
మీడియా దిగ్గజాలు ఒక్కటవబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో ఈ మధ్య చక్కర్లు కొడుతుంది. టీవి 9, ఎన్ టీవిలను ప్రజల్లోకి బలంగా తీసకెళ్లిన మీడియా అధిపతులు కొన్ని రోజులుగా ఒకే వేదికను పంచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే గూటికి చేరబోతున్నారని టాక్. అది నిజమే అని తెలిపింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు ప్రీ రిలీజ్ పంక్షన్. ఇద్దరు కలిసి ఓ భారీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థను స్థాపించబోతున్నారని.. ఆ లోపే న్యూస్ పరంగా కూడా ఇద్దరు కలిసే వెళ్లాలని నిశ్చయించుకున్నట్టు సమాచారం. ఇందుకు ప్రధాన కారణం ఏంటి..? ఇప్పటికిప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేని టీవీ 9 సంస్థ నుంచి రవి ప్రకాశ్ ఎందుకు బయటికి రావాలనుకుంటున్నారు..? ఒకవేళ వస్తే నరేంద్రుడితోనే ఎందుకు జతకట్టాలనుకుంటున్నారు..? ఈ ప్రశ్నలకు సమాదానం దొరకాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఎన్ టీవి, టీవి 9 రెండు దిగ్గజ న్యూస్ మీడియాల బలమెంతో తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. రవి ప్రకాశించక ముందు తెలుగు మీడియా వార్త రంగంలో వెలుగు లు లేకుండా ఉన్నది అన్న మాట వాస్తవం. రవి ప్రకాశ్ ఎంట్రీతో ఒక్క సారిగా తెలుగు న్యూస్ పవర్ ఏంటో దేశానికి తెలిసింది.. ఇక ఆ తరువాత వచ్చిన ఎన్ టీవి తన సంస్థ అదే రేంజ్ లో నిరూపించుకుంది. వచ్చి రాగానే సంచనాలకు తెర లేపిన ఎన్ టీవి న్యూస్ పరంగా నొప్పించక తానొవ్వక అనే దొరణిలోనే వెళుతుంది. ఇక ఈ రెండిటి మధ్య కొన్ని సంవత్సరాల క్రితం తీవ్ర పోటీ ఉండేది. సడన్ గా ఏమైందో తెలియదు కానీ రెండు సంస్థలు కలిసి సాగడం మొదలు పెట్టాయి. ఆడియో ఫంక్షన్లను షేర్ చేసుకోవడం.. న్యూస్ లో పోటీ పడుతూనే మరో ఛానల్ కు టాప్ ర్యాంక్ దక్కకుండా చేయడం జరుగుతు వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే మరో సంచలన వార్త ఒకటే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. నరేంద్ర చౌదరి తో రవి ప్రకాశ్ కలిసి నడవబోతున్నాడని.. ఒక భారీ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ ను తీసుకు రాబోతున్నారని వార్తలు చెక్కర్లు కొట్టాయి. ఇప్పుడా వార్త నిజమే అని తేలిపోయింది. కేవలం ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే కాదు న్యూస్ ఛానల్లో కూడా రవి ప్రకాశ్ నరేంద్ర చౌదరితో కలిసి సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. అందుకే ఈ మధ్య ఇద్దరు ఒకే వేదిక మీద కనిపిస్తు ఈ వార్తకి మరింత బలాన్ని చేకూరుస్తున్నారు. అంతే కాకుండా ఎన్ టీవి ఆఫీస్ కి కూడా రవి ప్రకాశ్ వస్తుపోతున్నారని సమాచారం. అయితే బలమైన సీఈవో ఉన్న ఎన్ టీవికి ఇప్పటికిప్పుడు న్యూస్ యాంగిల్ లో రవి ప్రకాశ్ అవసరం లేదన్నది మీడియా వర్గాల సమాధానం. కానీ ఎప్పుడు ఏ సమయంలో ఎలాంటి మార్పులైన జరిగే అవకాశం ఉందని.. ఇది రాజకీయ చదరంగం కంటే బలమైన నాలుగవ స్థంబంవ అని మీడియా మేదావుల మాట.
ఇక అసలు విషయంలోకి వస్తే ఇద్దరి కలయికకు ముద్దుగా మూడో స్టార్ కారణం అంటున్నాయి మీడియా వర్గాలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయంగా బలం పుంజుకునేందుకు మీడియా సఫోర్ట్ తప్పని సరి కావడం.. తనకంటు అండగా నిలిచే మీడియా కావాలని కోరుకోవడంతో ఎప్పటి నుండో తనలో ఉన్న రాజకీయ కోరికను సంతృప్తి పరుచుకునేందుకు నరేంద్ర చౌదరి గారు పవన్ కళ్యాణ్ కు అండగా నిలవాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇదే సమయంలో రవి ప్రకాశ్ పవన్ కళ్యాణ్ తో రెండు మూడు సార్లు ప్రత్యేకంగా సమావేశం అయి తన పూర్తి మద్దతు ఇస్తానంటు పేర్కున్నట్టు కూడా తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే గత ఏడాది గా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కు సంబందించిన ప్రతి కార్యక్రమాన్ని టీవి 9 కవర్ చేస్తుంది. ఓ దశలో ఆంధ్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా వెళ్లడానికి సిద్దమైంది అంటేనే రవి ప్రకాశ్ – పవన్ ల బంధం ఎలాంటిందో అర్థం చేసుకోవచ్చు. ఇక మూడేళ్లు పూర్తి చేసుకున్న జనసేనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే తప్పని సరిగా ప్రత్యేక గళం వినిపించే ఛానల్ అవసరం. ఆ కారణంగా టీవి 9 తో ఎన్ టివి జతకట్టినట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ తో గతంలోనే నరేంద్ర చౌదరికి దగ్గరి సంబందాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కు ఆప్త మిత్రుడు శరత్ మారర్ గతంలో చౌదరి గారి ఛానల్ లో సీఈవో గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కారణంగా పవన్ కళ్యాణ్ – నరేంద్ర చౌదరిల బంధానికి రవి ప్రకాశ్ తోడై అంబుజా సిమెంట్ ల పటిష్టంగా మారారన్నది మీడియా వర్గాల సమాచారం. వచ్చే ఎన్నికల్లో జనసేనానిని ఆంధ్రలో ఎలాగైన టాప్ లో నిలబెట్టాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశ్యంతో ఈ ఇద్దరి చౌదరిలు చేయి చేయి కలిపినట్టు తెలుస్తుంది. వీలైతే అటు రవిప్రకాశ్ ఇటు నరేంద్ర చౌదరి ఇద్దరికి ఇద్దరు ఆంధ్రలో 2019 ఎన్నికల్లో జనసేన తరుపున పోటీ చేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా ముచ్చటగా ముగ్గురి కలయికతో ఇటు మీడియాలో అటు రాజకీయంలో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.
























