You are here
Home > తాజా వార్త‌లు > మరీ ఇంత అన్యాయమా.. కోర్టు మెట్లెక్కకుండా ఏ పరీక్ష అయినా నిర్వహించగలిగారా..? టీఎస్ సర్కార్ ను నిలదీసిన నిరుద్యోగి.

మరీ ఇంత అన్యాయమా.. కోర్టు మెట్లెక్కకుండా ఏ పరీక్ష అయినా నిర్వహించగలిగారా..? టీఎస్ సర్కార్ ను నిలదీసిన నిరుద్యోగి.

తొలి తెలంగాణ ప్రభుత్వం మనదే అన్న పేరే కానీ పరాయి పాలనకంటే అధ్వాన్నంగా ఉందని నిరుద్యోగుల ఆవేదన. ప్రభుత్వ కొలువులకు నిర్వహించే పోటీ పరీక్షల్లో ఒక్కంటే ఒక్కటి కూడా కోర్టు మెట్లు ఎక్కకుండా లేని పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఉద్యోగం లో అవకతవకలే దర్శనమిస్తున్నాయని.. ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన పరీక్షలు అక్రమాలకు తావిచ్చేలా అవినీతిమయంతో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటారంటున్నారు. గ్రూప్ 2 అస్తవ్యస్తంగా నిర్వహించిన తీరుపై ఓ నిరుద్యోగి ఆవేదన.
టీఎస్ పీఎస్సీకి ఓ నిరుద్యోగి లేఖ

గౌరవనీయులైన టీఎస్ పీఎస్సీకి, తెలంగాణ ప్రభుత్వానికి మర్యాదపూర్వకంగా ఈ లెటర్ రాస్తున్నాను. వీలైతే మేం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. లేదు.. మేం చెప్పం అని మీరంటే 2019 ఎన్నికలే ఆ సమాధానం చెప్తాయి..ఇది నా ఒక్కడి మాట కాదు. యావత్తు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి, మీ ప్రభుత్వం ఏర్పడటానికి కారకులైన నిరుద్యోగ యువకులందరిది.
నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో పీఠమెక్కారు..బాగనే ఉంది..అడగని వాళ్లకు, అడిగిన వాళ్లందరికీ జీతాలు పెంచుతున్నారు..ఇది మరీ బాగుంది… మరి నిరుద్యోగులేం పాపం చేశారని వాళ్ల జీవితాలతో చెలగాటమాడుతున్నారు? ఇంకా మీరు నిరుద్యోగులను ఓటర్లుగానే చూస్తున్నారా చెప్పండి..ఓటుతోనే సమాధానం చెప్తాం! . సరే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది మీ తెలంగాణ సర్కారు గురించి…
ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతున్నాను ఘంటా చక్రపాణి సర్. విద్యార్థుల భవిష్యత్తులతో ఇక మీరు ఆడుకున్నది చాలు. ఇంకొద్దు.. మేం కోల్పోయింది చాలు మీవల్ల. టీఎస్ పీఎస్సీ ఏర్పడగానే నిరుద్యోగుల జీవితాల్లో సంతోషమేర్పడింది..ఆ సీట్లో మీరు కూర్చోగానే దానికి మరింత వన్నె వచ్చిందని తెగ సంబరపడి పోయాం. ఇది మూణ్నాళ్ల ముచ్చటనేనని మూడేళ్ల పాలన గడవక ముందే ముద్దుగా తేల్చేశారు.
ఇంట్లో కూడు లేక, కట్టుకోవడానికి సరైన గుడ్డ లేక, చదువుకున్న చదువుకు విలువలేక, ఊర్లో కలిసిన ప్రతిసారి తెలిసిన వాళ్లు ఏం చేస్తున్నావు రా అడిగితే ఏం చెప్పాలో తెలియక అయోమయపడుతూ, అవమానపడుతూ, ఇంకెతకాలం చదువుతవురా అని పదే పదే తల్లిదండ్రులు తిడుతుంటే….అవన్నీ దిగమింగుకొని ఏదైనా ఒక పరీక్షకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే నెల ముందు నుండే తెలిసి, తెలియని, మన, నా అనుకున్న వాళ్లందరినీ అడుక్కొని వెయ్యి రూపాయలు అప్పుగా తెచ్చుకొని ఊరి నుంచి 20 కి.మీలు ఛార్జీలు పెట్టుకొని ప్రయాణం చేసి తీరా అక్కడి కెళ్లాక ఆన్ లైన్ సెంటర్లో 40 కట్టి, అప్లై చేసినందుకు మీరు ఫిక్స్ చేసిన 250, 300, etc…. ఇలా ఎంతైతే అంత కట్టి బయట హోటల్ లో తిని అక్కడ ఇంకో 70 కట్టి తిరుగు ప్రయాణంలో ఇంటికి వస్తుంటే విజేత కాంపిటీషన్, ఉద్యోగ సోపానం, కరెంట్ అఫైర్స్ బుక్స్ కనిపిస్తే వాటిని కొని..కనిపించి, కనిపించని బుక్స్ ఇలా అన్ని కొనుక్కొని అప్పు తెచ్చుకున్న వెయ్యి ఒక్కరోజే ఖర్చు పెట్టి మళ్లీ ఇంటికొచ్చి బుక్స్ ముందరేసుకొని పొద్దస్తమానం చదివి పరీక్షలు రాస్తే మీరు చేస్తున్నదేమిటి?…ఇది ఒక వైపే….ఇంకో వైపు పుట్టిన ఊరును, కన్న తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యా పిల్లలను అందరినీ వదిలేసి జాబు వస్తుందన్న నమ్మకంతో కోచింగ్ సెంటర్లలో వేలు ధారబోసి, అక్కడ ఉండడానికి ఓ రూమ్ వెతుక్కొని దానికి రెంట్ కడుతూ, బయట మెస్ లలో తింటూ రాత్రనక, పగలనక రూమ్ లల్లో, లైబ్రరీల్లో చదువుకొంటూ పరీక్షలు రాస్తే మీరు చేస్తున్నదేమిటి? పెళ్లిళ్లు మానుకొని, వచ్చిన సంబంధాలు చెడగొట్టుకొని ఇంట్లో వాళ్లకు సమాధానం చెప్పలేక, జీవితంలో స్థిరపడతామన్న భరోసా లేక మీరు రిలీజ్ చేసే నోటిఫికేషన్లనే నమ్ముకొని అప్పో సొప్పో చేసి చదువుకుంటూ కాలం వెళ్లదీస్తుంటే మీరు మాకిచ్చే బహుమతి ఇదా?
సరే ఇదంతా ఉండని గానీ….ఓ నిరుద్యోగ అభ్యర్థిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను… సమాధానం చెప్పండి….
• టీఎస్ పీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల్లో అవకతవకలు జరిగితే పట్టించుకోరా? అది మీ బాధ్యత కాదా?
• ఓఎమ్ఆర్ షీట్లో వైట్ నర్ దిద్దిన వారిని సెలెక్ట్ చేయడం మీకు ఎంత వరకు సబబుగా ఉంది?
• మీరు(టీఎస్ పీఎస్సీ) ముందుగా ఇన్ స్ట్రక్షన్స్ లో పేర్కొన్నట్లు ఓఎమ్ ఆర్ షీట్ పై దిద్దు బాట్లు చర్యలను అంగీకరించబోమని చెప్పారు..మళ్లీ మీ నిబంధనలను మీరే ఉల్లంఘించడం ఎంత వరకు కరెక్ట్ ?
• అసలు వైట్ నర్ ను సెంటర్ లోకి ఎందుకు అనుమతించారు ? అన్నీ చెక్ చేసే మీకు వైట్ నర్లు కనిపించలేదా? వందల సంఖ్యలో వైట్ నర్లున్న ఓఎంఆర్ షీట్లు ఎలా వస్తాయి? దాని వెనక మీ హస్తం ఉందా?
• కట్ ఆఫ్ లిస్ట్ పెట్టకుండా డైరెక్ట్ ఫలితాలు రిలీజ్ చేయడం వెనుక ఏమైనా ఉద్ధేశం ఉందా?
• ఒకే సెంటర్ నుంచి వందల సంఖ్యలో అభ్యర్థులు ఎలా సెలెక్ట్ అయ్యారు ? దీని వెనక ఏదైనా మతలబు ఉందా? లేదా ఆయా సెంటర్లలో మాస్ కాఫీయింగ్ జరిగిందా?
• అర్హులకు అవకాశం దక్కలేదని రోడ్లపైకి వచ్చి వేలాది మంది అభ్యర్థులు వాపోతుంటే వారి గోడు మీకు వినిపించడం లేదా?
• వైట్ నర్ దిద్దే వారి విషయంలో సుప్రీంకోర్టు తీర్పును మీరు లెక్కచేయరా? అయినా మీరు లెక్కచేసి ఉంటే వైట్ నర్ పెట్టిన వాళ్లను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఎందుకు పిలుస్తారు ?
• ఎప్పుడో నవంబర్ లో పరీక్ష అయిపోతే కొంతమంది అభ్యర్థులు వైట్ నర్ విషయంలో కోర్టుకు వెళ్లారు..మరి ఆ 3 నెలల గ్యాప్ లో మీరేం చేశారు ?వాళ్లు కోర్టు మెట్లు ఎక్కేదాకా వేచిచూశారా?
• 17 ప్రశ్నలను అర్ధాంతరంగా తొలగించారు.. దానికి సంబంధించి మీరు టీఎస్ పీఎస్సీ ఎలాంటి మార్గదర్శకాలు లేవు. టీఎస్ పీఎస్సీ అంటే రాజ్యాంగ బద్ధంగా ఏర్పడ్డ సంస్థ కాబట్టి అభ్యర్థులకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మీకు ఉంది?
• ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నియామకాల్లో అన్యాయం జరిగిందనే తెలంగాణను కొట్లాడి తెచ్చుకుంటిమి..ఇప్పుడు అందులో పెద్దగా మార్పేమీ కనిపించడం లేదు.దీనికి మీ సమాధానం ఏమిటి?

• మీరు ప్రైమరీ, ఫైనల్ కీ లు ఇవ్వడానికి ఎందుకంత సమయం తీసుకున్నారు? అభ్యర్థుల ఎదురుచూపులతో ఆటలాడాలనుకున్నారా? ఆ జాప్యానికి కారణాలేంటి?
• మీరిచ్చిన ప్రతి ‘కీ’ లో సవాలక్ష తప్పులున్నాయి..అంత నిర్లక్ష్యం ఎందుకు చేసినట్లు? పోనీ మీరు కొలువు దీరిన సర్కారులో కీ తయారు చేసే నిష్ణాతులు కరువయ్యారా? గ్రూప్ 2 అంటే మీ దృష్టిలో చిన్నపిల్లలు ఆడుకునే ఆటనా?
• గ్రూప్ 2 పరీక్షకు ముందు 350 మార్కులు తెచ్చుకొని చూపించండని సవాల్ చేసిన మీకు ఈరోజు 420,430,440, 450 మార్కులు తెచ్చుకున్న వాళ్లు కనిపించడం లేదా..? వాళ్లను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఎందుకు అనుమతించడం లేదు..? అవి మార్కులు కావా..? ఇప్పటికీ చాలా మంది అన్నేసి మార్కులు తెచ్చుకున్నా జాబ్ వస్తుందన్న నమ్మకం లేకుండా చేశారు.
• మీది నిజంగా మాటల ప్రభుత్వమే అని నిరూపించారు. చేతల ప్రభుత్వం కాదని ఇప్పుడు తేలిపోయింది. ప్రకటనల్లో కాదు సర్ దమ్ము చూపించాల్సింది… చెప్పిన పని చెప్పినట్లు చేయడంలో చూపించండి..
• నోటిఫికేషన్ లో 1:2 ప్రకారం ఇంటర్వ్యూకు పిలుస్తామన్నారు..మళ్లీ కొత్తగా 1: 3 ఏంటీ సర్ ?ముందుగానే ఇలాంటి విషయాలు మీడియాకు చెప్పాల్సిన బాధ్యత, ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలన్న కనీస జ్ఞానం లేదా..? డైరెక్ట్ గా మీరెవరు సర్ నిర్ణయాలు తీసుకోవడానికి..?

చివరగా ఒక్కటి అడుగుతున్నాను… దమ్ముంటే పరీక్షను రద్దు చేసి ఇంకో మూడు నాలుగు నెలలు గడువిచ్చి మీరు చేసిన తప్పును సరిద్దుకోండి. లేదంటే తెలంగాణలో నియామకాల కోసం మరో ఉద్యమం తప్పదు. విద్యార్థుల భవిష్యత్తును నిర్ధేశించండి అంతే కానీ విద్యార్థుల భవిష్యత్తులతో ఆడుకోకండి. వారి జీవితాలను అంధకారం చేయకండి.. అది మీ హక్కు కాదని తెలసుకోండి.
ఇట్లు
గోపాల్ రావు.పి
జర్నలిస్ట్
(ఇది జర్నలిస్ట్ గా రాయలేదు.. విద్యార్థిగా రాశా.. జర్నలిస్ట్ గా రాసుంటే ఆ పవర్ ఇంకోలా ఉండేది)

 

ఇది ఆయన ఒక్కడి అంతరంగం మాత్రమే కాదు గ్రూప్ లో మోసపోయామని చెపుతున్న నిరుద్యోగుల ఆవేదన కూడా. 

Related Posts
నాకు సెంచరీలు రికార్డులు సంతృప్తి ఇవ్వవు.. – రోహిత్ శర్మ
టీం ఇండియా హిట్టింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ శ్రీలంక పై సెంచరీ రికార్డ్ తర్వాత మీడియా తో మాట్లాడుతూ.. నాకు సెంచరీలు రికార్డులు సంతృప్తిని ఇవ్వదని భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిస్తేనే అసలైన సంతృప్తి అని సృష్టం ...
READ MORE
మొన్నటిదాక నోటి దూల చూపించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడెక్కడా.!! నిలదీస్తున్న నెటిజన్లు.!!
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు అక్కడ ఒక సంచలన సంఘటన చోటు చేసుకుంది, అదే సీనియర్ మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య. అప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే.. కనీసం ఇప్పుడైనా పొత్తుల ప్రభుత్వం ఏర్పడింది కానీ ...
READ MORE
బ్రేకింగ్- భారత్ పై బయో ఉగ్రవాదానికి పాకిస్తాన్ విఫలయత్నం.!!
భారత దేశం.. ఇప్పుడు అమెరికా లాంటి అగ్ర దేశాలతో సహా పలు దేశాలకు కరోనా వైరస్ అడ్డుకోవడానికి చాలా విధాలుగా సహాయం చేస్తున్న గొప్ప దేశం. ఇలా ప్రపంచ దేశాలు ఓ వైపు కరోనా వైరస్ మహమ్మారిని ఎలా అడ్డుకోవాలి ఎలా నివారించాలి ...
READ MORE
పీవీ సింధు సాధించిన ఘనతేంటి.? ఈ గిరిజన యువకుడు చేసిన తప్పేంది.?? ఎందుకీ వివక్ష.??
కామన్వెల్త్ గేమ్స్ లో తెలుగుతేజం గుంటూరు స్టూవర్ట్ పురం నివాసి రాగాల వెంకట రాహుల్ స్వర్ణ పతకం సాధించి మన దేశ కీర్తిని రెపరెపలాడించాడు. స్వర్ణ పతకం సాధించిన కూడా రాహుల్ పై వివక్ష చూపిస్తోంది మన తెలుగు మీడియా మరియు ...
READ MORE
అయోధ్య రామ మందిర పునర్నిర్మాణంలో బయటపడ్డ 5 అడుగుల శివలింగం.
శతాబ్దాల పోరాటం తర్వాత మొత్తానికి అయోధ్యలో రామ మందిరం పునర్నిర్మానానికి ఆమోదం లభించిన విషయం తెలిసిందే. కాగా ఆలయ నిర్మాణం కోసం నరేంద్ర మోడీ సర్కార్ ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం లో భాగంగా ...
READ MORE
ప్రియాంకకున్న మానసిక వ్యాధి పేరు వెల్లడించిన సుబ్రహ్మణ్యస్వామి.!!
కాంగ్రెస్ పార్టీ లో రాహుల్ తో గెలవడం లేదని మరో కొత్త ప్రయత్నంగ సోనియా గాంధీ కూతురు రాహుల్ చెల్లి అవినీతి ఆరోపనలు ఎదుర్కుంటున్న రాబర్ట్ వాద్రా భార్య ప్రియాంక వాద్రా ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. రావడం ...
READ MORE
కలియుగ దైవానికి బంగారు కాసుల హారం..
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వడ్డీకాసుల వాడికి మరో కానుక లభించింది, గోవిందుడి భక్తుడైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ కు చెందిన ఎన్ఆర్ఐ అయినటువంటి మంతెన రామలింగరాజు అనే భక్తుడు శ్రీవారికి 8.39 కోట్ల రూపాయలు విలువ చేసే 28.645 ...
READ MORE
తెలంగాణ వంజరి సంఘం వార్షికోత్సవాలను విజయవంతం చేయండి- ఆముద లక్ష్మణ్ వంజరి
తెలంగాణ వంజరి సంఘం వార్షికోత్సవాలను వంజరి యువత పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆ సంఘం రాష్ట్ర నాయకులు ఆముద లక్ష్మణ్ వంజరి. రేపు శనివారం జులై 28 నాడు ఉదయం 10 గంటలకు హైద్రాబాద్ తార్నాక ...
READ MORE
అమెరికాలో కూడా లోకేష్ బాబు తన స్టైల్ చూపించాడు.! మరోసారి నవ్వులపాలు.!!
అమెరికా పర్యటనలో ఉన్న ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు మంత్రి లోకేష్ బాబు అక్కడ ఉన్న కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీ ఉత్సాహం చూస్తుంటే అమెరికాలో కూడా టీడీపీ అధికారంలోకొస్తదేమో అని వ్యాఖ్యానించడంతో ఆ మాటలకు అక్కడున్న టీడీపీ ...
READ MORE
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
నిన్న ఉదయం 10:30 నుండి దాదాపు 11గంటలు టాలివుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని డ్రగ్స్ కేసు విషయంలో సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం ఎక్సైజ్ ఆఫీస్ నుండి బయటకి వచ్చిన పూరీ కొంత అసంతృప్తి గా కనిపించడం జరిగింది. మీడియా తో ...
READ MORE
హత్రాస్ బాధిత యువతి మరియు నిందుతుడు సందీప్ ఠాకూర్ స్నేహితులా.? రోజుకో మలుపు తిరుగుతున్న కేసు.
దేశ వ్యాప్త చర్చకు దారి తీసిన ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో బాధిత యువతీ నీ మొదట అత్యాచారం చేసి నాలిక కోసి హత్యా యత్నానికి పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు పలు మీడియా ...
READ MORE
ఫోన్లు చూస్తూ నడిస్తే జరిమానా: హవాయిలో కొత్త చట్టం
హువాయిలోని హోనోలులు నగరంలో నడిచేప్పుడు ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు చూడటంపై నిషేధం విధించారు. ఈ మేరకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. బుధవారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. ఎవరైనా నడిచేప్పుడు ఫోన్‌ చూస్తూ కన్పించారో వారికి 35 డాలర్ల జరిమానా ...
READ MORE
ముస్లిం దేశం ఇండోనేషియా యువరాణి హిందూ మతం స్వీకారం.!!
ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాలలో ఇండోనేషియా దేశం ఒకటి. అక్కడ రాజుల పాలన నడుస్తోంది. కాగా తాజాగా ఆ దేశం యువరాణి "కంజెంగ్ రాదెన్ ఆయు మహింద్రానీ" హిందూ మతం స్వీరించింది. ప్రస్తుతం ఇండోనేషియా దేశం ముస్లిం నుండి హిందూ మతంలోకి ...
READ MORE
అజ్ఞాతంలోకి వెళ్లిన డేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్ నేపాల్ లో తేలింది..!
డేరాబాబా అరెస్ట్ తరువాత సచ్చసౌదాలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. సచ్చసౌదా గురువు డేరాబాబా రామ్ రహీం సింగ్ శిక్ష ఖరారవడంతో ఆయన దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ కనిపించకుండా పోయింది.  అయితే అజ్ఞాతంలోకి వెళ్లిన హనీ ఇన్సాన్ ఆచూకీ ఎట్టకేలకు తెలిసిపోయింది. ఆమె ...
READ MORE
వేగం పెంచిన రాజ్ న్యూస్.. మొదటి దశ ఇంటర్వ్యూలు పూర్తి.
తెలుగు మీడియాలోకి సరికొత్త అస్త్రంగా దూసుకు వస్తున్న కోమటి రెడ్డి బ్రదర్స్ రాజ్ న్యూస్ అభ్యర్థుల ఎంపికలో వేగాన్నిపెంచింది. మెరికల్లాంటి అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈనెల 17న ఇంటర్వ్యూలను నిర్వహించింది. తెలంగాణ వ్యాప్తంగా జిల్లా స్టాఫర్ల కోసం.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ...
READ MORE
స్టేజీ మీద తొడకొడతాడు.. రోడ్డు పైన పరిగెడతాడు.. BJYM నేతల అటాక్ తో ఖంగుతిన్న బాలయ్య.!!
చెప్పలేని రాయలేని ఛండాలమైన భాషలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పై అనుచితంగ మాట్లాడిన నటుడు టీడీపీ ఎంఎల్ఏ బాలక్రిష్ణ పై ఆకస్మిక దాడికి ప్రయత్నించారు బీజేవైయం నేతలు. ఆయన ఇంటిని ముట్టడించారు యువమోర్చ నేతలు. రోడ్డు పై బాలక్రిష్ణ ...
READ MORE
ధనుర్మాసం సంధర్భంగ చీర్యాల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.
తెలంగాణ రాష్ట్రంలోనే యాదాద్రి నరసింహుడి తర్వాత ఆ స్థాయిలో పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల లోని శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి నకసింహ స్వామి దేవస్థానం. ఈ పుణ్యక్షేత్రం భక్తులకు కొంగుబంగారంగ, కోరిన కోరికలకు నెలవుగ ...
READ MORE
సిఎం గారూ.. ఈ టీటీడీ చైర్మణ్ మాకొద్దు.! ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు.!!
అనుకున్నట్టుగానే గత కొంత కాలం నుండి వస్తున్న వార్తల ప్రకారమే తాజాగా నిర్ణయం తీసుకున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కోట్లాది మంది హిందువుల ఆరాద్యుడు కలియుగ దైవం అయిన తిరుమలేశుడి ఆస్థానానికి చైర్మణ్ గ ఏ ...
READ MORE
చిరునవ్వుకు దూరమవుతున్న చిన్నారి లోకం.. కారకులెవరు.??
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా.. ఎన్ని "షీ" టీం లను ఏర్పాటు చేసినా చిన్నారి బాలికల మాన ప్రాణాలకు రక్షణ కరువవుతోంది. ప్రతిసారి ఎక్కడో అక్కడ మానవ మృగాలు తమ వికృత రూపాన్ని ప్రధర్శిస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా సోన్ ...
READ MORE
లారీ డ్రైవర్ల ప్రాణాలను కాపాడేందుకు నడుం బిగించిన కేంద్ర ప్రభుత్వం.!
దేశ వ్యాప్తంగా లారీలు, ట్రక్కులు నడిపే డ్రైవర్ల ప్రాణాలు కాపాడేందుకు.. హైవేల పై ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన ప్రకటన పాలసీలను ప్రవేశపెడుతోంది ఇందుకోసం లారీల యాజమాన్యాలు కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని సూచించింది. హైవేల పై జరుగుతున్న ప్రమాదాలకు ఈ ...
READ MORE
ఒక “ఛాన్స్” కావాలంటే నలుగురికి “ఛాన్స్” ఇవ్వాల్సిందే..! ఎవ్వరూ పతివ్రతలు కాదని తేల్చేసిన హీరోయిన్.!!
టాలివుడ్ బ్రేకింగ్ న్యూస్:- ఇంకా డ్రగ్స్ విచారణలను మరవకముందే టాలివుడ్ లో కుదుపు.. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో గలీజ్ లెక్కలన్నీ బయటపడుతున్నై.. గత కొద్ది రోజులుగా తెలుగు హీరోయిన్ శ్రీ రెడ్డి బహిరంగంగా ఇండస్ట్రీ లోగుట్టు మొత్తం బయటపెడుతూ రచ్చ రచ్చ ...
READ MORE
ఒకటి రెండై… రెండు ఒకటై.. ఈ వారం బార్క్ రేటింగ్ లో దూసుకొచ్చిన ఎన్ టివి.
బార్క్ రేటింగ్ లో ఈ సారి స్థానాలు మారాయి. ఎప్పుడు టాప్ లో దూసుకు వెళుతున్న టీవి 9 కి ఈ సారి బార్క్ ఫలితాలు కలిసి రాలేదు. కొద్ది తేడాతో టాప్ వన్ ర్యాంకును చేజార్చుకుంది. ఎప్పటి నుండో కలలు ...
READ MORE
తెలంగాణ అమరవీరుల ఆశయాన్ని సాధిస్తాం – డా.లక్ష్మణ్
60 ఏండ్ల ఆంధ్రా నిరంకుశ పాలకుల చెర నుండి తెలంగాణ ప్రాంతం విముక్తి చెంది ప్రత్యేక తెలంగాణ గ ఏర్పడ్డ రోజు నేటి జూన్ 2 తేది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగేల్లు గడిచిన సంధర్భంగ ప్రత్యేక రాష్ట్రం కోసం ...
READ MORE
పాయింట్స్ సరే… మరీ నా గాయాలకు కారణం ఎవరు సార్..?
హైదరబాద్ లో అమలు కాబోతున్న ట్రాపిక్ పాయింట్స్ రూల్స్ పై ప్రజల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. మంచివే కానీ... అంటూ ధీర్ఘంతో కూడిన సమాదానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ.. ట్రాపిక్ రూల్స్ పేరు తో ...
READ MORE
దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామని నినాదాలు చేస్తే వీల్లెందుకు మౌనంగ ఉన్నారు.?
గతంలో అసహనమంటూ కొద్ది రోజులు హల్ చల్ చేసిన బ్యాచ్ మరోసారి మీడియాకెక్కుతున్నారు. మొన్న జులై 23 నాడు ఓ నలబై తొమ్మిది మంది కలిసి జై శ్రీ రాం నినాదం వద్దంటూ మరియు దళితులపై మైనారిటీల పై దాడులు జరుగుతున్నాయంటూ ...
READ MORE
నాకు సెంచరీలు రికార్డులు సంతృప్తి ఇవ్వవు.. – రోహిత్ శర్మ
మొన్నటిదాక నోటి దూల చూపించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడెక్కడా.!! నిలదీస్తున్న
బ్రేకింగ్- భారత్ పై బయో ఉగ్రవాదానికి పాకిస్తాన్ విఫలయత్నం.!!
పీవీ సింధు సాధించిన ఘనతేంటి.? ఈ గిరిజన యువకుడు చేసిన
అయోధ్య రామ మందిర పునర్నిర్మాణంలో బయటపడ్డ 5 అడుగుల శివలింగం.
ప్రియాంకకున్న మానసిక వ్యాధి పేరు వెల్లడించిన సుబ్రహ్మణ్యస్వామి.!!
కలియుగ దైవానికి బంగారు కాసుల హారం..
తెలంగాణ వంజరి సంఘం వార్షికోత్సవాలను విజయవంతం చేయండి- ఆముద లక్ష్మణ్
అమెరికాలో కూడా లోకేష్ బాబు తన స్టైల్ చూపించాడు.! మరోసారి
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
హత్రాస్ బాధిత యువతి మరియు నిందుతుడు సందీప్ ఠాకూర్ స్నేహితులా.?
ఫోన్లు చూస్తూ నడిస్తే జరిమానా: హవాయిలో కొత్త చట్టం
ముస్లిం దేశం ఇండోనేషియా యువరాణి హిందూ మతం స్వీకారం.!!
అజ్ఞాతంలోకి వెళ్లిన డేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్ నేపాల్ లో తేలింది..!
వేగం పెంచిన రాజ్ న్యూస్.. మొదటి దశ ఇంటర్వ్యూలు పూర్తి.
స్టేజీ మీద తొడకొడతాడు.. రోడ్డు పైన పరిగెడతాడు.. BJYM నేతల
ధనుర్మాసం సంధర్భంగ చీర్యాల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో
సిఎం గారూ.. ఈ టీటీడీ చైర్మణ్ మాకొద్దు.! ఆగ్రహం వ్యక్తం
చిరునవ్వుకు దూరమవుతున్న చిన్నారి లోకం.. కారకులెవరు.??
లారీ డ్రైవర్ల ప్రాణాలను కాపాడేందుకు నడుం బిగించిన కేంద్ర ప్రభుత్వం.!
ఒక “ఛాన్స్” కావాలంటే నలుగురికి “ఛాన్స్” ఇవ్వాల్సిందే..! ఎవ్వరూ పతివ్రతలు
ఒకటి రెండై… రెండు ఒకటై.. ఈ వారం బార్క్ రేటింగ్
తెలంగాణ అమరవీరుల ఆశయాన్ని సాధిస్తాం – డా.లక్ష్మణ్
పాయింట్స్ సరే… మరీ నా గాయాలకు కారణం ఎవరు సార్..?
దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామని నినాదాలు చేస్తే వీల్లెందుకు మౌనంగ
Facebook Comments
Top
error: Content is protected !!