You are here
Home > తాజా వార్త‌లు > జిల్లాలు పెంచి నేటికి ఏడాదీ.! పాలనను మాత్రం గాలికొదిలేసిన టిసర్కార్.!!

జిల్లాలు పెంచి నేటికి ఏడాదీ.! పాలనను మాత్రం గాలికొదిలేసిన టిసర్కార్.!!

ఎంతో అట్టహాసంగా ఆర్భాటంగ పది జిల్లాలను 31 జిల్లాలుగా విభజించి ఇక పరిపాలన అంటే ఏందో సూపిస్తం అని తొడలు కొట్టింది తెలంగాణ సర్కార్.. ఆ తంతు ముగించి గిట్ల నేటికి ఏడాది, కానీ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది, దీనికి తోడు పాత పది జిల్లాలకు రెండు జోన్లుండేవీ.. ఆ జోన్లను బట్టే ఉద్యోగ నోటిఫికేషన్లుండేవీ ఇక ఇప్పుడు 31 జిల్లాలుగ విభజించాక ఏ ప్రాంతాన్ని ఏ జోన్ కింద విభజించాలో అనే మీమాంసలో పడిపోయింది టిసర్కార్.. జిల్లాల పునర్విభజన తర్వాత నిరుద్యోగ సమస్య మరింతగా పెరిగిపోయింది. ఆఖరికి ఉద్యోగ నోటిఫికేషన్లకేం తొందరుంది అని సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులే మీడియా ముందు చెప్పిండ్రంటే విషయం అర్థం చేసుకోవాలి. అధికార పార్టీ నాయకులు తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో అడుగు పెట్టలేని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ ఉద్యోగాల విషయం ఇలా ఉంటే.. ఇంత వరకు పూర్తిగా పట్టాలెక్కలేని పరిస్థితి కొత్త జిల్లాలది. ఇక కొత్తగా మార్పులు చేర్పులు చేసిన మండలాల్లోనూ.. రెవెన్యూ డివిజన్లోనూ పూర్తిస్థాయి పాలన గాడిన పడలేదు. దీనికి తోడు ఇంకా ఆయా ప్రాంతాల్లో కొత్త జిల్లాలు కొత్త రెవెన్యూ మండలాల డిమాండ్ కోసం ఉద్యమాలు కొనసాగుతూనే ఉండగా మరోవైపు ఈ జిల్లాలు మాకొద్దు వీటి వల్ల మాకు ఒరిగిందేమీ లేదనే వారూ పెరుగుతున్నారు. ఏదో హడావుడిగా వారికి నచ్చినట్టు పది జిల్లాలను 31 ముక్కలుగా విభజించారు కానీ ఆ 31 జిల్లాలకు పర్మినెంట్ జిల్లా ఆఫీసులను జిల్లా స్థాయి అధికారులను కేటాయించాలన్న విషయాన్ని మాత్రం విస్మరించింది తెలంగాణ సర్కార్.
ఏ ఒక్క జిల్లాలోనూ సరైన ఆఫీసులకు.. ఆఫీసర్లకు దిక్కు దివాన కరువైంది.

నగరం నడిబొడ్డు నుండి మారుమూల పల్లెదాక.. అసెంబ్లీ నుండి అడవి మన్యం దాకా పాలనలో ఘననీయమైన మార్పులతో అభివృద్ధి ని ఫ్లెక్సిబుల్ చేసి వేగవంతం చేస్తున్నం అని, రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ అభివృద్ధి బాట పట్టిస్తం అని డబ్బా కొట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆఖరికొస్తే.. అన్ని విషయాల్లో ఘోరంగ విఫలం అయిపోయి తీవ్ర విమర్శలపాలైతున్నది.
మరోపక్క ఆ ఉన్న అధికారులకు ఆయా జిల్లాలలో రూలింగ్ పార్టీ ఎంఎల్ఏలకూ లీడర్లకు మధ్య అస్సలు పొసగక జరగాల్సిన చిన్న చితకా పనులుకూడా జరగడంలేదు.

సరే జిల్లాలను ఏర్పాటు చేసి ఏడాదైనా పాలనను గాడిలో పెట్టలేదు ఇకనైనా పడుతుంది అనుకుంటే అది అత్యాశే అవుతదేమో..??
ఉన్న ఐదేండ్లలో మిగిలిన పుణ్య కాలం కేవలం సంవత్సరం నర, ఇప్పటికే 2019 ఎన్నికల వ్యూహాలు మొదలైనై.. ఇంకో నాలుగు నెలలైతే ప్రత్యక్ష ఎన్నికల వేడి మొదలవుతది, ఆ సమయంలో జిల్లాలను పట్టించుకునే నాధుడు ఉంటడా..?? ఇదే అరకొర ఏర్పాట్లతో కొద్దిమంది అధికారులతో మరో సంవత్సరమో రెండేల్లో పాలన కొనసాగితే గనక జిల్లాలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగ ప్రజలకు దూరమయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పటికే.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు కావాల్సింది జిల్లాలు కాదు అభివృద్ధి, సంక్షేమ పథకాలు, నీతివంతమైన పాలన అంతే కానీ.. పిలుచుకోవడానికి మాత్రమే ఉపయోగపడే జిల్లాలు మాకెందుకని అంటున్నారు సామాన్య జనాలు. 31 జిల్లాలు ఏర్పాటు చేస్తే అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి అందరికీ అడవుల్లో ఉండే ఆదివాసులకు కూడా అభివృద్ధి ఫలాలు అందుతై అనుకుంటే.. కేవలం రాజకీయ లబ్దికోసం ఏర్పాటు చేసి గాలికొదిలేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.

ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు రాష్ట్ర సర్కార్. పేదలకు డబుల్ బెడ్రూం అన్నారు అది కేవలం పేపర్లో ఫోటోలకే పరిమితం కాగా దళితులకు ముఖ్యమంత్రి పదవి దేవుడెరుగు మూడెకరాల భూమీ పథకం అయితే కేవలం ప్రచార ఆర్భాటమే అయింది. వీటన్నింటికీ జిల్లాలలో అధికార పార్టీ నాయకులు, ఎంఎల్ఏలు,ఎంఎల్సీలు మంత్రులు సాగిస్తున్న అరాచకాలు దౌర్జన్యాలు అదనం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో అడవి బిడ్డలను బట్టలిప్పి చెట్టుకు కట్టేసి కొట్టడాలు, నేరెల్లలో దళితుల పై రాక్షసకాండ, ఖమ్మం మిర్చి రైతుల చేతులకు బేడీలు, గతి తప్పిన రాజధాని వ్యవస్థ, ఉద్యమకారులపై చీత్కారాలు ఉద్యమ ద్రోహులకు తాయిలాలు.. ఇవన్నీ గాడి తప్పిన పాలనకు పరాకాష్టగా మిగిలాయి.
సెంటిమెంట్ ముసుగులో కుటుంబ పాలన సాగిస్తున్న అధికార పార్టీని 2019 లో ప్రజలు ఎంత వరకు స్వీకరిస్తారో చూడాలి మరి. 

Related Posts
సీ సీ కెమెరాకు చిక్కిన గుజరాత్ హార్దిక్ పటేల్ యవ్వారం.?
గుజరాత్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరణంలో రోజుకో సెన్సేషనల్ న్యూస్ బయటకొస్తుంది. తాజాగా గుజరాత్ లో పటేల్ కులస్తులకు రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తూ.. పటేల్ వర్గానికి నాయకుడైన హార్దిక్ పటేల్ సంబంధించి ఓ సీసీ టీవీ కెమెరా ఫుటేజ్ ఒకటి ఒక రేంజ్ ...
READ MORE
నిర్భయ దోషులకు మూసుకుపోయిన దారులు.. మార్చి 3న ఉరి ఖాయం.!!
భారత న్యాయ వ్యవస్థ లో దోషులు ఎన్ని రకాలుగా తప్పించుకోవచ్చు అనేది నిర్భయ దోషులు రుజువుచేసారు.వంద మంది దోషులు తప్పించుకున్నా సరే ఒక్క నిర్దోషి అన్యాయం కావద్దని నమ్మే మన న్యాయ వ్యవస్థ లో ని సహజ లోపాలను ఉపయోగించుకుంటూ ఇంతకాలం ...
READ MORE
‘యోగ’మేరా జీవితం.. భోగభాగ్యాల ఆరోగ్యం.
మనిషికి ఎన్ని సిర సంపదలున్నా ఆరోగ్యం లేకపోతే అవన్నీ వృధాయే.. అందుకే మన పెద్దలు ‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అన్నారు.. ఇందుకోసం ఎలాంటి మందులు అవసరం లేకుండా చక్కని పరిష్కారం చూపించారు పతంజలి మహర్షి.. యోగ సాధన ద్వారా ఆరోగ్యంతో పాటు ...
READ MORE
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన చిలుకూరి దేవాలయ ప్రధాన అర్చకులు.
ఆంగ్ల సంవత్సరం వేడుకలపై తీవ్రంగ స్పందించారు ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చిలుకూరి శ్రీ బాలాజి దేవాలయం ప్రధాన అర్చకులు సౌందర్ రంగరాజన్. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. మరో నాలుగు రోజుల్లో ...
READ MORE
పాక్ కోడలు సానియా మీర్జా ను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గ తొలగించాలంటూ నెటిజన్ల డిమాండ్.!!
టెన్నిస్ క్రీడాకారిని సానియా మీర్జా పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆమెను తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ గ నియమించిన ముఖ్యమంత్రి కేసిఆర్ కు వెంటనే ఆమెను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గ తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. పుల్వామా లో మన సైన్యం పై ...
READ MORE
అనాలోచితంతో అడ్డంగ బుక్కైపోయిన రాహుల్ గాంధీ.!!
కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి బుక్కైపోయాడు.! ఆ.. ఇదేం కొత్తేం కాదు కదా.. అంటారేమో ఈసారి ఆయన చేసుకున్న అపరాదం తెలిస్తే ముక్కున వేలేసుకోవాలి మరి.!! గుజరాత్ లో హిందువుల ఓటు బ్యాంకు చాలా బలీయమైనది, ఆ ఓటు బ్యాంకు ...
READ MORE
ఉస్మానియ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి రాక.. రాజదానిలో ట్రాపిక్ ఆంక్షలు..
ఉద్యమాల గడ్డ ఉస్మానియా శతవసంత వేడుకలకు హజరయ్యేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి రేపు బుధవారం హైదరబాద్ రానున్నారు. రాష్ట్రపతి హైదరా బాద్ పర్యటన సందర్భంగా హైదరబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి. ...
READ MORE
వ్యభిచార గృహం పై దాడి ఇద్దరు జబర్దస్త్ షో నటులు అరెస్ట్.!!
విశాఖపట్నం లో మాధవ దారి లో ఓ ఇంట్లో వ్యభిచారం గుట్టుగా సాగుతుందని పక్కా సమాచారంతో పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టగా.. వ్యభిచార గృహ నిర్వాహకులు విటులు కలిపి మొత్తం ఏడుగురు వ్యక్తులు పట్టుబడటం జరిగింది.ఇందులో ఈటీవీ లో ప్రసారం అయ్యే ...
READ MORE
మోడీ, తొగాడియా మధ్య అసలేం జరుగుతోంది.? వీరి మధ్యలోకి కాంగ్రెస్ ఎందుకు దూరింది.??
ప్రధాని నరేంద్ర మోడి, వీహెచ్పీ అధ్యక్షులు ప్రవీన్ భాయ్ తొగాడియా వీరిద్దరూ ఆర్ఎస్ఎస్ నుండి జాతీయ స్థాయికి ఎదిగినవారే.. ఇద్దరిదీ ఒకటే సిద్దాంతం.. జాతీయవాద సిద్దాంతం. కానీ వ్యక్తిగతంగ వీరిద్దరి మధ్యన విభేధాలు గత కొన్నేండ్లుగ కొనసాగుతూ ఉన్నై. 2014 లో ప్రధాని ...
READ MORE
చివరికి అవి కూడా వదల్లేదు. కారులో వచ్చి కండోమ్‌లు ఎత్తుకెళ్లిన దొంగ.
ఛీ తూ ఎవడండి ఈ ఛీప్ ఛీపేల్ తుఫేల్ దొంగా. చివరికి వాటిని కూడా వదల్లేదా అని అనుకుంటున్నారు కదూ. ఇంకా వీటిని దొంగిలించడానికి దర్జాగా కారులో వచ్చాడా.. వీడికి పిండా కూడు పెట్టా. అంతగా ఉంటే కొనుక్కోవొచ్చుగా.. ఫ్రీగా కూడా ...
READ MORE
యాజమాన్యాల పైసల కక్కుర్తి అధికారుల నిర్లక్ష్యం పరీక్షకు దూరమైన విధ్యార్థులు.
నిన్న మొదలైన పదవ తరగతి పరీక్షల్లో కొందరు విద్యార్థులు పరీక్ష రాసే అవకాశాన్ని అర్థాంతరంగ కోల్పోయారు. ఇప్పుడు వారి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగ మారింది. రోజు రోజుకు విద్యారంగాన్ని దిగజార్చుతున్నారు కొందరు దుర్మార్గులు. పైసలకు కక్కుర్తి పడి పవిత్రమైన విద్యా రంగాన్ని వ్యాపారీకరణ ...
READ MORE
నేతలంతా ఓట్ల వేటలో మునిగితే.. మోడీ ఏం చేస్తున్నారో తెలుసా.!!
నరేంద్ర మోడి తనదైన శైలి యొక్క ప్రత్యేకతని మరోసారి చాటుకున్నాడు. గల్లీ నుండి ఢిల్లీ దాక చిన్నా చితకా నేతల నుండి జాతీయ నాయకుల వరకు మొత్తం ఆయా వర్గాలు కులాలు మతాల చుట్టూ తిరుగుతూ ఓట్లను అడుక్కునే పనిలో ఉంటే.. ...
READ MORE
అమ్మాయిల తల్లిదండ్రులూ.. తస్మాత్ జాగ్రత్త.. దుర్మార్గులు మీ చుట్టే ఉండొచ్చు..!!
ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా ఎన్ని షీ టీం లు పెట్టినా దుర్మార్గుల బారి నుండి అమ్మాయిలను రక్షించడం కష్టంగ మారుతోంది.తాజాగా తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం హజీపూర్ గ్రామం లో వెలుగు చూసిన ఘటనలే మరో ...
READ MORE
4548 మంది వైద్యులపై చర్యలు తీసుకున్న మహారాష్ట్ర ఫడ్నవిస్ సర్కార్.!
వైద్య విద్య పూర్తైన తర్వాత ఖచ్చితంగ సంవత్సరం పాటు గ్రామీన ప్రాంతాల్లో సర్విస్ చేయాలనే నిబంధనలను తుంగలో తొక్కి డాక్టర్ డిగ్రీ సర్టిఫికెట్ పొందిన 4548 మంది వైద్యుల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది మహారాష్ట్ర సర్కార్. ఈ చర్య దేశ వైద్య ...
READ MORE
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ఫలితాలు విడుదల.!!
తెలుగు చలనచిత్ర రంగం టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఎన్నికలు జరగగా ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి.ఈసారి పోటీలో శివాజీ రాజా ప్యానెల్ మరియు నరేష్ ప్యానెల్ పోటీ పడగా, శివాజీ రాజా ప్యానెల్ పై నరేష్ ప్యానెల్ విజయం సాధించింది.ఈ ...
READ MORE
బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదంతో ఉబ్బసం తగ్గేనా..??
బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదంతో ఉబ్బసం తగ్గేనా..?? ఈ ప్రశ్న ఇప్పటిది కాదు మృగశిర కార్తె వస్తుంంటే చాలు పలు అనుమానాలు, ఎన్నో రకాల ప్రశ్నలు. అసలు బత్తిని చేప ప్రసాదం ఉబ్బసానికి పనిచేస్తుందా.. లేక అందరిని మాయ చేస్తున్నార.. ...
READ MORE
చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న డ్రాగన్ కంట్రీ, చైనాలో తీవ్ర ఆహార కొరత.!!
ప్లాస్టిక్ ఉత్పత్తులు మొబైల్ ఫోన్ల ఉత్పత్తుల్లో గణనీయమైన ప్రగతి సాధించిన కమ్యునిస్టు దేశం చైనా.. ఆహారం విషయం లో మాత్రం దాదాపు నలభై శాతం వరకు ఇతర దేశాల మీదనే ఆధారపడింది. అయితే, మోసపూరిత బుద్ది వల్ల చైనా కు అందించే ఎగుమతులపై ...
READ MORE
ఈ టీడీపీ నాయకుడికి జయంతికి వర్థంతికి తేడా తెల్వదు కానీ ఎంపీ అయిండు మరి.!!
టీడీపీ లో నేతలు ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు.. ఎందులో అనుకుంటున్నారు ఏదో గొప్ప గొప్ప విషయంలో అనుకుంటే పొరపాటే.. జనాలంతా టీడీపీ అంటే నవ్వుకునేట్టు చేయడంలో మరీ..!! నేడు రాజ్యంగ నిర్మాత భారత రత్న డా.భీం రావ్ రాంజీ ...
READ MORE
డ్రగ్స్ కేసులోకి నాగబాబు.. ఆ పోటోలో ఉన్నది కెల్విన్ కాదు నేనే.
మీడియా మరో సారి పప్పు తప్పులో కాలేసిందా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి.  డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్ 'ఫోటో' వివాదాస్పదమవుతోంది. పూరి - ఛార్మి  మధ్యలో కెల్విన్ అని కథనాలు కూడా గుప్పుమన్నాయి. అయితే ఆ కథనాల్లో ...
READ MORE
మా బాధలు వినండి సారు… అంటూ.. నర్సింగ్ ఆఫీసర్స్ ప్రకటన.
నర్సింగ్ లో పడుతున్న కష్టాలను తెలంగాణ సర్కార్ గుర్తించడం లేదని ఎన్ని సేవలు చేసిన తమ సేవంత బూడిదలో పోసిన పన్నీరవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరంత మా కష్టాలు చూడాలంటూ పత్రికా ప్రకటనను విడుదల చేశారు నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ...
READ MORE
నరనరాల్లోకి పాకేస్తున్న ప్లాస్టిక్ భూతం.. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించే పద్దతులివే.
కల్తీ కల్తీ కల్తీ.. ఉగ్గు పాల నుండి చివరి నిమిషంలో తాగించే తులసి నీళ్ల దాక కల్తీనే. ఉప్పు కల్తి, పప్పు కల్తి, ఆవాలు, జిలకర, మెంతులు, పసుపు, అల్లం ఇలా ఒక్కటేమిటి తాగే పాలు, నీళ్లు చివరికి తినే తిండి ...
READ MORE
తెలంగాణలో మిత్రపక్షాన్ని ఖాళీ చేయిస్తున్న బీజేపీ.. కమలం గూటికి టీటీడీపీ ఎమ్ఎల్ఏ బీసీ నేత ఆర్ క్రిష్ణయ్య.
బీసీ సంఘం జాతీయ అద్యక్షుడు తెలంగాణ టీడీపీ ఎమ్ఎల్ఏ ఆర్ క్రిష్ణయ్య బీజేపీలోకి చేరుతున్నాడా..? తెలంగాణలో మిత్రపక్షానికే గాలంవేసి ఖాళీ చేసే దిశలో బీజేపీ సాగుతుందా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి దాక రేవంత్ రెడ్డి చేరిక తప్పదని ...
READ MORE
మారుతిరావు కు బేయిల్ మంజూరు, స్వాగతం పలుకుతున్న సోషల్ మీడియా.!!
గత ఏడాది సెప్టెంబర్ లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో జరిగిన ప్రణయ్ అనే యువకుడిని బహరంగంగ నరికి చంపిన కేసులో అరెస్టైన మారుతిరావు కు మరియు అతని సోదరుడు శ్రవన్ కుమార్, మరో నిందుతుడు కరీం లకు హైకోర్ట్ మధ్యంతర ...
READ MORE
చీర్యాల నరసింహుడి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ని ఆహ్వానించిన ఆలయ చైర్మణ్.!!
తెలంగాణ ప్రముఖ ఆలయం చీర్యాల శ్రీశ్రీశ్రీ లక్ష్మి నృసింహ స్వామి దేవాలయంలో ఈ నెల 09 తేదీ నుండి 14 వ తేదీ వరకు జరగనున్న స్వామి వారి బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని కలిసి ...
READ MORE
తెలంగాణ లో బీజేపీ నీ పట్టాలెక్కించిన డా.కే.లక్ష్మన్.!!
(నేడు తెలంగాణ బీజేపీ పూర్వ అధ్యక్షులు డా.కే.లక్ష్మన్ జన్మదినం సందర్భంగా జర్నలిజం పవర్ ప్రత్యేకం) తెలంగాణ లో అధికార పార్టీ టీఆర్ఎస్ కు ధీటుగా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ నే అనేలా రాష్ట్రం లో బీజేపీ తన దూకుడు కొనసాగిస్తున్నది. అయితే ...
READ MORE
సీ సీ కెమెరాకు చిక్కిన గుజరాత్ హార్దిక్ పటేల్ యవ్వారం.?
నిర్భయ దోషులకు మూసుకుపోయిన దారులు.. మార్చి 3న ఉరి ఖాయం.!!
‘యోగ’మేరా జీవితం.. భోగభాగ్యాల ఆరోగ్యం.
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన చిలుకూరి
పాక్ కోడలు సానియా మీర్జా ను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్
అనాలోచితంతో అడ్డంగ బుక్కైపోయిన రాహుల్ గాంధీ.!!
ఉస్మానియ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి రాక.. రాజదానిలో ట్రాపిక్ ఆంక్షలు..
వ్యభిచార గృహం పై దాడి ఇద్దరు జబర్దస్త్ షో నటులు
మోడీ, తొగాడియా మధ్య అసలేం జరుగుతోంది.? వీరి మధ్యలోకి కాంగ్రెస్
చివరికి అవి కూడా వదల్లేదు. కారులో వచ్చి కండోమ్‌లు ఎత్తుకెళ్లిన
యాజమాన్యాల పైసల కక్కుర్తి అధికారుల నిర్లక్ష్యం పరీక్షకు దూరమైన విధ్యార్థులు.
నేతలంతా ఓట్ల వేటలో మునిగితే.. మోడీ ఏం చేస్తున్నారో తెలుసా.!!
అమ్మాయిల తల్లిదండ్రులూ.. తస్మాత్ జాగ్రత్త.. దుర్మార్గులు మీ చుట్టే ఉండొచ్చు..!!
4548 మంది వైద్యులపై చర్యలు తీసుకున్న మహారాష్ట్ర ఫడ్నవిస్ సర్కార్.!
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ఫలితాలు విడుదల.!!
బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదంతో ఉబ్బసం తగ్గేనా..??
చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న డ్రాగన్ కంట్రీ, చైనాలో తీవ్ర
ఈ టీడీపీ నాయకుడికి జయంతికి వర్థంతికి తేడా తెల్వదు కానీ
డ్రగ్స్ కేసులోకి నాగబాబు.. ఆ పోటోలో ఉన్నది కెల్విన్ కాదు
మా బాధలు వినండి సారు… అంటూ.. నర్సింగ్ ఆఫీసర్స్ ప్రకటన.
నరనరాల్లోకి పాకేస్తున్న ప్లాస్టిక్ భూతం.. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించే పద్దతులివే.
తెలంగాణలో మిత్రపక్షాన్ని ఖాళీ చేయిస్తున్న బీజేపీ.. కమలం గూటికి టీటీడీపీ
మారుతిరావు కు బేయిల్ మంజూరు, స్వాగతం పలుకుతున్న సోషల్ మీడియా.!!
చీర్యాల నరసింహుడి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ని ఆహ్వానించిన ఆలయ చైర్మణ్.!!
తెలంగాణ లో బీజేపీ నీ పట్టాలెక్కించిన డా.కే.లక్ష్మన్.!!
Facebook Comments
Top
error: Content is protected !!