
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మరో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంతో పవర్ సర్ ప్రైజ్ గా అభిమానలుకు అందించాడు. తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం పిఎస్.పికే25 చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. మ్యూజికల్ సర్ప్రైజ్ అంటూ తాజా చిత్రరంలోన ఓ పాటను అభిమానుల కోసం విడుదల చేశారు. ‘బైటికొచ్చి చూస్తే టైమ్ ఏమో 3ఓ క్లాక్..’ అని సాగే ఈ పాటను సంగీత దర్శకుడు అనిరుధ్ ఆలపించి, స్వరాలు సమకూర్చారు. వీడియోలో అనిరుధ్ పాట పాడుతున్న దృశ్యాన్ని చూపించారు. ఆయన పక్కన త్రివిక్రమ్ కూడా ఉన్నారు. చివర్లో పవన్ కుర్చీ తిప్పి.. నిశబ్ధంగా నిల్చొని ఉన్న సన్నివేశాన్ని చూపించారు. వచ్చే ఏడాది జనవరి 10న సినిమాను విడుదల చేస్తున్నట్లు ఈ ప్రచార చిత్రంలో పేర్కొన్నారు.
Facebook Comments