You are here
Home > తాజా వార్త‌లు > సర్.. యాదిలో..రెండేళ్లు. భువి నుండి దివికేగిన కలాంకు సలామ్.

సర్.. యాదిలో..రెండేళ్లు. భువి నుండి దివికేగిన కలాంకు సలామ్.

సార్ వెళ్లిపోయి అప్పుడే రెండెళ్లయింది. నిన్న మొన్న మనల్ని విడిచి వెళ్లినట్టు తోస్తోంది. అయినా ఆయనెక్కడికెళ్లాడు.. ప్రతి నిమిషం ప్రతి క్షణం మన కణకణం రగిలిస్తూ మనలో కొత్త భావాలను పుట్టిస్తూ మనసే మతం మనమే కులం మన బాటే ధర్మం అంటూ తన మాటలతో చేతలతో సేవతో ఇంకా ఇంకా కొత్తదనాన్ని మనలో నింపుతూనే ఉన్నాడు. జస్ట్ అలా అంతరిక్షంలో ఏవో లోపాలుంటే బ్రహ్మతో మాట్లాడి.. చంద్రునికి సలహాలిచ్చి అటు నుంచి అటు శని, అంగారక , బుధ గ్రహాలకు సూచనలు చేసి అటు నుండి అటు నక్షత్ర మండలాలను ఓ సారి చూసోద్దామని వెళ్లాడంతా. ఆ పని మొత్తం పూర్తయ్యాక మళ్లీ తప్పక తిరిగొస్తా అని ఈ భూతల్లి భరత మాతకు మాట కూడా ఇచ్చి వెళ్లాడు. ఆయనెల మరుస్తాడు రాకని.

కలలు కను సాదించే వరకు కంటూనే ఉండూ ఏదో ఓ నాడు నీ కల నిజమై నీ కళ్ల ముందు నిలస్తుంంటాడు. పోరాటం నీలో నీతో నీ ప్రపంపంచంతో అంటూ కొత్త లోకలంలోకి తీసుకెళుతాడు. పేదరికం అంటే కడుపు నిండా తినడానికి లేకపోవడం కాదు ప్రశాంతంగా నిదురించే సమయం లేక పోవడమంటాడు. ఎన్నో వేవేలా మాటలు ఎందరినో సన్మార్గంలో నడిపిన చేతలు ఆయనవి. భారత దేశంలో పుట్టి ముస్లిం మత సిద్దాంతాల్లో పెరిగి తనది కానీ సొమ్ముతో పెద్దోడి కడుపు నింపకూడదన్న ఒకే ఒక్క నిర్ణయంతో ఇప్తార్ వింధులకు దూరంగా ఉన్న నికర్సైన ముస్లిం అతను. ఆయన్ని ఒక మతం తోనో ఒక కులం తోనే చూసే కనులు ఈ దేశంలో ఎక్కడా కనిపించవు.. ప్రపంచం సైతం ఆయనలో ఒఓ మహత్మున్ని తప్ప మరో రకంగా చూసిన ఆనవాళ్లు లేవు అందుకే ఆయన ఈ భువిని వీడి రెండేళ్లయినా ఇంకా మన మధ్యలపొనే ఉన్నాడు.

ఆయన గురించి మనకు తెలియని ఇంకా కొన్ని నిజాలు ఆయనకు పర్సనల్ సెక్రటరీగా చేసిన పీఎం నయార్ మాటల్లో…

మనం మన జీవితంలో ఇంకో కలాంను చూడలేము.
–  పి ఎం నాయర్

అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతిగా వివిధ దేశాలు పర్యటించినపుడు. ఆయనకు ఆయా దేశాల వారు ఇచ్చిన బహుమతులను తిరస్కరిస్తే అది వారి దేశాన్ని అవమానించినట్టు వారు బాధపడతారని అది
మన దేశాన్ని ఇరకాటం లో పెడుతుంది అని వాటిని  బలవంతంగా అయినా తీసుకునే వారు. బహుమతులు స్వీకరించడం ఆయనకు ఎంత మాత్రం ఇష్టం లేదు. అయినా ఇండియా తిరిగి రాగానే వాటికి ఫోటో తీయించి వాటికి కేటలాగు తయారు చేయించి అన్నీ ఆర్కైవ్స్ లో భధ్రపరిచేవారు. ఆయన రాష్ట్రపతి భవన్ విడిచి వెళ్ళేటపుడు ఒక్క పెన్సిల్ కూడా వాటిలోనుండి తనతో తీసుకు వెళ్ళలేదు. తను సంపాదించుకున్న సంపాదనంతా తన జ్ఞానమే ఎల్లప్పుడు నాతోనే వస్తుంది కదా అన్నది ఆయన ఆలోచన.

2002 లో రంజాన్ జూలై ఆగస్ట్ నెలలో వచ్చింది. మనదేశం లో రాష్ట్రపతి ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆచారం. ఒకరోజు కలాంగారు నన్ను పిలిచి ఇఫ్తార్ విందుకు ఎంత ఖర్చ అవుతుంది అని అడిగారు. దాదాపు 22 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పాను.
బాగా స్తోమత ఉన్నవారికి విందు ఇవ్వ్వడం కోసం అంత ఖర్చు పెట్టడం అనవసరమా.. ఆ సొమ్మును పేదవారికి బ్లాంకెట్లు, బట్టలు, ఆహారం ఇవ్వడం కోసం
కేటాయించండి ఆ డబ్బును అనాదాశ్రమాలకు ఇవ్వమని చెప్పారు. అనాదాశ్రమాల పేర్లు ఎంపిక చేసే పని కొందరికి అప్పచెప్పారు. అందులో ఆయన ఎటువంటి జోక్యమూ చేసుకోలేదు.

ఎంపిక అయ్యాక నన్ను తన రూమ్ లోకి పిలిచి ఈ లక్ష రూపాయలూ నా వ్యక్తిగత సంపాదన, నేను ఇచ్చే ఈ సొమ్ము విషయం ఎవరికీ చెప్పకండి అన్నారు. నేను ఈ విషయం అందరికీ చెబుతాను అంటే ఆయన వద్దు అన్నారు. తను ఖర్చు పెట్టదగిన సొమ్ము తన సొమ్మూ కూడా ఇలా ఖర్చు పెట్టిన వ్యక్తి ఇంకొకరులేరు.
“ఇఫ్తార్ పార్టీ ఇవ్వని నిఖార్సయిన ముస్లిం రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం జీ ఒక్కరే”

కలాం గారికి తన మాటలకు అందరూ “ ఎస్ సర్ “ అనాలి అనే నైజం లేదు. ఒక రోజు సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారితో చర్చల సందర్భంగా ఏమంటావు నాయర్ అని నన్ను అడిగారు.
“ నో సర్ !  “ అన్నాను. కలాంగారు మౌనంగా ఉండి పోయారు. మీటింగ్ అయ్యాక ప్రధాన న్యాయమూర్తి గారు నన్ను పిలిచి అలా No అన్నారేమిటండి అన్నా రు. ఆయన తరువాత నన్ను నా అభిప్రాయం చెప్పమని అడుగుతారు సర్..! విని అవసరం అయితే అయన తన అభిప్రాయం మార్చుకుంటారు సర్
అని నేను అన్నాను ప్రధాన న్యాయమూర్తి ఇది విని ఆశ్చర్య పోయారు.

కలాం గారు ఒక సారి తన బంధువులను సుమారు
50 మందిని రాష్ట్రపతి భవన్ కు అతిధులుగా పిలిచారు. వారికి ఢిల్లీ చూపడానికి ఒక బస్సును ఆయన బుక్ చేయించారు. దానికి అయిన ఖర్చును ఆయన చెల్లించారు. ఒక్క అధికారిక వాహనం కూడా ఆయన వారికి కేటాయించలేదు. వారికోసం అయిన ఖర్చును లెక్క కట్టించారు. అది సుమారు రెండు లక్షలు అయ్యింది . ఆ రెండు లక్షలూ ఆయన చెల్లించారు. ఈ దేశ చరిత్రలో ఇటువంటి సంఘటన ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. ఆయన అన్నయ్యను ఒక వారం రోజులు తనతో పాటే అట్టే పెట్టుకున్నారు. ఆ రోజులకి ఆయన అద్దె చేల్లిస్తాను అంటే మాత్రం ఎవరూ ఒప్పుకోలేదు. ఒక రాష్ట్రపతి తన అన్నయ్యను తనతో పాటు అట్టేపెట్టుకున్నందుకు తన నివాసానికి తానే అద్దె చెల్లించాలి అనే నిజాయతీని మేము భరించలేము అని మేము ఒప్పుకోలేదు.

ఆయన రాష్ట్రపతి భవన్ వదిలి వెళ్ళేముందు. అందరమూ ఒక్కొక్కరుగా కుటుంబాలతో వెళ్ళి కలిశాము. అందరినీ పేరు పేరునా పలకరించారు.
నా భార్య కాలు విరిగినందువలన నాతో రాలేకపోయింది. ఆయన అడిగారు నా భార్య ఎందుకు రాలేదు అని అడిగారు.?? నేను కారణం చెప్పాను.

మర్నాడు మా ఇంటి ముందు పోలీస్ లు. ఏమిటి హడావుడి అని అడిగితే రాష్ట్రపతి గారు మా ఇంటికి వస్తున్నారు అని చెప్పారు. ఇంతవరకూ ప్రపంచంలో ఏ దేశాధినేత తన వద్ద పనిచేసే ఒక ఉద్యోగి భార్య కాలు విరిగింది అని తెలిసి అతడి ఇంటికి వెళ్ళి ఆమెను పరామర్శించినట్టు చరిత్రలో ఎక్కడా జరగలేదు.

ఇక ఆయన చివరిగా రాష్ట్రపతి అనంతరం ఆస్తిగా తీసుకెళ్లింది ఒక టి వి మాత్రమే.. ఆయన ఆస్తి వివరాలు ఇవే…
1) 3 పాంట్లు 2) 6 షర్టులు 3) 3 సూట్లు 4) 1 వాచ్
5) 2500 పుస్తకాలు 6) Scientists Community Bangalore వారు ఆయనకు ఎప్పుడో ఇచ్చిన ఒక ఇల్లు 7) ఇంచుమించు సున్నా బ్యాంకు బాలన్స్
8) 120 మంది కోట్ల భారతీయుల ప్రేమాభిమానాలు.

ఇంత గొప్ప మహానుభావుడిని మనం కళ్లారా చూశాం. కొందరైతే ఆయనతో ఫోటోలో కరచాలనాలు ఆయన ఉపన్యాసాలు విన్నారు. మరీ అంతగొప్ప వ్యక్తి నడయాడిన ఈ నేలపై కొంత మార్పైనా రావాలి కదా. అందుకే బాస చేద్దాం రెండేళ్లే ఆయన వెళ్లిపోయి మరో ఏడాకే ఆయన తిరిగొచ్చేలా దేశాన్ని మార్చుకుందాం. జయహో కలాం.. మీకు మా సలాం. జోహర్లు కలాం జీ. మీ విశ్వ అంతరిక్ష ప్రయాణం పూర్తి చేసుకుని త్వరగా రండి.

 

https://youtu.be/EVoWrM73sKA 

Related Posts
నేషనల్ మీడియా ముందు రాహుల్ గాంధీ గాలి తీసేసిన వివేక్ ఒబెరాయ్.!!
భారత ప్రధాని నరేంద్ర మోడి జీవిత కథ ఆధారంగ తెరకెక్కించిన చిత్రం "పిఎం నరేంద్ర మోడి".ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కావాల్సి ఉన్నా.. ఎన్నికల్లో ఈ చిత్రం వల్ల నరేంద్ర మోడి కి మైలేజ్ పెరుగుతుందని ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు ...
READ MORE
పసిపిల్లలకు తల్లిపాల(బ్రెస్ట్ ఫీడింగ్) లోటును తీరుస్తున్న పాల దేవత.!
అవును నిజంగనే ఆమె తల్లిపాలకు నోచుకోని పసిపిల్లల పాలిట కన్న తల్లి స్థానంలో పాల తల్లిగా వెలసిన దేవతే అని చెప్పాలి, ఆవిడే.. అమెరికా దేశం ఓరెగాన్ రాష్ట్రం బేవర్టన్ నగరానికి చెందిన ఎలిజబెత్ అండర్సన్ సియార్రా.!! సీయారా కు అత్యంత అరుదుగా ...
READ MORE
పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??
మాకు కాశ్మీర్ వద్దు కానీ, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ని ఇవ్వండంటూ వినూత్నంగ నిరసన వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ క్రికెట్ ప్రేమికులు.ఇంగ్లాండ్ మాంచెస్టర్ వేదికగ జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ లో మరోసారి పాకిస్తాన్ టీం ...
READ MORE
రెండేల్లుగ తన అన్న ఆత్మశాంతి కోసం కమ్యునిస్ట్ ప్రభుత్వం పై పోరాటం చేస్తున్న తమ్ముడు.!!
తన అన్నది సహజ మరణం కాదు పోలీసుల చిత్ర హింసల వల్లే చనిపోయాడని కానీ కానీ అనారోగ్యంతో చనిపోయాడని అధికారులు అబద్దం చెప్తున్నారనీ తన అన్న మరణం పై సీబిఐ తో స్పెషల్ జడ్జీతో విచారణ చేయాలని న్యాయ పోరాటం చేస్తున్నాడు ...
READ MORE
జనసేనతో మాజీ జేడీ లక్ష్మి నారాయణ బంధం ముగిసినట్టేనా.?
టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ నుండి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి గ పోటీ చేసి ఓడిపోయిన సీబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ జనసేన పార్టీ కి గుడ్ బై చెప్పనున్నటు ...
READ MORE
ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉగ్రవాది.. 18 మంది దుర్మరణం.!
పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఓ ఉగ్రవాది తనకుతానే బాంబు ను పేల్చేసుకోవడంతో 18 మంది దాడి జరిగిన ప్రదేశంలో అక్కడికక్కడే మరణించగా.. మరో 30 మంది వరకు తీవ్రంగ గాయపడ్డటు తెలుస్తోంది. బలూచిస్తాన్ లోని ప్రావిన్స్ లో ఉన్న జుల్ ...
READ MORE
ప్రశ్నిస్తే.. కేసులు పెట్టడం అప్రజాస్వామ్యం.!!
తాజాగా ఖమ్మం జిల్లా కామేపల్లి హరిశ్చంద్ర పురం లో జరిగిన ఘటన కారణంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం కట్టిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణాల్లో నాణ్యత లోపించిందని అక్కడ కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లను ...
READ MORE
మంత్రి పద్మరావు చేతుల మీదుగా “కళ్లకద్దుకునె చరితరా” పాట విడుదల
ఉస్మానియా వందేళ్ల గొప్పతనాన్ని పాట రూపంలో తీసుకు వచ్చింది జర్నలిజంపవర్.కాం వెబ్సైట్. ఈ పాటను తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు పద్మరావు గౌడ్ గారు క్యాంప్ ఆఫీస్ లో ఈ రోజు లాంచనంగా ప్రారంభించారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలను పురష్కరించుకుని ...
READ MORE
ఎన్టిఆర్ బయోపిక్.. బాలయ్యకు మాత్రం భయంకర పిక్ గ మిగిలిపోయింది.!!
స్వర్గీయ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జీవిత కథ అంటూ ఆయన కుమారుడు టీడీపీ ఎంఎల్ఏ నటుడు బాలకృష్ణ స్వయంగ నటించి నిర్మించిన చిత్రాలు ఎన్టిఆర్ కథానాయకుడు, ఎన్టిఆర్ మహా నాయకుడు.. బయోపిక్ ని రెండు పార్ట్ లుగ తీయడం జరిగింది.ఈ ...
READ MORE
కార్యకర్త హత్య ఘటన, కేసిఆర్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్.!!
తెలంగాణ లో ప్రశాంతంగ ముగిసిందనుకున్న ఎంపీటీసీ జడ్పీటీసీ కౌంటింగ్ ప్రక్రియ తీరా చూస్తే భాజపా యువ కార్యకర్త హత్య తో ఉడికిపోతోంది తెలంగాణ రాష్ట్రం. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్ గ్రామం లో అధికార పార్టీ తెరాస ఎంపీటీసి ...
READ MORE
కర్నాటక లో హిందువులను విభజించి లబ్ది పొందాలని చూస్తున్న కాంగ్రెస్.!!
కర్నాటక లో ఎన్నికల చదరంగం మతం రంగు పులుముకుంటోంది.. హిందువులను విభజించి లబ్ది పొందడానికి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గరపడ్డ సమయంలో ఆ రాష్ట్రం లో 18% ఉన్న లింగాయత్ లను హిందువులు కాదంటూ.. ...
READ MORE
జై శ్రీరాం అంటే అరెస్టులు చేసే దీదీకి, రోహింగ్యా ముస్లింల అల్లర్లలో ప్రజాస్వామ్యం కనబడుతున్నదా..?
పార్లమెంట్ లో పౌరసత్వం సవరణ బిల్లు ప్రజాస్వామ్య పద్దతిలో చట్ట రూపం దాల్చడం ఏమాత్రం నచ్చని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంగ్లాదేశ్ చొరబాటుదారులు రోహింగ్యా ముస్లింలకు మద్దతుగా దేశంలోని ముస్లిం జనాభాను రెచ్చగొడుతూ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ...
READ MORE
చంద్రబాబు తన లైఫ్ లో ఇంతటి ఘోరమైన తిట్లు విమర్శలు ఎదుర్కోవడం మొదటిసారి కావచ్చు.?
పార్టీ కోసం సంస్థ కోసం నిజాయతిగ నిబద్దతతో పనిచేసిన నాయకుడిని వాడుకుని ఆ తర్వాత పక్కకుపడేస్తే.. ఆ నాయకుడు మూడో కన్ను తెరిస్తే ఎలా ఉంటదో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మరియు మోత్కుపల్లి నర్సింహుల యొక్క ఎపిసోడ్ చూస్తే అర్థమవుతోంది. అధికారంలో ...
READ MORE
బీజేవైఎం జిల్లా ఉపాద్యక్షుడిగ పవన్ కుమార్.!!
తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని మరోవైపు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో మంచి నాయకుడిగా గుర్తింపు సంపాదించి పలు విద్యార్థి సమస్యలపై అలుపెరుగని ఉద్యమాలు చేసిన నిదానకవి పవన్ కుమార్ తాజాగా రంగారెడ్డి జిల్లా బీజేవైఎం ఉపాద్యక్షులుగ ఎన్నిక కావడం ...
READ MORE
మరోసారి బలుపు మాటలు మాట్లాడిన కమల్ హాసన్..!!
దేశంలో లౌకికవాదం అనే పదానికి కొంతమంది ప్రముఖులు పూర్తిగా అర్థం మార్చేస్తున్నారు.. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు సీనియర్ సినీ నటుడు మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్ హాసన్. ఎప్పుడూ హిందూ మతం పై విషం ...
READ MORE
కూతురే అమ్మ.. తండ్రి ఆలపాలన చూస్తున్న తల్లి. కంటే కూతురినే కనాలిరా..
అది చెన్నూరు బస్టాండ్ తీవ్ర అనారోగ్యంతో చిక్కిపోయిన తండ్రి.. కనీసం నడవలేని పరిస్థితి. ఆ తండ్రిని తీసుకుని కరీంనగర్ ఆసుపత్రికి బయలు దేరింది కూతురు. సమయానికి ఆర్టీసీ బస్సులు లేవు. ఆ తండ్రి బక్క చిక్కిపోయి బలహీనంగా ఉండటంతో అందుబాటులో ఉన్న ...
READ MORE
మరో గుజరాత్ గ మారుతున్న ఉత్తరప్రదేశ్.!!
ఆకాశంలో మబ్బును చూసి ముంతలో నీల్లు ఒలకబోసుకోవడమనేది ఓ పాత సామెత.. వర్షం వచ్చేది తెలియదు, రానిది తెలియదు కానీ ఉన్న కొద్దిపాటి నీటిని నేలపాలు చేసుకోవడం స్వీయ అపరాదాన్ని సూచిస్తుంది ఈ సామెత. ఇప్పుడు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్- అక్బరుద్దిన్ వ్యాఖ్యలు మత విద్వేషమే, కేసు పెట్టండని ఆదేశాలిచ్చిన కోర్టు.!!
15 నిమిషాలు పోలీసులు పక్కకు జరిగితే దేశం లో ఉన్న హిందువులను చంపుతామంటూ 2012 లో ఎంఐఎం నేత అక్బరుద్దిన్ ఓవైసీ చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు గాను న్యాయస్థానంలో కేసులను ఎదుర్కుంటున్నారు. అప్పట్లో ఇదే కేసులో రిమాండ్ సైతం ఎదుర్కున్నారు అక్బరుద్దిన్. ...
READ MORE
బండి సంజయ్ రాజకీయాలకు ఇక దూరం.! తెలంగాణ భాజపా లో అసలెం జరుగుతోంది.!!
తెలంగాణ భాజపా లో ముఖ్యనేత రాష్ట్ర అధికార ప్రతినిధి కరింనగర్ జిల్లాలోనే కీలకనేత గ ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ రాజకీయాలకు ఇక దూరంగ జరుగుతున్నానంటూ ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. అంతేకాదు కుల్లు కుతంత్రాల రాజకీయాలు అంటూ ఇలాంటి రాజకీయాలు వద్దంటూ.. ...
READ MORE
బురద నీటిని కూడా తాగొచ్చు.. ఫ్లోరైడ్ కి చెక్ పెట్టేయవచ్చు.. తెలంగాణ కుర్రాళ్ల చేతిలో అద్బుతం.. వాటర్ టూ గో.
మురికి నీళ్లు క్షణాల్లో మంచి నీటిగా మారిపోతే...? ఫ్లోరైడ్ జలం క్షణాల్లో స్వచ్చమైన నీటిగా మారిపోతే..? బురదమయమై తాండాల్లో పారే నీరు హిమాలయాల్లోని గంగా నీళ్లలా తియ్యగా మారిపోతే.. అది కూడా కేవలం ఒక బాటిల్ పుణ్యాన జరిగితే..? నమ్మబుద్ది కావడం ...
READ MORE
డ్రగ్స్ భారీన పడ్డ స్కూల్స్, కాలేజేస్ లిస్ట్..!
భాగ్యనగరం మత్తు మందులకు అడ్డగా మారి హైద్రబాద్ కాస్తా హై'డ్రగ్'బాద్ మారిన విషయం తెలిసిందే. నిన్న మొన్నటి వరకు సినీ ఇండస్ట్రీ పెద్దలు బడా బడా బాబుల కొడుకులు కూతుళ్లు ఈ డ్రగ్స్ కి అడిక్ట్ అయి జీవితాలు నాశనం చేసుకున్న ...
READ MORE
స్వీయ నిర్బంధం లో దేశం.. ప్రధాని పిలుపుకు విశేష స్పందన.!!
నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుకు యావత్ దేశం ఆలోచించింది.. కుల మతాలకు అతీతంగా అందరూ స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు.జనతా కర్ఫ్యూ వలన దాదాపు దేశంలో అత్యవసర సేవలు తప్ప అన్ని సముదాయాలు రవాణా వ్యవస్థ నిర్బంధం లో ఉండిపోయాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ...
READ MORE
ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న తెలంగాణ సర్కార్.!!
గతంలో నేరెల్లలో దళితులను హింసించిన ఘటన.. ఆదిలాబాద్ లో గిరిజనులపై పోలీసుల లాఠీ చార్జ్ అరెస్టులు, అంతకు ముందు ఖమ్మం మిర్చి రైతుల చేతులకు బేడీలు వేసి అరెస్టులు చేయడం ఇవన్నీ ఇప్పటికే తెలంగాణ సర్కార్ కు వ్యతిరేకత తెచ్చిన ఘటనలు.. అయితే ...
READ MORE
ఈ ఒక్క రోజే ధర్నా చౌక్… తరువాత మరీ..?
ధర్నా చౌక్.. ఇందిరా పార్క్ అడ్టా. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో గర్జించి మరీ సాదించుకునే చోటు. సంఘాలు, కులాలు, మతాలు, వర్గాలు, జాతులనే తేడాలదు అన్ని రకాల వారికి ఇది పవిత్ర స్థలం. ఇక్కడ చేసిన ధర్నాల కారణంగానే తెలంగాణ ఉద్యమం ...
READ MORE
కమ్ముకున్న పొగ మంచు.. భారీగా రోడ్డు ప్రమాదం.
దట్టంగా కప్పుకున్న పొగ మంచుతో ఢిల్లీ ఆగ్రా జాతీయ రహదారిపై భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అసలు ముందు ఏ వాహనం ఉందో తెలుసుకునే వీలు లేకుండా పొగ మంచు దట్టంగా కమ్ముకోవడం పక్కన ఉన్న మనిషి కూడా కనిపించకపోవడంతో ...
READ MORE
నేషనల్ మీడియా ముందు రాహుల్ గాంధీ గాలి తీసేసిన వివేక్
పసిపిల్లలకు తల్లిపాల(బ్రెస్ట్ ఫీడింగ్) లోటును తీరుస్తున్న పాల దేవత.!
పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??
రెండేల్లుగ తన అన్న ఆత్మశాంతి కోసం కమ్యునిస్ట్ ప్రభుత్వం పై
జనసేనతో మాజీ జేడీ లక్ష్మి నారాయణ బంధం ముగిసినట్టేనా.?
ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉగ్రవాది.. 18 మంది దుర్మరణం.!
ప్రశ్నిస్తే.. కేసులు పెట్టడం అప్రజాస్వామ్యం.!!
మంత్రి పద్మరావు చేతుల మీదుగా “కళ్లకద్దుకునె చరితరా” పాట విడుదల
ఎన్టిఆర్ బయోపిక్.. బాలయ్యకు మాత్రం భయంకర పిక్ గ మిగిలిపోయింది.!!
కార్యకర్త హత్య ఘటన, కేసిఆర్ పై నిప్పులు చెరిగిన బండి
కర్నాటక లో హిందువులను విభజించి లబ్ది పొందాలని చూస్తున్న కాంగ్రెస్.!!
జై శ్రీరాం అంటే అరెస్టులు చేసే దీదీకి, రోహింగ్యా ముస్లింల
చంద్రబాబు తన లైఫ్ లో ఇంతటి ఘోరమైన తిట్లు విమర్శలు
బీజేవైఎం జిల్లా ఉపాద్యక్షుడిగ పవన్ కుమార్.!!
మరోసారి బలుపు మాటలు మాట్లాడిన కమల్ హాసన్..!!
కూతురే అమ్మ.. తండ్రి ఆలపాలన చూస్తున్న తల్లి. కంటే కూతురినే
మరో గుజరాత్ గ మారుతున్న ఉత్తరప్రదేశ్.!!
బ్రేకింగ్ న్యూస్- అక్బరుద్దిన్ వ్యాఖ్యలు మత విద్వేషమే, కేసు పెట్టండని
బండి సంజయ్ రాజకీయాలకు ఇక దూరం.! తెలంగాణ భాజపా లో
బురద నీటిని కూడా తాగొచ్చు.. ఫ్లోరైడ్ కి చెక్ పెట్టేయవచ్చు..
డ్రగ్స్ భారీన పడ్డ స్కూల్స్, కాలేజేస్ లిస్ట్..!
స్వీయ నిర్బంధం లో దేశం.. ప్రధాని పిలుపుకు విశేష స్పందన.!!
ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న తెలంగాణ సర్కార్.!!
ఈ ఒక్క రోజే ధర్నా చౌక్… తరువాత మరీ..?
కమ్ముకున్న పొగ మంచు.. భారీగా రోడ్డు ప్రమాదం.
Facebook Comments
Top
error: Content is protected !!