయనని ఫైర్ బ్రాండ్ అంటారు. తనకున్న రెడ్డి సామాజికవర్గ పరంగాను పక్కా ప్రణాలికతోనే ఉంటాడు రేవంత్ రెడ్డి.
ఇక తెలంగాణ లో రేవంత్ రెడ్డి కి పక్క రాష్ట్రం సిఎం టీడీపీ అధిష్ఠానం పార్టీ అధినేత చంద్రబాబు నుండి గొప్ప మద్దతేం లేకున్నా రేవంత్ రెడ్డి కి అడ్డు మాత్రం పడడం లేదని చెప్పొచ్చు.
ఇక అసలు విషయానికొస్తే.. 2019 ఎన్నికలకు రేవంత్ రెడ్డి ఏ స్ట్రాటజీ తో వెలుతున్నాడు అనే ప్రశ్నకు కనీసం ఆయన కూడా సరైన సమాధానం చెప్పలేడేమో అనే వాదన వినిపిస్తోంది.
2019 ఎన్నికల్లో రేవెంత్ రెడ్డి ఇలాగే తెలుగుదేశం టిక్కెట్ పైన వెలితే మహా అంటే ఆయనొక్కడు గెలుస్తాడేమో కాని పార్టీ స్థానం ఇప్పటికంటే బెటర్ పొజిషన్ లో ఉంటదనుకోనుకోడం అత్యాశే అవుతుంది.!! టీడీపీ అంటే ఆంధ్రా పార్టీగా ముద్రపడ్డ పరిస్థితిలో రెవంత్ రెడ్డి జెండా మారితే ఆయనకున్న ఇమేజ్ ను పూర్తి స్థాయిలో వాడుకోవచ్చన్నది అందరికంటే ఆయనకే బాగా తెలుసు అందుకే ఆయా పార్టీల ముఖ్యనేతలతో టచ్ రిలేషన్ మేయింటేన్ చేస్తున్నటు వార్తలొస్తున్నై..
మొన్నటివరకు దాదాపు భాజపా గూటికి చేరుతున్నాడనే వార్తలొచ్చినై కానీ అలా జరగలేదు ఊహాగానాలకైతే ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు, మరోవైపు కాంగ్రెస్ పార్టీలోకి వెలుతున్నటు కూడా వార్తలొచ్చినై వస్తూనే ఉన్నై..! సస్పెన్స్ మాత్రం కంటిన్యూ అవుతోంది. మద్యమద్యలో నేను పార్టీ మారడం లేదని ఖండించడాలు రాజకీయాల్లో సాధారణమే అనుకోండి.
ఇక రేవంత్ రెడ్డి పార్టీ మారే అవకాశాలే ఉంటే గనక ఏ పార్టీ లోకి వెల్లే అవకాశం ఉందో విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. రాష్ట్రంలో నేడు టీఆర్ఎస్ కాకుండ కాంగ్రెస్ మరియు భాజపా బలంగా ఉన్న పార్టీలు, సీట్లు పాట్ల విషయం పక్కన పెడితే ఇరు పార్టీలకు చెప్పుకోతగ్గ క్యాడర్,గ్రౌండ్ లెవల్ కార్యకర్తలున్నారు, ఇంకా చెప్పాలంటే అధికార తెరాస కంటే ప్రతిపక్ష కాంగ్రెస్ భాజపా లకు ఉన్న క్యాడెర్ ఎక్కువ ఇది కాదనలేని సత్యం. ఎందుకంటే అధికారం చూసి వచ్చే క్యాడర్ వేరు పార్టీ కోసం పనిచేసే క్యాడర్ వేరు. ఈ రెండు పార్టీలు కూడా జాతీయ పార్టీలే కానీ కేంద్రంలో అధికారంలోనూ దేశవ్యాప్తంగ పటిష్టంగ ఉన్న పార్టీ భాజపా, నరేంద్రమోడీ అమిత్ షా లాంటి క్రేజ్ ఉన్న నాయకులు భాజపా సొంతం. జాతీయ స్థాయిలో నేడు నాయకత్వ లోపంతో బాధపడుతుంది కాంగ్రెస్ పార్టీ. అధికారం కూడా కోల్పోయింది ఇప్పట్లో మరలా పుంజుకునే అవకాశం దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు, ఇంకా కాంగ్రెస్ నుండి కూడా హేమీహేమీలుగ ముద్రపడ్డ డీఎస్, గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి వాల్లు కూడా కేసిఆర్ వైపుకు వెల్లిపోయారు దీనిబట్టి చూస్తే కాంగ్రెస్ పై కూడా అధికార బాణం ప్రయోగించగలుగుతున్నాడు ముఖ్యమంత్రి కేసిఆర్, ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి భాజపా వైపు మొగ్గు చూపొచ్చు మరో అంశం ఆయన గతంలో ఏబీవీపీ లో పని చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయన ఆనాడే జాతీయవాదిగ ముద్రపడ్డారు.
కాకపోతే ఆయన ఇప్పుడు ఏ పార్టీలోకి వెల్లినా ముఖ్యమంత్రి అభ్యర్థి బెర్త్ కోసం డిమాండ్ చేసే అవకాశం ఉంది, ఈ అంశం వల్లనే ఇంకా ఏ పార్టీ అనేది తేల్చుకోలేని పరిస్థితికి కారణం అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. సిఎం క్యాండిట్ అంటే ఆయా పార్టీల ముఖ్యనేతలంతా మనస్పూర్తిగా అంగీకరించాలి అక్కడ అసంతృప్తి ఎదురైతే మొదటికే మోసం మరి.
ఇలాంటి పరిస్థితిలో సొంత పార్టీతో ప్రజల్లోకి వెలితే మాత్రం రేవంత్ రెడ్డి నష్టపోయే అవకాశాలే ఎక్కువ ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ సమీకరణాల మద్య సొంతపార్టీ అంటే ఎన్నికల తర్వాత రాజకీయ సన్యాసానికి సిద్దపడ్డట్లేననీ.. అలాగాక సొంత పార్టీ పెట్టి పొత్తులతో లాగిద్దాం అనుకున్నా అసంతృప్తి రెబల్ క్యాండిట్ల తలనొప్పి తప్ప మిగిలేది శూన్యం అంటున్నారు పలువురు విశ్లేషకులు.
Related Posts
తమకు అనుకూలమైన రాతలను చూసి ఆనందిస్తూ, వ్యతిరేకమైన రాతలను అణచివేస్తూ అరెస్టుల పర్వాన్ని సాగిస్తున్న ప్రభుత్వాలకు చెంపపెట్టు తగిలింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ - 2000 చట్టంలోని సెక్షన్-66Aను కొట్టేస్తూ మంగళవారం (జూన్ 27) సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐటీ ...
READ MORE
కిషన్ రెడ్డి.. తెలంగాణ లో పరిచయం అక్కరలేని పేరు.
కిషన్ రెడ్డి అంటే ఎంత గుర్తో.. అంబర్ పేట్ అంటే కూడా గుర్తుకొచ్చే పేరు కిషన్ రెడ్డే. అంతగా అంబర్ పెట్ కి మారుపేరుగా గుర్తింపు పొందిన నేత కిషన్ రెడ్డి.
విద్యార్థి ...
READ MORE
దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేష్ తివారీ స్థానిక ప్రజలను ఉద్దేశించి కొన్ని సూచనలు జాగ్రత్తలు తెలిపారు.
ముఖ్యంగా.. ఢిల్లీ మర్కజ్ లో జరిగిన ముస్లిం మత ...
READ MORE
భారతదేశం గర్వించదగ్గ నేత మరియు ప్రధాన మంత్రులలోనే అత్యుత్తమ ప్రధానమంత్రి భారత రత్న అటల్ బిహారీ వాజిపేయి తన 94 ఏట అనారోగ్యం కారణంగ కొంత కాలంగ ఢిల్లీ ఏయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడవడంతో యావత్ దేశమంతా ...
READ MORE
మేడ్చల్ నియోజకవర్గం తెరాస పార్టీ లో ఎంపీటీసీ ఎన్నికలు సరికొత్త వివాదానికి దారి తీసాయి. మాజీ ఎంఎల్ఏ సుధీర్ రెడ్డి, ప్రస్తుత ఎంఎల్ఏ మరియు మంత్రి మల్లారెడ్డి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. గత 2014 ఎన్నికల్లో ఎంఎల్ఏ గ గెలిచిన ...
READ MORE
తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తన పదునైన మాటలతో విరుచుకుపడ్డాడు.హైకోర్ట్ విభజన పై మీడియా సమావేశం నిర్వహించిన క్రమంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పై నిప్పులు చెరిగాడు. తనదైన ...
READ MORE
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాలం రానే వచ్చింది. జర్నలిస్టులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల కేటాయింపులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సుప్రీంకోర్టు కీలక తీర్పుతో ఇన్నాళ్లు పెండింగ్ లో వున్న జర్నలిస్ట్ ఇళ్ల స్థలాలకు మోక్షం లభించింది.
“సత్వర తీర్పు” ...
READ MORE
2014 ముందు తెలంగాణ ఉద్యమంలో భాజపా గట్టిగానే పోరాడింది అయినా ఎన్నికల్లో మాత్రం తీవ్ర నిరాశే ఎదురైంది భాజపాకు.. మొత్తం టీఆర్ఎస్ హవా నడిచింది. అలాంటి పరిస్థితిలోనూ భాజపా తరపున విజయబావుటా ఎగిరేసిన ఏకైక నాయకుడు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి ...
READ MORE
నోట్ల రద్దు తరువాత రూ. 500, రూ.2000 నోట్లు మార్కెట్ లోకి వచ్చాయి. ఆ తరువాత కొత్త నోట్ల పై రోజుకో వార్త వస్తునే ఉంది. 1000 రూపాయల నోటు మళ్లీ వస్తుందని ఓ సారి లేదంటు మరో సారి.. రూ. ...
READ MORE
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ పై మరోసారి ఫైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్.ముఖ్యంగ రైతుల సంక్షేమం ఎజెండా గ ఏర్పాటు చేసిన నీతి అయోగ్ సమావేశానికి ఎందుకు హాజరు కాలేదని కేసిఆర్ ను సూటిగ నిలదీసారు. అదే ...
READ MORE
గురుకుల భారీ ఉద్యోగ నోటిఫికేషన్లో భాగంగా గ్రామీణ నిరుద్యోగులకు పాఠ్యాంశాలను బోధించేందుకు ముందుకు వచ్చింది మన టీవి. వేలకు వేలు ఫీజులు పెట్టి కోచింగులు తీసుకోలేని గ్రామీణ నిరుద్యోగులకు ఈ అవకాశం వరం అనే చెప్పుకోవాలి. గతంలో ప్రసారం చేసిన మనటీవి ...
READ MORE
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వంలో సీఎంగా బాధ్యత లు చేపట్టడమే ఆలస్యం తన పాలన సత్తా ఏంటో చూపిస్తున్నారు యోగి. సరికొత్త పద్దతులకు శ్రీకారం చుడుతు అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఆకస్మిక తనిఖీలతో అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు యూపి సీఎం యోగి ఆదిత్యనాథ్. ...
READ MORE
పెళ్లంటే తప్పట్లు తాళాలు, మందులు, విందులు, డీజేల మోతలు. ఇప్పుడు ఆ పెళ్లి పండుగలోకి డిజిటల్ హంగులు వచ్చి చేరి ఖర్చును తడిసిమోపెడు చేశాయి. పక్కవాడు అంగరంగవైభవంగా పెళ్లి చేస్తుంటే ఆ పెళ్లిని చూసి అప్పొ సప్పొ చేసి మరింత ఘనంగా ...
READ MORE
కేంద్రంకు మిర్చి రైతులపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. కాలిపోతున్న మిర్చి పంటను కాపాడేందుకు కనికరం చూపించింది. ఎంతనో తెలుసా అక్షరాల పన్నెండు.... వేలనుకునేరు వందలే. 1250 రూపాయల ఇది అదనం అంటా..? మరి అసలెంతో అనే కదా.. అక్కడికే వస్తున్నాం. కేంద్రం ...
READ MORE
తెరాస నేత నాలుగవ డివిజన్ హెచ్ బి కాలనీ అధ్యక్షులు వంజరి సంఘం రాష్ట్ర నాయకులు కరిపె ప్రవీణ్ కుమార్ వంజరి ఆద్వర్యంలో నేడు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ముఖ్యమంత్రి కేసిఆర్ తనయుడు కల్వకుంట్ల తారక రామారావు జన్మధిన ...
READ MORE
అపచారం జరిగింది, కాదు కాదు అపచారం చేసారు. గోల్కండ మాంకాలమ్మ అమ్మవారి బోనాల సంధర్భంగ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ పట్టువస్త్రాలను తీసుకొచ్చే మంత్రులే మర్యాద తప్పి భక్తుల మనోభావాలు ...
READ MORE
ఓ వైపు ముందస్తు ఎన్నికలకు సై అంటూ మరోసారి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూ భారీ జన సమీకరణ అంటూ సభలంటూ హల్ చల్ చేస్తూ మరోసారి గెలిపిస్తే బంగారు తెలంగాణ చేసేస్తా అని జనాల ఓట్లను పొందేందుకు కష్టపడుతున్నారు గులాబీ ...
READ MORE
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవితంపై సినిమా రాబోతోంది.మన్మోమన్ సింగ్ పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ పోషించబోతున్నారు. ఆయన హయాంలోని జరిగిన అక్రమాలను.. మౌనం వహించిన తీరుని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఈ చిత్ర విషయాన్ని అనుపమ్ ...
READ MORE
తెలంగాణ సెమీ ఫైనల్ ఎన్నికలు బల్దియా పోరు తీవ్ర స్థాయిలో నడుస్తున్న పరిస్తితుల్లో అధికార TRS కు భారీ షాక్ తాకింది. ఆ పార్టీ ముఖ్య నేత మాజీ శాసన మండలి చైర్మన్ బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు ...
READ MORE
లిక్కర్ కింగ్, బడా వ్యాపార వేత్త విజయ్ మాల్యాను లండన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. విజయ్‌మాల్యా గత ఏడాది భారతీయ బ్యాంకులకు 9 వేల కోట్లు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయాడు. లండన్‌కి ఇండియాకి మధ్య ఓ ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ ...
READ MORE
తెలంగాణ లో ఇప్పుడు ఎక్కడ ఏ ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినా జరిగే చర్చ దుబ్బాక బై ఎలెక్షన్స్ గురించే.
ఇక ప్రధాన పార్టీ లు తెరాస బీజేపీ కాంగ్రెస్ లు దాదాపు అభ్యర్థులను ఖరారు చేసేసారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థి విషయంలో ...
READ MORE
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముస్లిం లకు 12% రిజర్వేషన్ ఎట్టి పరిస్తితిల్లో చేసి తీరుతామని చెప్పడంతో బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగానికి విరుద్దంగా రిజర్వేషన్లు కుదరవని సుప్రీం కోర్టు చెపుతున్నా వినకుండా కేసీఆర్ సర్కార్ మొండి వైఖరి ...
READ MORE
జనసేన అధినేత రాజకీయం ఎలా ఉండబోతోంది. 2019 ఎన్నికల్లో జెండా ఎజెండా ఏంటి.. ఇవ్వబోతున్న నినాదాలేంటి ట్విట్టర్ లో తప్ప బయట నినదాలు ఉండవా. ఇప్పుడు ఇదే చర్చ జనంలో మొదలైంది. పవన్ కళ్యాణ్ మనస్సులో ఏముందో ట్విట్టర్ ద్వారా తెలుసుకోవచ్చు ...
READ MORE
కశ్మీర్ వేర్పాటువాద సంస్థ హుర్రియత్ కు ఆడియో రూపంలో ఓ హెచ్చరిక అందింది. హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాది ఒకడు సంచలన ప్రకటన చేస్తూ ఓ ఆడియోను విడుదల చేయడం ప్రస్తుతం కశ్మిర్ లో కలకలం రేపుతోంది. జాకీర్ మూసా అనే ...
READ MORE
తెలంగాణ లో హాట్ టాపిక్ గా మారిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ కి అధికార పార్టీ TRS కు వార్ జరుగుతోంది.
అక్కడ ఎన్నిక అనివార్యం అయినప్పటి నుండే ప్రచారంలో నిమగ్నమైన రఘునందన్ రావు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని ...
READ MORE
సోషల్ మీడియాలో పోస్టులకు నో అరెస్టు… సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
అంబర్ పేట్ లో తిరుగులేని నాయకుడు కిషన్ రెడ్డి.!!
ముస్లిం వ్యాపారుల వద్ద కూరగాయలు వస్తువులు కొనొద్దని సూచించిన ఎమ్మెల్యే.!!
అభినవ జాతిపిత అటల్ జి కి జర్నలిజం పవర్ నివాలి.!!
మేడ్చల్ తెరాస లో అగ్గి రాజేసిన స్థానిక ఎన్నికలు.. అయోమయంలో
చంద్రబాబు పై తిట్ల ప్రవాహం పారించిన కేసిఆర్.. వామ్మో తిట్లతోనే
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఎట్టకేలకు మోక్షం.. సుప్రీంకోర్టులో విజయం సాధించిన
అజాత శత్రువు అందరివాడైన దత్తన్నకు అవమానం..!!
త్వరలో మార్కెట్ లోకి కొత్త 10 రూపాయలు
కారు సారు పదహారు రాకపోయేసరికి కేసిఆర్ బేజారైపోతున్నారు – డా.కె.లక్ష్మన్
నిరుద్యోగులకు సువర్ణ అవకాశం. మనటీవిలో గురుకుల పాఠాలు.
అరె యోగి… ఉత్తరప్రదేశ్ లో అధికారులకు చుక్కలు చూపిస్తున్న సీఎం..
ఇకనుంచి మూడు ముళ్లకు టాక్స్. మా పెళ్లి మా ఇష్టం
ఫ్లాష్…. ఫ్లాష్… ఫ్లాష్…. మిర్చి రైతుల కష్టాలపై కేంద్రం కనికరించిందంట…
తెలంగాణ దిక్సూచి కల్వకుంట్ల తారకరాముడికి జన్మధిన శుభాకాంక్షలు- కరిపె ప్రవీణ్
గోల్కొండ మాంకాలమ్మా.. మా మంత్రులను క్షమించమ్మా..
కేసిఆర్ కు ఎందుకు వేయాలి ఓటు.? ప్రశ్నిస్తున్న దళిత సమాజం.!!
సైలంట్ పీఎం పై సినిమా.. కాంగ్రెస్, సోనియా, రాహుల్ గాంధీలే
TRS కు భారీ షాక్. బీజేపీ లో చేరిన స్వామి
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా అరెస్ట్..
దుబ్బాక రిజల్ట్స్ ఎఫెక్ట్ రాబోయే గ్రేటర్ మరియు అసెంబ్లీ ఎన్నికలపై
అడుగడుగునా అరెస్ట్ ల పర్వం.. రిజర్వేషన్ జాన్తానై అంటున్న బీజేపి.
జనసేన నయా నినాదం తలలు తెగిపడిన కాళ్లు వెనకు పడదు.
అడ్డొస్తే తలలు నరికేస్తాం.. శ్రీనగర్ చౌరస్తాలో వేలాడిదీస్తాం.. ఉగ్రవాదుల హెచ్చరిక.
దుబ్బాక లో దూసుకుపోతున్న రఘునందన్ రావు. అధికార పార్టీ లో