
మనోహర్ పారికర్.. ఈ పేరు చెపితే ఓ గొప్ప రాజకీయ నాయకుడు కనిపిస్తాడు. దర్జా దర్పాన్ని పక్కకు నెట్టి సీఎం అంటే కామన్ మ్యాన్ అని నిరుపించిన ( ముఖ్యమంత్రి ) ఛీప్ మినిస్టర్ కనిపిస్తారు. ఆయనకు సంబందించిన ఓ విషయం ఇప్పుడు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతుంది. దేశ రక్షణ వ్యవస్థకు మంత్రిగా ఉన్న ఆయన్ని గోవా రా రమ్మంటు స్వాగతం పలుకుతోంది. అంతగా ఆయనే గోవాకు ముఖ్యమంత్రి కావాలని ఎందుకు కోరుకుంటుందో.. ఈ కింది విషయం చదివితే మీకే అర్థం అవుతుంది. సోషల్ మీడియాలో తన అభిమానాన్ని చాటుతున్న ఈ మెసెజ్ మీకోసం.
గోవా కాబోయే ముఖ్యమంత్రి మనోహరు పారికర్. అవును గోవా ముఖ్యమంత్రిగా ఆయనే మాకు కావాలని అటు ప్రజలు ఇటు ప్రతిపక్షాలు కూడ పట్టుబడుతున్నాయి. అది ఆయన గొప్పతనం అంటే.. గోవా అంటే తెలియని వారుండరు. సంతోషాలకు, ఆనందాలకు పెట్టింది పేరు గోవా. టూరిజంలో దేశంలో టాప్ లో నిలుస్తోంది. విదేశీయులకు అత్యంత నచ్చిన ప్రదేశం కూడ గోవానే. ఆ నగరానికి ఇప్పుడు సీఎంగా పారికర్ ను కావాలని కోరుకుంటుంది. ఎందుకు కావాలనుకుంటొందో ఓ చిన్న కథ రూపంలో..
గోవా నగరం లో ఒక ట్రాఫిక్ సిగ్నల్ పడింది ఆది చూసి స్కూటెర్ నడుపుతున్న ఓ వ్యక్తి బండి ఆపేసాడు. వెనుకగా ఒక కార్ వచ్చింది.. ఒకటే హారన్ కొడుతూ దారి ఇవ్వమని గోళ చేస్తున్నాడు. స్కూటర్ పైన ఉన్న వ్యక్తి రెడ్ లైట్ చూపాడు. నాకు తెలుసులే నువ్ తప్పుకో నేను గోవా పోలీస్ ఆఫీసర్ కొడుకుని అన్నాడు. స్కూటర్ మీదున్న వ్యక్తి చిన్నగా నవ్వి నేను గోవా ముఖ్యమంత్రిని అన్నాడు. అంతే ఆ అబ్బాయి మారు మాట్లాడలేదు. ఒక సామాన్య ముఖ్య మంత్రి. అసెంబ్లీ కి స్కూటర్ మీద వెళతారు. అక్కడ ప్రోటోకాల్ అవసరం ఉండదు. పోలీస్ కేస్ లలో నాయకుల జోక్యం ఉండదు. అదే గోవా. పారికర్ పాలనలో సాగిన గోవా. ఆ తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉన్న పారికర్ ను కేంద్ర పిలిచి కేంద్ర మంత్రి పదవి ఇచ్చి స్వాగతిచింది. ఒక ముఖ్య మంత్రి తమ రాష్ట్రం నుండి కేంద్ర మంత్రిగా వెళుతున్నారంటే ఏ రాష్ట్ర ప్రజలైన సంతోషిస్తారు. కానీ ఆయన్ని గోవా ముఖ్యమంతి పదవికి రాజీనామా చేసి కేంద్ర రక్షణ మంత్రి బాధ్యతలు స్వీకరించామని కొరినపుడు యావత్ గోవా కంట తడి పెట్టింది. రాజకీయ నాయకులు అంటేనే అసహ్యం జుగుప్సు ఉన్న ఈ రోజుల్లో తమ నాయకుడు తమని వదిలి కేంద్రానికి వెళుతున్నారంటే ప్రజలు కన్నీరు పెట్టారంటే ఆయన ఎంత పెద్ద నాయకుడో ఇట్టే చెప్పొచ్చు. ట్రాఫిక్ జాం ఐతే కార్ దిగేసి స్కూటెర్ పై ఉన్న వాడిని లిఫ్ట్ అడిగెస్తాడు. బడ్డీ కొట్టు లో టీ తాగేస్తాడు. ఫుట్ పాత్ పై ఉన్న బజ్జీలు తింటాడు. అదేమిటి అని అడిగితే మన పాలన గురించి బడ్డీ కొట్టు లో తెలిసినంత మరెక్కడా తెలీదు అంటూ ఓ చిరునవ్వుతో సమాధానం ఇస్తాడు.
పారికర్ గారు గోవా ముఖ్య మంత్రిగా ఒక కాన్ఫరెన్స్ కి హాజరు కావాల్సి ఉంది కార్ ఆగింది.. ఒక వ్యక్తి దిగి ఒక చేత్తో బాగ్ మరో చేత్తో ఫైల్స్ మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెనక సెక్యూరిటీ వచ్చారు ఎక్కడ గోవా ముఖ్య మంత్రి అని అడిగారు.. అదిగో ఫైల్స్ మోసుకెళుతున్న వ్యక్తే మా ముఖ్యమంత్రి అని గొప్పగా గర్వంగా చెప్పరాట సెక్యూరిటీ. ఇది ఆయనకు ప్రతి వ్యక్తి ఇచ్చే గౌరవం. తీరా లోపలికెళ్లాక ఆ స్టార్ హోటెల్ గేట్ వద్ద ఉన్న వ్యక్తి ఎవరు మీరు లోపలికి వెళుతున్నారు అని ఆపేశారట వెనక నుండి సెక్యూరిటీ పరుగెత్తుకుంటు వచ్చి ఆయన మా ముఖ్య మంత్రి అని చెబితే అక్కడున్న వారంతా అవాక్కయ్యరంట.. అది పారికర్ జి సాదా సీదా జీవితం. హంగు ఆర్బాటాలు ఉండవు.. ప్రొటోకాల్ ఉండదు.. మంది మార్బలం అసలు అవసరం ఉండదు. కేవలం నేను ముఖ్యమంత్రిని కేవలం నేను నా రాష్ట్రానికి నా ప్రజలకు పాలించే అధికారిని మాత్రమే అంటారాయన. ఇది పారికర్ జీ గొప్పతనం. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అంటే ఘనస్వాగతాలు.. ఇచ్చిన వింధు నచ్చకపోతే ఛీత్కారాలు.. గొప్పలకు పోయి పాలభిషేకాలు.. అవి చేయకపోతే కార్యకర్తలకు దండనలు. ఇది నేటి కాలంలో సీఎం ల తీరు. కానీ మనోహర్ పారికర్ ఇప్పటికి ఎప్పటికి ఆయన సీఎం నే.. అవును నేనే సీఎం నే మీరనుకుంటున్న ముఖ్యమంత్రిని కాదు కామన్ మ్యాన్ ని అంటాడాయన. ఇది ఆయన చరిత్ర.. ఇప్పుడు అర్థం అయి ఉంటుంది కదూ ఎందుకు ఆయనే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారో.
























