
అమ్మాయిలు ఎందులోను తక్కువ కాదని నిరుపించింది ఓ యువతి. అయితే ఇది మాత్రం కాస్త వ్యతిరేకంగా లెండి. అబ్బాయిలు మాత్రమే నా అమ్మాయిలు రచ్చ చేయగలరని తేల్చింది. అలా ఇలా కాదు నడిరోడ్డు పై అది కూడా నగరం నడిబొడ్డున ఉన్న బేగంపేట రహదారిపై రచ్చ చేసి ట్రాపిక్ పోలీసులకు సైతం చుక్కలు చూపింది.
ఇక అసలు రచ్చలోకి వస్తే.. అత్యంత రద్దీగా ఉండే హైదరబాద్ లోని బేగం పేట రోడ్డుపై తన కారుతో ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేసుకుంటూ వాహనదారుల పైకి దూసుకెళ్లింది ఓ యువతి. క్షణాల్లో అప్రమత్తమైన వాహనదారులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పక్కన నుండి రయ్యున దూసుకెళుతూ డ్యాస్ ఇచ్చినంత పని చేసిన ఆ యువతిని నిలదీసే ప్రయత్నం చేశారు కొందరు. ర్యాష్ డ్రైవింగ్ పై కారుకు అడ్డంగా తన వాహనాన్ని నిలిపి ప్రశ్నించే ప్రయత్నం చేయగా ఉల్టా ఆ వ్యక్తిపైకి దాడికి వచ్చింది సదరు యువతి. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎదుటే వీరంగం సృష్టిస్తూ కెమెరాకు అడ్డంగా బుక్కయింది. అయితే ఈ తతంగానంత చూస్తున్న పక్క వానదారులను బండ బూతులు తిట్టడంతో అంతా షాక్ అయ్యారు. బెంజ్ కార్లో వచ్చి మరీ సంస్కారం లేకుండా ప్రవర్తించిన ఆ యువతిని అంతా తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఎంత మాత్రం అమ్మాయి అయితే ఇంత రచ్చ చేయాల అంటూ క్లాస్ లు పీకుతున్నారు. ఇక ఈ అమ్మడి వీడియో ఆన్ లైన్ల తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వైపు ట్రాఫిక్ పోలీసు సర్దిచెబుతున్నాఅసలు వినేదే లేదంటు ప్రవర్తించిన తీరును అంతా తప్పు పడుతున్నారు. అయితే యువతి ఎవరన్నది మాత్రం తెలియ రాలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు.