You are here
Home > తాజా వార్త‌లు > కేసీఆర్ క్రమబద్దీకరణ నిర్ణయంతో విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంబురాలు.

కేసీఆర్ క్రమబద్దీకరణ నిర్ణయంతో విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంబురాలు.

తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామనే హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకున్నారు. క్రమబద్ధీకరణకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సంతకం చేశారు. జెన్ కో, ట్రాన్స్ కో, ఎస్.పి.డి.సి.ఎల్. , ఎన్.పి.డి.సి.ఎల్. పరిధిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని ఇప్పటికే ఈ నాలుగు సంస్థలకు చెందిన పాలక మండళ్లు నిర్ణయించాయి. ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేశాయి. దీనిపై శనివారం విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, జెన్ కో – ట్రాన్స్ కో సిఎండి డి.ప్రభాకర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్ రావు కూలంకశంగా చర్చించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ సిఫారసులు సిద్దం చేసి, ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపారు. ముఖ్యమంత్రి వెంటనే దీనికి ఆమోద ముద్ర వేశారు. ఏండ్ల తరబడి విద్యుత్ సంస్థలలో తక్కువ జీతం తీసుకుంటూ, ఎంతో శ్రమ చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం పట్ల సిఎం సంతోషం వ్యక్తం చేశారు. ట్రాన్స్ కో లో 4,197, జెన్ కో లో 2,914, ఎన్.పి.డి.సి.ఎల్. లో 4,333, ఎస్.పి.డి.సి.ఎల్. లో 9,459… మొత్తం నాలుగు సంస్థల్లో కలిపి 20,903 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరిగింది.
ముఖ్యమంత్రికి ప్రభాకర్ రావు కృతజ్ఞతలు:
విద్యుత్ సంస్థల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి, వారిని క్రమబద్ధీకరిస్తామని చెప్పి, మాట నిలుపుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు విద్యుత్ సంస్థల తరుఫును జెన్ కో, ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ముఖ్యమంత్రికి రుణపడి ఉంటారని అన్నారు. విద్యుత్ ఉద్యోగులు మరింత అంకితభావంతో పనిచేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సహకరించిన మంత్రి జగదీష్ రెడ్డికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణ, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్ రావుకు ప్రభాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు.

Related Posts
పవన్ కాదంటే “నంద్యాల” లో టీడీపీ గల్లంతేనా..??
ఆంద్రప్రదేశ్ లో ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక హాట్ టాపిక్ అయింది. అధికార తెలుగు దేశం పార్టీ ప్రతిపక్ష వైఎస్ఆర్సపీ లు హోరా హోరీగ తలపడుతున్నాయి. కాంగ్రెస్ లాంటి ఇతర పార్టీలున్నా అవి డమ్మీలుగానే మిగలనున్నాయి. 2014 లో భూమా నాగిరెడ్డి జగన్ ...
READ MORE
రాజాసింగ్ v/s కేసిఆర్.. రాజాసింగ్ అరెస్టుకు రంగం సిద్దం.?
భాగ్యనగర్ లో రాజాసింగ్ అంటే తెలియని వారుండరు. హిందూ లీడర్ గ ఆయన ఫేమస్. హిందూ నాయకుడిగానే ఆయన గోషామహల్ ఎంఎల్ఏ గా గెలుపొందారు. అయితే ఎప్పుడు హిందూ సభలు జరిగినా ర్యాలీల సమయంలోనూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడం సిటీలో రాజకీయ మతసంబంధ దుమారం ...
READ MORE
తెలంగాణ నుండి మరొకరికి గవర్నర్ పదవి.  అది బద్దం బాల్ రెడ్డికేనా.?
రాష్ట్రపతి ఎన్నికలు ముగిసాయి. తొందర్లోనే ఉప రాష్ట్రపతి ఎన్నక కూడా ముగియనుంది. ఇక ఆ తర్వాత ఆయా రాష్ట్రాలకు గవర్నర్ ల నియామకం జరగాల్సి ఉంది. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక కూడా యూపీఏ హయాంలో వచ్చిన గవర్నర్లు కొనసాగుతున్నారు. ఇక వారందరి పదవీ కాలం ...
READ MORE
సిటీలో అక్రమ కట్టడాలను కూల్చేదాక నిద్రపోనని అన్నదెవరో తెలుసా??
హైద్రాబాద్ నగరంలో 28 వేల అక్రమ కట్టడాలున్నై వాటన్నిటినీ కూల్చేదాక నిద్రపోయేదే లేదని పోయినేడాది మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నాడు. గీ మాట అన్నదీ అక్రమ నిర్మాణాల వల్ల నాలాలు మురుగునీటి కాల్వలు మూసుకపోయి వాన కాలం అంతా ...
READ MORE
పవన్ కాదంటే “నంద్యాల” లో టీడీపీ గల్లంతేనా..??
రాజాసింగ్ v/s కేసిఆర్.. రాజాసింగ్ అరెస్టుకు రంగం సిద్దం.?
తెలంగాణ నుండి మరొకరికి గవర్నర్ పదవి. అది బద్దం
సిటీలో అక్రమ కట్టడాలను కూల్చేదాక నిద్రపోనని అన్నదెవరో తెలుసా??
Facebook Comments
Top
error: Content is protected !!