You are here
Home > తాజా వార్త‌లు > బీజేపీ వ్యూహం ఫలించేనా..? రాష్ట్రపతి ఎన్నిక ప్రతిపక్షాల మౌనమేల..

బీజేపీ వ్యూహం ఫలించేనా..? రాష్ట్రపతి ఎన్నిక ప్రతిపక్షాల మౌనమేల..

రాష్ట్రపతి ఎన్నికలో చోటు చేసుకున్న పరిణామం అనూహ్యం…ఆశ్చర్యం అని చెప్పవచ్చు. అగ్రనేతలు, వివిధ రంగాల ప్రముఖులు సహా ఎవరెవరో పేర్లు తెరపైకి రాగా వాటన్నింటినీ పక్కకు పెట్టి ఎవ్వరూ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. అధికార బీజేపీ కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయబోయే వ్యక్తి పేరు ఖరారైంది. దళితనేతను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే ప్రకటించింది.

రామ్‌నాథ్‌ కోవింద్‌ ఏకగ్రీవంగా ఎన్నికైతే ఆర్కే నారాయణ తర్వాత రెండో దళిత నేత రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించినవారు అవుతారు. బీహార్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ చీఫ్ అమిత్ షా సోమవారం పార్టీ నిర్ణయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నెల 23న రామ్‌నాధ్‌ కోవింద్ రాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నెల 24న ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నందున అంతకుముందే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది.

ఇక రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో బీజేపీ ముందునుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్నిక విషయంలో వ్యవహరించిన విధంగానే రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక విషయంలోనూ ఇతర పేర్లను తెరపైకి తీసుకువచ్చింది. బీజేపీ అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, సుష్మా స్వరాజ్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్, జార్ఖండ్ గవర్నర్ ద్రౌపదీ ముర్ము  పేర్లు వినిపించాయి. ఇందులో ఒక్కో దశలో ఒక్కొక్కరి పేరుపై ప్రచారం జరిగింది. కానీ… ఎక్కడా కూడా తమ అసలు అభ్యర్థి ఎవరో బయటపెట్టకుండా మోదీ, అమిత్ షాలు అడుగు ముందుకు వేశారు.

అలాగే పార్టీ తరఫున కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, రాజ్‌నాధ్ సింగ్, అరుణ్ జైట్లీలు విపక్షాలు, మిత్రపక్షాలతో సంప్రదింపులు జరిపారు. ఈ చర్చల్లోనూ తమ అభ్యర్థి ఎవరో వాళ్లు కూడా బయటపెట్టలేదు. ఇదే విషయాన్ని కాంగ్రెస్, వామపక్షనేతలతో పాటు మిత్రపక్షం శివసేన నేతలు కూడా ప్రశ్నించారు. అయినప్పటికీ గుంభనంగా వ్యవహరించిన మోదీ, షాలు చివరకు ఎవ్వరూ ఊహించని విధంగా దళిత మంత్రాన్ని పఠించారు. విపక్షాలకు షాకిస్తూ దళితాస్త్రం సంధించారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో బీజేపీ మొదటి నుంచి గుంభనంగా వ్యవహరించింది. చివరికి పార్టీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ ముగిసిన తర్వాత స్వయంగా పార్టీ చీఫ్ అమిత్ షా ప్రకటిస్తేగానీ అసలు పేరు బయటకు రాలేదు.

రాష్ట్రపతి అభ్యర్ధిగా దళిత నాయకుడు రామ్‌నాథ్‌ కోవింద్‌ పేరును ప్రకటించిన బీజేపీ ఒక్కదెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్లు వ్యవహరించింది. ఇందులో ఒకటి విపక్షాల మద్ధతు కూడగట్టడం. బీజేపీ సంధించిన దళితాస్త్రంతో విపక్షాలు ఒక్కసారిగా షాక్ తిన్నాయి. గతంలో వాజ్‌పేయ్ హయాంలో ఎలాగైతే అనూహ్యంగా అబ్దుల్ కలాం పేరును తెరపైకి తీసుకొచ్చి విపక్షాలకు చెక్ పెట్టారో ఇప్పుడు కూడా అలాగే దళితమంత్రాన్ని పఠించి విపక్షాలకు అవకాశం లేకుండా చేశారు. నిన్నా మొన్నటి వరకు ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతామంటూ బీరాలు పోయిన విపక్ష నేతలు ఇప్పుడు ఒక్కొక్కరే బీజేపీ అభ్యర్థికి మద్ధతు పలుకుతున్నారు. ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్, తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, సమాజ్‌వాదీ పార్టీ, జేడీయూ అధినేత బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, ఆర్‌ఐపీ సహా పలువురు నేతలు రామ్‌నాథ్‌ అభ్యర్థిత్వానికి మద్ధతు ప్రకటించారు.

ఇక దళితులనే నమ్ముకున్న బీఎస్పీకి కూడా రామ్‌నాథ్‌కే మద్ధతు పలకడం మినహా మరో అవకాశం లేదు. ఇదిలా ఉంటే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా ఎన్డీఏ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మరోవైపు ఎన్డీయే తరఫు రాష్ట్రపతి అభ్యర్థిపై నిర్ణయం ఇప్పుడే చెప్పలేమని, పార్టీలో చర్చించిన తర్వాతే నిర్ణయం ప్రకటిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. అలాగే ప్రతిపక్షాలన్నీ ఈ నెల 22న సమావేశమై రాష్ట్రపతి అభ్యర్థి వ్యవహారంపై చర్చించిన తర్వాత, పోటీ ఉంటుందా లేదా అనేది అప్పుడే ప్రకటిస్తామని తృణమూల్‌ చీఫ్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఇక వామపక్షాలు కూడా ఎన్డీయే అభ్యర్థికి మద్దతుకు సుముఖంగా లేవు.

ఎవరీ రామ్‌నాధ్ కోవింద్?
రాష్ట్రపతి అభ్యర్థిగా తెరమీదకు వచ్చిన రామ్‌నాధ్ కోవింద్ 1945 ఆగస్టు ఒకటో తేదీన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ ప్రాంతంలోని దహేత్ జిల్లాలో జన్మించారు. దళితవర్గానికి చెందిన రామ్‌నాథ్‌ కాన్పూర్ యూనివర్సిటీ నుంచి న్యాయవాద పట్టా పుచ్చుకున్నారు. ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో 16 ఏళ్లపాటు న్యాయవాదిగా పనిచేశారు.

1994లో తొలి సారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన ఆయన 2000వ సంవత్సరంలో మరోసారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యునిగా పని చేశారు. 1998-2002 మధ్య బీజేపీ దళిత మోర్చా అధ్యక్షునిగా వ్యవహరించిన ఆయన 2015 ఆగస్టు 16న బీహార్‌ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2002 అక్టోబర్‌లో భారత్ తరఫున ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించిన ఆయన దళితులు, వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారు. 

Related Posts
ప్రియాంకకున్న మానసిక వ్యాధి పేరు వెల్లడించిన సుబ్రహ్మణ్యస్వామి.!!
కాంగ్రెస్ పార్టీ లో రాహుల్ తో గెలవడం లేదని మరో కొత్త ప్రయత్నంగ సోనియా గాంధీ కూతురు రాహుల్ చెల్లి అవినీతి ఆరోపనలు ఎదుర్కుంటున్న రాబర్ట్ వాద్రా భార్య ప్రియాంక వాద్రా ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. రావడం ...
READ MORE
చంద్రబాబు ను కుక్క తోక వంకర అంటూ, మరో ఆసక్తికర విషయం చెప్పిన సిఎం జగన్.!!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక నూతన సర్కార్ ఏర్పడ్డాక మొట్టమొదటి అసెంబ్లీ సమావేశం అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మధ్య పలు ఆసక్తికర సంభాషణ జరిగింది. అనుకున్నటుగానే అసెంబ్లీ కి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత అసంతృప్తి గ ...
READ MORE
వెయ్యి మంది పేద అమ్మాయిలకు ఘనంగ పెళ్లి జరిపించిన గొప్ప వ్యక్తి ఈయన
గుజరాత్ సూరత్ నివాసి మహేష్ భాయి సవాని.. పెద్ద వ్యాపారవేత్త. వందల కోట్లకు అధిపతి.. కాని చాలామంది కోటీశ్వరుల్లా కేవలం డబ్బు సంపాదనకే పరిమితం కాకుండా.. సమాజ సేవ చేస్తున్నాడు. సమాజ సేవ అంటే.. సముద్రంలో నుండి చెంబుడు నీల్లు దానం ...
READ MORE
ముస్లిం దేశం ఇండోనేషియా యువరాణి హిందూ మతం స్వీకారం.!!
ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాలలో ఇండోనేషియా దేశం ఒకటి. అక్కడ రాజుల పాలన నడుస్తోంది. కాగా తాజాగా ఆ దేశం యువరాణి "కంజెంగ్ రాదెన్ ఆయు మహింద్రానీ" హిందూ మతం స్వీరించింది. ప్రస్తుతం ఇండోనేషియా దేశం ముస్లిం నుండి హిందూ మతంలోకి ...
READ MORE
పది ఫలితాలొచ్చాయి.. మంత్రి మాటలతో ఉద్యోగాలు కూడా వచ్చేశాయి.
ముందుగా యావత్ తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో విజయం సాదించిన ప్రతి ఒక్క విద్యార్థికి మా తరుపున శుభాకాంక్షలు. ఇక వార్తలోకి వస్తే గతేమే నయం అనేలా ఫలితాలొచ్చాయ్. ఈ ఏడాది 1.4 శాతం ఫలితాలు తగ్గి 84.15శాతం ఉత్తీర్ణత నమోదయింది. ...
READ MORE
12 మంది అవినీతి జలగల పై కొరడా జులిపించిన మోడీ సర్కార్..!!
దేశ వ్యాప్తంగా పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు నరేంద్ర మోడి సర్కార్ నడుం బిగించింది. ఇంతకాలం రాజకీయంగానే ప్రధాన దృష్టి పెట్టిన మోడీ, ఇక ఇప్పుడు రెండో సారి అధికారం చేపట్టాక అధికారిక వ్యవస్థ పై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ...
READ MORE
పడవ ప్రమాదానికి నైతిక బాధ్యత ఎవరు వహించాలి.??
*సామాజిక విశ్లేషణ* క్రిష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రిఘాట్ వద్ద జరిగిన పడవ ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడగా 7మంది గల్లైంతయ్యారు. మిగతా వారిని రక్షణ సిబ్బంది స్థానికులు కాపాడగలిగారు. ప్రమాదం జరిగినప్పుడు పడవలో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నటు తెలుస్తోంది. ...
READ MORE
PPE కిట్లా బియ్యం సంచులా.. 4 కోట్ల జనాభా కు ఒక కోవిడ్ ఆసుపత్రా.. అంటూ డాక్టర్ల నిరసన.
తెలంగాణ లో కరోనా టెస్టింగులు జరగట్లేవని ఓ వైపు రోజు రోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నదని, ఈ పరిణామం చాలా ప్రమాకరమైనదని దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం కరోనా విషయంలో బాగా పని ...
READ MORE
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
ఉత్తర ప్రదేశ్ లో రాజకీయ బలం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతకు ముందు బీఎస్పీ ఎస్పీ స్థానిక పార్టీలుగ అధికారం సాధించాయి. కానీ నరేంద్ర మోడి అమిత్ షా యోగీ ఆదిత్యానాథ్ ల ఆధ్వర్యంలో ఉత్తర ప్రదేశ్ ఇప్పుడు ...
READ MORE
దేశవ్యాప్తంగ వేడి పుట్టిస్తున్న రజినీ పొలిటికల్ ఎంట్రీ..!!
గత నాలుగైదు రోజులుగా తమిళనాడు లో అభిమానులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇక రేపో మాపో పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చే సూచనలూ కనిపిస్తున్నై. కాకపోతే ఇప్పటికి కూడా.. దేవుడి ఆదేశిస్తేనే అనే వస్తానంటున్నాడు. కాలం పై ...
READ MORE
మోస్ట్ వాటెండ్ హ‌నీప్రీత్ సింగ్ నేపాల్ లో లేదంటా.? మ‌రెక్క‌డ‌..?
స‌చ్చా సౌదా డేరా బాబా అత్యంత ప్రియ‌మైన ద‌త్త‌త పుత్రిక హ‌నీప్రీత్ సింగ్ నేపాల్ పారిపోయింద‌ని తాజాగా వార్త‌లు వ‌చ్చాయి క‌దా. రామ్ ర‌హీం సింగ్ అరెస్ట్ తో ప‌త్త‌కు లేకుండా పోయిన హ‌నీ భార‌త్ నుండి ర‌హ‌స్యంగా పారిపోయింది. అయితే ...
READ MORE
రష్యాతో కీలక ఒప్పందం.. ఇక ఉగ్రవాదులకు దబిడి దిబిడే.!!
రష్యా దేశంతో భారత్ కీలకమైన ఒప్పందం చేసుకుంది. ప్రపంచ అభివృద్ధి కి పెను సవాల్ గ మారిన తీవ్రవాదాన్ని ఇరు దేశాలు కలిసి కట్టుగా అణచేయాలని నిర్ణయించాయి. ఇందుకు గాను "కాంప్రెహెన్సివ్ కౌంటర్ టెర్రర్ అగ్రిమెంట్" పై ఇరు దేశాలు సంతకం చేసాయి. ...
READ MORE
పేదలంటే ఈ సృష్టికి చులకనే: దాయి.శ్రీశైలం
పేదలంటే పెద్దలకేకాదు ఈ భూతల్లికి.. ఆ ఆకాశానికి.. నడిమనే నడిచే సమాజానికి అందరికి లోకువనే. రోజు రోజుకు పెరిగిపోతున్న పేదరికాన్ని అడ్డుకునే సాహసం చేసినా విజయం కూడా పేదరికం వైపే నిలబడుతుంద ని సర్వేలు చెపుతున్న నిజాలు. ఆకలి కూడా పేదరికాన్ని ...
READ MORE
కమ్ముకున్న పొగ మంచు.. భారీగా రోడ్డు ప్రమాదం.
దట్టంగా కప్పుకున్న పొగ మంచుతో ఢిల్లీ ఆగ్రా జాతీయ రహదారిపై భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అసలు ముందు ఏ వాహనం ఉందో తెలుసుకునే వీలు లేకుండా పొగ మంచు దట్టంగా కమ్ముకోవడం పక్కన ఉన్న మనిషి కూడా కనిపించకపోవడంతో ...
READ MORE
మున్సిపల్ ఎన్నికలపై ఎందుకంత హడావుడి.. కేసిఆర్ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించిన హైకోర్ట్.
మరోసారి కేసిఆర్ సర్కార్ కు మొట్టికాయలేసింది హైకోర్ట్. తెలంగాణ లో టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడిన నాటి నుండి చాలా సార్లు దాదాపు హైకోర్ట్ కి వెల్లిన ప్రతీ అంశంలోనూ కేసిఆర్ సర్కార్ ను నిలదీసింది న్యాయస్థానం. కాగా మొన్నటికి మొన్న నూతన ...
READ MORE
హీరో ప్రభాస్ తో సంబంధం అంటూ సోషల్ మీడియా ప్రచారంపై స్పందించిన వైఎస్ షర్మిళ
చాలాకాలం నుండి సినీ హీరో ప్రభాస్ తో జగన్ మోహన్ రెడ్డి చెల్లి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కూతురు వైఎస్ షర్మిళ కు సంబంధం ఉందంటూ సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారంపై స్పందించిన వైఎస్ షర్మిళ ఈ విషయమై ...
READ MORE
సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!
ఒక్కోసారి సమాజంలో జరిగే దారుణ ఘటన ల పట్ల ఎలా స్పందించాలో కూడా అర్దం కానీ ఆవేదనగా మిగిలిపోతుంది. తాజాగా సభ్య సమాజం తల దించుకునేలా, సాటి మహిళలు చీదరించుకునేల ఓ మహిళ పోలీస్ అధికారి తతంగం వెలుగులోకి వచ్చింది. గుజరాత్ అహ్మదాబాద్ పశ్చిమ ...
READ MORE
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ కు ఇచ్చిన నిధుల వివరాలు చెప్పిన మోడీ సర్కార్.!!
కేంద్రం లో బీజేపీ సర్కార్ మరియు తెలంగాణ రాష్ట్రం లో టీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటు అయినప్పటి నుండి బీజేపీ కి టీఆర్ఎస్ కు మధ్య మాటల యుద్దం జరుగుతున్నది.రాష్ట్రానికి నిధులను ఇవ్వడం లేదని టీఆర్ఎస్ నేతలు అంటుంటే, మరో వైపు రాష్ట్రాన్ని ...
READ MORE
రోజుకు 20 వేల టెస్టులు చేస్తున్నం, కరోనా పై యుద్దానికి కేంద్రం సహాయానికి థాంక్స్.!!
కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ ఉంటుంది. అయితే ఇంతగా వైరస్ విజృంభిస్తున్నా ఆప్ సర్కార్ పట్టించుకోవడం లేదనే విమర్శల నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ కరోనా వైరస్ నిర్మూలన కై ఎలాంటి చర్యలు ...
READ MORE
సెలవులొచ్చేశాయోచ్… ఇక అల్లరే అల్లరి.
సెలవులొచ్చేశాయోచ్.. తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలకు ఈరోజుతో సెలవులు. ఎండలు మండిపోతున్నాయి.. అడుగు తీసి అడుగు వేయాలంటే సూర్యుడు తాపానికి గిర్రున తిరిగి కిందపడటం ఖాయం. ఇక ఇలాంటి ఎండల్లో పిల్లలు స్కూల్ అంటే నరకమే... అందుకే తెలంగాణ ప్రభుత్వం ఎండ కాలం ...
READ MORE
అనుష్క విరాటుల నూతన పర్వం. మోగిన పెళ్లిబాజ.
ఎప్పుడెప్పడా అని ఆశక్తిగా ఎదురు చూస్తున్న ఘట్టం సింపిల్ గా ముగిసింది. అంగరంగవైభవంగా దూమ్ ధామ్ గా సాగుతుందని ఊహించిన విరాట్ అనుష్కల వివాహం కుటుంబసభ్యుల మధ్య సాదాసీదగా సాగిపోయింది. ఇన్నాళ్లు ప్రేమ పక్షులుగా విహరించిన అనుష్క విరాట్ కోహ్లిలు మూడుముళ్ల ...
READ MORE
అధికారులు అర్థం చేసుకోరు, పాలకులు పట్టించుకోరు.! రోడ్డు పై వెల్లాలంటే నరకం చూస్తున్న ప్రజలు.!!
గ్రేటర్ హైద్రాబాద్ పరిధి కూకట్ పల్లి నియోజకవర్గం హస్మత్ పేట్ ప్రజలకు, అధికారులు మరియు పాలకుల పుణ్యమాని రోజూ ప్రత్యక్ష నరకం చవిచూస్తున్నారు. హస్మత్ పేట్ లోని సూర్య ఎన్ క్లేవ్ వెనకవైపు ఉన్న ప్రాంతం లో డ్రైనేజ్ లైన్ కోసం ...
READ MORE
ఎన్నేల్లో… వేచిన తరుణం.!హైద్రాబాదీల నిరీక్షణకు తెర పడనుంది.!!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలైన ప్రాజెక్ట్.. ఆయన మరణాంతరం కె. రోషయ్య ముఖ్యమంత్రి ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడు కేసిఆర్ ముఖ్యమంత్రి.. కేసిఆర్ ప్రభుత్వం ఏర్పడి గిట్ల మూడేండ్లైంది ఇగో.. ఇప్పుడు ఆ ...
READ MORE
చైనా పాక్ లకి బ్యాడ్ న్యూస్, భారత వాయుసేనలోకి చేరిన అపాచి హెలికాప్టర్.!
భారత వాయుసేన మరింత పటిష్టంగ శత్రు దుర్భేద్యంగ తయారైంది. ఇప్పటికే ప్రపంచంలోనే పటిష్టమైన వాయుసేన భారత వాయుసేనకు మంచి పేరుంది. గత నాలుగు సంవత్సరాల క్రితం అమెరికా విమాన దిగ్గజ కంపెనీ బోయింగ్ విమాన సంస్థ తో ఒప్పందం కుదుర్చుకుంది నరేంద్ర ...
READ MORE
భైంసా దారుణ ఘటన గూర్చి ఒక్క బీజేపీ మాత్రమే ఎందుకు పోరాటం చేస్తున్నది.??
తెలంగాణ నిర్మల్ జిల్లా భైంసా లో జరిగిన దారుణ ఘటన గురించి దాదాపు ఏ మీడియా లో రాకున్నప్పటికి ఆ ఘటన లో వంద మందికి పైగా హిందువులు పదుల సంఖ్యలో హిందూ కుటుంబాలు రోడ్డున పడ్డాయి.సొంత ఊర్లో సొంత ఇంట్లో ...
READ MORE
ప్రియాంకకున్న మానసిక వ్యాధి పేరు వెల్లడించిన సుబ్రహ్మణ్యస్వామి.!!
చంద్రబాబు ను కుక్క తోక వంకర అంటూ, మరో ఆసక్తికర
వెయ్యి మంది పేద అమ్మాయిలకు ఘనంగ పెళ్లి జరిపించిన గొప్ప
ముస్లిం దేశం ఇండోనేషియా యువరాణి హిందూ మతం స్వీకారం.!!
పది ఫలితాలొచ్చాయి.. మంత్రి మాటలతో ఉద్యోగాలు కూడా వచ్చేశాయి.
12 మంది అవినీతి జలగల పై కొరడా జులిపించిన మోడీ
పడవ ప్రమాదానికి నైతిక బాధ్యత ఎవరు వహించాలి.??
PPE కిట్లా బియ్యం సంచులా.. 4 కోట్ల జనాభా కు
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
దేశవ్యాప్తంగ వేడి పుట్టిస్తున్న రజినీ పొలిటికల్ ఎంట్రీ..!!
మోస్ట్ వాటెండ్ హ‌నీప్రీత్ సింగ్ నేపాల్ లో లేదంటా.? మ‌రెక్క‌డ‌..?
రష్యాతో కీలక ఒప్పందం.. ఇక ఉగ్రవాదులకు దబిడి దిబిడే.!!
పేదలంటే ఈ సృష్టికి చులకనే: దాయి.శ్రీశైలం
కమ్ముకున్న పొగ మంచు.. భారీగా రోడ్డు ప్రమాదం.
మున్సిపల్ ఎన్నికలపై ఎందుకంత హడావుడి.. కేసిఆర్ సర్కార్ పై ప్రశ్నల
హీరో ప్రభాస్ తో సంబంధం అంటూ సోషల్ మీడియా ప్రచారంపై
సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ కు ఇచ్చిన నిధుల వివరాలు చెప్పిన
రోజుకు 20 వేల టెస్టులు చేస్తున్నం, కరోనా పై యుద్దానికి
సెలవులొచ్చేశాయోచ్… ఇక అల్లరే అల్లరి.
అనుష్క విరాటుల నూతన పర్వం. మోగిన పెళ్లిబాజ.
అధికారులు అర్థం చేసుకోరు, పాలకులు పట్టించుకోరు.! రోడ్డు పై వెల్లాలంటే
ఎన్నేల్లో… వేచిన తరుణం.!హైద్రాబాదీల నిరీక్షణకు తెర పడనుంది.!!
చైనా పాక్ లకి బ్యాడ్ న్యూస్, భారత వాయుసేనలోకి చేరిన
భైంసా దారుణ ఘటన గూర్చి ఒక్క బీజేపీ మాత్రమే ఎందుకు
Facebook Comments
Top
error: Content is protected !!