
ఖాకీ చొక్కా వేసుకోవాలి.. నెత్తిన టోపి చేతిలో లాఠీ పట్టి సమాజాన్ని సెట్ చేయాలి. నీతి నిజాయితీకి మారు పేరుగా నిలవాలి. పోలీస్ అవ్వాలనుకునే ప్రతి ఒక్క యువకుని మనసులో మాట. తీరా కష్టపడి స్టేట్ రూట్ లో జాబ్ సాదించి ట్రైనింగ్ అంతా పూర్తి చేసుకుని ఉద్యోగంలోకి చేరడమే ఆలస్యం.. అంతకు ముందు వరకు అనుకున్న నీతివంతపు పలుకులు ఖాకీ చొక్కా మాటున కరిగిపోతున్నాయి. నేనేరా పోలీస్ అనే అహంకారం వెంటనే ఒంటికి పట్టేస్తుంది. మాటలో గాంభీర్యం కాస్త బలుపుగా మారుతుంది. ఆ బలుపు పేరే నయా ఖాకీ గిరి. దాదలకే దాదాలుగా చలామణీ అవుతున్న చోటా డాన్ల పై వరుస కథనాలకు ఈ కథతోనే అంకురార్పన.. అనుకున్న ప్రకారం కరీంనగరం నుండి మొదలు పెట్టాలి కానీ భాగ్యనగరం పోలీసులు సార్ మేమే ది బెస్ట్ నీతి – అవినీ తి పోలీస్ లం మా నుండే ఏదైనా అంటున్నారు. సో జంట నగరాల నుండే ప్రారంభిస్తున్నాం. ఖాకీల నీతి – అవినీతి కథలకు అంకురార్పన గచ్చీబౌలీ నుండి.
ఓ ప్రధాన పత్రిక ప్రచురించిన వివరాల ప్రకారం… సైబరాబాద్‌కు గుండెకాయ లాంటి గచ్చీబౌలీ పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ల ఇన్స్పెక్టర్ తిష్ట వేశారు అని పేర్కొంది. ఇదే విషయాన్ని నిజమా కాద తెలుసుకునేందుకు జర్నలిజంపవర్ ప్రయత్నించింది. నిజమే ఆ పోలీస్ పెద్దల అండతో రెచ్చిపోవడం వాస్తవమే అని తేలింది. ఇక అతని వెర్సన్ మాత్రం మరోలా ఉంది. అయితే నిజాలు , వాస్తవాలు మాత్రం అతని అవినీతినే ఎత్తి చూపుతున్నాయి. ఏకంగా సదరు పోలీస్ దాదగిరికి ఆత్మహత్యలే శరణ్యం అనే అంత రేంజ్ లో ఇతని ఇబ్బందులు ఉన్నాయన్నది బాధితులు చెపుతున్న కథనం.
పేరు జూపల్లి రమేశ్ కుమార్… ప్రస్తుతం గచ్చిబౌలి స్టేషన్లో సీఐ. మూడేళ్లుగా ఒకే స్టేషన్లో కదలకుండా ఉంటున్నాడు. సెటిల్మెంట్ల కింగ్ అని పేరు మూటగట్టుకున్నాడు. బలవంతుడు బలహీనున్ని తొక్కడం కామన్.. ఇక్కడ జరుగుతుంది కూడా అదే… ఇంకా కాస్త బలం ఉన్న వ్యక్తుల కేసులు వస్తే మనోడి చేతికి మట్టి అంటకుండానే పని జరిగిపోద్ది.
గచ్చిబౌలీ ఎలాగు ఐటీ కారిడార్.. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డా.. అలాంటి స్టేషన్ వదులుకోవడం అంటే బంగారు గుడ్లు పెట్టే బాతును వదులుకున్నట్టే అన్నది రమేష్ కుమార్ ఆలోచన. అందుకు గానూ ఏకంగా ఐటీ మంత్రి పేరునే వాడుకుంటున్నాడు. ఎవరైనా నిలదీస్తే వెంటనే వచ్చే సమాధానం… రాష్ట్ర మంత్రి కేటీఆర్ నా క్లాస్మేట్… చుట్టం… మా ఇద్దరిదీ ఒకే ఊరంటాడు. ప్రదాన పత్రిక రాతలే కాదు అక్కడి సామాన్యులు చెపుతున్న మాట కూడా ఇదే… ఐటీ కారిడార్‌లోని రియల్ ఎస్టేట్ వ్యాపారంపై కన్నేసిన అతగాడిపై గతంలోస్పెషల్ బ్రాంచ్ పోలీసులు పలు నివేదికలు ఇచ్చినా అవన్ని చెత్త బుట్టలోకే వెళ్లాయి. కారణం పెద్దల అండ. సిన్సియర్ ఆఫీసర్లు వచ్చిన ప్రతి సారి గమ్మునుండటం ఆ తరువాత వాళ్లు బదిలీ అవగానే రెచ్చిపోవడం ఇది గచ్చిబౌలి సీఐ జూపల్లి. రమేష్ దారి. గతంలో సందీప్ శాండిల్య కమిషనర్‌గా వచ్చాక కొన్ని రోజులు ఈ దారిలోనే నడుచుకున్నాడు ఇతగాడిపై ఎన్ని ఎంక్వయిరీ లు వేసిన లాభం మాత్రం శూన్యం. గతంలో మాదాపూర్ స్టేషన్లో ఎస్సైగా ఉన్నపుడు కేసు ఉపసంహరించుకోకుంటే కాల్చి వేస్తానని ఒక న్యాయవాదిని సర్వీస్ రివాల్వర్‌తో బెదిరించాడు. ఆ న్యాయవాది ఎస్సై కారణంగానే చనిపోతున్నానని లేఖరాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో అదో సంచలనం..ఇదే కారణంగా అతడిని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత నిజామాబాద్‌కు బదిలీ చేశారు. అయితే మనోడికి ఉన్న రాజకీయ బలం పోలీస్ అధికారుల అండంతో తిరిగి సైబరాబాద్ కు పోస్టింగ్ చేయించుకున్నాడు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు స్టేషన్ మారింది లేదు. అయితే గతంలో బెదిరించిన తీరుగానో న్యాయం కోసం వచ్చిన షాహిన్ బేగం అనే మహిళను బెదిరించారన్నది సమాచారం. దీంతో సదరు మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కష్టార్జితంతో సంపాదించుకున్న భూమిని తనకు దక్కకుండా సీఐ రమేష్ చేస్తున్నాడని బాధితురాలి ఆరోపణ. ఎస్సై గా ఉన్నప్పుడే రెచ్చిపోయిన రమేష్.. సీఐ గా మారాక ఆగకుండా ఉంటాడా అన్నది అసలు ప్రశ్న…?
























