
ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లతో దాదాపు 32లక్షల ఓటర్లతో దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ గా రికార్డుకెక్కిన నియోజకవర్గం మల్కాజిగిరి పార్లమెంట్. మల్కాజిగిరి అసెంబ్లీ తో పాటు కంటోన్మెంట్, మేడ్చల్, ఎల్బీనగర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నై. ఇంతపెద్ద నియోజకవర్గం కాబట్టే మల్కాజిగిరు అంటే గుర్తుపట్టని వారుండరు, 2009 లో గెలిచిన సర్వే సత్యనారాయణకు కేంద్ర మంత్రిగా కూడా పదవి లభించింది. 2014 లో మోడీ గాలితో బలంగా ఉన్న జాతీయ పార్టీ భాజపా మద్దతుతో అసెంబ్లీ సెగ్మెంట్లలో బలంగా ఉన్న టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు మల్లారెడ్డి.
అదే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో భాజపా అభ్యర్థిగా మల్కాజిగిరిలో పోటీ చేసిన ప్రస్తుత భాజపా ఎంఎల్సీ రాంచందర్ రావు కొద్ది తేడాతో తెరాస అభ్యర్థి చింతల కనకారెడ్డి పై ఓటమి పాలైయ్యారు.. నాడు మల్కాజిగిరి అసెంబ్లీ లో రాజకీయ పరిణామాలు అనూహ్య మలుపులు తిరగడం తెలంగాణ సెంటిమెంటు లాంటి అంశాలు జయాపజయాలను ప్రభావితం చేసాయి..
ఇక పార్లమెంట్ సెగ్మెంట్ చూస్తే ఇక్కడ సెటిలర్లంటే ఏదో ఒక ప్రాంతం కాదు నార్త్ రాష్ట్రాల ప్రజలు కూడా ఎక్కువే అందుకే స్థానిక పార్టీకి పార్లమెంట్ గెలవడం కష్టమైన పని. తొంబై శాతం ఓటర్లు ఎగువ పట్టణ మధ్య తరగతి కుటుంబాల ప్రజలే..అక్షరాస్యత కూడా ఎక్కువే.. కాపులు కమ్మలు కలిపి ఇరవై శాతం ఉండగా బ్రాహ్మణ సామాజికవర్గం ఓటర్లు దాదాపు లక్ష మంది ఉండడం ప్రత్యేకమైన అంశం.
నాడు అసెంబ్లీ లో ఓటమిపాలైనప్పటికీ.. తర్వాత అతి కొద్ది రోజుల్లోనే వచ్చిన పట్టభద్రుల ఎన్నికల్లో రాంచందర్ రావు తన సత్తా చాటి ఎంఎల్సీ గా గెలిచి వ్యక్తిగత ట్రాక్ రికార్డ్ పెంచుకోవడమే కాకుండా రాష్టవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ క్రెడిబిలిటీని పెంచగలిగారు. ఈ విజయంతో ఆయన జాతీయ స్థాయి నాయకులంతా మరోసారి తనవైపు చూసేలా ఆకర్షించగలిగారు. తెలంగాణ సెంటిమెంట్ తో ఏకంగా అధికారాన్నే సొంతం చేసుకుని జోరుమీదున్న కేసిఆర్ ముఖ్యమంత్రి హోదాలో నిలబెట్టిన అభ్యర్థిని ఓడించడం అంటే సాధాసీదా విషయం కాదు మరి.
అప్పటినుండే రాంచందర్ రావు ఓవైపు పార్టీ క్యాడర్ ని సమన్వయపరుస్తూనే మరోవైపు అసెంబ్లీ సెగ్మెంట్ తో పాటే పార్లమెంట్ సెగ్మెంట్లోనూ ప్రజలకు దగ్గరవ్వడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమైన కార్యకర్తలకు సమయమిస్తూ ప్రజల సమస్యలపై కూడా పోరాడుతున్నారు. ఇదంతా ఒకఎత్తైతే ఆయన ముందునుండే మంచి పేరున్న లాయర్ కాబట్టి ఆయనని గుర్తు పట్టనివారంటూ ఉండరు. అందుకే రాంచందర్ రావు కు వ్యక్తిగతంగ కూడా ప్రజల్లో మంచి కమ్యునికేషన్ తో పాటు ప్రజా నాయకుడనే పేరుంది. ఈ ఇమేజే 2019 లో మల్కాజిగిరి పార్లమెంట్ లో విజయాన్ని అందిస్తుందని ఆయన అనుచరులు అభిమానులు అంటున్నారు.
ఇంతవరకైతే ఆయన మల్కాజిగిరి కి పోటీ చేస్తాడా లేక పార్లమెంట్ బరిలో నిలుస్తాడా అనేది ఎక్కడా బహిర్గతం చేయకున్నా ఆయన ఇప్పటికే పార్లమెంట్ సీటు కోసం లైన్ క్లియర్ చేసుకునే పనిలో ఉన్నటు సమాచారం. పార్లమెంట్ అభ్యర్థిగా ఏ కోణంలో చూసినా రాంచందర్ రావు ప్రొఫైల్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది, విద్యావేత్తగా మేధావిగా జాతీయ స్థాయిలో రాజకీయం చేయగల సత్తా ఉన్నవాడిగా ఇప్పటికే రుజువు చేసుకున్న నాయకుడు రాంచందర్ రావు. ఆర్ఎస్ఎస్ పెద్దలతోనూ మంచి సత్సంబంధాలున్నాయి రాంచందర్ రావుకి. ఆయన రాజకీయ జీవితం మొదలైందే ఏబీవీపి విద్యార్థి నాయకుడిగా.. ఆనాడే ఆయన జాతీయ స్థాయిలో విద్యార్థి ఉద్యమాలు చేసారు, నేడు ఉన్న ఏబీవీపి నాయకుల్లో చాలామంది ఆయన అడుగుజాడల్లో నడిచినవారే.. తద్వారా భాజపా లోనూ ఆ సత్సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు.. రాజకీయాలతో సమంగా ఆయన తన న్యాయవాద వృత్తి పై కూడా పూర్తి పట్టు సాధించారు, నేడు ఎందరో ప్రముఖులంతా ఆయన క్లయింట్లే కావడం గమనార్హం.
ఎందరో యువ లాయర్లంతా ఆయన శిష్యులే..!!
జాతీయ ప్రెస్ కౌన్సిల్ మెంబర్ గా కూడా గుర్తింపు సాధించారు. ఇంత ప్రజా ఉద్యమ రాజకీయ అనుభవం ఉన్నా కూడా సౌమ్యుడిగా క్రమ శిక్షణ గల నాయకుడిగా పేరు గడించడం ఒక్క రాంచందర్ రావుకే సాద్యం మరి.
























