డేరాబాబా అరెస్ట్ తరువాత సచ్చసౌదాలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. సచ్చసౌదా గురువు డేరాబాబా రామ్ రహీం సింగ్ శిక్ష ఖరారవడంతో ఆయన దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ కనిపించకుండా పోయింది.  అయితే అజ్ఞాతంలోకి వెళ్లిన హనీ ఇన్సాన్ ఆచూకీ ఎట్టకేలకు తెలిసిపోయింది. ఆమె వేషం మార్చి నేపాల్‌కు వెళ్లినట్లు అదికారులు గుర్తించారు. డేరా బాబా సన్నిహితుడు ప్రదీప్ గోయల్‌ విచారణ తరువాత ఈమె ఆచూకీని గుర్తించారు. అంతేకాదు సెప్టెంబర్ 2న నేపాల్ రాజధాని ఖాట్మాండూలో హనీప్రీత్ కనిపించిందని నిర్ధారణ అయింది. ఆమెతో పాటు మరో ముగ్గురు ఉన్నారని, వారంతా ఆమెను సురక్షిత ప్రాంతంలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని తేలింది.

ఇదిలా ఉంటే పోలీసు, నిఘా వర్గాలకు చిక్కకుండా ఉండేందుకు హనీ ప్రీత్ తన గెటప్‌ను పూర్తిగా మార్చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తన ప్రయాణాలను గతంలోలా లగ్జరీ వాహనాల ద్వారా కాకుండా సాధారణ, ప్రైవేటు ట్యాక్సీలలో చేస్తున్నట్టు గుర్తించారు. దీంతో ఆమెను పట్టుకునేందుకు పోలీసులు పకడ్బందీ ప్లాన్‌తో రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం.