You are here
Home > తాజా వార్త‌లు > మొక్కలకు ప్రాణం పోద్దాం.. రేపటి భవిష్యత్ ను రక్షించుకుందాం.

మొక్కలకు ప్రాణం పోద్దాం.. రేపటి భవిష్యత్ ను రక్షించుకుందాం.

ఏ చెట్టులో ఏ ఔషధ గుణాలున్నాయో తెలుసుకున్న ప్పుడే- వాటి విలువ అవగతమవుతుంది. మన పూర్వీకులు కొన్ని చెట్లలో ఔషధ గుణాలుండటం గమనించి, మనిషి ఆరోగ్యానికి ఉపకరిస్తాయని తెలుసుకొని వాటిని జాగ్రత్తగా పరిరక్షించి పూజించడం మొదలుపెట్టారు. వీటిలో తులసి, మామిడి, రావి, మేడి, మర్రి, మారేడు, వేప, జమ్మి మొదలైనవి పవిత్రమైనవిగా భావించి మన పూర్వీకులు వీటిని దేవాలయ ప్రాంగణాల్లో, మామిడితోటల్లో వూరి మధ్యన పెంచి మనకు తెలియని ఉపకారం చేశారు. వారి దూరదృష్టి వలనే నేడు పెద్దపెద్ద వృక్షాలు అక్కడక్కడ మనకు కనిపిస్తున్నాయి. మనుషులకు, పశువులకు నీడనివ్వడమే కాకుండా పక్షి సంతతి జీవించడానికి ఆధారమయ్యాయి. విలువ తెలియని నేటి కాలం మానవులు స్వార్థప్రయోజనంతో ఏదో సాకుతో మహోన్నత వృక్షాలను నేలకూల్చి పర్యావరణానికి హాని చేస్తున్నారు. పక్షిజాతి అంతరించడానికీ కారకులవుతున్నారు. చెట్లను మనం కాపాడితే అవి మనల్ని రక్షిస్తాయి. ఈ సూక్తిని మరచి విశ్వాన్ని చేజేతులా నాశనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఔషద మొక్కలను నేలకూల్చి విష వలయాన్ని సృష్టించుకుని నానా రోగాలతో సతమతమవుతున్నారు. పచ్చని పంటలు బీళ్లుగా మారుతున్నాయి. చల్లని గాలి మాయమై ఉక్కపోత, వేడి భగభగమండే సూర్యుడి విశ్వరూపానికి బలవుతున్నారు. తీవ్రమైన చర్మ రోగాల భారీన పడి ఒళ్లును గుళ్ల చేసుకుంటున్నారు.


మన పూర్వికులు చెప్పిన ఒక్కో చెట్టు రహస్యమిది.

రావిచెట్టు, వేపచెట్టు, మామిడిచెట్టు బొగ్గుపులుసు వాయువు ( కార్బన్ డై యాక్సైడ్ )   ను ఎక్కువగా స్వీకరించి, మానవులకు అవసరమైన ప్రాణవాయువును అధిక మోతాదులో విడుదల చేసి ఆరోగ్యవంతులుగా ఉండటానికి దోహదపడుతున్నాయి. వేప, రావిచెట్లు రెండూ కలిసి ఒకచోట ఉంటే లక్ష్మీనారాయణ స్వరూపమని ప్రదక్షిణలు చేసి పూజిస్తారు. ఆదివారంనాడు 108 ప్రదక్షిణలు చేయడం వల్ల రావి వేపలో ఉండే గాలి ప్రభావం వల్ల పిల్లలు లేని వారికి సంతాన యోగ్యత కలుగుతుందని పెద్దలు చెబుతారు. రావిచెక్కను కొన్ని రోగాలకు మందుగా వాడతారు.

మర్రిచెట్టు నీడన పరమశివుడు దక్షిణామూర్తి రూపాన కొలువైవుండి భక్తులకు దర్శనమిస్తాడని విశ్వసిస్తారు. మర్రిచెట్టు వూడలు, వేళ్లతో చేసిన చూర్ణం వంధ్యత్వాన్ని పోగొట్టి సంతానవంతులను చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.

మారేడు లక్ష్మీస్వరూపమని, త్రిమూర్తుల ప్రతీకగా భావించి శివకేశవులను ఇద్దరినీ మారేడు దళాలతో పూజిస్తారు. మారేడుపండు గుజ్జు ఉపయోగించి ఆయుర్వేద మందులు తయారుచేసి అనేక రోగాలను పోగొట్టడానికి వాడతారు. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వారి ఆయుధాలను జమ్మిచెట్టుపై దాచారని మహాభారతం తెలియజెబుతోంది. యజ్ఞయాగాదులకు జమ్మిచెక్కను రాపిడి చేసి అగ్ని పుట్టించి సమిధలు వెలిగిస్తారు. జమ్మిచెట్టులో అనేక ఔషధ గుణాలున్నాయంటారు. దాన్ని ఉపయోగించి ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు ఔషధాలు తయారుచేస్తారు. విజయదశమి నాడు జమ్మిచెట్టుకు ప్రదక్షిణలు చేసి పూజిస్తారు. హిందువుల ప్రతి ఇంట్లో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం లభిస్తుంది. ఇంటి ముందు కానీ, పెరట్లో కానీ పవిత్ర ప్రదేశంలో దీన్ని పెంచి పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తారు. ‘తులసి కోట’ లేక ‘బృందావనం’ అని తులసిని పెంచే చోటును పిలుస్తారు. తులసి సర్వరోగ నివారిణిగా, అనేక రోగాలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది.

ఏ పండుగ వచ్చినా పబ్బం వచ్చినా ఏ శుభకార్యం వచ్చినా మామిడితోరణాలు కట్టకుండా జరగదు. ఇది హిందూ సంప్రదాయం. మామిడి కొమ్మలు ప్రాణవాయువును ఇవ్వడమే కాకుండా క్రిమికీటకాలను అడ్డుకుంటాయి. వాటిని ఇంటిలోనికి రానివ్వవు. మామిడికాయలు, పళ్లు రుచికరం, ఆరోగ్యదాయకం. మేడిచెట్టు దత్తాత్రేయుడికి ప్రీతికరమైందంటారు. ఆ స్వామి ఆ చెట్టు నీడన ఎల్లవేళలా ఉంటాడని నమ్మి మేడిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. ఆయుర్వేద వైద్యానికి, కొన్ని వ్యాధుల నివారణకు మేడిపళ్లను, చెట్టు బెరడును ఉపయోగిస్తారు.

ఉసిరిచెట్టుకే అమలక వృక్షమని మరో పేరు ఉంది. ఉసిరిచెట్టు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. కార్తికమాసంలో దీపారాధాన చేసి ప్రదక్షిణలు చేయడమే కాకుండా చెట్టుకింద వనభోజనాలు చేస్తారు. ఉసిరికాయ సర్వరోగాలకు దివ్య ఔషధం. విటమిన్‌ సి పుష్కలంగా ఉండే ఫలం.

స్వచ్ఛమైన గాలి, నీడతోపాటు ఔషధాలు, మధుర ఫలాలు, కలప అందిస్తున్న వాటిని సంరక్షించకుండా మట్టుపెడుతూ పోతున్నాం. ఇప్పటికి కొన్ని రకాల ఔషద మొక్కలు అంతరించిపోయాయి.. మరి కొన్ని చెట్లు పర్యావరణ కాలుష్యానికి నేలకొరుగుతున్నాయి. చెట్లు లేక పర్యావరణం అతాలకుతలం అవుతోంది. సకాలంలో వర్షాలు కురవక, ఎండ తీవ్రత మరింత పెరిగి నానాటికి చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికైనా వృక్ష సంతతిని నాశనం చేయడం కాకుండా కాపాడుకుంటే రేపటి తరం చెట్టు నీడన బతుకుతుంది. లేదంటే మొక్కంటే ఇలా ఉండేదని పాఠాలు చెప్పుకోవాల్సిన ఖర్మ పట్టే అవకాశం లేకపోలేదు. వృక్షో రక్షతి రక్షితః ఈ వాక్కు నిత్యం పటించడమే కాదు ప్రతి శుభకార్యానికి సూచికగా ఓ మొక్కను మాటితేనే అది ఫలించినట్టు. మొక్కలకు ప్రాణం పోద్దా మన ప్రాణాలను రక్షించుకుందాం. 

Related Posts
రష్యాతో కీలక ఒప్పందం.. ఇక ఉగ్రవాదులకు దబిడి దిబిడే.!!
రష్యా దేశంతో భారత్ కీలకమైన ఒప్పందం చేసుకుంది. ప్రపంచ అభివృద్ధి కి పెను సవాల్ గ మారిన తీవ్రవాదాన్ని ఇరు దేశాలు కలిసి కట్టుగా అణచేయాలని నిర్ణయించాయి. ఇందుకు గాను "కాంప్రెహెన్సివ్ కౌంటర్ టెర్రర్ అగ్రిమెంట్" పై ఇరు దేశాలు సంతకం చేసాయి. ...
READ MORE
కోదండరాం కు “రెడ్ సిగ్నల్” పీకేకు “గ్రీన్ సిగ్నల్” ఇరకాటంలో పడ్డ సిఎం కేసిఆర్.!!
తెలంగాణ కోసం అహర్నిశలు కొట్లాడీ.. లాఠీ దెబ్బలు తిని, జైలు జీవితం గడిపి రాజకీయ నాయకులందరినీ ఒకతాటిపై కూర్చోబెట్టి ఉద్యమం చేసిన ప్రొ.కోదండరాం మొన్నామద్య జేఏసీ ఆద్వర్యంలో నిరుద్యోగ సభ పెట్టుకుంట అంటే కేసిఆర్ సర్కార్ ఎన్ని రకాల ఆటంకాలు సృష్టించిందో ...
READ MORE
సిట్‌ విచారణకు సహకరిస్తానంటూనే యూ టర్న్ తీసుకున్న ఛార్మి.
డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న హీరోయిన్‌ ఛార్మీ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు.  సిట్‌ విచారణకు సహకరిస్తానంటూ తెలిపిన ఛార్మీ అనూహ్యంగా న్యాయస్థానం తలుపుతట్టారు. ఆర్టికల్‌ 20 సబ్‌ క్లాజ్‌ 3 ప్రకారం బలవంతంగా రక్త నమూనాలు సేకరించవద్దంటూ ఆమె తరఫు ...
READ MORE
కొడుకు కోసం పోలింగ్ బూత్ కు తరలివచ్చిన అమ్మ.! భాజపాకు విజయం తథ్యం అంటున్న మోడీ ఫ్యాన్స్
గుజరాత్ లో జరుగుతున్న రెండో పోలింగ్ దశలో గాంధీనగర్ పోలింగ్ బూత్ లో తన ఓటును ఉపయోగించుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తల్లి హీరాబెన్ మోడీ. ఈ విషయంలో ప్రత్యేకత ఏముందీ ఎన్నికలు కాబట్టీ ఓటు వేసిందీ.. కొడుకు భాజపా నాయకుడు ...
READ MORE
దొంగ దెబ్బ తీయబోతున్న చైనా.. యుద్దానికి బలగాలు సిద్దం.
దొంగ చాటుగా దెబ్బ కొట్టేందుకు చైనా జిత్తుల మారి ఎత్తులు వేస్తోంది. ఇప్పటికే కవ్వింపు చర్యలతో బోర్డర్ దాటి ముందుకు కదులుతున్న చైనా ఈ సారి ఏకంగా యుద్దానికే సిద్దమన్న రహస్య సంకేతాలను పంపిస్తోంది. ఓ వైపు భారత్ సహనం పాటిస్తుంటే.. చైనా ...
READ MORE
తెలుగు రాష్ట్రాలలో సంచలనం.. వివేకాది సహజ మరణం కాదు హత్య.!!
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మరణించిన విషయం తెలిసిందే.. అయితే వివేకాది సహజ మరణం కాదు హత్యే నని ఆయన భౌతికకాయానికి జరిపిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగ వాస్తవం బహిర్గతం ...
READ MORE
ఎన్నడూ లేనిది, పీవీ నీ పొగుడుతున్న కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబం.!!
కాంగ్రెస్ పార్టీ.. దశాబ్దాల కాలం దేశాన్ని ఏలి, దేశాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలం చెంది, ప్రస్తుతం పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితిలో ఉంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ...
READ MORE
బాలీవుడ్ ఫ్లాప్ షో కు ఊరటనిస్తోన్న “టాయిలెట్”.
"టాయిలెట్" ఏక్ ప్రేమ్ కథా అంటూ తాజా చిత్రం తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. శ్రీ నారాయణ సింగ్ దర్శకత్వం వహించాడు. ఈ విజయంతోనూ అకి విజయాల పరంపర కొనసాగినట్టు అయింది. ఈ చిత్రం కథకు ప్రధాని ...
READ MORE
దళారులు వ్యాపారులు కలిసి మిర్చి రైతు ను ముంచుతున్న
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ లో మిర్చి రైతుల పరిస్తితి ఎంత ఆగమ్య గోచరంగ తయారైందో రోజూ చూస్తూనే ఉన్నాం.. అయితే ఈ సీజన్ లో మిర్చి రైతు పరిస్తితి మరీ దారుణం గ తాయారైంది. ముఖ్యంగా వరంగల్ మిర్చి రైతుల ...
READ MORE
తెలంగాణ అమరవీరుల ఆశయాన్ని సాధిస్తాం – డా.లక్ష్మణ్
60 ఏండ్ల ఆంధ్రా నిరంకుశ పాలకుల చెర నుండి తెలంగాణ ప్రాంతం విముక్తి చెంది ప్రత్యేక తెలంగాణ గ ఏర్పడ్డ రోజు నేటి జూన్ 2 తేది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగేల్లు గడిచిన సంధర్భంగ ప్రత్యేక రాష్ట్రం కోసం ...
READ MORE
ముస్లిం మహిళలకు సమాధానం చెప్పలేకపోతున్న టీఆర్ఎస్ పార్టీ..!!
ఇస్లాం మతం నిబంధనల పరంగ ఇప్పటిదాక ముస్లిం మహిళలు ఎందరో ట్రిపుల్ తలాక్ బారిన పడి జీవితాలను చిన్నాభిన్నం చేసుకున్నారు.మూడు సార్లు తలాక్ తలాక్ తలాక్ అంటే చాలు ఆ భర్త తన భార్యకు విడాకులు ఇచ్చినట్టే ఇందులో మరో ఉండదిక. ...
READ MORE
పేదలంటే ఈ సృష్టికి చులకనే: దాయి.శ్రీశైలం
పేదలంటే పెద్దలకేకాదు ఈ భూతల్లికి.. ఆ ఆకాశానికి.. నడిమనే నడిచే సమాజానికి అందరికి లోకువనే. రోజు రోజుకు పెరిగిపోతున్న పేదరికాన్ని అడ్డుకునే సాహసం చేసినా విజయం కూడా పేదరికం వైపే నిలబడుతుంద ని సర్వేలు చెపుతున్న నిజాలు. ఆకలి కూడా పేదరికాన్ని ...
READ MORE
అమ్మతనానికి మాయని మచ్చ.. పసి కందును వర్షంలో చెత్తకుప్పల్లో పడేసిన తల్లి. అక్కున చేర్చుకున్న స్థానికులు.
కన్న పేగును తెంచుకుని పుట్టిందన్న కనికరం కూడా లేకుండా అప్పుడే పుట్టిన పసికందును చెత్త కుప్పల్లో పడేసింది ఆ కసాయి తల్లి ఓ పక్క జోరు వాన మరో వైపు చిమ్మ చీకటి గుక్కపెట్టి ఏడుస్తున్న పాప గొంతు విని స్థానికులు ...
READ MORE
ఆ నీటిని తాకితే ఇక అంతే… శిలగా మారిపోక తప్పదు..!
తాకకూడని వస్తువును పొరపాటునో, గ్రహపాటునో తాకితే నరుడు శిలగా మారిన దృశ్యాలను పాత సినిమాల్లో తప్ప నిజ జీవితంలో చూసి ఉండవు. ఆనాటి రామయణంలో రాముడు తాక గానే శిల నుండి అహల్య మానవరూపంలోకి వచ్చిందని కథల్లో విన్నాం.. అసలు అలా ...
READ MORE
హిందూ ఉగ్రవాదం అంటూ రెచ్చగొట్టిన కాంగ్రెస్ పార్టీకి ఇది తగిన గుణపాఠం.??
2008 ముంబాయి పై ఉగ్ర దాడి.. 2007 మక్కా మసీద్ పై దాడి ఆపై జరిగిన దాడులూ అన్నిటికీ కారణాలు బయటకొచ్చినై. 2008 లో జరిగిన దాడి పాకిస్తాన్ పనే అని స్వయంగ ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ...
READ MORE
బీజేపీ వ్యూహం ఫలించేనా..? రాష్ట్రపతి ఎన్నిక ప్రతిపక్షాల మౌనమేల..
రాష్ట్రపతి ఎన్నికలో చోటు చేసుకున్న పరిణామం అనూహ్యం...ఆశ్చర్యం అని చెప్పవచ్చు. అగ్రనేతలు, వివిధ రంగాల ప్రముఖులు సహా ఎవరెవరో పేర్లు తెరపైకి రాగా వాటన్నింటినీ పక్కకు పెట్టి ఎవ్వరూ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. అధికార బీజేపీ కూటమి తరఫున రాష్ట్రపతి ...
READ MORE
కరోనా కేసుల్లోనూ.. అగ్ర స్థానం అమెరికా దే.! విషమిస్తోన్న పరిస్తితి.!!
ఆర్థిక రంగం లో సాంకేతిక రంగం లో ఇలా ఎన్నో రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిన అమెరికా ప్రపంచం లోనే అగ్ర దేశం గా కొనసాగుతున్నది. ఇలా చాలా దేశాలకు అమెరికా పెద్దన్నగా వ్యవహరిస్తున్నది.అయితే ఆసుపత్రుల విషయం లో అయినా మరియు ...
READ MORE
హీరో ప్రభాస్ తో సంబంధం అంటూ సోషల్ మీడియా ప్రచారంపై స్పందించిన వైఎస్ షర్మిళ
చాలాకాలం నుండి సినీ హీరో ప్రభాస్ తో జగన్ మోహన్ రెడ్డి చెల్లి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కూతురు వైఎస్ షర్మిళ కు సంబంధం ఉందంటూ సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారంపై స్పందించిన వైఎస్ షర్మిళ ఈ విషయమై ...
READ MORE
అస్సాంకు చెందిన ఈ స్కూల్ టీచర్ ఏం చేసాడో తెలిస్తే మీ రక్తం మరిగిపోతది.
ఈ టీచర్ చేసిన గలీజ్ పని వల్ల పవిత్ర వృత్తి అయిన ఉపాద్యాయలోకానికే తీరని కలంకం అంటుకునే ప్రమాదం ఉంది. బహుశా జైల్లో చిప్పకూడు తింటూ ఊచల మద్యే ఉండాల్సిన నరరూప కామాంధుడు పొరపాటున ఉపాద్యాయుడిగా మారిండనుకుంటా అనిపిస్తుంది. ఇలాంటివాడు సమాజంలో ...
READ MORE
పెట్రేగిపోతున్న ప్రేమోన్మాదం.. ప్రాణాలు తీస్తున్న పిచ్చి ప్రేమ‌.
ప్రేమ‌కు నిర్వ‌చ‌నం చెప్ప‌డం క‌ష్ట‌మే. కానీ ఈ మ‌ధ్య ప్రేమ ఉన్మాదానికి పరాకాష్ట‌గా మారుతోంది. ఎప్ప‌డి నుండో మారింది కానీ ఈ మ‌ధ్య మ‌రింత రెచ్చిపోతోంది. త‌న‌కు ద‌క్క‌నిది ఈ ప్ర‌పంచంలో ఎవ‌రికి ద‌క్క కూడ‌ద‌న్న ఉన్మాదంతో ప్రేమ‌ను చంపుకోలేక ప్రేమించిన ...
READ MORE
బ్రేకింగ్- రేపటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బైక్ ర్యాలీ రద్దు..!!
తెలంగాణ రాష్ట్ర బీజేపీ కి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మొదటిసారి తెలంగాణ లో అడుగు పెడుతున్న సందర్భంగ బేగం పెట్ ఎయిర్ పోర్ట్ నుండి పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ ఏర్పాటు ...
READ MORE
బ్రాహ్మణ సమాజం ఆగ్రహానికి గురవుతున్న టీడీపీ.!!
టీడీపీ నేత ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రం లో దుమారం రేపుతున్నై. మొత్తం బ్రాహ్మణ సమాజం టీడీపీ సర్కార్ పైన చంద్రబాబు నాయుడు పైన నోరుపారేసుకున్న ...
READ MORE
ఆఫ్గనిస్తాన్ పై అమెరికా అతి పెద్ద బాంబు దాడి..
ఐసిస్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా అతి పెద్ద బాంబు ను ప్రయోగించింది. బాంబుల్లో అతిపెద్దదిగా భావించే జిబియూ-43 అనే బాంబును ఎంసీ-130 విమానం నుంచి ఆఫ్ఘనిస్థాన్‌లోని నాంగర్హర్ ప్రాంతంలో ప్రయోగించింది. ఈ బాంబు దాటికి ఈ ప్రాంతం అంతా ముక్కలు ముక్కలైంది.  ...
READ MORE
మూడు దశాబ్దాల తరువాత సర్దార్జీ రూపం లో గ్రామం లో ప్రత్యక్ష్యమయ్యాడు..
దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఇంటి నుండి పారిపోయిన ఓ వ్యక్తి హఠాత్తుగా ప్రత్యక్షమైతే..? తల్లిదండ్రులు చిన్నప్పుడు పనిచేయడం లేదని మందలించడంతో ఇంటి నుండి పారిపోయిన ఓ వ్యక్తి సర్దార్ రూపంలో తిరిగి దర్శనం ఇస్తే..? తీరా తన గ్రామం వెతుక్కుంటూ ...
READ MORE
సోషల్ మీడియాలో పోస్టులకు నో అరెస్టు… సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
తమకు అనుకూలమైన రాతలను చూసి ఆనందిస్తూ, వ్యతిరేకమైన రాతలను అణచివేస్తూ అరెస్టుల పర్వాన్ని సాగిస్తున్న ప్రభుత్వాలకు చెంపపెట్టు తగిలింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ - 2000 చట్టంలోని సెక్షన్-66Aను కొట్టేస్తూ మంగళవారం (జూన్ 27) సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐటీ ...
READ MORE
రష్యాతో కీలక ఒప్పందం.. ఇక ఉగ్రవాదులకు దబిడి దిబిడే.!!
కోదండరాం కు “రెడ్ సిగ్నల్” పీకేకు “గ్రీన్ సిగ్నల్” ఇరకాటంలో
సిట్‌ విచారణకు సహకరిస్తానంటూనే యూ టర్న్ తీసుకున్న ఛార్మి.
కొడుకు కోసం పోలింగ్ బూత్ కు తరలివచ్చిన అమ్మ.! భాజపాకు
దొంగ దెబ్బ తీయబోతున్న చైనా.. యుద్దానికి బలగాలు సిద్దం.
తెలుగు రాష్ట్రాలలో సంచలనం.. వివేకాది సహజ మరణం కాదు హత్య.!!
ఎన్నడూ లేనిది, పీవీ నీ పొగుడుతున్న కాంగ్రెస్ పార్టీ నెహ్రూ
బాలీవుడ్ ఫ్లాప్ షో కు ఊరటనిస్తోన్న “టాయిలెట్”.
దళారులు వ్యాపారులు కలిసి మిర్చి రైతు ను ముంచుతున్న
తెలంగాణ అమరవీరుల ఆశయాన్ని సాధిస్తాం – డా.లక్ష్మణ్
ముస్లిం మహిళలకు సమాధానం చెప్పలేకపోతున్న టీఆర్ఎస్ పార్టీ..!!
పేదలంటే ఈ సృష్టికి చులకనే: దాయి.శ్రీశైలం
అమ్మతనానికి మాయని మచ్చ.. పసి కందును వర్షంలో చెత్తకుప్పల్లో పడేసిన
ఆ నీటిని తాకితే ఇక అంతే… శిలగా మారిపోక తప్పదు..!
హిందూ ఉగ్రవాదం అంటూ రెచ్చగొట్టిన కాంగ్రెస్ పార్టీకి ఇది తగిన
బీజేపీ వ్యూహం ఫలించేనా..? రాష్ట్రపతి ఎన్నిక ప్రతిపక్షాల మౌనమేల..
కరోనా కేసుల్లోనూ.. అగ్ర స్థానం అమెరికా దే.! విషమిస్తోన్న పరిస్తితి.!!
హీరో ప్రభాస్ తో సంబంధం అంటూ సోషల్ మీడియా ప్రచారంపై
అస్సాంకు చెందిన ఈ స్కూల్ టీచర్ ఏం చేసాడో తెలిస్తే
పెట్రేగిపోతున్న ప్రేమోన్మాదం.. ప్రాణాలు తీస్తున్న పిచ్చి ప్రేమ‌.
బ్రేకింగ్- రేపటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బైక్
బ్రాహ్మణ సమాజం ఆగ్రహానికి గురవుతున్న టీడీపీ.!!
ఆఫ్గనిస్తాన్ పై అమెరికా అతి పెద్ద బాంబు దాడి..
మూడు దశాబ్దాల తరువాత సర్దార్జీ రూపం లో గ్రామం లో
సోషల్ మీడియాలో పోస్టులకు నో అరెస్టు… సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
Facebook Comments
Top
error: Content is protected !!