
థాయ్‌లాండ్‌లోని నాంగ్ఘాయ్కు చెందిన ఫాకమడ్ సాంగ్చాయ్ అనే ఏడేళ్ల పాప చిత్రమైన జబ్బుతో బాధ పడుతోంది. అందరిలా తాను ఏడిస్తే కన్నీళ్లు రావడం లేదు.. అందుకు బదులుగా రక్తం దారలై కారుతోంది.ఒక్క కంటి నుంచే కాదు అప్పుడప్పుడు ముక్కు, చెవులు, చేతుల నుంచి కూడా రక్తం కారుతుంది. అది కూడా ఎలాంటి గాయం లేకుండా ఎక్కడ తెగిన ఆనవాళ్లు కూడా లేకుండానే రక్తం దారలై కారుతోంది. ఇలాంటి కేసులు ప్రపంచంలో ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదైనట్టు సమాచారం. పాప పుట్టినప్పటి నుండి ఆరోగ్యంగానే ఉన్నా.. గత ఆర్నెల్ల నుండే ఈ పరిస్థితి దాపురించిందని తల్లిదండ్రులు చెపుతున్నారు. హఠాత్తుగా వచ్చి పడిన ఈ ప్రమాదంతో తీవ్ర నరకం చూస్తోంది ఈ పాప. ఇలాంటి జబ్బు కోటి మందిలో ఒక్కరికి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు శరీరంలో ఏదో భాగంలో రక్తనాళాలు చిట్లిపోయి రక్తం కారుతుందని.. దీన్ని వైద్యభాషలో ‘హెమటోహైడ్రాసిస్’ అని పిలుస్తారని వైద్య నిపుణులు చెపుతున్నారు. ఇది ఏ వయస్సు వారికైనా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెపుతున్నారు. తీవ్రమైన తలనొప్పి రావడం, అలా వచ్చినప్పుడల్లా కళ్లు, చెవులు, చేతులు, చర్మం లో ఏదో ఓ భాగం నుండి రక్తం కారడం ప్రారంభమవుతుందని చెపుతున్నారు. ఆ తర్వాత దానంతట అదే ఆగిపోతుందని చెపుతున్నారు. ఇప్పటి వరకు ఈ జబ్బుకు మందు కనుక్కోలేక పోయామని.. కనీసం ఎందుకు వస్తుందో కూడా కారణం తెలుసుకోలేకపోయామని చెపుతున్నారు వైద్య నిపుణులు.
ఇక ఈ పాప విషయానికి వస్తే ఇంత భయకరమైన వ్యాదితో బాధపడుతున్నా ఎక్కడ కూడా తొనకడం లేదంటా. ఆ పసి పాప గుండె నిబ్బరం చూసి వైద్యులే ఆశ్యర్చపోతున్నారని సమాచారం. కుటుంబ సభ్యులంతా భయపడుతుంటే ఈ పాప మాత్రం అవేమి పట్టించుకోవడం లేదని చెపుతున్నారు ఆ పాప తల్లి నిపాపర్న్ కాంటేన్ . అయితే తమ కూతురుని ఈ విషమ పరిస్థితి నుంచి కాపాడాలని ఆమె తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.