
అగ్ర రాజ్యపు అదిపతి గారాల పట్టి ఇవాంక రానే వచ్చింది. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరయ్యేందుకు ఇవాంక ట్రంప్ విచ్చేశారు. ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూస్తామ అని అంతా ఆశక్తి గా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. నెలవంక ఇవాంక భారత్ లో అందులోను భాగ్యనగరం హైదరబాద్ లో అడుగు పెట్టింది. ఇవాంక రాకకు సంబందించి నెల రోజుల ముందు నుంచి ఒకటే హడావిడి. ఇవాంక వచ్చేస్తుంది వచ్చేస్తుంది అంటూ ప్రభుత్వం కూడా హైదరబాద్ ను అద్దంలా తయారు చేసింది. ఏది ఏమైతేనేమ్ తమ రోడ్లు బాగయ్యాయి. పట్టించుకొండి సార్లు అని ఎంత మొత్తుకున్నా వినిపించుకోని సర్కార్ ట్రంప్ రాక దెబ్బకు క్షణాల్లో భారీ మార్పులను చేసి చూపింది. ఇక ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే మళ్లీ అదే రేంజ్ లో హడావిడి. ఇవాంక ఇవాంక ఇవాంక ఈ రెండు రోజులు ఆ యువరాణి భజన మాత్రం తప్పదు. ఇక ఇవాంక టూర్ ఎలా సాగబోతుంది. ఇవాంక ఎప్పుడు ఎక్కడ ఏ కార్యక్రమంలో పాల్గొనబోతోంది. మన కూడా కాస్త హడావిడి చేస్తే పోలా…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంక ట్రంప్ మంగళవారం తెల్లవారు జామున శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. యువరాణి రాకతో మన వాళ్లతో పుష్పగుచ్చాలతో సాదర స్వాగతం పలికేందుకు అప్పటికే టంచన్ గా రెడీ అయిపోయారు. మన రాష్ట్ర మంత్రులు, భారత్‌లోని అమెరికా రాయబారి కెన్జుస్టర్, అమెరికాలోని భారతీయ రాయబారి నవతేజ్‌సింగ్ సరన్, హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్స్లేట్ జనరల్ కాథరినా హడ్డా, తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు జయేష్ రంజన్, అంజనీకుమార్, షికా గోయల్ ఆమెకు సాదర స్వాగతం పలికారు. భారీ కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రత్యేక వాహనంలో మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్‌కు బయల్దేరింది యువరాణి ఇవాంక ట్రంప్. తెల్లవారు జామున 4.03 నిమిషాలకు ట్రైడెంట్ హోటల్ చేరుకున్నారు.
ఇక ఇవాంక టూర్ విషయానికి వస్తే.. ట్రైడెంట్ హోటల్ నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు హెచ్ఐసీసీకి చేరుకుంటారు. అనంతరం హెచ్ఐసీసీలోని రెండో అంతస్తులో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో భేటీ కానున్నారు. ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా ఇవాంక కలుస్తారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రారంభించిన తర్వాత.. పాతబస్తీలోని ఫలక్ నుమా ప్యాలెస్‌కు ప్రధాని మోదీ , ఇవాంక వెళ్తారు. ఈ సదస్సుకు సుమారు 1500 మంది ప్రతినిధులు హాజరవనుండటంతో 45 ప్రత్యేక బస్సుల్లో ఫలక్ నుమా ప్యాలెస్ వరకు భారీ భద్రత ఉండబోతోంది. చీమ చిటుక్కుమన్నా తెలుసుకునే అంతా కట్టుదిట్టమైన భద్రత నడుమ డెలిగేట్స్ సమావేశానికి హాజరవనున్నారు. ఫలక్ నుమా ప్యాలెస్ లో భారత సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శనలు కొనసాగుతాయి. మధ్యాహ్నం లంచ్ అక్కడే… తిరిగి విందు అయిన తర్వాత ప్రధాని మోదీ ఢిల్లీకి వెళ్లిపోతారు ఇవాంక మాత్రం తిరిగి రాత్రి 10.45 గంటలకు మాదాపూర్ లోని ట్రైడెంట్ హోటల్‌కు వెళ్తారు. ఈ నెల 29వ తేదీ న ఉదయం హెచ్ఐసీసీలో జరగనున్న సదస్సుకు ఇవాంక హాజరవుతారు. ఆ కార్యక్రమం పూర్తవగానే మధ్యాహ్నం 12గంటల తర్వాత హెచ్ఐసీసీ నుంచి ఇవాంక బయటకు వెళ్తారు. మధ్యాహ్నం భోజనం చేసి తిరిగి ట్రైడెంట్ హోటల్‌కు చేరుకుంటారు. అక్కడే అమెరికా ప్రతినిధులతో భేటీ అవుతారు. ఆ తరువాత కార్యక్రమాలు ఉన్న అవన్నీ రహస్యం కాబట్టి సమాచారం లేదు. ఆ తరువాత ఎక్కడి వెళుతారు అనేది భద్రత బలగాలకు బయటకు పొక్కకుండా చూసుకుంటున్నాయి. ఇక రాత్రి 9.20 గంటలకు తిరుగు ప్రయాణం అయి.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ బయల్దేరి వెళ్తారు. అక్కడి అమెరికా వెళుతారు. ఇది ఇవాంక టూర్. నెలవంక లా ఇలా వచ్చి అలా మాయం మవుతుంది ఇవాంటక ట్రంప్. ఆమె రోడ్డల మీద తిరిగేది కేవలం 25 నిమిషాలంటే 25 నిమిషాలే అయినా హైదరబాద్ మాత్రం అద్దంలా మెరవడానికి ఈ నెలవంకే కారణమని అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీలుంటే మళ్లీ రావమ్మా ఇవాంక. ఈ సారి మాత్రం ఓ రెండు రోజులు ఎక్కువ ఉండేలా ఫ్లాన్ చేసుకుని రామ్మా.. నీ రాక కోసం ఎదురు చూస్తూ. మా నాయకుల గుండెల్లో గుబులైతే పుట్టించావ్ చాలు.
























