AP Weather: ఏపీలో ఇంకా ఎన్ని రోజులు వర్షాలు కురుస్తాయ్.. వాతావరణ శాఖ రిపోర్ట్ ఇదే

ఏపీలోని పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం ఎంతో నష్టాన్ని మిగిల్చింది. పలు చోట్ల పిడుగులు కూడా పడ్డాయి. పంట నష్టం వాటిల్లింది.

ఉత్తర ఛత్తీస్గఢ్ నుండి దక్షిణ అంతర్గత తమిళనాడు వరకు ఏర్పడిన ఉత్తర దక్షిణ ద్రోణి/గాలులు కోత ఇపుడు విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు మరాఠవాడ, అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తువద్ద కొనసాగుతున్నది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ / నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయి.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :- ——————————————

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :– —————————–

సోమవారం, మంగళవారం, బుధవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగంతో)వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- ———————–

సోమవారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది.

మంగళవారం, బుధవారం :- పొడి వాతావరణము ఏర్పడే అవకాశము ఉంది.

రాయలసీమ :- —————-

సోమవారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది.

మంగళవారం, బుధవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..