
జూనియర్ ఎన్టీఆర్ త్రి పాత్రాభినేయం చేస్తున్న చిత్రం జై లవకుశ. ఒక్కొ పాత్రకి ఒక్కో ప్రత్యేకథ అంటూ విడతల వారిగా పాత్రలను పరిచయం చేశారు. చివరిగా అభిమానులు ఎదురు చూస్తున్న టీజర్ ను విడుదల చేశారు. జై.. లవ .. కుశ పాత్రల్లో జూనియర్ నటించి మెప్పించేందుకు సిద్దమయ్యారు. బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబందించి టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్లో తారక్.. ‘కొట్టేయడంతో పాటు కొట్టడమూ వచ్చురా’ అని చెప్తున్న డైలాగ్ కిరాక్ గా ఉందంటున్నారు అభిమానులు. తారక్ పలికిన మరో డైలాగ్ ‘ఈ డబ్బు తీసుకెళ్లి అమెరికాలోఇన్వెస్ట్ చేసి ఆ ఆధార్ కార్డేదో నాకు ఇప్పిచ్చేయండి బాబూ’ అని అంటుంటే.. ‘దాన్ని ఆధార్ కార్డు అనరమ్మా గ్రీన్ కార్డు అంటారు’ అని చెప్పడం హస్యాన్ని పంచుతోంది. మొదటగా రిలీజ్ అయిన జై పాత్ర ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచే అవకాశాలున్నాయని సినీ వర్గాలు చెపుతున్నాయి. తొలి సారిగా మూడు పాత్రల్లో కనిపించనుండటం అభిమానులకు ఎక్కడ లేని సంతోషాన్ని తెచ్చిపెడుతోంది. ఈ చిత్రంలో తారక్‌కి జోడీగా రాశీ ఖన్నా, నివేదా థామస్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.