“ఉద్యమ గడ్డకే సంకెళ్లా.. రాష్ట్రానికి ఊపిరి పోసిన తల్లికే స్వేచ్చ బంధా..? ఇదే నా తెలంగాణ రాజ్యం. ఇదేనా స్వేచ్చ గీతం. ఉక్కు పిడికిళ్లకు సంకెళ్లెస్తే ఏం జరుగుతుందో తెలియదా. ఉప్పెనను ఆపాలని చూస్తే ఏం అవుతుందో కొత్తగా చెప్పాలా..?”
తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఆ గడ్డ.. తెలంగాణ తొలి దశ నుండి మలి దశ దాక 60 ఏండ్ల కొట్లాటకు నిలువుటద్దం ఆ తల్లి. అక్కడ ఉరికొయ్యలకు వేలాడే తలలు కూడా గర్వంగా చావును ఎదిరిస్తాయి.. అగ్నికి ఆహుతయ్యే శరీరాలు ఉప్పెనను తోలుకొస్తాయి. ఎవడబ్బ జాగీరు రా నా నేల అంటూ గొంతులు పెక్కటిల్లుతాయి. పంచభూతలా సాక్షిగా నలుదిక్కుల ఎగిసిపడిన పోరాటం నా ఉద్యమాల గడ్డ ఉస్మానియా తల్లి సొంతం.
ఇక్కడ పోరాటాలు ఉగ్గు పాలతో నరనరాన ఇమిడిపోతాయి. ఇక్కడి చదువులు చరిత్రను మారుస్తాయి. మార్చాయ్.. మారుస్తున్నాయ్.ఇక్కడ చిగురించిన మొక్కలు వటవృక్షాలై రాజ్యాలను ఏలుతాయి.. ఏలాయ్.. ఏలుతున్నాయి. .
చదువు , సంస్కారం , పోరాటం, రాజకీయం ఒక్కటేమిటి ఇక్కడ నేర్చుకోలేనిదంటు లేదు. ఇది నా ఉస్మానియా విశ్వవిద్యాలయ ఘనత. తెలంగాణ రాష్ట్రానికి ఊపిరి పోసిన నా ఉస్మానియా ఇప్పుడు ఎవడికి కానరానిదైంది.
ఈ గడ్డపై గర్జించాల్సిన గొంతులను ఓ పేద్ద రాజకీయం మూగబోయేలా చేయాలని చూస్తోంది. కుట్రలకు ఇప్పుడే కాదు ఎప్పుడు బలికాబోదన్నది ఉస్మానియా విశ్వవిద్యాలయ గోడల చరిత్రే చెపుతోంది. తెలియనోడు ఎవడన్న ఉంటే చెవులు దగ్గర పెట్టి జాగ్రత్తగా వినండి. తరతరాల చరిత్రను నరనరాల్లో నింపుకునేలా తేజో మేదస్సు వెలిగిపోయేలా చెపుతోంది.
అనేక ప్రజాస్వామిక ఉద్యమాలకు వేదికైనా ఉస్మానియా విశ్వ విద్యాలయం ఇప్పుడు ప్రశాంతంగానే ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక భూమికగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీలో సభలు , సాంస్కృతిక కార్యక్రమాలు కొత్తేమి కాదు. ఇక్కడ స్వేచ్చ గాలిలా విహరిస్తూనే ఉంటుంది. మరి ఆ గాలినే ఆపాలనుకుంటే ఊపిరి ఆగి చావడం ఖాయం. ఇప్పుడు జరగబోయేది అదే.
ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఎలాంటి సభలు సమావేశాలు పెట్టొద్దని యూనివర్సిటీ హుకూం జారీ చేసింది. స్వేచ్ఛగా అభిప్రాయాల మార్పిడికి యూని వర్సిటీ వేదికలు కావాలని ఇటీవల జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తూ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పిన సంగతి తెలిసిందే. అలా ప్రకటించి కనీసం రెండు నెలలైనా గడవక ముందే సభలపై యూనివర్సిటీ నిషేధం విధించింది.
యూనివర్సిటీ అధ్యాపకులు, బోధకులు, సిబ్బంది విద్యా, పరిశోధనేతర కార్యకలాపాలకు పాల్పొడొద్దని బుధవారం రాత్రి ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. విశ్వవిద్యాలయం ప్రాంగణంలో రాజకీయ, బహిరంగ సభలను అనుమతించబోమని స్పష్టం చేసింది. విశ్వవిద్యాలయాల లక్షం విద్యాపరమైన, పరిశోధన సంబంధిత అంశాలకే పరిమితమని పేర్కొంది. ఇది అసలయ కథ. అయితే విద్యార్థి శక్తిని అడ్డుకునే దమ్ము ధైర్యం ఎవరికుంది. ఉన్నపలంగా రాత్రికి రాత్రికి హుకూం జారీ చేయడం వెనుక ఎవరి హస్తం ఉంది.
ఉద్యమ చరిత్రకు నిలువుటద్దమైన ఉస్మానియానినే.. ఉద్యమాలకే దూరం చేయాలన్న ఆలోచన ఇప్పటి కిప్పుడు పుట్టిందేనా..? లేక ఉస్మానియాలో అడుగు పెట్టిన క్షణంలో మాట పడిపోయిన వెంటనే పుట్టిందా..? సభలు వద్దని చెప్పడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ త్వరలో సభ నిర్వహిస్తామని తెలపడమేనా..?
కాంగ్రెస్ ఇలా ప్రకటించడమే ఆలస్యం విద్యాశాఖ మంత్రి అలా ప్రకటన కూడా ఇచ్చేశాడే దాని వెనుకున్న అసలు మర్మం ఏంటి..? ఇంకా ప్రత్యేకంగా చెప్పాలా.. వీసిల నోటీసుల వెనుక.. ఉస్మానియా విద్యార్థులను అనచివేసే దోరణి వెనుక ఏ మైండ్ గేమ్ హస్తం ఉందో. నేనే రాజు నాదే రాజ్యం అనుకునే ఏ పాలన చివరి వరకు సాగలేదు అపజయంతో అదపాతాళానికి వెళ్లకుండా లేదు. విద్యార్థులతో ఆటలు మంచివి కావు.. అందులోనూ ఉస్మానియా విద్యా శక్తితో ఆటలు అసలుకే ఎసరు తెచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. రాత్రి నిర్ణయాలు అసలు వెలుగే లేకుండా చేసినా చేయొచ్చు. తస్మాత్ జాగ్రత్త.
టీడీపీ నేత ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రం లో దుమారం రేపుతున్నై.
మొత్తం బ్రాహ్మణ సమాజం టీడీపీ సర్కార్ పైన చంద్రబాబు నాయుడు పైన నోరుపారేసుకున్న ...
ముంబైలో ఉదయం 10:30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో.. పక్కనే ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సహాయంతో వందలాది మంది ఒక్క ఉదుటున ఎలిఫోన్ స్టోన్ రైల్వే స్టేషన్ లోకి వెల్లే ప్రయత్నంలో తొక్కిసలాట జరగడంతో పదిహేనుమంది పైగా ...
ఎవ్వరి కొడుకైనా కొడుకే.. ఎవ్వరి మరణం అయినా మరణమే. శత్రువు కొడుకు చనిపోయిన అయ్యో పాపం అని జాలి పడుతాం.. అయ్యో పాపం అలా ఎలా జరిగిందని ఆరా తీస్తాం కానీ ఏపీ మంత్రి నారాయణ కొడుకు నిషిత్ కారు ప్రమాదంలో ...
గత ఏడాది సెప్టెంబర్ లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో జరిగిన ప్రణయ్ అనే యువకుడిని బహరంగంగ నరికి చంపిన కేసులో అరెస్టైన మారుతిరావు కు మరియు అతని సోదరుడు శ్రవన్ కుమార్, మరో నిందుతుడు కరీం లకు హైకోర్ట్ మధ్యంతర ...
ఈ సృష్టిలో అంతు చిక్కని రహస్యాలు చాలా ఉన్నై.. అందులో మహిమాన్విత హిందూ పురాతన ఆలయాలు ప్రంపంచంలో నేటికీ చాలా ఉన్నై.. మరి నేటి ఆధునిక సాంకేతిక విప్లవం సాధించిన మరమనిషి భవిష్యత్తులో ఆ రహస్యాలు ఛేదించగలడా అంటే.. అది కూడా ...
మనోహర్ పారికర్.. ఈ పేరు చెపితే ఓ గొప్ప రాజకీయ నాయకుడు కనిపిస్తాడు. దర్జా దర్పాన్ని పక్కకు నెట్టి సీఎం అంటే కామన్ మ్యాన్ అని నిరుపించిన ( ముఖ్యమంత్రి ) ఛీప్ మినిస్టర్ కనిపిస్తారు. ఆయనకు సంబందించిన ఓ విషయం ...
విజయం అపజయాల మాటలు.. ఘన చరిత్రలు.. తాతల మీసాల సంపెంగ నూనే కథలు ఈ ట్రెండ్ యుగంలో పనికి రావడం లేదు. కోట్లకు కోట్లు లాభాలు ఆర్జించాలని తప్పుడు దారిలో నడుస్తున్న వాడు సైతం ఒక్క ఆదారం.. ఒకే ఒక్క ఆధారం ...
బీజేపీ సీనియర్ నాయకులు ప్రముఖ జాతీయవాది సంఘ సంస్కర్త శివాజీ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తిండేరు హనుమంతరావు జన్మధినం సంధర్భంగ పలువురు ప్రముఖ నాయకులు సామాజిక వేత్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
హైద్రాబాద్ రామాంతాపూర్ నివాసి అయిన తిండేరు హనుమంతరావు పలు ...
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ దర్బార్. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రం షూటింగ్ కు సంబంధించిన స్టిల్స్ కొన్ని సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం లో పోలీస్ అధికారి ...
ఇప్పుడంతా సోషల్ మీడియా తరం నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మనుషుల మద్య సంబంధ బాంధవ్యాలలో పెనుమార్పులను సాధించింది సోషల్ మీడియా. ప్రపంచం మొత్తాన్ని అరచేతిలో బంధీ చేయగలిగింది సోషల్ మీడియా.. ఇలా చెప్తూ పోతే సోషల్ మీడియా సాధించిన సంచలన విప్లవాత్మక ...
నంద్యాల ఉపఎన్నిక ట్రెండ్ మొదటి నుంచీ టీడీపీకి అనుకూలంగా స్పష్టమైంది. ప్రతి రౌండ్ లోనూ అధికార పార్టీ హవా చాటుతోంది. ఓట్ల శాతం పెరగడంతో ఆదిక్యం రావనుకున్న ప్రాంతాల్లో సైతం టీడీపీ దూసుకుపోతోంది. రౌండ్ రౌండ్ ఆదిక్యత చాటు అంతకంతకు మెజార్టీని ...
పాలకులు ప్రజల యొక్క మాన ప్రాణ ఆస్తులను గౌరవాన్ని కాపాడాలి. కానీ స్వయంగ ప్రభుత్వాలే అన్యం పుణ్యం ఎరుగని ఓ అమాయ పేద కుటుంబంలో చిచ్చు పెట్టి ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితికి తీసుకొస్తే ఇక ఆ ...
విధులు నిర్వహిస్తూ నిద్రపోతున్న ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసారు ఎస్పీ. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్ లో జరిగింది. కాగా విధి నిర్వహణ లో పోలీసులు ఎంత అలర్ట్ గ ఉన్నారో పరీక్షించాలనుకుని తనిఖీలు చేపట్టగా ముగ్గురు పోలీసులు నిద్రపోతున్నటు గమనించారు. ...
భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లు పై ఓవరాక్షన్ చేస్తున్న అమెరికా సంస్థ యూఎస్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడం (USCIRF) ను గట్టిగ హెచ్చరించింది భారత్. ఈ సంస్థ పౌరసత్వ సవరణ బిల్లును మత ప్రాదిపదికగ తయారుచేసారని ...
ఢిల్లీ ఐఎంఎం లో చదువుతున్న ఓ విద్యార్థి మరణానికి తోటి విద్యార్థులే కారణం అవడం సర్వత్రా సంచలనం కలిగిస్తోంది. స్నేహితుల మద్య పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం సాధారణ విషయం. కానీ కొందరు స్నేహితులు పనికిమాలిన సాంప్రదాయం అవలంబిస్తూ ప్రమాదకర పరిస్థితులకు ...
వరంగల్ హన్మకొండ లో సభ్య సమాజం తల దించుకునే ఘటన చోటు చేసుకుంది. నిందుతుడిని నడిరోడ్డు పై ఉరి తీసి చంపినా వాడు చేసిన దారుణ చర్య కు పాపపరిహారం ఉండదు. హన్మకొండ టైలర్ స్ట్రీట్ లో నివాసముండే జగన్ రచన ...
ఆర్ధిక నియంత్రణలో కేసిఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని సృష్టం చేసింది "కాగ్" నివేదిక.
75% ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌళిక వసతులు లేవనీ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మందులు కూడా ఇచ్చే పరిస్థితి లేదని వేలాది కోట్లలో అవకతవకలు జరిగాయనీ.. ఖర్చుల ...
తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే.. గీ మాటే ఎప్పుడూ అనేటోడు మన జయశంకర్ సార్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తన జీవితాన్ని త్యాగం జేసిన ఆజన్మ బ్రహ్మచారి. మంచితనం మానవత్వమే తప్ప ప్రతిఫలం కోరని నిస్వార్థపరుడు జయశంకర్ సార్.
నేటి తెలంగాణ ...
తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదల అవుతుండడం.. ఫలితాలు పూర్తిగ స్థానిక పార్టీ అయిన టీఆర్ఎస్ కు అనుకూలంగ వస్తుండడం, దాదాపు మరోసారి టీఆర్ఎస్ అధికారం చేపట్టడం ఖరారు కావడంతో.. సోషల్ మీడియా లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ...
సిరియాలో అక్కడి ప్రభుత్వానికి ఐసిస్ తీవ్రవాదులకు మధ్య యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.. ఐసిస్ తీవ్రవాదులను ఎదుర్కోవడానికి సిరియా ప్రభుత్వానికి రష్యా దేశం అండదండలందిస్తోంది.. అందుకు తగ్గట్టే ఐసిస్ ని సిరియా సైన్యం గట్టిగా ఎదుర్కుంటుంది. కానీ ఐసిస్ తీవ్రవాదులు ...
తెలంగాణ లో హాట్ టాపిక్ గా మారిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ కి అధికార పార్టీ TRS కు వార్ జరుగుతోంది.
అక్కడ ఎన్నిక అనివార్యం అయినప్పటి నుండే ప్రచారంలో నిమగ్నమైన రఘునందన్ రావు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని ...
భారత భూభాగమైన కాశ్మీర్ ను కొంతమేర పాకిస్తాన్ ఆక్రమించుకోవడంతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం కారణంగ, భారత్ కు పాకిస్తాన్ కు దశాబ్దాల నుండి వైరం కొనసాగుతోంది. కాగా భారత్ లో నరేంద్ర మోడి సర్కార్ ఏర్పడిన నాటి నుండి పాకిస్తాన్ ...
మాట తప్పను ..మడమ తిప్పను అంటూ పదే పదే చెప్పుకునే జగన్ మాట జారారు. అది కూడా వేలాది మంది ప్రత్యక్ష్యంగా చూస్తున్న బహిరంగ సభలో. తాను చెప్పాలనకున్నది చెప్పే ప్రయత్నంలో మాట తప్పను ..మడమ తిప్పను అంటూ పదే పదే చెప్పుకునే ...
ఇంగ్లాండ్ వేదికగ జరుగుతున్న 2019 ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో హాట్ ఫేవరేట్ మ్యాచ్ ఈరోజు జరగనుంది. మాంచెస్టర్ లో మధ్యాహ్నం 3 గంటలకు ఆట మొదలుకానుంది. ఈ ఆట కు ఇంత ప్రాధాన్యం ఏర్పడడానికి ముఖ్య కారణం దాయాదులు భారత్ ...
భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి గారు స్వర్గస్థులు కావడంతో అందుకు సంతాపంగ దేశమంతా రాజకీయాలకు అతీతంగ కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నేడు అధికారికంగ సెలవు దినం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఒక్క టీడీపీ అధికారంలో ...