You are here
Home > మన ఊరు > నువ్వు నువ్వేనా.? అసలు నీవెవరు.?? మనసుకు హత్తుకునే కథ

నువ్వు నువ్వేనా.? అసలు నీవెవరు.?? మనసుకు హత్తుకునే కథ

సైదులు చిన్నతనం లో పెద్దగా చదువుకోకపోయినప్పటికీ తాత సంపాదించిన ఆస్తి పాస్తులు బాగానే ఉండడంతో అసలు సైదులుకు చదువు అవసరమే రాలేదు, ఏ అవసరమొచ్చినా చేయించుకోవడానికి పాలేర్లు పనివారు.
సైదులు తండ్రి రంగారావు కూడా ఎప్పుడూ.. వాడికి చదువెందుకే వాడికేం తక్కువా వాడు ఈ ఊర్లోనే అందరికంటే పెద్ద భూస్వామి కొడుకు అనేవాడు.! సైదులు తల్లి సుశీలమ్మ ఎప్పుడైన కొడుకు చదువు విషయం భర్తతో అన్నప్పుడు. ఇక భర్త రంగారావు సమాధానం విన్నాక తనలో తానే బాధతో గునుక్కునేది.

అంతే తప్ప భర్తని ఎదిరించి, వాడికి గారాభం ఎక్కువైంది బడికి పంపమని చెప్పే ధైర్యం ఏనాడూ చేయలేకపోయింది. కేవలం ప్రయత్నం దగ్గరే ఆగిపోయింది.
ఇపుడు సైదులు పెద్దవాడైయ్యాడు 29 ఏళ్ల యువకుడైయ్యాడు, బాగా డబ్బున్న కుటుంబం కావడం వల్ల చూడడానికి సైదులు చదువుకున్నవాడిలా విదేశీ కంపెనీ బ్రాండెడ్, ఎక్కువ ధర కలిగిన బట్టలు ధరించి ఎప్పుడూ ఒక పర్సనల్ డ్రైవర్ హుందాగా హోదాతో ఉండేవాడు. మిత్రులు అందరు ధనవంతులే అందులోనూ దాదాపు అందరు బాగానే చదువుకున్న వాళ్ళే కావడం వల్ల సైదులు కూడా ఓ మోస్తారుగా చదువుకున్న వాడిలా ఎదుటివారు అనుకోవాలని అవసరం లేకున్నా సరే ఇంగ్లిష్ పదాలను వాడుతూ మాట్లాడేవాడు.

ఆ తర్వాత పూర్తిగా ధనవంతులంటే ఆంగ్లం లో మాట్లాడాలని మాతృ భాష అంటే పెద్దగా పరిచయం లేదన్నట్టు ప్రవర్తించాలని చాలా వరకు అమెరికాలో ఉండి అక్కడే ఎంజాయ్ చేయాలని ఒక భావనకు కట్టుబడిపోయాడు సైదులు.
అప్పటికే హైద్రాబాద్ లో సైదులు ఒక అపార్ట్మెంట్ లో డబుల్ బెడ్రూం ఫ్లాట్ లో ఉంటూ ఫ్రెండ్స్ తో గడుపుతున్నాడు.
అంతే కాక తన ఫ్రెండ్ వినయ్ రెడ్డి తో కలిసి అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

వినయ్ రెడ్డి అక్క, బావ అమెరికాలో నివాసం, అక్కడికి ఇద్దరూ వెళ్లాలని నిర్ణయించుకోవడమే కాదు, వినయ్ రెడ్డి ని మించి ఒక అడుగు ముందుకేసిన సైదులు ఏకంగా అమెరికా అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని వినయ్ రెడ్డి తో చెప్పిండు, వినయ్ రెడ్డి కూడా సైదులు మాట ను కాదనలేకుండా అవసరం అయితే ఆ విషయం లో మా అక్క బావ లు హెల్ప్ చేస్తారులే అని సైదులు ను ఉత్సాహ పరిచిండు.
ప్రయాణ ఏర్పాట్లు పూర్తయిన వెంటనే ఊర్లో ఉన్న అమ్మా నాన్నలకు ఫోన్ చేసి స్నేహితునితో బొంబాయి వెళుతున్నా అక్కడ ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా కొద్ది రోజులవరకు ఊరికి రాలేనంటూ నమ్మించాడు.
అయితే తండ్రి రంగారావు సైదులుతో నీకు పెళ్లి సంబంధం చూసాను ఓసారి వచ్చి చూడు నచ్చితే వీలైనప్పుడే ముహూర్తం పెట్టుకుందాం అన్నాడు.
తండ్రి మాటతో ఆలోచనలో పడ్డ సైదులు ఎలాగూ అమెరికా ప్రయాణానికి ఇంకో రెండు వారాల సమయం ఉంది కనుక ఇక్కడుండి మాత్రం చేసేదేముందీ రోజూ ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకోవడం తప్ప అనుకొని ఊరికి బయలుదేరాడు.

అక్కడ పెళ్లి చూపుల్లో అమ్మాయి ఎవరో కాదు స్వయాన తన మేనమామ క్రిష్ణమూర్తి కూతురు లావణ్య అని తెలిసింది. ఇన్ని రోజులూ కుటుంబ కలహాల వల్ల మాటలు గానీ కలవడాలు గాని లేవు, కిట్టప్పకు తన మామయ్య అంటే పెద్దగా చూసింది కూడా లేదు. అయితే కుటుంబ కలహాల వల్ల కనీసం మాట్లాడుకోని బావమరిది కూతురిని ఇంట్లోకి తెచ్చుకోవడానికి కారణం లేకపోలేదు.!!

కాగా క్రిష్ణమూర్తి తన బావ రంగారావులా డబ్బు పిచ్చోడు కాదు. ఉన్నదాంట్లోనే నలుగురికి సహాయం చేసే గొప్ప గుణం కలవాడు. పుట్టిన ఊరన్నా పంటపోలాలన్నా మాతృభాషా అన్నా తల్లిదండ్రులూ గురువులన్నా అమితమైన గౌరవం.
ఆవులన్నా నోరులేని ఏ ఇతర మూగ జీవులన్నా ప్రేమగ చూసుకుంటాడు పూర్తి శాఖాహారీ.
పట్నంలో పెద్దబడిలో తన కూతురు లావణ్యని చదివించే స్తోమత ఉన్నా కూడా తన ఊరిలో ఉన్న హైస్కూల్ లోనే పదో తరగతి వరకు లావణ్యని చదివించాడు.
తన పెరట్లో కాచే పూలు కానీ కూరగాయలు ఆకుకూరలేవైనా సరే ఊర్లో అందరికీ పంచేవాడు ఏరోజు రూపాయి తీసుకునేవాడుకాదు.
క్రిష్ణమూర్తి కి చిన్నప్పటినుండే దేశభక్తి గీతాలు పాడటం దేశ నాయకుల వీరగాథలు వారి జీవిత చరిత్రలు చదవడం ఇష్టం.
ప్రతీ ఏడాదీ స్వామి వివేకనంద జయంతి జనవరి 12 కి  క్రిష్ణమూర్తి చేసే హడావుడీ ని చూసినవారెవరూ ఎప్పటికీ మరవలేరు. యువతకు పేద పిల్లలకు ప్రోత్సహకాలిచ్చేవాడు, గొప్ప గొప్ప పుస్తకాలు తెప్పించి విద్యార్ధులకు అందించీ అందరికీ భోజనం ఏర్పాటు చేసీ అందరినీ కార్యక్రమంలో పాల్గొనేలా చేసేవాడు.

ఇలా  క్రిష్ణమూర్తి అంటే ఊరిజనాల మనసులో ఒక గౌరవం ప్రేమ అభిమానం పెరిగినై..
అయినా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే భావనకు కట్టుబడేవాడు  క్రిష్ణమూర్తి.
అందుకే ఊరి జనాలు ఆయన్నీ ఎన్ని సార్లు సర్పంచిగా పోటీ చేయమని అడిగినా సున్నితంగ తిరస్కరించేవాడు.
రాజకీయాలు ఆధిపత్యాలు అంటే ఆసక్తి లేదనేవాడు.
కాని ఎవరు సర్పంచి గా పనిచేసినా అన్నివిదాలుగా సహకరించేవాడు. ఏది ఏమైనా ఊరి క్షేమమే ముఖ్యం అనేవాడు.
క్రిష్ణమూర్తి తన జాతీయవాద అభ్యుదయభావాలకు అనుగునంగానే కూతురు లావణ్యని చాలా సాంప్రదాయంగ పధ్దతిగ పెంచాడు, కానీ లావణ్యని ఆ దేవుడు చిన్న చూపు చూసాడు తనకు అన్నీ తానై చూసుకునే తండ్రిని కోల్పోయింది, అంటే ఊరికి పెట్టని కిరీటం లాంటి క్రిష్ణమూర్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
ఒక్కసారిగా ఊరు ఊరంతా భోరున విలపించింది అందరూ ఏడిచేవారే అక్కడెవరూ ఒకరిని ఒకరు ఓదార్చడానికి లేరంటే అతిశయోక్తి కాదు.
లావణ్యకు తల్లి కూడా లేదు తల్లిని చిన్నతనంలోనే కోల్పోయింది.
ఇప్పుడు లావణ్య ఇంట్లో ఒంటరైంది ఇంతవరకు అన్నీ తండ్రే లావణ్యకు. కాని ఊరిజనం లావణ్యని అక్కున చేర్చుకుంది, ఏ అవసరమైనా అందరూ వచ్చేవారు ఎప్పుడూ లావణ్యని ఒంటరిగా ఉండనిచ్చేవారు కాదు అందరూ వచ్చి హడావుడి చేసేవారు..!

తన అన్న కూతురు అనాథ అయిందనే విషయం తెలిసినా కూడా సుశీలమ్మని తన అన్న  క్రిష్ణమూర్తి ఇంటికీ వెల్లనిచ్చే పరిస్థితి లేదు, సొంత అన్న చనిపోతేనే వెల్లనివ్వని భర్త ఇపుడు మాత్రం ఆ ఊరికి పంపుతాడా అని తనలో తానే బాదపడి తనకుతానే ఓదార్చుకుంది సుశీలమ్మ.

కానీ తన భర్త రంగారావు కు ఆస్తులన్నా డబ్బులన్నా అత్యాశ కాబట్టి, తన అన్న క్రిష్ణమూర్తి ఆస్తులను మనం స్వాదీనం చేసుకోవాలంటే ఆయన ఏకైక కుమార్తె లావణ్యని మన సైదులుకు కు ఇచ్చి పెళ్లి చేద్దాం అనగానే.. భార్య ఆలోచనకు అబ్బురపడిపోయి వెంటనే బావమరది క్రిష్ణమూర్తి ఇంటికి వెల్లి కోడలు లావణ్యని స్వయంగ ఇంటికి తెచ్చాడు రంగారావు.
మొదట లావణ్య తన తండ్రి పోయిన కొన్ని నెలల తర్వాత ఇప్పుడు గుర్తుకొచ్చానా అంటూ మామ రంగారావు పై ఆగ్రహించినప్పటికీ.. ఊర్లో వాల్లు నచ్చజెప్పడంతో వెల్లడానికి ఒప్పుకుందీ.. మేనత్త కొడుకు సైదులుతో వివాహానికి కూడా ఒప్పుకుంది లావణ్య.

లావణ్య చూడడానికి నలుపే అయినా ఆమే ప్రవర్తన సాంప్రదాయం మాటతీరుతో చాల అందంగా కనబడుతది.
ఇక పెళ్లికి అంగీకరించడంతో సుశీలమ్మ ఆనందానికి అవధులు లేవు, ఇటు రంగారావుకు కూడా ఓ మూలన తన ఆస్తులు బరువెక్కుతున్న ఆనందం కలుగుతోంది.
అయితే మామ గురించీ మరదలు గురించీ సైదులుకు ఇంటికొచ్చాకే తెలిసింది..
సైదులు లావణ్యను చూసాడు బాగానే మాట్లాడుకున్నారు కానీ.. సైదులు తన నిర్ణయం ఏంటనేది చెప్పకుండానే అమెరికా వెల్లిపోయాడు.
బావ సైదులు నిర్ణయం కోసం లావణ్య పెద్దగా ఆతృతేమీ కనబరచకపోయినా తల్లి సుశీలమ్మ మాత్రం క్షణ క్షణం ఉత్కంటతో.. ఆతృతతో ఎదురుచూసిందీ కానీ ఏమీ తేల్చకుండానే వెల్లిపోయాడు కొడుకు సైదులు.
ఇంకా అమెరికా ఫ్లైట్ ఎక్కకుండానే తన పేరును సైలెష్ గా స్టైల్ గ మార్చేసుకున్నాడు.

అమెరికా చేరుకున్న వినయ్ రెడ్డి మరియు సైదులు అలియాస్ సైలెష్ ఇద్దరూ వినయ్ రెడ్డి వాల్ల అక్కబావ ఇంటికి చేరుకున్నారు. అంతే… అక్కడికెల్లగానే సైదులుకు మూర్ఛ వచ్చినంత పనైంది.
వినయ్ రెడ్డి వాల్ల అక్క ఇల్లు ఉన్నది అమెరికాలోనే అయినా అచ్చ తెలుగు సాంప్రదాయం పాటించే కుటుంబం వారిది.
పిల్లలకోసం ప్రత్యేకంగ తెలుగు గురువును ఏర్పాటు చేసారు.
ఇంట్లోనే భరతనాట్యం నేర్పిస్తున్నారు.
ఇంట్లో అందరూ స్వచ్చమైన తెలుగే మాట్లాడాలనే నిబంధన అదనం.
తరువాతి రోజు అక్క సుచిత్రతో అన్ని విషయాలు చెప్పాడు వినయ్ రెడ్డి.
అంతేకాదు సైదులు ఇక్కడే అమెరికా అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయాన్నీ..మరియు తన మరదలు తో పెల్లి చూపుల విషయం కూడా అక్కబావ కు వివరించేసాడు వినయ్ రెడ్డి.

ఏదో ఐటీ కంపెనీ లో ఉద్యోగాన్ని వదల్లేక ఇక్కడికొచ్చామే తప్ప మాకు ఊరి జనాలను సొంత మనుషులను దూరం చేసుకోవడం నచ్చడం లేదు.. అందుకే అవసరం అయితే ఉద్యోగాలు మార్చైనా సరే లేదా ఏదైనా వ్యాపారం పెట్టుకునైనా సరే తొందర్లోనె ఊరికెల్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నామని వినయ్ రెడ్డి అక్క సుచిత్ర చెప్పగానే సైదులు మనసులో ఏదో పోగొట్టుకున్న బాధ అలా వచ్చి వెల్లింది మరి.

మరో రోజు వినయ్ రెడ్డి వాల్ల బావ నితిన్ కుమార్ రెడ్డి, సైదులు తో అమెరికా లో అడుక్కునేవాడు కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడినా కూడా మన మాతృభాషకు సమానం కాదు, అని తనదైన శైలిలో చెప్పగా వెంటనే అర్దం చేసుకోకున్నా.. కొద్ది రోజులకు మాతృభాషా మాతృదేశం పుట్టిన ఊరు తల్లిదండ్రుల విలువను అర్థం చేసుకుని ఇండియా వెల్దామని వినయ్ రెడ్డితో చెప్పిండు సైదులు.

ఇండియాలో విమానం దిగి నేరుగా ఊరెల్లాడు, ఊర్లో దిగగానే ఏదో ఈసారికి సైదులుకు తన ఊరు కొత్తగా అప్యాయతగా కనిపించింది.
ఎందుకో ఊరిపైన మనసులో ఎనలేని గౌరవం పెరిగిపోతోంది… ఎంతగా అంటే తను ఈ ఊర్లోనే పుట్టినా నేను తెలుగోడిని అని అరవాలనిపించేంత.

ఇంటికెల్లగానే తన తల్లిదండ్రులిద్దర్నీ పలకరిస్తూ అమ్మ నాన్న అన్నాడు, సుశీలమ్మ రంగారావులు కాస్త కొత్తగా చూసారు.. ఎప్పుడూ ఆ వచ్చీ రాని ఇంగ్లీష్ లో మమ్మీ డాడీ అనీ లేదా మామ్ డాడ్ అనేవాడు ఇప్పుడింత గొప్పగా పిలిచేసరికి.

ఆలస్యం అమృతం విషం అంటారు కదా అందుకేనేమో ఈసారి దేవుడు సైదులును చిన్న చూపు చూసాడు..
తను నిర్ణయం చెప్పకుండా వెల్లిపోయిన తర్వాత లావణ్య రవి ని పెళ్లి చేసుకుంది.
రవి ఎవరంటే తన సొంతూర్లోనే చిన్నప్పటి నుండీ తనతోనే పెరిగిన వాల్ల పాలెరు రామన్న కొడుకు. కులం హోదా విషయాలను పక్కన పెట్టి ఆదర్శ వివాహం చేసుకుంది లావణ్య.
రవి అంటే తన తండ్రి క్రిష్ణమూర్తికి కూడా చాలా ఇష్టం, తన తండ్రి చెప్పినట్టే రవి నడుచుకునేవాడు. స్వార్థం లేనివాడు, తన తండ్రి దహన సంస్కారాలను దగ్గరుండి చూసుకున్నాడు.
ఇన్నేల్లలో ఏ ఒక్కరోజు కూడా అప్రయత్నంగా కూడా తన దగ్గర కానీ తన తండ్రి క్రిష్ణమూర్తి వద్ద కానీ ఎప్పుడూ అమర్యాదగా చెడుగా ప్రవర్తించని వ్యక్తి కాబట్టి లావణ్య నిర్ణయాన్ని ఊరి జనాలంతా హర్షించారు. 

Related Posts
సంఘటనం ఒక యజ్ఞం.. గీత్ వీడియో ఆవిష్కరణ
సంఘటనం ఒక యజ్ఞం సమిధగా మన జీవనం అంటూ భారత మాత సేవకు పునఃరంకితం కావాలి. - గుంత లక్ష్మణ్ జీ (ABVP అఖిల భారత సహ సంఘటన కార్యదర్శి) "సంఘటనం ఒక యజ్ఞం" గీత్ వీడియో రూపంలో ఆవిష్కరిస్తున్న సందర్బంగా హైదరాబాద్ తార్నాక ఏబీవీపీ ...
READ MORE
సిద్దిపేట్ జిల్లా లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి అవమానం.!!
సిద్దిపేట్ జిల్లా మిర్దొడ్డి మండలం పెద్ద చెప్యాల లో గుర్తు తెలియని దుండగులు బరితెగించారు. అంబేద్కర్ యొక్క నిలువెత్తు విగ్రహం పై దాడి చేసి, ద్వంసం చేసారు. దీంతో ఒక్కసారిగా మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రశాంతమైన పరిస్థితుల మధ్య ఇలాంటి ...
READ MORE
అధికారులు అర్థం చేసుకోరు, పాలకులు పట్టించుకోరు.! రోడ్డు పై వెల్లాలంటే నరకం చూస్తున్న ప్రజలు.!!
గ్రేటర్ హైద్రాబాద్ పరిధి కూకట్ పల్లి నియోజకవర్గం హస్మత్ పేట్ ప్రజలకు, అధికారులు మరియు పాలకుల పుణ్యమాని రోజూ ప్రత్యక్ష నరకం చవిచూస్తున్నారు. హస్మత్ పేట్ లోని సూర్య ఎన్ క్లేవ్ వెనకవైపు ఉన్న ప్రాంతం లో డ్రైనేజ్ లైన్ కోసం ...
READ MORE
కరోనా ఎఫెక్ట్.. స్కూళ్లు కాలేజీలు బంద్ చేయాలని సీఎం ఆదేశం..!!
ప్రస్తుతం ప్రపంచ దేశాలను గడ గడ వనికిస్తున్నది ఎవరంటే.. కరోనా వైరస్ వ్యాధి.మన దేశం లోకీ చొచ్చుకొచ్చిన ఈ మహమ్మారి వైరస్ వల్ల ఇప్పటికే రెండు మరణాలు సైతం సంభవించాయి.పలు రాష్ట్రాలలో వేగం గ విస్తరిస్తున్న ఈ మహమ్మారి వైరస్ ను ...
READ MORE
చీర్యాల నరసింహ స్వామి ని దర్శించుకున్న  జిల్లా కలెక్టర్.!!
తెలంగాణ ప్రముఖ ఆలయం చీర్యాల శ్రీశ్రీశ్రీ లక్ష్మి నృసింహ స్వామి దేవాలయంలో ఈ నెల 09 తేదీన మొదలైన బ్రహ్మోత్సవాలకు నేడు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి విచ్చేసి శ్రీశ్రీశ్రీ లక్ష్మి నృసింహ స్వామి ని దర్శించుకున్నారు. తర్వాత ...
READ MORE
మునగ… 300 వ్యాధులకు సింపుల్ మెడిసిన్.
మునగ చెట్టులో బలం ఉండదని చెపుతారు. చెట్టు కొమ్మలు చిన్న గాలికే విరిగిపోతుంటాయి. కానీ ఆ బలహీనమైన కొమ్మల్లోనే 300 రకాల వ్యాదులను నయం చేసే శక్తి దాగుందని మీకు తెలుసా.. మునగ కాయలకంటే వాటి ఆకులే మన శరీరానికి వంద ...
READ MORE
రోజుకు 7 వేల మంది భక్తులకే ఏడుకొండలవాడి దర్శనం..!!
కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వాడు తిరుమల ఎంకన్న సామి దర్శనం మరి కొంత కాలం దొరకడం కష్టం గానే అనిపిస్తోంది. ప్రస్తుతం దర్శనాలు పూర్తిగా ఆపి వేయడం జరిగినా.. ఇకపై దర్శనాల విషయంలో కొంత సడలింపు కు ఆలోచన చేస్తోంది ...
READ MORE
ఆరోగ్యానికి ఏ నెంబ‌ర్ పండు మంచిది…? ప‌ండుపై నెంబ‌ర్ చెబుతున్న ర‌హ‌స్యం మేంటి.?
పండేంటి నెంబ‌ర్ ఏంట‌ని ఆశ్చ‌ర్య‌పోకండి. ఇప్ప‌టికే ఈ విష‌యం మాకు తెలుస‌ని పెద‌వి కూడా విర‌వ‌కండి. మ‌రొక్క‌సారి మీ దృష్టికి తీసుకు రావ‌డంలో త‌ప్పు లేద‌ని.. తెలియ‌ని వారికి మ‌రింత చెప్పేందుకే ఈ పండు సంఖ్య‌లో ఉన్న మ‌ర్మాన్ని మీకోసం ఇలా ...
READ MORE
మందుబాబులకు షాకింగ్ న్యూస్.!!
అక్కడక్కడ మంచినీల్లు ఆఖరికి వాడుకునే నీరు కూడా దొరకదేమో కానీ మందు(ఆల్కహాల్) దొరకని ప్రాంతం ఉండదంటే అతిశయోక్తి కాదు. మన తెలంగాణ లో అయితే మరీ ఎక్కువ. కిరాణ దుకాణమైనా ఉదయం రద్దీ కాదేమో కానీ మందు షాప్ అయితే తెరవకముందే ...
READ MORE
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో భాగమైన SFD(స్టూడెంట్  ఫర్ డెవలప్మెంట్) ఆద్వర్యంలో ఈ నెల 20 నుండి 26 వరకు తెలంగాణ జిల్లాల్లోని మారుమూల పల్లె వాసుల జీవన స్థితిగతులూ.. రైతులు  అడ్డా కూలీల సాదకబాదలను వారి కుటుంబ పరిస్థితులను ...
READ MORE
ధన ప్రవాహానికి సిద్దమవుతున్న పంచాయతి సమరం.!!
తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది ఇక ఇప్పుడు మరో సమరానికి సిద్దం అవుతోంది రాష్ట్రం. ఈసారి పంచాయతి ఎన్నికల రూపంలో ఆ సమరం ఉంటుంది. ఇక ఈ ఎన్నికల్లోనూ ధన ప్రవాహం గట్టిగా జరగే ప్రమాదం ఉందని రాజకీయ ...
READ MORE
సంఘటనం ఒక యజ్ఞం.. గీత్ వీడియో ఆవిష్కరణ
సిద్దిపేట్ జిల్లా లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి అవమానం.!!
అధికారులు అర్థం చేసుకోరు, పాలకులు పట్టించుకోరు.! రోడ్డు పై వెల్లాలంటే
కరోనా ఎఫెక్ట్.. స్కూళ్లు కాలేజీలు బంద్ చేయాలని సీఎం ఆదేశం..!!
చీర్యాల నరసింహ స్వామి ని దర్శించుకున్న జిల్లా కలెక్టర్.!!
మునగ… 300 వ్యాధులకు సింపుల్ మెడిసిన్.
రోజుకు 7 వేల మంది భక్తులకే ఏడుకొండలవాడి దర్శనం..!!
ఆరోగ్యానికి ఏ నెంబ‌ర్ పండు మంచిది…? ప‌ండుపై నెంబ‌ర్ చెబుతున్న
మందుబాబులకు షాకింగ్ న్యూస్.!!
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
ధన ప్రవాహానికి సిద్దమవుతున్న పంచాయతి సమరం.!!
Facebook Comments
Top
error: Content is protected !!