You are here
Home > తాజా వార్త‌లు > మాతృదినోత్సవ శుభాకాంక్షలుతో.. అమ్మలందరికి పాదాభివందనం.

మాతృదినోత్సవ శుభాకాంక్షలుతో.. అమ్మలందరికి పాదాభివందనం.

మాతృదేవోభవః..
అమ్మ అంటే ఆనందం, అమ్మంటే  ఆదరణ, అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే ఆప్యాయత.. ఆదర్శం.. అనురాగం ఇలా ఎన్ని చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా ఆ అమ్మ ప్రేమ ముందు చాలా చాలా తక్కువే. భూ దేవికున్నంత ఓర్పు ఆకాశమంత ప్రేమ, పంచ భూతలను మించిన గుణం ఒక్క అమ్మది మాత్రమే. ఇవన్ని కేవలం అమ్మ అనే ఒకే ఒక్క వ్యక్తిలో సాధ్యం. మరి అలాంటి అమ్మ గురించి ఒక రోజులో ఒక కవితలో ఒక కావ్యంలో ఒక మాటలో చెప్పడం వీలవుతుందా. ఎందరు కవులు పుట్టుకు వచ్చిన ఎంత గొప్పగా వర్ణించిన అమ్మ తత్వం ఇంకా అనంతం. అయినా మా వంతుగా అమ్మ మీద ఒక చిన్న ఆర్టికల్ అంతే..


ఈ లోకం లో భూమి కంటే బరువైనదేదని మహాభారతంలో ఒక సంధర్బంలో అడిగారంట.. అందుకు ధర్మరాజు వెంటనే అమ్మ అని సమాధానమిస్తాడు. నిజానికి భూమికన్నాభరించే శక్తి అమ్మకి మాత్రమే ఉంది. అలాంటి అమ్మ కడుపున పుట్టిన ఎవరైనా మాతృదినోత్సవం సందర్భంగా ఆమెకి పాదాభివందనం చేయాల్సిందే. ఈ ఒక్క రోజే కాదు జీవితాంతం చేయాల్సిందే. కానీ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కట్టు బాట్లను వీడి బ్రతకాడానికి మాత్రమే యుద్దం చేస్తున్న ఈ సమాజంలో అమ్మ కు నిజమైన పండుగను అందించే బిడ్టలెందరు..?


నవమాసాలు మోసి ఒక బిడ్డకి జన్మనిస్తూ తను పునర్జన్మను పొందిన మరుసటి క్షణం నుండి తల్లిగా తన ప్రయాణం మొదలవుతుంది. పొత్తిళ్ళలో ఉన్న బిడ్డని చూసి తన ఒత్తిళ్లనే మరచిపోతుంది. కడుపులో తన్నినా ఎదుగుతూ గుండెల మీద తన్నినా మురిసిపోతుంది. తనని ఆ బిడ్ట ఎంత గాయపరిచినా బరించే తల్లి ఆ బిడ్టకు చిన్న దెబ్బ తగిలినా విలవిలలాడిపోతుంది. బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతు ఇంతింతై వటుడింతయ్యే వరకు తోడుంటుంది. ఆది నుండి అనంత వరకు సాగే బిడ్డ ప్రయాణంలో తన ఊపిరిని మనకు ఊపిరిగా పోసి సాగుతుంది.


నడక నేర్పి… పలుకు నేర్పి… నడత నేర్పి… దగ్గరుండి గోరు ముద్దల్లో తన ప్రేమను కలిపి తినిపిస్తూ పెంచుతుంది. బుడి బుడి నడకలైనా, చిలక పలుకులైనా అన్ని అమ్మ దగ్గర నుండే నేర్చుకుంటాం. ఆకలి వేసినప్పుడు అమ్మ చేతి గోరుముద్దలైనా, అల్లరి చేసినప్పుడు అమ్మ చేతి దెబ్బలైనా కమ్మగానే ఉంటాయి. ఇలా బాల్యంలో ఆటపాటలు అమ్మ ఒడిలోన, మాట మంచితనం అమ్మ బడిలోన, ఆనందం మరియు ఆదర్శాలు అమ్మ గుడిలోన, మనమందరం నేర్చుకున్నవాళ్ళమే. అందుకే నేనంటాను మన అందరికీ అమ్మే ఆది గురువు. అమ్మ హృదయమే మనకి మొదటి పాఠశాల.


యవ్వనంలో మొదట స్నేహితురాలు అమ్మే. పెరుగుతున్న కొద్ది ఆమె ఇష్టాలను మన మీద రుద్దలేదు. మన ఇష్టాలను తెలుసుకొని వాటికి ఆమె భావాలను జోడించి మంచి మార్గంలో నడిపించింది. కుటుంబంలో పెరుగుతున్న కష్టాలు, ఆర్దిక ఇబ్బందులు తనలోనే దాచుకొని మనలను ఉన్నత మార్గాల వైపు నడిపిస్తుంది. మనకు వయసుతో పాటు పెరిగిన కోపం, కొంటెతనం ఇలా ఆమెను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, తనకు కోపం బిడ్ట మీద ఎన్నటికి కనిపించదు. పిల్లల సంతోషం కోసం దుఖాలను, బాధలను దిగమింగుతూ పిల్లల కళ్ళల్లో సంతోషం చూసి ఎంతో పొంగిపోతుంది ఆ పిచ్చి తల్లి.


అద్దాల మేడలో ఉన్నా..  పూరి గుడిసెలో ఉన్నా.. మురికి కాలువ పక్కన ఉన్నా.. స్వచ్చమైన నది తీరంలో ఏడంతస్తుల మేడలో ఉన్నా.. అమ్మ అమ్మే. తన చనుబాల రుణం ఈ జన్మకు కాదు కదా వచ్చే జన్మకు కూడా తీర్చలేమేమో. అమ్మరుణం తీర్చేది మరో అమ్మగా మారే మన ఇంటి లక్ష్మిలే. మరీ ఆ లక్ష్మిలను అమ్మ కడుపులో నుంచి బాహ్య ప్రపంచాన్ని చూడనివ్వకుండానే ఆ దేవుడు దగ్గరకి పంపుతున్న మనల్ని ఏమనాలి. మరో అమ్మను భూమి మీద రాకుండా చేస్తున్న ఈ లోకం తీరును ఏమని ప్రశ్నించాలి. నిన్నింత వాడిని చేసిన దేవతనక అనాథగా శరణాలయాల్లోకి చేరుస్తున్నావ్ మరీ నీ తీరును ఏమని ప్రశ్నించాలి. ఇన్నేళ్లు భారంగా మోసిన తల్లి ముసలితనంతో బాధపడితే బాధ్యతగా మెలగాల్సిన సమాజం అమ్మనే దూరం చేసుకుంటోంది. ఇదేనా తీరు.

అమ్మ అంటే ఆడబిడ్డ.. అమ్మ అంటే మరో జన్మ.. అమ్మగా మారే ప్రతి అమ్మాయిని గౌరవిద్దాం. కళ్ల ముందు కనిపించే నిజమైన దైవాన్ని నిత్యం పూజించుకుందాం. మాతృదేవోభవః.. ప్రపంచంలోని అందరి తల్లులకు మాతృదినోత్సవ శుభాకాంక్షలుతో  మా జర్నలిజంపవర్ తరుపున అమ్మలందరికి పాదాభివందనం. ముందుగా మా అమ్మకు.

Related Posts
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
కాంగ్రెస్ పార్టీ లో కొండ సురేఖ గతంలో ఓ వెలుగు వెలిగారు.. కీలక నేతగా ఫైర్ బ్రాండ్ గ పేరుగడించారు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ ఈక్వేషన్స్ మారిపోవడంతో.. ఆమే రాజకీయ జీవతం పలు మలుపులు తిరిగింది. నాటి కాంగ్రెస్ ...
READ MORE
అందరికీ స్వస్తతను అందించే బ్రదర్ అనిల్ కుమార్ కి ఆసుపత్రిలో చికిత్స.!!
స్టేజి ముందు లక్షల జనాలు ఉంటారు స్టేజి మీద ఒక పాస్టర్ మైక్ పట్టుకుని ప్రార్దన చేస్తు అందరికీ స్వస్థత ను అందిస్తాడు. అంతే కాదు ప్రార్దన సమయం లో వర్షం వచ్చి అడ్డంకిగా మారితే అప్పటికప్పుడు ప్రార్దన చేసి వర్షాన్ని ...
READ MORE
భద్రాద్రి రామయ్య దర్శనానికి డ్రెస్ కోడ్.
భద్రాచల రామయ్య వారి దర్శనానికి ఆలయ అధికారులు కొత్త నింబంధన తీసుకొచ్చారు. ఏడు కొండల వాడి దర్శనానికి ఎలా అయితే డ్రెస్ కోడ్ ఉంటే దర్శనానికి అనుమతిస్తారో అలాంటి సంప్రదాయ వస్త్రాలను దరించి వస్తేనే రాములోరి దర్శనానికి అనుమతిస్తామంటున్నారు. భద్రాచల సీతారాముల దర్శనార్థం ...
READ MORE
మాన‌వ‌త్వాన్ని చాటుకున్న సైనా నెహ్వాల్.. సీఆర్పీఎఫ్ జ‌వాన్ల కుటుంబాల‌కు ఆర్థిక సాయం.
భార‌త అగ్ర‌శ్రేణి బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ త‌న పెద్ద మ‌న‌సును చాటుకుంది. రియ‌ల్ హీరో అక్ష‌య్ కుమార్ బాట‌లోనే ఎన్ కౌంట‌ర్ లో మృతి చెందిన సీఆర్పీఎప్ జ‌వాన్ల కుటుంబాల‌కు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చింది. ఇటీవల చత్తీస్‌గఢ్ ...
READ MORE
తెలంగాణ రాష్ట్రానికి ఇంఛార్జ్ డీజీపీని ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్.!!
హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ గ విధులు నిర్వర్తిస్తున్న మహెందర్ రెడ్డి నే తెలంగాణ రాష్ట్రానికి ఇంచార్జ్ డీజీపీగ నియమించనుంది రాష్ట్ర సర్కార్. ఈ నెల 12న అధికారికంగ బాధ్యతలు స్వికరింనున్నారు మహెందర్ రెడ్డి. కాగా నూతనంగ ఇంఛార్జ్ డీజీపీ గ నియమకం కానున్న ...
READ MORE
గులాబీ “కారు” ఫుల్..!! ఇరుకుగా కూర్చోలేక దిగిపోతున్న నేతలు.!
అధికారంలో ఉండగానే టీఆర్ఎస్ పార్టీ బలహీనం కానుందా.. అంటే అవుననే అనుమానాలు వస్తున్నై వరంగల్ లో జరిగిన ఘటన చూస్తే..!! సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం లో ఉన్నపుడు చాలా పటిష్టంగ ఉంటుంది. అది జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ ...
READ MORE
అక్రిడేషన్ లేని వారికి హెల్త్ కార్డులు.. త్వరలో.. మరో శుభవార్త.
అక్రిడిటేషన్ లేనివారికి కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వడానికి గాను మార్హదర్శకాలు రూపొందించడానికి ప్రభుత్వం కమిటీని ఏర్పాటుచేసింది. అక్రిడిటేషన్ లేనివారికి కోస హెల్త్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం 2015 లొనే జి.ఓ జారీ చేసినప్పటికీ అర్హులైన వారిని గుర్తించడంలో సమాచార శాఖ ఆలస్యం ...
READ MORE
ప్రఖ్యాత కామర్స్ విద్యా సంస్థ అనిష్ కాలేజ్ కు బీకాం హానర్స్ కోర్స్ కు అనుమతి ఇచ్చిన ఓయూ
ప్రముఖ విద్యా సంస్థ అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ కు ఉస్మానియా యూనివర్శిటీ నుండి బీకాం హానర్స్ సబ్జెక్టు గాను నూతన అనుమతులు మంజూరు చేయడం జరిగింది. ఈ సంధర్భంగ అనిష్ కాలేజ్ వ్యవస్థాపకులు చైర్మన్ ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ...
READ MORE
సుప్రీం కోర్టు జడ్జిల వివాదం.. కీలక పరిణామం..!!
సుప్రీంకోర్టు జడ్జిల వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు.. నలుగురు సీనియర్ జడ్జీలు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రంజన్ గొగొయ్ లు రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా పై మీడియా సమావేశం ...
READ MORE
చిన్నారి మృత్యుపయనం..
నేను బోరు బావిలో బిగించబడిన మోటరాను.. సూర్యుడు అస్తమించే సమయాన చిన్నారి మీనా అనే పాప 40 అడుగుల ఎత్తు నుండి నా మీద బలంగా పడింది... పసిపాప తల నా దృఢమైన దేహాన్ని బలంగా తాకింది. తల పగిలి రక్తం నా ...
READ MORE
లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు చూపిస్తా అని 3428 ఇండ్లు చూపించి మంత్రి పారిపోయిండు – భట్టి విక్రమార్క
గ్రేటర్ ఎన్నికల సందర్భంగా TRS పార్టీ జనాల కు అబద్ధాలు చెప్తూ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క. గ్రేటర్ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల సవాల్ ప్రతి సవాల్ లో ఈరోజు ...
READ MORE
కొనసాగుతున్న అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు.!!
తెలంగాణ కోసం వేలాది మంది యువకులు ప్రాణాలర్పించారు. దశాబ్దాల పోరాటంతో సిద్దించింది ప్రత్యేక రాష్ట్రం. సొంత రాష్ట్రం లో ఉన్నమన్న గౌరవమే లేకుండా పోతోంది అధికార పార్టీ నేతల దౌర్జన్యాల పరంపర కొనసాగుతుంటే.. ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో బయటకొస్తోంది తెరాస ...
READ MORE
ర‌క్త క‌న్నీరు.. ఏడేళ్ల పాప శ‌రీర భాగాల‌ నుండి దార‌గా కారుతున్న ర‌క్తం..
థాయ్‌లాండ్‌లోని నాంగ్‌ఘాయ్‌కు చెందిన ఫాకమడ్‌ సాంగ్‌చాయ్‌ అనే ఏడేళ్ల పాప చిత్రమైన జబ్బుతో బాధ పడుతోంది. అంద‌రిలా తాను ఏడిస్తే క‌న్నీళ్లు రావ‌డం లేదు.. అందుకు బ‌దులుగా ర‌క్తం దార‌లై కారుతోంది.ఒక్క కంటి నుంచే కాదు అప్పుడ‌ప్పుడు ముక్కు, చెవులు, చేతుల ...
READ MORE
అమెరికా లో భారతీయుడిని కాల్చి చంపిన దుండగులు.!!
అమెరికా గన్ కల్చర్ కి మరో భారతీయుడు బలైపోయాడు. అమెరికాలో గన్ కల్చర్ రోజు రోజుకీ విచ్చలవిడిగా పెరిగిపోతోంది. భారత్ నుండి స్టూడెంట్ వీసాపై అమెరికా వెల్లిన పంజాబ్ రాష్ట్రానికి చెందిన ధరమ్ ప్రీత్ సింగ్ జసార్ (21) అక్కడ అకౌంటెన్స్ కోర్స్ చేస్తూనే ...
READ MORE
భక్తులకు వనదేవతలు.. వ్యాపారులకు మాత్రం లక్ష్మి దేవతలు.! మేడారం పరిస్థితి.!!
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంటే తెలియని వారుండరు.. దేశ వ్యాప్త గుర్తింపు కలిగిన అతిపెద్ద ఉత్సవం.. ఇది గిరిజన జాతరనే అయినప్పటికీ కుల వర్గాలకు అతీతంగ భక్తులు తరలివస్తారు. ఇంకా చెప్పాలంటే హిందువులే కాకుండా ఇతర మతాల ప్రజలు సైతం ...
READ MORE
వేదాలను, గురువుని, పాఠశాలను, విద్యార్ధులను దూషించిన వ్యక్తిపై ఫిర్యాదు.!
హైద్రాబాద్ నగర శివారు చెంగిచెర్లలోని ఓ కాలనీలో రెండేల్లుగా 32 మంది విద్యార్ధులతో అద్దె ఇంట్లో వేదపాఠశాల కొనసాగుతుంది. వేద పాఠశాల కు ట్రస్ట్ అధ్యక్షుడు బ్రహ్మ శ్రీ మాడుగుల శశిభూషణ శర్మ సోమయాజి. కాగా ఆ కాలనీకి నేను ప్రెసిడెంట్ ను ...
READ MORE
వివాదాల సీఐ పై బదిలీ వేటు.!!
పోలీస్ బాస్ లు ప్రజలతో ఫ్రెండ్లీగ వ్యవహరిస్తూ.. వారితో మమేకం కావాలని అందుకు మా ప్రభుత్వం చాలా కృషి చేస్తున్నదని పదే పదే చెప్తున్నది తెలంగాణ సర్కార్.. కానీ ఇవి కేవలం మాటల వరకే పరిమితం అని మరోసారి రుజువైంది. పోలీసులంటేనే సామాన్య ...
READ MORE
టెక్నాలజీ యుగంలోనూ మూఢనమ్మకానికి “బలి” అయిపోతున్న మనిషి.!!
21వ ఆధునిక శతాబ్దం లోనూ టెక్నాలజీ తో పరుగులు తీస్తున్న తరుణంలోనూ.. అంతరిక్షానికి విహారయాత్రకు వెలుతున్న ఈ కాలంలోనూ.. దురాచారం నుండి బయటపడలేకపోతున్నాడు సగటు మనిషి. ఇంకా ఆ దురాచారాలకి బలైపోతున్నాడు. ** హైద్రాబాద్ చిల్కనగర్ లో జరిగిన దారుణం సంధర్భంగ ...
READ MORE
చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న డ్రాగన్ కంట్రీ, చైనాలో తీవ్ర ఆహార కొరత.!!
ప్లాస్టిక్ ఉత్పత్తులు మొబైల్ ఫోన్ల ఉత్పత్తుల్లో గణనీయమైన ప్రగతి సాధించిన కమ్యునిస్టు దేశం చైనా.. ఆహారం విషయం లో మాత్రం దాదాపు నలభై శాతం వరకు ఇతర దేశాల మీదనే ఆధారపడింది. అయితే, మోసపూరిత బుద్ది వల్ల చైనా కు అందించే ఎగుమతులపై ...
READ MORE
స్వామి పరిపూర్ణానందకు ఒక న్యాయం, అక్బరుద్దిన్ ఓవైసీకి ఒక న్యాయమా..??
ఎంఐఎం నేత అక్బరుద్దిన్ ఓవైసీ తాజాగా హిందువులపై ఆర్ఎస్ఎస్ పై చేసిన వివాదస్పద వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈ అంశం పై సోషల్ మీడియా లో విపరీతంగ చర్చ జరుగుతోంది. అయితే అక్బరుద్దిన్ ఎటువంటి వివాదస్పద వ్యాఖ్యలు ...
READ MORE
బలైందా…? బలి చేశారా..? లేక్ వ్యూ సీఐ శ్రీదేవి పరిస్థితేంటి..?
ధర్నా చౌక్ ను కాపాడుకోవాలని ఒక వర్గం.. లేదు లేదు ఇందిరాపార్క్ సంరక్షణే మా భాద్యత అంటూ మరో వర్గం పోటా పోటీగా నిన్న ధర్నా చౌక్ వద్దా నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ప్రజా సమస్యల పోరాట వేదికగా ఉన్న ...
READ MORE
అందమైన అడవుల్లో హింసాకాండ.. రక్తమోడిన లంబాడ తండాలు.!!
ప్రస్తుతం తెలంగాణ లో ఓ విచిత్రకరమైన పరిస్థితి నెలకొంది. ఎప్పుడూ ఐక్యంగ ఉండే.. గిరిజనుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా గిరిజన తండాలకు ఆదివాసులకు నెలవైన అడవుల జిల్లా ఆదిలాబాద్ లో హింసాకాండ రగిలింది. మొన్నటివరకు ఈ గొడవలు నిరసనలకు ...
READ MORE
చంద్రబాబు దీక్ష సభనా.!బాహుబలి షూటింగా.!! ఒక్క రోజుకు 20కోట్ల ప్రజా ధనం ఖర్చు..
రాష్ట్రానికి కేంద్రం నిధులివ్వడం లేదంటూ.. హోదా కావాలంటూ.. రాష్ట్రం డబ్బు లేక అప్పుల్లో ఉందంటూ నిరసన దీక్షకు పూనుకున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకంగ 20 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నారు. అప్పుల్లో ఉన్నామంటూనే ...
READ MORE
దళిత మహిళను వివస్త్రను చేసి ఈడ్చుకెల్లిన తెలుగుదేశం తమ్ముల్లు..!!
ఆంధ్రప్రదేశ్ లో పేదవారిపై మరోసారి పంజా విసిరారు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు. బలహీనులపై కనీస మానవత్వం చూపలేకపోయారు.. కనీసం మహిళలు అనే ఇంగిత జ్ఞానం మరిచిపోయి సిగ్గుతప్పిన చర్యలకు పాల్పడ్డారు. సభ్య సమాజం తల దించుకునేలా ప్రవర్తించారు.. బడుగు ...
READ MORE
2019 లో AP టీడీపీకి దిమ్మతిరిగే “షాక్” ఇవ్వనున్న భాజపా.? రంగంలోకి దిగిన ఢిల్లీ అధిష్టానం.!!
ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నై.. ఇప్పటివరకైతే అధికార తెలుగుదేశం పార్టీ కి ప్రధాన ప్రత్యర్థి వైసీపీ ఉన్నప్పటికీ.. 2019 లో రాజకీయ ముఖచిత్రం మారే అవకాశాలు కనబడుతున్నై. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నేటి మిత్ర పక్షాలైన ...
READ MORE
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
అందరికీ స్వస్తతను అందించే బ్రదర్ అనిల్ కుమార్ కి ఆసుపత్రిలో
భద్రాద్రి రామయ్య దర్శనానికి డ్రెస్ కోడ్.
మాన‌వ‌త్వాన్ని చాటుకున్న సైనా నెహ్వాల్.. సీఆర్పీఎఫ్ జ‌వాన్ల కుటుంబాల‌కు ఆర్థిక
తెలంగాణ రాష్ట్రానికి ఇంఛార్జ్ డీజీపీని ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్.!!
గులాబీ “కారు” ఫుల్..!! ఇరుకుగా కూర్చోలేక దిగిపోతున్న నేతలు.!
అక్రిడేషన్ లేని వారికి హెల్త్ కార్డులు.. త్వరలో.. మరో శుభవార్త.
ప్రఖ్యాత కామర్స్ విద్యా సంస్థ అనిష్ కాలేజ్ కు బీకాం
సుప్రీం కోర్టు జడ్జిల వివాదం.. కీలక పరిణామం..!!
చిన్నారి మృత్యుపయనం..
లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు చూపిస్తా అని 3428 ఇండ్లు
కొనసాగుతున్న అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు.!!
ర‌క్త క‌న్నీరు.. ఏడేళ్ల పాప శ‌రీర భాగాల‌ నుండి దార‌గా
అమెరికా లో భారతీయుడిని కాల్చి చంపిన దుండగులు.!!
భక్తులకు వనదేవతలు.. వ్యాపారులకు మాత్రం లక్ష్మి దేవతలు.! మేడారం పరిస్థితి.!!
వేదాలను, గురువుని, పాఠశాలను, విద్యార్ధులను దూషించిన వ్యక్తిపై ఫిర్యాదు.!
వివాదాల సీఐ పై బదిలీ వేటు.!!
టెక్నాలజీ యుగంలోనూ మూఢనమ్మకానికి “బలి” అయిపోతున్న మనిషి.!!
చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న డ్రాగన్ కంట్రీ, చైనాలో తీవ్ర
స్వామి పరిపూర్ణానందకు ఒక న్యాయం, అక్బరుద్దిన్ ఓవైసీకి ఒక న్యాయమా..??
బలైందా…? బలి చేశారా..? లేక్ వ్యూ సీఐ శ్రీదేవి పరిస్థితేంటి..?
అందమైన అడవుల్లో హింసాకాండ.. రక్తమోడిన లంబాడ తండాలు.!!
చంద్రబాబు దీక్ష సభనా.!బాహుబలి షూటింగా.!! ఒక్క రోజుకు 20కోట్ల ప్రజా
దళిత మహిళను వివస్త్రను చేసి ఈడ్చుకెల్లిన తెలుగుదేశం తమ్ముల్లు..!!
2019 లో AP టీడీపీకి దిమ్మతిరిగే “షాక్” ఇవ్వనున్న భాజపా.?
Facebook Comments
Top
error: Content is protected !!