బహిరంగ లేఖ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జర్నలిస్ట్ సుకుమార్ మీద తెలంగాణ ప్రభుత్వ మాటల తూటాలు పేల్చడం పరోక్షంగా దాడికి దిగడం పై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. లేఖ రాసిన వారి వివరాలు లేకపోయిన లేఖ మాత్రం ప్రస్తుతం సంచలనం గా మారింది. తెలంగాణ ఉద్యమం లో తన వంతు అక్షర యజ్ఞం చేసిన వరంగల్ బిడ్డ ఎకనామిక్ టైమ్స్ సుకుమార్ పై మాటల దాడిని ఖండిస్తోంది. పనిలో పనిగా సూటిగా ప్రశ్నలను సందించి ప్రభుత్వాన్ని సమాదానం చెప్పమని కోరుతోంది. ఇంతకీ ఆ ప్రశ్నలేటంటి.. ఆ లేఖలో ఏముంది..? నిజాలెంత అబద్దాలెంత..? సుకుమార్ పై ప్రభుత్వ పరోక్ష దాడికి కారణమేంటి.. ఈ బహిరంగ లేఖలొక చదవండి.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న బహిరంగ లేఖ మీకోసం
రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు శ్రీ కెటిఆర్ గార్కి బహిరంగ లేఖ:
ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అంటే ఇదేనెమో
అయ్యా మీరు మా విచారణ లో బయట పడ్డదే మియాపూర్ ల్యాండ్ స్కాం అని అంటున్నారు . దీంట్లో ఉన్న అసలు మతలబు ఏంటి, పెద్ద చేపలు ఎవరు అంటే, అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.
జయేష్ రంజన్, కేటీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ తాను ఎకనామిక్ టైమ్స్ పత్రిక కు ఇచ్చిన వివరణ లో స్పష్టం గా మియాపూర్ భూములలోనే కాదు, అనేక చోట్ల భూ సంబంధిత సమస్యలు ఉన్నాయని ఒప్పుకున్నారు .
ఎకనామిక్ టైమ్స్ పత్రిక అదే విషయాన్ని రాసింది. కానీ ఉన్న మాటంటే ఉలిక్కి పడ్డట్లు , కేటీఆర్ గారికి కోపం వచ్చి , పత్రికను, ఆ ఆర్టికల్ రాసిన జర్నలిస్ట్ సుకుమార్ మీద మీద దండయాత్ర చేసిండు.
సుకుమార్ రాసిన అంశాలన్నీ తప్పు అయితే రిజాయిన్డెర్ ఇచ్చిన జయేష్ మాటలు కూడా తప్పా..?
ప్రభుత్వం 14వ ఫైనాన్స్ కమీషన్ కు ఇచ్చిన రిపోర్ట్ లోనే తెలంగాణ ఏర్పడ్డంక కొన్ని కంపనీలు తరలి పోయాయి అని రాసింది నిజం కాదా..? అదే మాట సుకుమార్ రాసిండు, మరి అంత ఎందుకు ఉలికిపాటు..?
మంత్రి మాటల్లో, ఐఏఎస్ ఆఫీసర్ మాటల్లో వైరుధ్యాలు ఎందుకు ఉన్నాయి..? ఎవరిది నిజం..? ఎవరిది అబద్దం..?
మియాపూర్ ఉదంతం పొక్కగానే ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఆఘమేఘాల మీద 70+ సబ్ – రెజిస్ట్రార్లను బదిలీ చేసి, తరువాత ఏం నష్టం జరుగలేడు అని దొంగలకు వత్తాసు పలికింది నిజం కాదా..?
తప్పులే జరగక పోతే రాజ్య సభ సభ్యుడు కేకే గారు తన భూములను ఎందుకు వదులుకున్నారు..?
మరి రాజ్య సభ సభ్యుడు డి శ్రీనివాస్ పై చర్యలేవి..?
అసలు గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఎక్కడ? తెలంగాణ పోలీసులకు దొరకట్లేదా? ఎవరు గోల్డ్ స్టోన్ ప్రసాద్ ను కాపాడుతున్నారు? విజయ మాల్యా ను తప్పించినట్లే, ఆయన్ని కూడా విదేశాలకు పంపించారా..?
కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు, గోల్డ్ స్టోన్ ప్రసాద్ సెక్రటరీ ప్రవీణ్ రెడ్డి పై చర్య లేవి?
కెసిఆర్ గారి ఆత్మ బంధువు నమస్తే తెలంగాణా అధినేత దామోదర్ రావు పై చర్యలేవి..?
ప్రగతి భవన్ వేదికగా తప్పు జరిగినట్లు వార్తలోచ్సాయి. అసలు పెద్ద చేపలు ఎవరు..?
తెలంగాణ వచ్చినంక ఎమ్మార్ భూ కుంభ కోణం పై చర్యలేవి..? వారిపై విచారణ లేకుండా దొంగలకు వత్తాసు పలుకుతూ కోర్టులలో పిటిషన్లు ఎందుకు దాఖలు చేసిండ్రు..?
రహేజాకు సంభందించిన వ్యవహారం లో తెలంగాణ ప్రభుత్వమే కోర్టులను తప్పు తోవ పట్టిస్తున్నట్లు వస్తున్న వార్తలలో నిజమెంత..?
సినీ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ లో జరిగిన భూ ఆక్రమణ కేసు ఏమైంది..? అయ్యప్ప సొసైటీ లో ఉన్న మధ్య తరగతి వాళ్ళ ఇళ్లను మాత్రం కూల్చిండ్రు. సమ న్యాయం అంటే ఇదేనా..?
మూడు ఏళ్ళైనా అన్యాక్రాంతమైన ఒక్క అంగుళం భూమిని ఎందుకు వెనక్కి తేలేక పోయారు..?
వక్ఫ్ బోర్డు లో నిజాయితీగా పనిచేస్తు, భూ కబ్జాకోరుల పాలిటి సింహ స్వప్నమైన ఐ పి యస్ అధికారి ఇక్బాల్ ని ఎందుకు బదిలీ చేసిండ్రు..?
మూడేళ్లయినా వక్ఫ్ బోర్డుకు జ్యూడిషల్ అథారిటీ చేస్తానని తెరాస మేనిఫెస్టో లొ చేప్పిన వాగ్దానం ఎందుకు అమలు చెయ్యట్లేదు..?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అమలు లో ఉన్న భూ ఆక్రమణ పరిరక్షణ చట్టాన్ని ఎందుకు రద్దు చేసినట్లు? ఎవరికి లాభం కల్గుతుందని ఈ చర్యలు..? ఆ చట్టం ఉండి ఉంటే, ఎమ్మార్ లో మాదిరిగా, మియాపూర్ భూ ఆక్రమణ దారులకు ఇప్పటికి బెయిల్లు రాక, జైళ్ల లో ఉండే వారు కాదా?
ఆఖరికి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఎవరిని వదిలిపెట్టలేదు. తెలంగాణ వచ్చినంక దొంగల అడుగులకు మడుగులు వత్తుతున్నారు. ఎమ్మార్ లాంటి విషయం లో జైళ్ళ కు పోయున వారికి మ్యుటేషన్ కింగ్ లుగా పేరొంది, భూ ఆక్రమణలకు తోడ్పడ్డ అధికార బృందానికి, కేటీఆర్ గారు ఏ లాలూచీతో పెద్ద పెద్ద పదవులు ఎందుకు కట్టపెట్టిండు..?
ఎకనామిక్ టైమ్స్ సుకుమార్ హైదరబాద్ సెంట్రల్ యూనివెర్సిటీ లో ఏంఏ ఫిలాసఫీ చదివి, ఎంఫిల్ కూడా చేసాడు. దేశంలోనే ప్రధమ స్థాయిలో నిలబడి కామన్వెల్త్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ పొందిన ఉత్తమ విద్య పరిశోధకుడు కూడా.
విద్యార్థి దశలో వామపక్ష ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటూ, ప్రస్తుతం తనకంటూ ఒక సిద్ధాంతంతో విలువలతో జీవితం గడిపే ఒక మధ్య తరగతి జర్నలిస్ట్ సుకుమార్.
ఉద్యమాల గడ్డ వరంగల్లు జిల్లా కు చెందిన జనగామలో, రెడ్డి కులం లో పుట్టినప్పటికిని, అంబెడ్కర్ ఆలోచనల స్పూర్తితో తన పేరు చివర ఉన్న రెడ్డి ని తీసివేసిన వ్యక్తి సుకుమార్.
కఠిన నిజం ఎప్పడు చెదే. నిజాన్ని జీర్ణించుకోలేక, బట్ట కాల్చి మీద వేసినట్లు, సుకుమార్ ను అనరాని మాటలంటూ, అవినీతి పరుడు అని, అమ్ముడు పోయిండు అని తప్పుడు రాతలు రాయడమే గాక, అదేదో గొప్ప పని అన్నట్లు స్వంత బాకా పత్రికలలో ప్రచురించుకోవడం న్యాయమా..? అధికారం లోకి వచ్చిన తర్వాత అమ్మడం, కొనడం బాగా అలవాటై అందరిని తమ లెక్కనే అనుకుంటే పొరపాటే.
కేటీఆర్ దృష్టిలో ఇవ్వాళ అవినీతి పరుడు అని బిరుదు పొందిన సుకుమార్, కేటీఆర్ కు తెలుసో లేదో నాకు తెలియదు కాని, తెలంగాణ ఉద్యమ కాలంలో ఆనాటి ఉద్యమ నేత కెసిఆర్ ను తన ఫార్మ్ హౌస్ లో కలిసి ఆయన ఇంటర్వ్యూలను జాతీయ స్థాయిలో పతాక శీర్షికన ప్రచురించింది నిజం. ఒకటి కాదు ఎన్నో మార్లు ఆర్టికల్స్ రాసిండు. ఆనాడు ఉద్యమానికి మద్దతు కలిగెలా రాసింది నిజం, ఇవ్వాళ అధికారం వచ్చినంక తెరాస తప్పొప్పులను ఎండగడుతుంది నిజం. అయితే నిజం నిప్పు లాంటిది. తప్పు చేసిన వాళ్లను ఒక రోజు అయినా కాల్చక మానదు.
మీకు బాజా గొడితే మంచి వాళ్ళు, లేక పోతే తెలంగాణ ద్రోహులు అని ముద్ర వేయడం, తెరాస పెద్దల భావ దారిద్ర్యానికి ప్రతీక. వారికున్న తప్పుడు అలవాటు.
చాలా పత్రికలు, చానెళ్లు ఈ భూ కబ్జా వార్తలు రాశాయి. ఒక్క ఎకనామిక్ టైమ్స్, ఒక్క సుకుమార్ మాత్రమే ఈ వార్తలు రాయలేదు. బిజినెస్ పేపర్ కాబట్టి వ్యాపార సంస్థల కోణం రాయవచ్చు. అంత మాత్రాన అన్ని అబాండాలు వేయాలా..? ప్రభుత్వానికి అమ్ముడు పోలేదని ఆక్రోశమా..?
ఇవాళ తెలంగాణ ఏ మీడియా హౌస్ కూడా స్వేచ్ఛగా పనిచేయట్లేదు. తెరాస పెద్దల బ్లాక్ మెయిల్ కు గురిఅవుతూ నానా ఇబ్బందులకు గురి అవుతున్నారు. అమ్ముడు పోండి, లేదా అణగిమణగి ఉండండి అన్నట్లుంది తెరాస వ్యవహారం
హైదరాబాద్ ప్రతిష్ట అంటూ, తెలంగాణ సెంటిమెంటును అడ్డంబెట్టుకొని చడి చప్పుడు గాకుండా దొంగలు దొంగలు దేశాలు పంచుకున్నట్లు దోచుకు తింటాం అంటే, చైతన్యవంతమైన తెలంగాణ సమాజం ఊరుకోదు. నిలదీస్తది, ప్రశ్నిస్తది. ఆ ప్రశ్నే ప్రజాస్వామ్యానికి రక్ష.
తెరాస పెద్దలకు పాలకులకు, ప్రజలకు తేడా తెలియనట్లుంది. ప్రజలు ప్రశ్నిస్తారు, పాలకులు సంమయనంతో సమాధానం చెప్పాలి. కాని అక్కసుతో దాడి చేయడం నేరం. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.
కేటీఆర్ వాఖ్యలు ముమ్మాటికీ పత్రిక స్వేచ్ఛ పై దాడి. బెదిరంపు బ్లాక్ మెయిల్ తో కూడుకున్న ఆధిపత్య రాజకీయాల కొనసాగింపే ! భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాయడమే ! ఇకనైనా ప్రజాస్వామ్యానికి నాల్గొ స్తంభమైన తెలంగాణ మీడియా ఏకం కావాలి. ప్రభుత్వ ఆధిపత్య దురాగతాలను ఎదిరించాలి.
తెలంగాణ సోయి కేవలం తెరాస లో ఉన్న వాళ్లకు మాత్రమే గాదు, ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడికి తెలంగాణ ప్రజాస్వామ్య బద్దం గా బాగుపడాలని కోరుకుందన్న విషయం తెరాస పెద్దలు తెలుసుకోవాలి.
ప్రభుత్వానికి దమ్ముంటే, భూ ఆక్రమణలపై బహిరంగ చర్చకు రండి. సి బి ఐ విచారణ జరిపించండి అధికారులు, కాంగ్రెస్ కు చెందిన వారితో సహా ఏ పార్టీకి చెందిన వారినైనా, ఎంతటి వారినైనా వదిలిపెట్టకండి.
మ్యుటేషన్ కింగ్ లను, జైళ్ళ లో మగ్గిన ఆఫీసర్లను తొలగించండి.
చివరిగా ఎకనామిక్ టైమ్స్ సుకుమార్ రాసింది అబద్దమైతే, జయేష్ రంజన్ రాసిన వివరణ బహిర్గతం చేయండి.
Related Posts
పుట్టుక నిజం చావు నిజం. ఆ మధ్యనున్న బ్రతుకంతా అబద్దం అన్నాడు ఓ కవి. పుట్టుక ఎప్పుడు ఎంత సమయానికి జరుగుతుందో వైద్యులు ఇప్పటికే తేల్చేశారు. అమ్మ కడుపునుండి తిథి, వర్జం, రావుకాలం చూసుకుని మరీ పుడుతున్నారు. మరీ చావో.. దీనికే ...
READ MORE
ఖమ్మం జిల్లాలోని కూనమంచి మండలం పాలేరు రిజర్వాయరు నాయకన్‌గూడెం వద్ద రాజధాని బస్సు వాగులోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి ...
READ MORE
మహిళ సాధికారిత సభకు ఆహ్వనించి అవమానించారని వై.ఎస్.ఆర్.సిపి ఎమ్మేల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులతో అమానుషంగా అరెస్ట్ చేయించారని ఇదేనా మహిళ సాధికారిత అంటూ మండిపడింది. తనపై జరిగిన కుట్రను తనను పోలీస్ లు ఎందుకు అరెస్ట్ చేశారో తెలుపుతో ...
READ MORE
భారత భూభాగమైన కాశ్మీర్ ను కొంతమేర పాకిస్తాన్ ఆక్రమించుకోవడంతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం కారణంగ, భారత్ కు పాకిస్తాన్ కు దశాబ్దాల నుండి వైరం కొనసాగుతోంది. కాగా భారత్ లో నరేంద్ర మోడి సర్కార్ ఏర్పడిన నాటి నుండి పాకిస్తాన్ ...
READ MORE
తెలంగాణ జాగృతి నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రం నిరుద్యోగ యువతకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నది. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్‌తో సహా 15 పట్టణాలలో జులై 4వ తేదీ నుంచి ఆగస్టు 25 వరకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నది. ఉదయం 10-30 గంటల ...
READ MORE
గత శనివారం మన సైనికులను దొంద దెబ్బ తీసి కర్కశత్వం ప్రధర్శించి రాక్షసానందం పొందిన పాకిస్తాన్ సైన్యం పై మనోల్లు అప్పుడే ప్రతీకారం తీర్చుకుంటున్నారు.. మరోసారి మన భారత సైన్యం కన్నెర్ర చేయడంతో పాక్ సైనికులు హడలిపోతున్నారు. ఈ దెబ్బతో మనోల్ల ...
READ MORE
మోడీ సర్కార్ తీసుకొచ్చిన CAA (సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ ఆక్ట్) ను వ్యతిరేకిస్తు భారీ స్థాయిలో ఆందోళనలు చేస్తున్న ప్రతిపక్షాలకు సూపర్ స్టార్ రజనీకాంత్ రూపం లో భారీ షాక్ తగిలింది.ఇప్పటికే దేశవ్యాప్తంగా 75 శాతం జనాలు మద్దతు ఇవ్వడం తో నిరసనలు ...
READ MORE
ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ గత మూడేల్లలో తన క్యాంప్ ఆఫిస్ లో కేవలం చాయ్, స్నాక్స్ కోసం ఎంత ఖర్చు పెట్టాడో తెలిస్తే నిజంగా మైండ్ బ్లాక్ కావాల్సిందే మరి. అక్షరాలా ఒక కోటికి పైగా ఖర్చు ...
READ MORE
గత నెలరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లేనూ వాడీవేడిగా జరుగుతున్న తంతు ఏదైనా ఉందంటే.. అది కంచె ఐలయ్య కు కోమటోల్లకు జరుగుతున్న యుద్ధం అని చెప్పొచ్చు.. ఇంకా ఆ నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నై..
కాగా కంచె ఐలయ్య రాసిన "సామాజిక స్మగ్లర్లు ...
READ MORE
హైద్రాబాద్ లో అధికార పార్టీ తెరాస కార్పోరేటర్ల ఆగడాలు సామాన్య ప్రజలను దాటి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల వరకు వెల్లాయి. కాచిగూడ తెరాస కార్పోరేటర్ ఎక్కల చైతన్య కన్నా భర్త కన్నా యాదవ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు ...
READ MORE
వర్షాకాల సమావేశాల్లో అవిశ్వాస తీర్మానంలో భాగంగా పార్లమెంట్ లో మాట్లాడిన రాహుల్ గాంధీ మరోసారి తన సహజ దోషాలతో సభ నవ్వులకు గురయ్యాడు. తద్వారా ఒక దశలో విచక్షణ కోల్పోయి అసహజంగ ప్రవర్తించాడు. అంతే కాదు సభ గౌరవాన్ని కించపరిచేలా వికృత ...
READ MORE
కలియుగ ప్రత్యక్ష దైవం గ పూజలందుకునే వేంకటేశ్నరుడు కొలువై ఉన్న తిరుమల ఆస్థానంలో రోజు రోజుకు అపచారాలు బయటపడుతూనే ఉన్నై..
మొన్నటికి మొన్న టీటీడీ లో ఉన్నత స్థాయి లో ఉద్యోగం చేస్తూ హిందువుల సొమ్మును నెల నెల జీతంగ తింటూ ...
READ MORE
2019 లోకసభ ఎన్నకల్లో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన స్థానం నిజామాబాద్ లోకసభ నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ పసుపు బోర్డ్ ఏర్పాటు కోసం అంతకు ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత ను ఎంపీ గ గెలిపించారు ఇక్కడి ప్రజలు. ...
READ MORE
దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని తొమ్మిది రోజులు అత్యంత నిష్ఠాగ పూజించనున్నారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారి ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో ఒక్కో మహ రూపంగా కొలుస్తారు. ఆ విశేషాలేంటి అమ్మవారిని ఏ రోజు ఎలా ఆరాదించాలి.. పూజ కార్యక్రమాలు ...
READ MORE
గత రెండు నెలలుగా భూటాన్ - భారత్ డోక్లాం సరిహద్దు వద్ద చైనా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అందుకు ఏమాత్రం తీసిపోకుండా ఢీ అంటే ఢీ అని గట్టిగా నిలబడింది భారత సైన్యం. చైనా సైనికులు రాల్లతో దాడి ...
READ MORE
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవితంపై సినిమా రాబోతోంది.మన్మోమన్ సింగ్ పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ పోషించబోతున్నారు. ఆయన హయాంలోని జరిగిన అక్రమాలను.. మౌనం వహించిన తీరుని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఈ చిత్ర విషయాన్ని అనుపమ్ ...
READ MORE
2019 లో ఎలాగైన భాజపాను ఓడించి మోడీ మరోసారి ప్రధాన మంత్రి కాకుండ చేయాలనే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నై.
తాజాగా భాజపా కు మోడీకి బద్ద శత్రువైన ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
యుగానికి ఆది ఉగాది. ప్రకృతిలో మార్పు కారణంగా వచ్చే తొట్టి తొలి పండుగ. తెలుగు వారంతా గొప్పగా జరుపుకునే పండుగ. మనస్సు అన్ని కర్మలకు మూలమని గ్రహించిన తెలుగువారు ఆ మనసుకు అదిపతి అయిన చాంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించి దాని ఆధారంగా ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొరడా జులిపించింది. ఇన్నాళ్లు ఎంత రచ్చ చేసినా ఎన్ని దూశనలు చేసినా చూసి చూడనట్టు వదిలేసిన ప్రభుత్వం ఒక్కసారిగా ప్రతాపం చూపించింది. పక్కా ఆధారాలతో సహా ఐటీ సాయంతో నిదింతులను అరెస్ట్ చేసింది. అయితే అరెస్ట్ అయిన నిదింతుడు ...
READ MORE
మరోసారి ప్రపంచ బ్యాంకు మన ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికెత్తేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన దేశం 130 స్థానం నుండి ఏకంగ 100 వ ర్యాంకు ను సాధించడం తాజాగా అంతర్జాతీయంగ చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలో వరల్డ్ ...
READ MORE
తలనొప్పి, దగ్గు, దమ్ము, తుమ్ములు, జ్వరం, కాళ్ల నొప్పి, కీళ్ల నొప్పి ఇలా చిన్న చిన్నవాటికే మెడికల్ కి పరుగులు తీస్తుంటామ్. అక్కడ అనుభవం లేని ఓ వ్యక్తి ఈ గోలీ మింగెయ్ గంటలో తగ్గిపోద్దని సలహ ఇస్తాడు. డాక్టర్ సలహా ...
READ MORE
గత కొంత కాలంగ టాలీవుడ్ తెలుగు హీరోయిన్ శ్రీ రెడ్డి ఇండస్ట్రీలోని పెద్దలపై ఆరోపనలు చేస్తూ.. టాలీవుడ్ లో" క్యాస్ట్ కౌచింగ్" కల్చర్ చాలా ఉందనీ.. హీరోయిన్లని శారీరకంగ వాడుకోకుండా అవకాశాలు ఇవ్వరనీ అయినా.. తెగించి భరించినప్పటికీ అవకాశాలు ఇవ్వడం లేదనీ.. ...
READ MORE
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతలంతా గులాబీ గూటికి చేరిపోగా ఇప్పుడు తన వంతుగా జిల్లాలో టీడీపీ పెద్ద దిక్కుగా ఉన్న పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ ఈ ...
READ MORE
ఏప్రిల్ 1 నుంచి బీఎస్ 3 వాహనాలను అమ్మకూడదు. రిజిస్టేషన్లు కూడా నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. దీంతో ఉన్నపళంగా టూ వీలర్ కంపెనీలు బీఎస్ 3 వాహనాలపై భారీ డిస్కౌంట్ ప్రకటించారు. గడువు కూడా మార్చి 31 అంటూ ఒకే ...
READ MORE
వైద్య సిబ్బంది అంటే డాక్టర్ల తర్వాత గుర్తొచ్చేది నర్స్. ఒక ప్రాణం నిలబడాలంటే డాక్టర్ ఉండాల్సిందే కానీ ఆ డాక్టర్ పక్కన నర్స్ నిలబడకుంటే మాత్రం ఏ ప్రాణం కూడా బతకదు. సమాజం తో అంతలా ప్రాధాన్యత సంతరించుకున్న పవిత్రమైన వృత్తి ...
READ MORE
డెత్ టైమ్ చెప్తామంటున్న శాస్త్రవేత్తలు.
వాగులోకి దూసుకెళ్లిన రాజదాని.. 15 మందికి తీవ్ర గాయాలు.
సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే రోజా
కల నుండి వాస్తవంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్..!!
నిరుద్యోగులకు సదావకాశం.. జులై4 నుంచి తెలంగాణ జాగృతి జాబ్ మేళా.
పాక్ సైనికులను ఉరికించి ఉరికించి వేటాడుతున్న భారత సేన.!!
CAA వ్యతిరేకులకు భారీ షాక్.. చట్టాన్ని సమర్ధించిన తలైవ.!!
ఢిల్లీ CM అరవింద్ కేజ్రివాల్ చాయ్, స్నాక్స్ ఖర్చు తెలిస్తే
GHMC ఉద్యోగినిపై దాడి చేసిన తెరాస కార్పోరేటర్ భర్త.!
రాహుల్ గాంధీ ఈరోజు పార్లమెంట్ సాక్షిగ తన వికృత ప్రవర్తనని
కలియుగాన్ని కాపాడుతున్న వెంకన్న స్వామి వైభవానికే మచ్చ తెస్తున్న TTD
కల్వకుంట్ల కవిత 5 ఏండ్లలో సాధించలేనిది, అర్వింద్ 8 నెలల్లో
దేవీ శరన్నవరాత్రులు అమ్మవారి పూజ విశేషాలు.
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా
సైలంట్ పీఎం పై సినిమా.. కాంగ్రెస్, సోనియా, రాహుల్ గాంధీలే
భాజపా వ్యతిరేక కూటిమిలో చేరడం మాకిష్టం లేదు. దేశాభివృద్ధి లో
ఉగాది విశిష్టత ఏంటి..? ఉగాది పండుగను ఎలా జరుపుకుంటే ఉత్తమం..?
సోషల్ మీడియా ఉంది కదా అని రెచ్చిపోతే కటకటాలే..? మరీ
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మంచి ర్యాంకును పొందడం
నిత్యం వాడే ఆ మందులు నకిలీవంటా.. నిర్ధారించిన సెంట్రల్ డ్రగ్స్
సినీ ఇండస్ట్రీలో ఙరుగుతున్న వాస్తవాలను చెప్తే.. కేసులు పెడతారా.??
ఆదిలాబాద్ లో తెలుగు దేశం ఖేల్ కథమ్.. టీడీపీకి రాథోడ్
బీఎస్ – 3 అంటే ఏంటి..? సుప్రీం కోర్టు ఇప్పుడు
జీతం తక్కువే అయినా వృత్తి కోసం జీవితం అర్పించే నర్స్