భారత రైల్వే సరికొత్త ఆవిష్కరణకు తెరలేపింది. మరో మైలు రాయిని దాటేందుకు సిద్దమైంది. ప్రపంచపు అత్యంత ఎత్తైన రైల్వే లైన్ నిర్మించడానికి ఇండియన్ రైల్వే రెడీ అంటోంది. ప్రస్తుతం ఈ రికార్డ్ చైనా రైల్వే ఖాతాలో ఉంది. బిలాస్పూర్-లేహ్-మనాలి మీదుగా హిమాలయాల్లో ఇండియన్ రైల్వే నిర్మించతలపెట్టిన రైల్వే లైన్ పూర్తయితే, చైనా నిర్మించిన టిబెట్ రైల్వే లైన్ రెండవ స్థానానికే పరిమితం అవుతుంది. చైనాను ఈ విధంగా ఢీ కొట్టి వెనక్కి నెట్టయబోతోంది భారత్.
జమ్మూ కాశ్మీర్‌లోని బిలాస్పూర్-మనాలి-లేస్ ప్రాంతాల మీదుగా సుమారుగా 498 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణానికి ప్రతిపాదించారు. ఇందుకు రైల్వే లైన్ వెళ్లే ప్రాంతాలను గుర్తించేందుకు చివరి దశ సర్వే ఈ వారంలో ప్రారంభించనున్నారు. 3,300 మీటర్ల ఎత్తులో నిర్మించ తలపెట్టిన రైల్వే లైన్ పూర్తయితే, చైనా రైల్వే విభాగంలో ఉన్న క్వింఘాయ్-టిబెట్ రైల్వే లైన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచపు అత్యంత ఎత్తైన రైల్వే లైనుగా రికార్డుకెక్కనుంది.
ఈ రైల్వే లైను పనులను జూన్ 27, 2017 న కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు గారు ప్రారంభించనున్నారు. దీనికి సంభందించి ఇండియన్ రైల్వే ట్వీట్ చేసింది.
ప్రపంచపు అత్యంత ఎత్తైన రైల్వే లైన్ ప్రాజెక్ట్ కోసం 157.77 కోట్ల రుపాయల నిధుల అవసరం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ మొత్తం నిధులను రక్షణ మంత్రిత్వ శాఖ(Defence Ministry) కేటాయించనుంది.

హిమాలయాల్లో ప్రతిపాదిత రైల్వే లైన్ బిలాస్పూర్ నుండి సుందర్ నగర్ మండి, మనాలి, తండి, కేలాంగ్, కోక్సర్, దార్చా, ఉప్షి మరియు కారు వంటి ప్రాంతాలను కలుపుతూ లేహ్ వరకు విస్తరించనుంది. ప్రస్తుతం ఈ రైల్వే లైన్ ప్రతిపాదిత ప్రాంతాలకు ఉన్న రోడ్డు మార్గం ఏడాదిలో ఐదు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. కొన్నిసందర్భాల్లో ఈ మార్గాల్లో రోడ్డు ప్రయాణం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఈ రైల్వే లైన్ పూర్తయితే ఇక్కడి ప్రాంతాలను సురక్షితంగా అనుసంధానం చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగానే రైల్వే లైన్ ను వీలైనంత వేగంగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది ఇండియన్ రైల్వేస్.
పర్యాటక రంగాన్ని అభివృద్ది చేయడంలో కూడా ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారనుంది. ఈ రైల్వే లైను పూర్తి స్థాయిలో ప్రారంభమైతే దేశంలోని వివిధ ప్రధాన నగరాల నుండి లేహ్ వరకు ప్రత్యేక రైళ్లను నడిపబోతున్నారు. ప్రపంచపు అత్యంత ఎత్తైన రైల్వే లైన్‌ను ప్రధాన పర్యాటక ప్రాంతాలతో అనుసంధానం చేయనున్నారు.
భారత రక్షణ దళాలకు ఆయుధ సరఫరా మరియు సరిహద్దులో సైనికుల అవసరాలను తీర్చేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ నిధులతో ఈ రైల్వే లైన్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించడం దేశం మొత్తం గర్వించదగ్గ అంశం. ఈ రైల్వే లైన్ పూర్తయితే భారత సిగలో మరో మణిహారం వచ్చి చేరుతుంది. విజయోస్తూ భారత్.
Related Posts
రాజకీయ నాయకుల్లో దురాశ దుర్భుద్ధి ఎక్కువవడంతో ప్రస్తుతం మొత్తం కన్ఫ్యూజ్ రాజకీయాలు కనబడుతున్నై.
ఒక పార్టీ నుండి ఇంకో పార్టీ కి ఎందుకు వెలతారో ఎప్పుడు వెలతారో అర్థం కాని పరిస్థితి.
ఊసరవెల్లి కంటే వేగంగ రంగులు మార్చే శక్తి బహుశా ...
READ MORE
పేదోటండే రోజు రోజుకు ప్రభుత్వ అధికారుల్లో నిర్లక్ష్య ధోరణి, విసుక్కునే ధోరణి, చిన్నచూపు చూసే ధోరణి పెరిగిపోతుంది.రెక్కాడితే గాని డొక్కాడని పేదల పట్ల కనికరం మానవత్వం చూపించాలనే ఇంగిత జ్ఞానం మరిచిపోయి, లంచాలు ఇస్తే గానీ పనిచెయ్యం అంటూ సిగ్గు విడిచి ...
READ MORE
సామాజిక కార్యకర్తగ చెలామని అవుతూ కాషాయ వస్త్ర ధారనతో స్వామీజీ లా ఫోజులు కొడుతూ.. మీడియా లో హైలెట్ కావడం కోసం, జనాలను గందరగోలపర్చి సంచలన వ్యాఖ్యలు చేసి మతపరమైన దూషనలకు పాల్పడుతున్న స్వామీ అగ్నివేష్ నాలిక దురుసుకు తగిన బుద్ది ...
READ MORE
తెలుగు రాష్ట్రాలలో చరిత్రలో మొట్టమొదటి సారి ఒక సరికొత్త యుద్ధం జరుగుతోంది. అది రాజకీయ నాయకుల మద్య కాదు కులాల మధ్య మతాల మద్య కాదు.. తెలుగు సినిమా ఇండస్ట్రీ కి తెలుగు న్యూస్ ఛానెల్స్ కి మద్య..!!
మొదట క్యాస్టింగ్ ...
READ MORE
డిగ్గీ రాజా మళ్లీ నోరు జారారు. హిందువులు ఉగ్రవాదులు కాదని సంఘ్ పరివార్ వారు మాత్రమే ఉగ్రవాదులని తెలిపారు. హిందువులు ఏనాడూ టెర్రరిస్టులు కారని, అసలు హిందూ టెర్రరిజం అన్న పదమే లేదని హర్యానా మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యానించడంతో కౌంటర్ ...
READ MORE
పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు చాధస్తంగ తయారవుతున్నై.. సినిమాల్లో బ్రేక్ దొరికినప్పుడు రాజకీయాలు చేస్తున్నాడని అందరికీ తెలిసిందే.. కనీసం గా బ్రేక్ టైంలో అయినా సరైన నిర్ణయాలు తీసుకుంటుండా అంటే.. పనికి రాని పాత చింతకాయ పచ్చడి నిర్ణయాలు తీసుకుంటున్నాడు.. సినిమా ...
READ MORE
వందే మాతరం భారత్ మాతా కి జై.. జై హింద్.. అంటే తెల్లోడి తూటాకు బలికావాల్సిందే.. స్వాతంత్ర కావాలని నినదిస్తే.. జీవితాంతం జైల్లో గడపాల్సిందే..!!
మానవుడికి మాటలు నేర్పిన భరత ఖండం దాదాపు రెండు వందల ఏండ్లు బ్రిటీష్ వాడి దోపిడీకి గురై ...
READ MORE
అంబేడ్కర్ ఫోటో పెట్టుకుని ప్రచారం చేసుకుంటూ రాజకీయం చేసే వారు ఉన్న నేటి సమాజం లో అంబేడ్కర్ ని వాడుకోవడం కాదు నిజంగా అంబేడ్కర్ ఆశయానికి వారసుడిగా శ్రమిస్తూ యువతకుగ నిలుస్తున్న ప్రముఖ జాతీయవాది సామాజికవేత్త బీజేపీ అంబర్ పేట్ అసెంబ్లీ ...
READ MORE
దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం అయిన ICICI బ్యాంక్ తన దేశభక్తి ని చాటుకుంది. భారత ఆర్మీ కి తనవంతుగా 10కోట్ల రూపాయలను విరాళంగ ప్రకటించింది. అందులో భాగంగ మొదటగ ఐదు కోట్ల రూపాయల విలువైన చెక్కును కేంద్ర రక్షణ శాఖ ...
READ MORE
గత నెల 13,14,15 తేదీలలో ఢిల్లీ నిజాముద్దీన్ లో వేలాది మందితో ముస్లిం మత సమావేశం నిర్వహించి, ఆ సమావేశానికి విదేశీయులను కూడా అక్రమంగా హాజరు పరిచి భారత దేశంలో కరోనా మహమ్మారి వైరస్ ప్రభలడానికి ముఖ్య కారకుడు తబ్లిగీ జమాత్ ...
READ MORE
ఓ కండోమ్ సంస్థ వారు పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఫోటోతో ఏర్పాటు చేసిన హోర్డింగ్ లపై సర్వత్రా వివాదానికి కారణమవుతుంది. హోర్డింగ్ లో సన్నీ లియోన్ ఫోటోతో పాటు "ప్లే బట్ విత్ దిస్ నవరాత్రి" ఈ నవరాత్రి పర్వదినాన ...
READ MORE
తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది ఇక ఇప్పుడు మరో సమరానికి సిద్దం అవుతోంది రాష్ట్రం. ఈసారి పంచాయతి ఎన్నికల రూపంలో ఆ సమరం ఉంటుంది. ఇక ఈ ఎన్నికల్లోనూ ధన ప్రవాహం గట్టిగా జరగే ప్రమాదం ఉందని రాజకీయ ...
READ MORE
హిందూ వ్యతిరేకిగా.. గట్టి ముద్ర ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా హిందువలకు నీతులు చెప్పింది. 35 ఏండ్లు కమ్యునిస్టు పాలన తర్వాత ముఖ్యమంత్రి గ గెలిచింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ.. ఆమె గెలిచిన ...
READ MORE
తెలంగాణ కన్నీళ్లను కష్టాలను తమ రాతలతో మాటలతో ప్రపంచానికి తెలియచెప్పి అలుపెరుగని పోరాటాన్ని చేశారు తెలంగాణ జర్నలిస్టులు. తెలంగాణ పోరాటంలో జర్నలిస్ట్ ల పాత్ర అనిర్వచనీయం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల యుద్దంలో సమిధలుగా మారిన కలం వీరుల కష్టాలను ...
READ MORE
కేరళ మలప్పురం లో జరిగిన గర్భం తో ఉన్న ఏనుగు ను చంపిన ఘటన యావత్ దేశాన్ని కదిలిస్తున్నది. సాధారణంగా ఏనుగు కు ఆకలి ఎక్కువ అందులోనూ ఆ టస్కర్ అనే ఏనుగు 20 నెలల గర్భం తో ఉండడంతో తీవ్ర ...
READ MORE
థాయ్‌లాండ్‌లోని నాంగ్ఘాయ్కు చెందిన ఫాకమడ్ సాంగ్చాయ్ అనే ఏడేళ్ల పాప చిత్రమైన జబ్బుతో బాధ పడుతోంది. అందరిలా తాను ఏడిస్తే కన్నీళ్లు రావడం లేదు.. అందుకు బదులుగా రక్తం దారలై కారుతోంది.ఒక్క కంటి నుంచే కాదు అప్పుడప్పుడు ముక్కు, చెవులు, చేతుల ...
READ MORE
ఉద్యమాల గడ్డ ఉస్మానియా శతవసంత వేడుకలకు హజరయ్యేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి రేపు బుధవారం హైదరబాద్ రానున్నారు. రాష్ట్రపతి హైదరా బాద్ పర్యటన సందర్భంగా హైదరబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి. ...
READ MORE
సంక్రాంతి వస్తే చాలు ప్రతి ఇంటి ముందు రంగు రంగుల హరివిల్లులా అందమైన ముగ్గులు ఆ ముగ్గుపై భక్తితో పెట్టే గొబ్బెమ్మలతో ఇంట్లో మరియు ఇంటి చుట్టూ వాతావరణమే మారిపోతుంది. అదే సంక్రాంతి పండగ స్పెషల్. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ...
READ MORE
మీకు ఇప్పుడు ఓ బ్రహ్మండమైనా.. చిత్ర విచిత్ర అద్బుత అమోఘమైన పరీక్ష పెడతాం. పాసయ్యారో బలి బలి బలిరా బలి మీరే తెలుగులో నిజమైన నిఘంటువని కీర్తిస్తాం. యెహే ఈ సోదంతా ఏంటి పాయింట్‌కి రా అనేగా.. అక్కడికే వస్తున్నా. తెలుగును ...
READ MORE
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తండ్రైయ్యాడు.. ఆయన మూడో భార్య అన్నా లెజెనోవా రెండో సంతానానికి జన్మనిచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్ రేనూ దేశాయ్ లకు కూడా ఇద్దరు సంతానం ఉన్న విషయం తెలిసిందే.. తర్వాత అన్నా లెజెనోవా ...
READ MORE
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ మంత్రి మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ మరోసారి విచక్షణ కోల్పోయి మాట్లాడాడు.
సొంత పార్టీ నేతల తో కూడా విమర్శలకు గురవుతున్నాడు.
భారతదేశం లో పుట్టి శత్రు దేశం పాకిస్తాన్ కు వంతపాడుతూ, పాకిస్తాన్ గొప్ప ...
READ MORE
కరోనా వైరస్ పై దేశ వ్యాప్తంగా విడుదలైన వివరాలను చూస్తే, తెలంగాణ ప్రజలు ఎంత ప్రమాదంలో ఉన్నారో బహిర్గతం అవుతున్నది. దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న కరోనా కేసుల కంటే తెలంగాణలో నమోదవుతున్న కేసుల సంఖ్య మూడు రెట్లు అధికంగా ఉండడం సంచలనంగా ...
READ MORE
తెలంగాణ అద్భుతాలకు పుట్టినిల్లు.. రణరంగానికి ప్రాణం పోసిన ఉద్యమాల పొదరిల్లు.. పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా ఈ భూమిది అని చాటి చెప్పిన ప్రదేశమిది. పవిత్ర పుణ్యక్షేత్రాలకు నిలయం.. పంచభూతులకు ఆలయం.
మన తెలంగాణకు సొంతమైన ఎన్నో విషయాలు మీకోసం.
1) ప్రపంచవ్యాప్తంగా ...
READ MORE
ప్రముఖ జాతీయవాది తెలంగాణ ఉద్యమకారుడు భాజపా స్పోర్ట్స్ సెల్ జాతీయ కన్వీనర్ తూటుపల్లి రవన్న జన్మధినం సంధర్భంగ కార్యకర్తలు అభిమానులు పలువురు జాతీయ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.
తూటుపల్లి రవి కుమార్ అంటే ఇటు భాజపా లో గానీ అటు అఖిల భారతీయ ...
READ MORE
ఛత్తిస్ ఘడ్ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్ "లోక్ సూరజ్" నినాదంతో కొండగావ్ జిల్లా లోని పుసాపావ్ గ్రామంలో పర్యటించారు. కొండగావ్ జిల్లా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం.
గ్రామంలో పాదయాత్ర చేస్తూ వీధి వీధి లో గిరిజనులను కలుసుకుని మీకు ఎటువంటి ...
READ MORE
టిఆర్ఎస్ ఎంపి టీడీపీ వాల్లతో కూర్చోవాల్సి వచ్చింది.. ఎందుకో తెలుసా.?
పేదోడంటే అధికారులకు ఎందుకంత అలుసు? పన్నులు కట్టి జీతమిస్తున్నందుకా.??
స్వామీ అగ్నివేష్ నోటి దూలకు గుణపాఠం చెప్పిన ప్రజలు.!!
తెలుగు సినీ ఇండస్ట్రీ వర్సెస్ తెలుగు మీడియా ఛానల్స్.!!
సంఘీ శక్తులే ఉగ్రవాదులు.. మరి వాళ్లు హిందువులో కాదో తేల్చుకోవాలి.
పవన్ కళ్యాణ్ అసలు రాజకీయం చేస్తుండా.. సినిమాలో లాగ కామెడీ
సమరయోధుల త్యాగఫలం.. 72 వసంతాల భారతావనికి సెల్యూట్.!!
నేటి తరం అంబేద్కర్ వారసుడు ఏడెల్లి అజయ్ కుమార్ జన్మదిన
భారత ఆర్మీ కి భారీ విరాళం ప్రకటించిన ICICI బ్యాంక్.!
తబ్లిగీ జమాతే చీఫ్ మౌలానా సాద్ పై హత్య కేసు
సన్నీలియోన్ కండోమ్ యాడ్ వివాదం.. హిందూ సంస్థల ఆగ్రహం.
ధన ప్రవాహానికి సిద్దమవుతున్న పంచాయతి సమరం.!!
హిందువులకు నీతులు చెప్తున్న మమతా బెనర్జీ..!!
ప్రగతి భవన్ సాక్షిగా.. జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన
దేవతలు నడయాడిన భూమి పై రాక్షసులు జీవిస్తున్నారు.. ఏనుగు హత్య
రక్త కన్నీరు.. ఏడేళ్ల పాప శరీర భాగాల నుండి దారగా
ఉస్మానియ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి రాక.. రాజదానిలో ట్రాపిక్ ఆంక్షలు..
ఇదే ప్రపంచంలోనే అతి పెద్ద ముగ్గు.!! ఎక్కడో తెలుసా.??
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
మరో బుల్లి “పవర్ స్టార్” పుట్టిండు..!!
ఈ సిద్దు గాడికి పాకిస్తాన్ దయ్యం పట్టిందా..? సిగ్గులేకుండ వాగుతుండు.!!
దేశం కంటే కూడా తెలంగాణ లో మూడు రెట్లు అధికంగా
ఇది నా తెలంగాణ.. అద్బుతాలకు పుట్టినిల్లు కోట్ల రతనాల వీణ.
ఆదర్శ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం తూటుపల్లి రవి కుమార్ జన్మదినం.!!
గిరిజన పిల్లలతో దోస్తీ చేసి బ్యాట్ కొనిచ్చిన ముఖ్యమంత్రి.!!