
ఓ ప్రముఖ ఛానల్ హస్యం అంటూ అడ్డ మైన బూతులతో ఓ ప్రోగ్రాం ను ప్రారంభించింది.. యావత్ ప్రపంచం ఇదే ప్రోగ్రాం ని గుడ్లప్పగించుకుని చూస్తోంది. న భూతే న భవిష్యత్ అంటూ దూసుకుపోతున్న ఈ ప్రోగ్రాం అమ్మనాన్న అక్క చెల్లి తో కలిసి చూసేందుకు అసలు అవకాశం లేకుండా ఉన్నా.. యువత మాత్రం ఎగబడి మరీ ఈ ప్రోగ్రాం కు అటెండ్ అవుతుంది. ఇక్కడ తప్పు ఎవరిదో మీరే చెప్పాలి. నీతి వంతమైన ప్రజాస్వామ్యంలో ప్రతి వృత్తిని అపహాస్యం చేస్తుంటే పగలపడి నవ్వుతోంది. ఈ కథంత ఏ చెత్త ప్రోగ్రాం గురించో ఆ చెత్తను రోజు చూస్తున్న మీకు తెలియంది కాకపోవచ్చు.
అవును మేం చెపుతుంది.. ఈ టీవి ఫ్లస్ పటాస్ షో గురించే. ఈ కార్యక్రమంలో ఈ మధ్య ప్రసారం అయిన ఓ స్కిట్ లో నర్సింగ్ వృత్తిని అపహస్యం చేస్తూ కుల్లు జోకులతో విరుచుకు పడింది. ఇక అందులో ఆ జోకులు వేసిన అడ్డగాడిద తన స్కిట్ ద్వార ఒకరి మనోభావాలను దెబ్బ తీశానని తెలిసినా స్వారీ చెప్పేందుకు కూడా నోరు రాలేదు. ఇక్కడి వరకు బాగానే ఉంది.
తమను కించపరిచేలా స్కిట్ వేశారని వెంటనే క్షమాపణ చెప్పాలని తెలంగాణ నర్సింగ్ అసోసియేషన్ తరుపున ఓ అమ్మాయి ముందుకు వచ్చింది. అయిన పటాస్ యాజమాన్యం నుండి స్పందన నిల్. తప్పని పరిస్థితిల్లో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఈ నెల 6 తేదీన ఎల్బీ నగర్ పీస్ లో ఫిర్యాదు చేసింది. ఇక ఈ వార్త తెలుసుకున్న మీడియా తన దారిలో తాను న్యూస్ వేసి వదిలేసింది. కానీ సమస్య వచ్చిందల్లా సోషల్ మీడియా సైట్ల నుండే… కొన్ని బూతు సైట్లు సదరు నర్స్ ఫోటోను చూపిస్తు పటాస్ షో పై రెచ్చిపోయిన యువతి… శ్రీముఖి ని చెప్పు తీసుకుని కొడుతా అన్న యువతి.. రవి శ్రీముఖిల పటాస్ షోలో మధ్యలో దూరి ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా అంటూ ఇష్టం వచ్చినట్టు రాసుకున్నాయి. పాపం అసలు విషయం తెలియని నర్సింగ్ అసోసియేషన్ సభ్యురాలు తన కేసు నమోదు చేసిన వివరాలు ప్రతి ఒక్కరితో షేర్ చేసుకుంది.
అయితే అడ్టమైన రాతలతో చెత్త రాతలు రాసి… ఆ అమ్మాయిపై పిచ్చి కుక్కల్లా అభిమానం పేరుతో లుచ్చగాళ్లు ఫోన్ లతో వేధించేందుకు కారణం అయ్యాయి బూతు సైట్లు. ఇక కేసు పెట్టిన స్టేషన్లో పోలీసుల తీరు కూడా అంతే.. మాకు న్యాయం జరిగేలా చూడండి అంటూ ఎంత వేడుకున్నా అసలు ఇది కేసే కాదు.. మా పరిదిలోకి రాదంటూ డొంక తిరుగుడు సమాధానాలు ఇచ్చారు అక్కడి పోలీసులు. షో ఎక్కడ జరిగిందో అక్కడే కంప్లెయింట్ ఇవ్వండి మాకు సంబంధం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఒక యువతి ధైర్యంగా ముందుకు వచ్చి అన్యాయాన్ని నిలదీస్తుంటే కొన్ని వెబ్ సైట్లు తప్ప అసలు మీడియాలోని ఏ వర్గం కూడా పట్టించుకున్న పాపన పోలేదు.
ఇక ఫిర్యాదు ఇచ్చిన నాలుగవ రోజు నుండి ఆ అమ్మాయికి రాంగ్ కాల్స్ రావడం మొదలయ్యాయి. మొదట్లో నేను కామెడియన్ అభిమానిని కేసు వాపస్ తీసుకొండి అంటూ వచ్చిన కాల్స్ ఆరో రోజు నుండి శ్రీముఖి లవర్ మీదకి మారిపోయాయి. ఒక అక్క చెల్లి అమ్మకు విలువను ఇవ్వాలేని అడ్ట గాడిదలు సదరు యువతిని అసభ్య పదజాలంతో తిడుతూ చాలా ఇబ్బందులకు గురి చేశారు. అర్థరాత్రులు కాల్ చేయడం నానా మాటలతో తిట్టడం… కేసు వెనక్కి తీసుకోకపోతే చంపేస్తానంటూ బెదిరించడం… గత మూడు రోజులుగా ఆ అమ్మాయికి తలెత్తిన ఇబ్బందులు అన్ని ఇన్ని కావు.
ఈ సంధర్బంలో తనకు అండగా నిలిచింది నర్సింగ్ అసోసియేషన్… వెంటనే సనత్ నగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది ఆ అమ్మాయి. కేసు నమోదు చేసుకుని కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు నిందితుడి పై ఐపీసీ 359, 506 కింద కేసు నమోదు చేశారు. ఒక ఆడపిల్ల తన వాళ్ల మీద అసభ్యంగా మాట్లాడారని ధైర్యంగా ముందుకు వచ్చి పోరాడుతుంటే కనీస బాద్యతతో ఇక సమాజం అండంగా నిలవడం లేదు. తను ధైర్యం చేసి ఇంత రచ్చను ఎదుర్కుంటూ సాయంకోసం ఇదే విషయాన్ని కొందరు మీడియా వర్గాలకు చెప్పిన విని విననట్టు వదిలేశారని వాపోతుంది ఆ అమ్మాయి. ఇరవై రోజులు గడిచినా ఇప్పటికి పటాస్ యాజమాన్యం కనీసం బాధ్యతగా క్షమాపణ కూడా కోరలేదు. ఇది మన నీతి. రేపు ఇదే సమాజం రోగం రొప్పి వచ్చి మంచాన పటితే మళ్లీ సేవ చేసేది నర్సింగ్ మాతృమూర్తులే అని కనీసం ధర్మాన్ని కూడా గుర్తెరగపోవడం బాధకరం.
























