You are here
Home > తాజా వార్త‌లు > అడుగడుగునా ఉద్దానాలు.. కిడ్నీ వ్యాదితో ఆదిలాబాద్ తండాలు విలవిలా.

అడుగడుగునా ఉద్దానాలు.. కిడ్నీ వ్యాదితో ఆదిలాబాద్ తండాలు విలవిలా.

ప్రాణాలు తోడేసే కిడ్ని వ్యాది ఆ గ్రామాలను పట్టిపీడుస్తోంది. పిల్లాజల్లా ముసలి ముతక అన్నా తేడా లేకుండా ప్రాణాలు తీసేస్తోంది. కిడ్నీ రక్కసి కోరలకి అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ వణికిపోతోంది. మారు మూల గ్రామాలైన గురుజ , లొద్దిగూడా , భూతాయి తండాలు కిడ్ని రక్కసితో పోరాడలేక విలవిలాడుతున్నాయి. అక్కడి నీళ్లు విషంగా మారుతున్నాయి. ఆ నీళ్లు తాగిన వారి ప్రాణాలు గాల్లో దీపాలుగా మారుతున్నాయి. కిడ్నీ మహమ్మారి పంజాకి ఇక్కడి వారు బతుకులు అతాలాకుతలం అవుతున్నాయి. ఆదుకునే దిక్కులేక మరణంతో యుద్దం చేస్తున్నాయి ఆ పల్లెలు.

ఇది ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని మారు మూల గిరిజన గ్రామం. పేరు గురుజ. ఒక్కప్పుడు ఆయురారోగ్యాలతో ఉన్న ఇక్కడి ప్రజలపై ఒక్కసారిగా కిడ్నీ రక్కసి పంజా విసిరింది. కిడ్నీ భూతం దెబ్బకు సంతోషంగా ఉన్న ఆ పల్లె మంచానపడింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇప్పటి వరకు పాతిక మందిని పొట్టన పెట్టుకుంది ఈ మహమ్మారి. మరో 15 మందికి పైగా ఈ వ్యాది భారీన పడి రోజులు లెక్కపెట్టుకుంటున్నారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు అందరికి అదే సమస్య. ఇంకొందరిదైతే తమకు వచ్చిన రోగమేమిటో తెలియని దుస్థితి. వేలకు వేలు ఆసుపత్రుల్లో ఖర్చు పెడుతున్నా రోగం నయం అయిన దాఖాలాలు కనిపించడం లేదు. కూలీ నాలి చేసుకుని బ్రతికే కుటుంబాలు ఈ మహమ్మారి దెబ్బతో కుప్పకూలిపోతున్నాయి. కిడ్నీ వ్యాది భారీన పడి ఇంటి యజమానులను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో మునిగిపోతున్నారు.

ఒక్క గురుజనే కాదు ఉమ్మడి ఆదిలాబాద్ నుండి విడిపోయి కొమ్రంభీం జిల్లా గా ఏర్పడిన లింగాపూర్ మండలం లోని లొద్దిగూడా మారు మూల గ్రామం పరిస్థితి కూడా ఇదే. ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఉద్దానం మాత్రమే కనిపిస్తే ఇక్కడ తండాలకు తండాలే ఉద్దానంలా మారిపోయి విలవిలాడుతున్నాయి. లొద్దిగూడ గిరిజన గ్రామం. ఈ ఊర్లో కిడ్నీవ్యాధి బాధితుల్లో 95 శాతంపైగా పురుషులే. గురుజలో ఆడ మగ భేదం లేకుండా కిడ్నీ భూతం పట్టుకుంటే ఇక్కడ మాత్రం కుటుంబ భారాన్ని మోసే మగవాళ్లను పట్టి పీడిస్తోంది. కిడ్నీ మహమ్మారి దెబ్బకు మగవాళ్లు అర్ధంతరంగా తనువుచాలిస్తుండటంతో వారి భార్యాపిల్లలు దిక్కులేనివారవుతున్నారు.

నలభై ఏళ్ల క్రితం ఈ గ్రామం ఏర్పడింది. ఈ ఊర్లో 50 దాకా కుటుంబాలు ఉన్నాయి. జనాభా 200 ఇందులో వ్యాధి సోకిన వారి సంఖ్య 60 మంది. అంతా మగవాళ్లే. దీంతో ఈ గ్రామానికి పిల్లనిచ్చేందుకు కూడా జంకుతున్నారు.

ఇక ఇలాంటి మరో గ్రామమే ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని భూతాయి తండా. ఇక్కడ కూడా కిడ్నీ మహమ్మారి రంకెలు వేస్తోంది. ఇక్కడ నీళ్లు తాగిన వారిని బాదిస్తూ ప్రాణాలు తీస్తుంది. ఈ మూడు మారుమూల గ్రామల పరిస్థితి ఒకటే కిడ్నీ వ్యాది. అది రావడానికి కారణం కూడా ఒకటే నీటి సమస్య. ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండటం. ఐదేళ్ల క్రితం వాటర్ ఫ్లాంట్ ఏర్పాటు చేసినా ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు. నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఎంపీ నగేష్ స్వగ్రామం ఉన్నా.. ఎంపీ నియోజకవర్గంలోని గ్రామమే అయినా కనీసం ఒక్క సారి కూడా తమను చూసేందుకు తమ సమస్యలు వినేందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకున్న పాపన పోలేదంటూ కన్నీరు మున్నీరవుతున్నారు.

ఈ మూడు గ్రామాల జీవనాదారం వ్యవసాయమే. తమ భూములను, కన్న ఉరిని వదిలి వెళ్లలేక రోగాన్ని జయించలేక ఇక్కడే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తమకు సాగు తప్ప మరేపని తెలియదని, కన్నతల్లిలాంటి ఊరును విడిచి ఎక్కడికి వెళ్లేదని అక్కడి బడుగుజనం కన్నీటి పర్యంతమవుతున్నారు. గ్రామంలో కిడ్నీవ్యాధి చావుడప్పు మోగిస్తున్నా.. అధికారుల్లో చలనం మాత్రం రావడం లేదు.

కొమ్రంభీం జిల్లాలోని లొద్దిగూడా లో గత రెండు నెలల్లోనే రాథోడ్‌ ఓంకార్‌, అడె దులాజీ అనే ఇద్దరు యువకులు కిడ్నీలు చెడిపోవడంతో ప్రాణాలుకోల్పోయారు. గురుజ గ్రామంలో 2016 ఒక్క ఏడాది లోనే ( ఉత్తంజాదవ్, బొజ్జు నాయక్, అడెల్లు, చందునాయక్, బాబారావు రాథోడ్, విజయ్, అమీనాజాదవ్, పులిబాయి, లస్మన్న తో పాటు మరో 5 గురు ) 14 మంది ఈ కిడ్నీ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. లొద్దిగూడాలో ఈ ఏడాదిలో మరో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. గురుజలో సైతం అదే పరిస్థితి. మరో నలుగురు 2017 లో చనిపోయారు. ఇలా పదుల సంఖ్యల్లో పిట్టల్లా రాలుతున్న కనీసం కాపాడే ప్రయత్నం చేయడం లేదు ప్రభుత్వం.

ఈ విషయమై వైద్య సిబ్బందికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. భోజనం కంటే మందులే ఎక్కువగా వేసుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. నీటి సమస్యతో ఈ కిడ్నీ వ్యాది వచ్చి ఉండవచ్చని తగ్గుతుందిలే భయపడాల్సిన అవసరంలేదంటూ డాక్టర్లు మందు చీటీలు రాసి పంపేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గురుజ గ్రామంలోని సంజీవ్, పార్వతి బాయి దంపతులకు ముగ్గురు సంతానం. కూతురు లలిత ఐదేండ్ల వయసుకే కిడ్నీ వ్యాధితో చనిపోయింది. అంతలోనే కొడుకు విజయ్ 2014లో ఇదే వ్యాధితో 15 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. పుట్టడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని కిడ్నీ భూతం మరో సారి కోలికోలేని దెబ్బ కొట్టింది. మూడేళ్ల నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మరో కొడుకు నిఖిల్‌ 2017 ఫిబ్రవరిలో చికిత్సపొందుతూ చనిపోయాడు. దీంతో సంజీవ్ పార్వతి భాయిల కుటుంబం కన్నబిడ్డలను కోల్పోయి తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.

లొద్దిగూడా, గురుజ , భూతాయి గ్రామాల్లో కిడ్నీ వ్యాధి ఇంతలా ఎందుకు విజృంభిస్తుందో మాత్రం ఏ వైద్యాధికారి చెప్పడం లేదు. వ్యాధి సోకడానికి కారణమేమిటో ఎవరు కనుక్కోలేక పోతున్నారు. ఈ గ్రామస్తులు తాగే నీటిలో ఐరన్ శాతం అధికంగా ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆర్‌డబ్ల్యూఎస్, వైద్యాధికారులు ఈ గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదు. వ్యాధిబారిన పడినవారు ప్రైవేటు వైద్యం చేయించుకుంటూ వేలల్లో ఖర్చు చేసుకుంటున్నారు. ఆర్థిక స్థోమత లేని వారు మాత్రం ఇంటికే పరిమితమై కన్నుమూస్తున్నారు. అందుకు సాక్ష్యమే తుమ్రం. స్వర్ణలత కుటుంబం. ఈ కుటుంబ యజమాని సుదర్శన్ కన్నుమూయడం పిల్లల ఆలనా పాలన చూడాల్సిన భారం తల్లి మీద పడింది. తల్లి కూడ కిడ్నీ బారీన పడటంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఆపన్న హస్తం అందించే వారు లేకపోవడంతో పిల్లలు ఒక పూట తిని మరో పూట పస్తులుంటున్నారు.

ఒక్కరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. కిడ్నీ మహమ్మారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ఇలా విరుచుకుపడి ప్రాణాలు తోడేస్తున్నా పట్టిచ్చుకునే నాధుడే కరువయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాధికి శాశ్వత పరిష్కారం లభించకపోతే గ్రామం వల్లకాడులా మారే అవకాశం ఉందని, తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మేలుకొని ఈ వ్యాధికి కారణమేమిటో నిర్థారణ జరిపి చికిత్స అందించాలని వేడుకుంటున్నారు. 

Related Posts
జర్నలిజం పవర్ ఇంటర్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించిన ప్రొ.కోదండరాం.. భవిష్యత్తు, కొత్త పార్టీ పై క్లారిటీ
తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మణ్ ప్రొ.కోదండరాం తాజాగా జర్నలిజం పవర్ ముఖముఖి కార్యక్రమంలో పలు ముఖ్యమైన ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆయన రాజకీయ పార్టీ పెట్టడం పై క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్ తెలంగాణ లో రాజకీయంగ ఉద్యమకారులు, విద్యార్ధుల పాత్ర ఏంటనే అంశం ...
READ MORE
తెలంగాణ లో బీజేపీ నీ పట్టాలెక్కించిన డా.కే.లక్ష్మన్.!!
(నేడు తెలంగాణ బీజేపీ పూర్వ అధ్యక్షులు డా.కే.లక్ష్మన్ జన్మదినం సందర్భంగా జర్నలిజం పవర్ ప్రత్యేకం) తెలంగాణ లో అధికార పార్టీ టీఆర్ఎస్ కు ధీటుగా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ నే అనేలా రాష్ట్రం లో బీజేపీ తన దూకుడు కొనసాగిస్తున్నది. అయితే ...
READ MORE
కొంత ఉపశమనం.. రాష్ట్రం లో తగ్గు ముఖం పట్టిన కరోనా కేసులు..!!
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. బుధవారం కొత్తగా 6 కరోనా పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. 8 మంది డిశ్చార్జ్‌ అయ్యారని ప్రభుత్వం వెల్లడించింది. కోవిడ్‌-19 కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రాష్ట్రంలో 650కు చేరుకుంది. వీరిలో 118 మంది కోలుకోగా 18 ...
READ MORE
యువతని తప్పుదోవ పట్టిస్తోన్న రంగుల లోకం.!!
ఆ రంగుల లోకంలో ఒక్క అవకాశం తోనే గొప్ప సెలెబ్రిటీలుగా మారిపోయిన వాల్లుంటే.. చాలా అవకాశాలున్నా వచ్చినా వీధుల వెంట బిచ్చమెత్తుకున్నోల్లు కూడా ఉంటారు. అదే ఒక్క అవకాశం కోసం జీవితాంతం ఎదురుచూసే వాల్లు కూడా అడుగడుగుకూ కనబడుతారు. స్టార్లు కావాలని కలలు కంటారు.. ...
READ MORE
ప్రజల ఇంటి వద్దకే అంగన్ వాడి సేవలు..!!
చైనా వైరస్ కరోనా మహమ్మారి ఓ వైపు రోజు రోజుకు విజృంభిస్తుంటే, ప్రజలు ఇంటి నుండి బయటకు రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో నే ప్రధాని నరేంద్ర మోడీ 21 రోజుల లాక్ డౌన్ విధించగా ...
READ MORE
రిపోర్టర్ అవతారం ఎత్తిన పోలీస్.. లంగ పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన రిపోర్టర్.
రిపోర్టర్.. లోకల్ రిపోర్టర్.. అందినకాడికి దండుకునే రిపోర్టర్.. జనాన్ని నిండ ముంచేసే రిపోర్టర్.. మాయల మరాఠీ ఇప్పుడున్న రిపోర్టర్.. ఇది మేము చెపుతున్న మాట కాదు సమాజం.. ప్రజలు గొంతెత్తి మొత్తుకుంటున్న ముచ్చట. నిజానికి రిపోర్టర్ అంటే జనం గొంతు.. రిపోర్టర్ ...
READ MORE
సెలవులొచ్చేశాయోచ్… ఇక అల్లరే అల్లరి.
సెలవులొచ్చేశాయోచ్.. తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలకు ఈరోజుతో సెలవులు. ఎండలు మండిపోతున్నాయి.. అడుగు తీసి అడుగు వేయాలంటే సూర్యుడు తాపానికి గిర్రున తిరిగి కిందపడటం ఖాయం. ఇక ఇలాంటి ఎండల్లో పిల్లలు స్కూల్ అంటే నరకమే... అందుకే తెలంగాణ ప్రభుత్వం ఎండ కాలం ...
READ MORE
కాంగ్రెస్ సొంత కార్యకర్తలే కాంగ్రెస్ ను ఓడించి సుష్మా స్వరాజ్ ను గెలిపించారు..!!
కాంగ్రెస్ పార్టీ కి ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది.. అది ట్విట్టర్ వేదికగ జరిగింది. ఇరాక్ లో 39 మంది భారతీయులు చనిపోవడాన్ని గుర్తు చేస్తూ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విఫలం అయ్యారని మీరు భావిస్తున్నారా అంటూ కాంగ్రెస్ ...
READ MORE
తనదైన శైలిలో వేట మొదలుపెట్టిన మోదీ.! కమళనాధుల్లో రెట్టింపైన ఉత్సాహం.!!
కర్నాటక లో ఎన్నికలు దగ్గర పడ్డాయి.. ప్రచార హోరు మాత్రం రెండు నెలలుగా సాగుతోంది నెల రోజుల నుండి మరింత హీటెక్కింది. రాహుల్ గాంధీ లు ఇటు భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్ షా నెల రోజుల ముందు నుండే రాష్ట్రం ...
READ MORE
న్యాయం అడిగిన బాధితులపై పంచాయతి కార్యధర్శి కస్సు బుస్సు.. మీడియా పై రుసరుసలు.!!
న్యాయం కోసం వచ్చిన ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వెళ్ళగొడుతున్న పంచాయితీ కార్యదర్శి.! వీడియో రికార్డు చేస్తుండగా ఏకంగా జర్నలిస్టుల పైనే దౌర్జన్యం..!! వివరాల్లోకెలితే... మాదీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటు జబ్బలు చర్చుకుంటున్న తెలంగాణా సర్కార్.. ఆ దిశగా అధికారులను మాత్రం మార్చలేక పోతుందని మేడ్చల్ ...
READ MORE
నటి కవిత టీడీపీ ని వదిలి భాజపా లో చేరిక.!
టాలివుడ్ నటి కవిత చాలా కాలం నుండి టీడీపీ లో పని చేస్తున్నారు. ఆమె రాష్ట్ర స్థాయిలో అధికార ప్రతినిధి గ పని చేసారు. ఎన్నికల్లోనూ టీడీపీ నుండి స్టార్ క్యాంపేయినర్ గ కూడా ప్రచారం చేసారు. కాగా కొంత కాలంగ ...
READ MORE
మేడ్చల్ పంచాయతిల పై పట్టు బిగిస్తోన్న భాజపా.!!
త్వరలోనే జరగనున్న పంచాయతి ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ఎవరి ప్రయత్నాలు వారు చేయడంలో నిమగ్నం అయ్యారు. 2019కి తెలంగాణ లో పాగా వేయడానికి కృత నిశ్చయంతో తీవ్రంగ కష్టపడుతున్న భాజపా నాయకత్వం ప్రస్తుతం పంచాయతిలపై ...
READ MORE
భారత్ కు జై కొట్టిన జపాన్.
చైనా తో ఏర్పడ్డ సరిహద్దు వివాదంలో అగ్రదేశం జపాన్ భారత్ ను సమర్థించింది. బేషరతుగా మద్దతునిఛ్చింది. తప్పు చైనాదేనంటూ చైనా వైపు వేలెత్తి చూపిస్తోంది. అసలు డోక్లాం ప్రాంతం భూటాన్ దేశానికి చెందినది.. భూటాన్ తో భారత్ కు మంచి సంబంధాలు ...
READ MORE
ఇక్కడ చర్చి కడితే కూల్చేస్తారు.!!
ప్రపంచంలో ఇస్లాం జనాభా అధికంగ ఉన్న దేశాల్లో ఈజిప్టు ఒకటి.. ఆ దేశంలో క్రైస్తవుల జనాభా పది శాతం. కాగా అక్కడ నిర్మించే చర్చిలపై అభ్యంతరం వెల్లడిస్తున్నారు ఈజిప్టు ముస్లిం ఛాందసవాదులు. ఈ క్రమంలోనే తాజాగా ఈజిప్టు రాజధాని కైరో లో ...
READ MORE
పవన్ కళ్యాణ్‌ని ప్రేమిస్తున్నా.. జ‌న‌సైనికుల మీద ఒట్టు: వ‌ర్మ‌
వివాదాల‌కి కేరాఫ్ అడ్రెస్ వ‌ర్మ‌. ఇటీవ‌ల వివాదాస్ప‌ద చిత్రాల‌తో ఎక్క‌వగా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్న వ‌ర్మ రీసెంట్‌గా అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు అనే సినిమా చేశారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నారా లోకేష్‌, చంద్ర‌బాబు, కేఏపాల్‌ల‌పై సెటైర్స్ వేస్తూ ప్రేక్ష‌కుల‌కి ...
READ MORE
కార్యకర్త కోసం తన జీతం డబ్బును ఇచ్చి ఆదుకున్న తాడూరి.!!
రాష్ట్ర ఎంబీసీ చైర్మణ్ తాడూరి శ్రీనివాస్ తన ఉదారతను చాటుకున్నారు. గంగాధర్ ఆంజనేయులు అనే తెరాస కార్యకర్త గత రెండేల్ల క్రితం గుండె పోటు తో మరణించడంతో.. ఆయన కుటుంబం ఆర్థికంగ ఇబ్బందులు ఎదుర్కుంటోందని తెలుసుకున్న తాడూరి శ్రీనివాస్ వెంటనే స్పందించి.. ...
READ MORE
ఐసిసి ర్యాంకింగ్ లో మనోల్లే కింగ్ లు.. బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ..!!
అన్ని దేశాలలో క్రికెట్ అంటే ఒక ముఖ్యమైన ఆట.. కానీ భారతదేశం లో మాత్రం క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదు, క్రికెట్ అంటే ఒక మతం.. ఆరోజుకు గేమ్ విన్నర్ ఎవరో అతడే దేవుడు. ఇలా సచిన్ గంగూలీ ...
READ MORE
మోడీ దెబ్బతో ఆర్థిక సంక్షోభం దిశగా పాకిస్తాన్..! ఎందుకో తెలుసా.??
తినడానికి తిండి లేకున్నా మీసాలకు సంపెంగ నూనె.. అనే సామేత మనందరికీ తెలిసిందే.. ఇప్పుడు మన శత్రు దేశం పాకిస్తాన్ పరిస్థితి కూడా అచ్చం ఇలాగే తయారైంది. ఆఖరికి ఆ దేశ ప్రధానమంత్రే తన సెక్యూరిటీ ని తగ్గించుకుని, ప్రధాని ఆఫిస్ ...
READ MORE
ప‌చ్చ‌ని ప్ర‌కృతి న‌డుమ అంద‌మైన శిల్ప సంప‌దతో రారామ్మ‌ని పిలుస్తున్న గాంధారి ఖిల్లా.
త‌రత‌రాల తెలంగాణ అస్థిత్వ సంప‌ద అది. కొండ‌ల్లో గుట్ట‌ల్లో ప‌చ్చ‌ని ప్ర‌కృతిలో ఒదిగిపోయిన చ‌రిత్ర‌ ఆదారాల‌కు సాక్ష్యం అది. ప్ర‌దాన ప‌ట్ట‌ణానికి కూతవేటు దూరంలోనే ఉన్న ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచానికి తెలిసింది కొంతే. తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి చ‌రిత్ర‌కు సాక్ష్యమే ఈ ...
READ MORE
బాలివుడ్ ఖాన్ ల పై కరణ్ జోహార్ పై సర్వత్రా నిరసనలు, తాజాగా ఖంగన షాకింగ్ నిర్ణయం.!!
బాలివుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న ఘటన బాలివుడ్ లో బడా నటులు ఖాన్ లను బడా నిర్మాత కరణ్ జోహార్ ను పట్టి ఊపెస్తోంది. వీళ్ళ వల్లే సుశాంత్ సింగ్ తీవ్ర మనో వేదనకు గురై ...
READ MORE
ముఖ్యమంత్రికి వియ్యంకుడైతే.. చట్టాలు వర్తించవా.? ఇదెక్కడి ప్రజాస్వామ్యం.??
ప్రజా ప్రతినిధుల పై ఉన్న క్రిమినల్ కేసులన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి, నేటికీ.. ఈ క్రిమినల్ కేసుల నుండి తప్పించుకోవడానికి ఈ అవినీతి నేతలంతా అధికారాన్ని విచ్చల విడిగా వాడేసుకుంటుంటారు.. ఇలాంటి సీన్లు మనకు మామాలే, కానీ ఈ చెడు సంస్కృతి కి ...
READ MORE
సగం తాగి ఉమ్మేసిన పాలను జనాలకు అమ్ముతున్న మహ్మద్ సోహైల్ అరెస్ట్.!!
హైదరాబాద్ డబిర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో జహంగీర్ డైరీ ఫాం నీ నడిపిస్తున్న మహ్మద్ సోహైల్ అనే వ్యక్తి రోజూ జనాలకు అమ్మే పాలను అపరిశుభ్రం చేస్తూ పాలు పితకగానే ఆ పాలను ఎంగిలి చేసి అంతే కాకుండా పశువులు ...
READ MORE
బండి సంజయ్ కి కుడి భుజం గా నిలబడి యువతను ఏకతాటి చేస్తున్న భాను ప్రకాష్.
బండి సంజయ్ తెలంగాణ బీజేపీ కి అధ్యక్షుడు అయ్యాక రాష్ట్ర కమిటీలో ఆయన పట్టు బట్టి ఎన్నుకున్న పదవిలో యువ మోర్చ ఒకటి. ఈ క్రమంలో నే రాష్ట్ర యువ మోర్చ అధ్యక్షుడిగా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న ...
READ MORE
అంతా అనుకున్నట్టే జరిగింది.. కర్నాటక లో  కూలడానికి సిద్దమైన సంకీర్ణ ప్రభుత్వం.!!
ప్రభుత్వం ఏర్పాటు జరిగిన నాటి నుండే కర్నాటక లో ప్రజా వ్యవస్థ సంక్షోభం లో పడింది.ఈ క్రమంలోనే చిలికి చిలికి గాలవానగ మారిన చందంగ జేడిఎస్ కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే దశకు చేరుకుంది. 105 స్థానాల్లో ...
READ MORE
బ్రేకింగ్ :- వర్మకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ, లక్ష్మిస్ ఎన్టీఆర్ రిలీజ్ కు క్లియరెన్స్.!!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జీవిత కథ ఆధారంగ తీసిన లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఎందుకంటే ముందు నుండి ఈ చిత్రం పై ఆంధ్ర ప్రదేశ్ అధికార ...
READ MORE
జర్నలిజం పవర్ ఇంటర్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించిన ప్రొ.కోదండరాం.. భవిష్యత్తు,
తెలంగాణ లో బీజేపీ నీ పట్టాలెక్కించిన డా.కే.లక్ష్మన్.!!
కొంత ఉపశమనం.. రాష్ట్రం లో తగ్గు ముఖం పట్టిన కరోనా
యువతని తప్పుదోవ పట్టిస్తోన్న రంగుల లోకం.!!
ప్రజల ఇంటి వద్దకే అంగన్ వాడి సేవలు..!!
రిపోర్టర్ అవతారం ఎత్తిన పోలీస్.. లంగ పనులు చేస్తూ అడ్డంగా
సెలవులొచ్చేశాయోచ్… ఇక అల్లరే అల్లరి.
కాంగ్రెస్ సొంత కార్యకర్తలే కాంగ్రెస్ ను ఓడించి సుష్మా స్వరాజ్
తనదైన శైలిలో వేట మొదలుపెట్టిన మోదీ.! కమళనాధుల్లో రెట్టింపైన ఉత్సాహం.!!
న్యాయం అడిగిన బాధితులపై పంచాయతి కార్యధర్శి కస్సు బుస్సు.. మీడియా
నటి కవిత టీడీపీ ని వదిలి భాజపా లో చేరిక.!
మేడ్చల్ పంచాయతిల పై పట్టు బిగిస్తోన్న భాజపా.!!
భారత్ కు జై కొట్టిన జపాన్.
ఇక్కడ చర్చి కడితే కూల్చేస్తారు.!!
పవన్ కళ్యాణ్‌ని ప్రేమిస్తున్నా.. జ‌న‌సైనికుల మీద ఒట్టు: వ‌ర్మ‌
కార్యకర్త కోసం తన జీతం డబ్బును ఇచ్చి ఆదుకున్న తాడూరి.!!
ఐసిసి ర్యాంకింగ్ లో మనోల్లే కింగ్ లు.. బ్యాటింగ్ లోనూ
మోడీ దెబ్బతో ఆర్థిక సంక్షోభం దిశగా పాకిస్తాన్..! ఎందుకో తెలుసా.??
ప‌చ్చ‌ని ప్ర‌కృతి న‌డుమ అంద‌మైన శిల్ప సంప‌దతో రారామ్మ‌ని పిలుస్తున్న
బాలివుడ్ ఖాన్ ల పై కరణ్ జోహార్ పై సర్వత్రా
ముఖ్యమంత్రికి వియ్యంకుడైతే.. చట్టాలు వర్తించవా.? ఇదెక్కడి ప్రజాస్వామ్యం.??
సగం తాగి ఉమ్మేసిన పాలను జనాలకు అమ్ముతున్న మహ్మద్ సోహైల్
బండి సంజయ్ కి కుడి భుజం గా నిలబడి యువతను
అంతా అనుకున్నట్టే జరిగింది.. కర్నాటక లో కూలడానికి సిద్దమైన
బ్రేకింగ్ :- వర్మకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ, లక్ష్మిస్
Facebook Comments
Top
error: Content is protected !!