You are here
Home > తాజా వార్త‌లు > వ‌డ్డెర‌బ‌స్తీ కూడా దాట‌ని వందేళ్ల ఉత్స‌వం..? భారీ నిధులు ఎక్క‌డ‌పోయిన‌య్..?

వ‌డ్డెర‌బ‌స్తీ కూడా దాట‌ని వందేళ్ల ఉత్స‌వం..? భారీ నిధులు ఎక్క‌డ‌పోయిన‌య్..?

తెలంగాణ రాష్ట్రానికి ఊపిరి.. ఉద్య‌మాల పోరుగ‌డ్డ‌.. మ‌లిద‌శ ఉద్య‌మంలో శ‌త్రువుకు చెమ‌ట‌లు పుట్టించి ఢిల్లీ నాయ‌కుల త‌ల‌లు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాదించి పెట్టి పోరాటాల గ‌డ్డ‌.. ఎంద‌రో అమ‌ర‌వీరుల‌కు అమ్మ‌.. మ‌హోన్న‌తుల‌కు పుట్టినిల్లు మ‌రి అంత‌టి ఘ‌న చరిత్ర క‌లిగిన ఉస్మానియా వందేళ్లు పూర్తి చేసుకుంటుంటే సంబ‌రాలేవి.. అంబ‌రాన్ని ఎక్క‌డ అంటుతున్నాయి. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంతో బంధ‌మున్న వ‌డ్డెర బ‌స్తీ గ‌ల్లీ కూడా దాట‌డం లేదు ఓయూ సంబ‌రాల కేక‌లు. ఇంత అద్వానంగా నిర్వ‌హించాలా.. నా త‌ల్లి తెలంగాణ పురిటిగ‌డ్డ‌ను ఇంత‌లా అవ‌మానించాల అని ప్ర‌శ్నిస్తున్నాయి ఓయూ విద్యార్థి గొంతుక‌లు.

తెలంగాణ రాష్ట్రం సిద్దించిన‌నాడు అంబ‌రాన్నంటే సంబ‌రాలు చేసుకుంది ఓయూ.. ఆ త‌రువాత ఏడాది రాష్ట్రమంతా సంబ‌రాల్లో మునిగిపోతుంటే చీకట్ల‌ల్లో మ‌గ్గింది నా త‌ల్లి. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబురాల్లో గ‌జ్జె క‌ట్టి ఆడింది నా ఓయూ.. మ‌రీ అమ్మ‌కు వందేళ్లు నిండితే ఇంత త‌క్కువ చేసి చూస్తుంది ఏంటి తెలంగాణ స‌ర్కార్. కోట్ల మందికి విద్యాబుద్దులు నేర్పిన విశ్వ‌విద్యాల‌యం వందేళ్ల పండుగ‌కు 4000 మందిని మాత్ర‌మే అనుమ‌తించి తొలి దీపం వెలిగించే స‌మ‌యాన్ని వందేళ్ల పండుగ‌కు దీపం పెట్టింది స‌ర్కార్. 200 కోట్ల భారీ నిధులు వెచ్చించి సంబురాల‌ని చెప్పిన తెలంగాణ స‌ర్కార్ 2 కోట్ల నిధులు కూడా వెచ్చించిన దాఖలాలు క‌నిపించ‌డం లేదు. వెలుగు జిలుగుల‌తో ఆట‌పాట‌ల‌తో.. రాష్ట్ర‌మంతా ఓయూ సంబురాల్లో మునిగితేలాల్సిన పండుగ సంధ‌ర్భాన ఇక్క‌డే చ‌దువుకున్న ప్ర‌భుత్వ నాయ‌కులు ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా ఇది మా పండుగ కాద‌నట్టు వెళ్లిపోతున్నారు. ఇంత అధ్వాన్న‌మా..? ఇంత చిన్న చూపా అని ప్ర‌శ్నిస్తున్నారు ఓయూ బిడ్డ‌లు.

నా త‌ల్లి ఉస్మానియా యూనివ‌ర్సిటీ పేరు విన‌గానే ప్ర‌తి తెలంగాణ విద్యార్థి గుండె జ‌ల్లుమంటుంది. నా త‌ల్లి కేవ‌లం పాఠాలు నేర్పిన బ‌డి మాత్ర‌మే కాదు రాష్ట్రాన్ని సాధించి పెట్టిన క‌ల్ప‌వ‌ళ్లి క‌నుక‌.. ఇక్క‌డ చ‌దివిన బిడ్డ‌లు చ‌దువైపోగానే మ‌రిచిపోయే విద్యాల‌యం అంత‌కంటే కాదు. న‌ర‌న‌రాన అమ్మ నేర్పిన పాఠాల‌ను జీర్ణించుకు జీవిత పాఠాల‌ను ఇక్క‌డే చ‌దివేసి.. భ‌విష్య‌త్ కు బంగారు బాట‌లు వేసుకుంటే ఓయూ నీడ‌లోనే ఎదిగిన వృక్షాలెన్నో. ఓయూ గ‌డ్డ‌పై కాలు పెట్టిన అనామ‌కుడు కూడా తిరిగి వెళ్లే రోజు ఉక్కు సంక‌ల్పంతో స‌మాజంలోకి అడుగు పెట్ట‌డం క‌నిపిస్తుంది. సామాజిక స్పృహ‌, స‌మ‌స్య‌ల‌పై పోరాడే త‌త్వం, ఇలా ఒక్క‌టేమిటి.. స‌మాజ స్థితిగ‌తులెన్నింటినో నేర్పిస్తుంది ఓయూ. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే ఉద్య‌మాల పురిటిగ‌డ్డ‌. మ‌రి అలాంటి యూనివ‌ర్సిటీ వందేళ్ల ఉత్స‌వాలు ఎలా జ‌ర‌గాలి. అదిరిపోవాలి. సొంత రాష్ట్రంలో జ‌రుగుతున్నాయి కాబట్టి అదిరిపోతాయ‌నుకున్నారు. రాష్ట్ర స‌ర్కార్‌…200 కోట్లు ఇస్తే ఎంత ఘ‌నంగా నిర్వ‌హిస్తారో అనుకున్నారు. బ‌తుక‌మ్మల పండ‌గ‌ల‌కే హంగామా చేసే ప్ర‌భుత్వం ఓయూ వందేళ్ల ఉత్స‌వాల‌ను ఇంకెంత గ్రాండ్ చేస్తుందో అనుకున్నారు. కానీ అనుకోవ‌డ‌మే మిగిలింది. ప్రారంభోత్స‌వం నాడే ఓయూ వందేళ్ల వేడుక‌ను ఊసురుమ‌నిపించారు. అతి జాగ్ర‌త్త‌తో ఓయూ ప‌రువు తీశారు. ప్ర‌భుత్వం ప‌రువు తీసుకున్నారు. కాదు కాదు రాష్ట్ర ప్ర‌జ‌ల ప‌రువు రాష్ట్ర‌ప‌తి ముందు అడ్డంగా తీసేశారు.

వందేళ్ల యూనివ‌ర్సిటీ.. రాష్ట్ర‌ప‌తిని తీసుకొచ్చారు. బాగుంది. కానీ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం మ‌రీ 40 నిమిషాల్లో ముగియ‌డమేంటి..? ప్ర‌ణ‌బ్ స్పీచ్ త‌ర్వాత క‌ట్టేశారెందుకు..! యూనివ‌ర్సిటీ ఛాన్స్‌ల‌ర్‌.. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌.. ఆయ‌న క‌నీసం నోరు మెద‌ప‌లేదంటి..? అక్క‌డి వ‌ర‌కు ఎందుకు ఓయూ గురించి అంతా తెలిసిన సీఎం సారు ఒక్క మాట కూడా మాట్ల‌డ‌క‌పోవ‌డం మొత్తం ఉత్స‌వాలను నీరు గార్చాయి. ఉద్య‌మంలో ఓయూ పాత్ర‌పై ఎంత గొప్ప‌గా చెబుతారోన‌ని అంద‌రూ సీఎం వైపు చూశారు. కానీ ఆయ‌న ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికే కాదు.. ఆగ్ర‌హానికి గురి చేసింది. అయితే వందేళ్ల పండుగ‌ను అటు మీడియా కూడా అంత ఘ‌నంగా ఏమి క‌వ‌రేజ్ ఇవ్వ‌లేదు.. ఇవ్వ‌డం లేదు కూడా. గులాభీ వ‌నం ప్ర‌జానివేద‌నం అని తెలంగాణ స‌ర్కార్ సొంత డ‌బ్బాకొట్టుకునే పార్టీ మీటింగ్ కు మాత్రం డీఎస్ఎన్జీలు లైవ్ కిట్ లు ప‌ట్టుకుని ప‌రుగులు పెట్టారు. భారీ జ‌న‌స‌మీక‌ర‌ణ‌తో అట్ట‌హ‌సంగా అదేదో సంబురంగా చేస్తున్నారు. మరీ అందులో దాదాపు ఇక్క‌డ చ‌దివి రాజ‌కీయ నాయ‌కులుగా మారి పెద్ద స్థానాల్లో కూర్చున్న ఎంపీలు, మంత్రులు కూడా లేక‌పోలేదు. మ‌రీ వాళ్ల‌కైనా క‌నీస సోయి లేదా.. నా త‌ల్లి ఓయూ సంబురాల్లో తేలిపోతున్నాయ‌ని స‌ర్కార్ కావాల‌నే ఇలా చేస్తుంద‌ని. ఇది ప్ర‌తి ఓయూ బిడ్డ ఆవేద‌న‌. నా త‌ల్లి వందేళ్ల వేడుక ఇంత అద్వాన్నంగా జ‌రుగుద్ద‌ని క‌ల‌లో కూడా ఊహించుకోలేద‌ని క‌న్నీరు మున్నీర‌వుతున్నారు. ఇందుకేనా తెలంగాణ కోసం కొట్లాడి చ‌దువులు ప‌క్క‌న పెట్టి… నా మిత్రుల‌ను అమ‌రులుగా మార్చుకున్న‌ద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. నా త‌ల్లినే ప‌ట్టించుకోని పాల‌కుడు ఉంతే ఎంతా ఊడితే ఎంత అని ఆవేశంతో ఊగిపోతున్నారు.

మ‌రీ ప్ర‌భుత్వం ఏడాది పొడుగునా నిర్వ‌హిస్తామ‌న్నా మాట ప‌క్క‌న పెడితే మూడు రోజుల‌కే ఎందుకు దిక్కు లేకుండా పోయింది. స‌ర్కార్ ఇచ్చిన
రెండొంద‌ల కోట్లు నిధులు ఎక్క‌డికి పోయాయి. దేశం గ‌ర్వించే ఉస్మానియా వందేళ్ల పండక్కి చిన్న స‌భా వేదిక ఏర్పాటు చేశారు.. ఎందుకు. అందులో అంద‌రు విద్యార్థులు కూర్చేనేందుకు సరైన ప్లేస్ లేదు. విద్యార్థులు గొడ‌వ చేస్తారంటూ వారికి అక్క‌డెక్క‌డో దూర సీట్లు కేటాయించారు. అటు కొంద‌రికి మాత్ర‌మే పాస్‌లు ఇవ్వ‌డ‌మేంటి..? అందులో కొన్ని సంఘాల విద్యార్థుల‌ను ముందస్తుగా అరెస్ట్ చేయ‌డ‌మేమిటి. సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను కూడా ముందుగానే ముగించాల‌ని ఆర్డ‌ర్లు పాస్ చేయ‌డం ఏమిటి. 4000 విద్యార్థులు వ‌స్తే 5000 మంది పోలీసు బ‌ల‌గాల‌ను దించ‌డం ఏమిటి. ఇదేనా వందేళ్ల వేడ‌కంటే.. ఇదేనా నా త‌ల్లి తెలంగాణకు ఊపిరి పోసిన ఓయూ గ‌డ్డ పండుగంటే. ఇదంతా అవ‌మానం కాదా..? విద్యార్థుల మీద కోపంతో ఓయూ ఉత్స‌వాల‌ను ఇలాగేనా నిర్వ‌హించేది..? ఇదేం ప‌ద్ధ‌తి. వందేళ్ల సంబ‌రాలు చేసేది ఇలాగేనా..? ప‌్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంది. వ‌రంగ‌ల్ స‌భ మాయ‌లో ఉన్న‌సర్కార్ ఉస్మానియా సంబ‌రాల‌ను మ‌రిచిపోయింది. క‌నీసం బ‌తుక‌మ్మ సంబ‌రాలపై పెట్టినంత దృష్టి కూడా పెట్ట‌క‌పోవ‌డం దారుణం. ఇక ప్ర‌తి ఒక్క ఉస్మానియా బిడ్డ మేల్కోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. మ‌న‌ అమ్మ‌కు నిజ‌మైన పండుగ చేయ‌నోడు మ‌న‌కు ప‌ట్టెడ‌న్నం పెడుతాన‌డి ఎలా అనుకుంటాం. ఉస్మానియా అన్నత‌మ్ముల్లు అక్క చెల్లెల్లు ఓసారి ఆలోచించండి.

(ఇట్లు.. మీ ఓయూ విద్యార్థి )

Related Posts
అంబర్ పేట్ లో తిరుగులేని నాయకుడు కిషన్ రెడ్డి.!!
కిషన్ రెడ్డి.. తెలంగాణ లో పరిచయం అక్కరలేని పేరు. కిషన్ రెడ్డి అంటే ఎంత గుర్తో.. అంబర్ పేట్ అంటే కూడా గుర్తుకొచ్చే పేరు కిషన్ రెడ్డే. అంతగా అంబర్ పెట్ కి మారుపేరుగా గుర్తింపు పొందిన నేత కిషన్ రెడ్డి. విద్యార్థి ...
READ MORE
తెరాస నాయకులు v/s జంప్ జిలానీలు.. కేసిఆర్ కు కొత్త తలనొప్పి.??
తెలంగాణ రాష్ట్ర సమితి లో ఎన్నడూ లేని విధంగ సరికొత్త వివాదం బట్టయలైంది.. సాక్షాత్తూ ఆ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు ప్రస్తుత హోం మినిస్టర్ నాయిని నర్సింహ రెడ్డి తన అసంతృప్తి ని ఓపెన్ చేసారు. డైరెక్ట్ గా కేసిఆర్ ను ...
READ MORE
దేశ ద్రోహం కేసు ఎదుర్కుంటున్న అర్బన్ నక్సల్ కన్హయ కుమార్ భవిష్యత్ ఏంటి.?
పాకిస్తాన్ మన దేశానికి వ్యతిరేకంగ ఉగ్రవాదులను తయారు చేస్తే ఇంటి దొంగలు దేశం లో ఉన్న విశ్వ విద్యాలయాల్లో విద్యార్థులను అర్బన్ నక్సల్స్ గ తయారు చేసి దేశం లోపలే దేశాన్ని విభజించే కుట్రలకు పన్నాగం రచిస్తున్నారు.ఈ క్రమం లోనే ...
READ MORE
అట్టర్ ఫ్లాప్ అయిన హైద్రాబాద్ మెట్రో రైల్.! కారణాలేంటి.??
ఏండ్ల తరబడి వాయిదాల మీద వాయిదాలు ఛేదించి, రాజధాని జనాలను ముప్పు తిప్పలు పెట్టి, ఇంకా నిర్మాణం సాగుతూనే ఉన్నప్పటికీ మొదటి దశ ప్రారంభమైంది. అది కూడా ప్రధాని మోడి చేతుల మీదుగా ఘనంగ అట్టహాసంగ మొదలైంది. కానీ మూడు నెలలు ...
READ MORE
చైనా లో ఉనికి కోల్పోనున్న క్రైస్తవమతం.! తాజాగా మరో దారుణ నిర్ణయం.!!
చైనా లో క్రైస్తవులకు రోజు రోజుకు ఇక్కట్లు పెరుగుతున్నై.. గతంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ పై నిషేధం విధించి సంచలనం కలిగించిన చైనా కమ్యునిస్టు ప్రభుత్వం.. తాజాగా క్రైస్తవులపై పిడుగు లాంటి రూల్ మోపింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆదేశాలతో తీవ్ర ...
READ MORE
పిల్లల్లో “ఆటిజం” నిర్మూలనకు అందరూ కృషి చేయాలి – డా.కె.లక్ష్మణ్
ఈరోజు హైద్రాబాద్ త్యాగరాజ గాణ సభలో ప్రపంచ ఆటిజం జాగృత దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగ భాజపా రాష్ట్ర అధ్యక్షులు ముషీరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు డా.కె.లక్ష్మణ్ పాల్గొనగ అతిథులుగ కార్యక్రమ నిర్వాహకులు ఆల్ ఇండియా డిసాబుల్డ్ రైట్స్ ...
READ MORE
దీక్ష హైలెట్ కోసం బాలయ్యను పణంగ పెట్టి బలిచేసిన చంద్రబాబు..??
నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన 12 గంటల నిరాహార దీక్ష లో ముఖ్యంగ చర్చకొస్తున్న ఏకైక అంశం హిందూపురం ఎంఎల్ఏ నటుడు బాలక్రిష్ణ ప్రధానమంత్రి నరేంద్ర మోడి పై చేసిన అనుచిత వ్యక్తిగత వ్యాఖ్యలు. బాలక్రిష్ణ చేసిన వ్యాఖ్యలకు ...
READ MORE
తెలంగాణ ఉద్యమ కెరటం..వంజరి నేత కరిపె రాజు వంజరికి జన్మధిన శుభాకాంక్షలు.!!
తెలంగాణ ఉద్యమకారుడు, అఖిల భారత వంజరి సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరిపె రాజు వంజరి జన్మధినం సంధర్భంగ ఆ సంఘం నాయకులు రాష్ట్ర వ్యాప్తంగ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కరిపె రాజు వంజరి తెలంగాణ ఉద్యమంలో కీలక ...
READ MORE
ఎగ్జిట్ పోల్స్ అన్నీ నరేంద్ర మోడి కి క్లీన్ మెజారిటీ..!!
ఏడు దశల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి.పోలింగ్ ముగిసేంత వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిన నేపథ్యం లో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఒక్కొక్కటిగ ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల అవుతున్నాయి. అయితే.. అంతా అనుకున్నటుగానే నరేంద్ర ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ – పాక్ పై యుద్ద విమానాలతో విరుచుకుపడ్డ భారత్.!!
పుల్వామా ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. సర్జికల్ స్ట్రైక్ 2 ను విజయవంతం చేసింది. పుల్వామా దాడి తర్వాత అన్ని వైపుల నుండి ఆర్థికంగ వ్యాపారపరంగ అదే విధంగ అంతర్జాతీయంగ ఐక్యరాజ్యసమితిలోనూ పాక్ ను వంటరి చేసి మరోవైపు ప్రత్యక్ష ...
READ MORE
మదరసాల్లో గాయత్రీ మంత్రం.. దేవ భూమి విలువ చాటుతున్న ఏక‌త్వంలో భిన్న‌త్వం..
మ‌ద‌ర్సా ఈ పేరు విన‌గానే మ‌తం మాత్ర‌మే గుర్తుకు రావ‌డంలో త‌ప్పులేదు. అక్క‌డి బోధ‌న అలా ఉంటుంద‌ని అనుకోవ‌డం లో కూడా త‌ప్పు లేదు. కానీ నిజానికి మ‌ద‌ర్సా అంటే అది కాద‌ని చెపుతున్నాయి నిజ‌మైన మ‌ద‌రసాలు. అస‌లు మ‌ద‌ర‌సా అంటే ...
READ MORE
చిరుజల్లుల పలకరింపుతో చల్లబడిన భాగ్యనగరం.!!
రాజధాని హైద్రాబాద్ లో ఈ సాయంత్రం నుండి ఉరుములుతో కూడిన వర్షం కురుస్తుండడంతో ఒక్కసారిగ నగరం చల్లబడింది. దీంతో నగరవాసులు వేడి ఎండల ఎఫెక్ట్ నుండి కాస్తంత ఉపశమనం పొందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం నమోదవుతోంది. ఇక నిన్నటిదాక ఎన్నికల ...
READ MORE
రాజ్యసభ ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీ లో టెన్షన్.!!
ఈ నెల 19 న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి టెన్షన్ పుట్టిస్తున్నాయి. అధిష్టానం పై నమ్మకం కోల్పోయిన పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు రాజ్యసభ ఎన్నికల ముందు రాజీనామా బాట పడుతున్నారు. ఇప్పటికే పార్లమెంటులో కనీసం ...
READ MORE
ఈ బల్లి ధర వింటే షాక్ అవుతారు..?
చూడటానికి వేలెడు కూడా లేని ఈ బల్లి ధర ఎంతో తెలుసా. అక్షరాల ఇరవై కోట్లు. 20 కోట్లా అని ఆశ్చర్యపోకండి.. మీరు చదువుతున్నది నిజమే. ఈ బల్లి ఖరీదు రూ.20 కోట్లే.  పురాణాల్లో చెప్పినట్టుగా బంగారు బల్లులు ఉండేవి.. వాటి అరుపులతో ...
READ MORE
సన్నీలియోన్ కండోమ్ యాడ్ వివాదం.. హిందూ సంస్థల ఆగ్రహం.
ఓ కండోమ్ సంస్థ వారు పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఫోటోతో ఏర్పాటు చేసిన హోర్డింగ్ లపై సర్వత్రా వివాదానికి కారణమవుతుంది. హోర్డింగ్ లో సన్నీ లియోన్ ఫోటోతో పాటు "ప్లే బట్ విత్ దిస్ నవరాత్రి" ఈ నవరాత్రి పర్వదినాన ...
READ MORE
ఇదేం ఆచారం.? భక్తుల ఆగ్రహానికి గురవుతున్న శాంతలింగేశ్వర స్వామి పూజా విధానం.!
మహా దేవుడు భోలా శంకరుడిగా పేరుగడించాడు.. కారణం భక్తులు ఏ కోరిక కోరినా కాదనడు కాబట్టి..!! అలాంటి శంకరుడి ప్రతిరూపమే శివలింగం ఇది అందరికీ తెలిసిందే.. అన్ని స్వయంభు శివాలయాలు దాదాపుగ శివలింగ రూపంలోనే ఉంటాయి. ఆ శివలింగ దర్శనం కోసమే ...
READ MORE
తెలుగు రాష్ట్రాలలో సంచలనం.. వివేకాది సహజ మరణం కాదు హత్య.!!
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మరణించిన విషయం తెలిసిందే.. అయితే వివేకాది సహజ మరణం కాదు హత్యే నని ఆయన భౌతికకాయానికి జరిపిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగ వాస్తవం బహిర్గతం ...
READ MORE
ముస్తాబవుతున్న గువ్వ గోరింక.. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో మీ ముందుకు.. త్వరలో.
మానవ సంబంధాలు కనుమరుగవుతున్న ప్రస్తుత ప్రపంచంలో ఇద్దరు ప్రేమికుల మధ్య జరగిన సంఘటనలకు రూపమే గువ్వగోరింక చిత్రం. వినూత్నమైన సినిమాలకు పట్టం కడుతున్న తెలుగు ప్రేక్షకుల అభిరుచిపై నమ్మకంతో. ఆకార్ మూవీస్ సంస్థ  ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో.. పూర్తి సహజమైన పాత్రలతో.. ...
READ MORE
“లాల్” లో “నీల్” స్థానం శూన్యం.! దళితులపై కపట ప్రేమ చూపిస్తున్న అగ్రకుల కమ్యునిస్టు నాయకత్వం.!!
పొద్దుగాల లేస్తే చాలు దళితులు బహుజనులు అంటూ భజన చేసే కమ్యునిస్టుల అసలు నిజ స్వరూపం కొద్ది కొద్దిగా బహిర్గతం అవుతోంది. అచ్చం మేకవన్నే పులి కథలో దొంగ పులి కంటే దారుణంగ దళిత వ్యతిరేక రహస్య అజెండాతో పని చేస్తోందని ...
READ MORE
నేతలంతా ఓట్ల వేటలో మునిగితే.. మోడీ ఏం చేస్తున్నారో తెలుసా.!!
నరేంద్ర మోడి తనదైన శైలి యొక్క ప్రత్యేకతని మరోసారి చాటుకున్నాడు. గల్లీ నుండి ఢిల్లీ దాక చిన్నా చితకా నేతల నుండి జాతీయ నాయకుల వరకు మొత్తం ఆయా వర్గాలు కులాలు మతాల చుట్టూ తిరుగుతూ ఓట్లను అడుక్కునే పనిలో ఉంటే.. ...
READ MORE
సినీ క్రిటిక్ కత్తి మహేష్ నిజంగా ఇంత నీచుడా..? రేపిస్టా..??
ఒక సాధారణ వ్యక్తి గ సినిమాల పై విశ్లేషణలు రాస్తూ సినీ క్రిటిక్ అనే కత్తి మహేష్.. తద్వారా తెలుగులో ప్రసారమైన టీవీ షో బిగ్ బాస్ లో పాల్గొని తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పై విమర్శలు చేయడం ద్వారా ...
READ MORE
తెలంగాణ గిరిజన కుంభమేళా.. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర.!!
ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతరగ భారతదేశానికి తలమానికంగ నిలుస్తున్నది ఓరుగల్లు(జయశంకర్ భూపాలపల్లి జిల్లా) మేడారం సమ్మక్క సారలమ్మ గిరిజన జాతర. ప్రతీ రెండేల్లకోసారి మాఘశుద్ద పౌర్ణమి రోజు సమ్మక్క సారలమ్మలకు ఘనంగ జాతర చేయబడుతుంది. దాదాపు 900 ఏండ్ల ఘన చరిత్ర ...
READ MORE
సోషల్ మీడియా లో రజీనీ కొత్త చిత్రం ఫోటోలు వైరల్.!!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ దర్బార్. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రం షూటింగ్ కు సంబంధించిన స్టిల్స్ కొన్ని సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం లో పోలీస్ అధికారి ...
READ MORE
అయ్యో పాపం రాహుల్ గాంధీ.. ఎంత పనైపోయింది.!
తరచూ.. సోషల్ మీడియా లో తనకుతానే తప్పులు చేస్తూ దొరికిపోవడం కాంగ్రెస్ యువరాజు జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కి అలవాటే.. కాగా మరోసారి రాహుల్ గాంధీ ఇలాంటి తప్పే చేసి నెటిజన్లకు దొరికిపోయాడు. తెలిసి చేస్తాడో లేక తొందరపాటుతో చేస్తాడోగానీ.. మొత్తానికి ...
READ MORE
పవర్ స్టార్ అభిమానులకు పండుగే.. రివ్యూలో కాటమరాయుడు సూపర్ హిట్.
నటీనటులు: పవన్‌ కల్యాణ్‌, శ్రుతిహాసన్‌, అలీ, రావు రమేష్‌, శివ బాలాజీ, అజయ్‌, చైతన్య కృష్ణ, కమల్‌ కామరాజు... సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ ఎడిటింగ్ : గౌతంరాజు ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల నిర్మాత: శరత్‌ మరార్‌ దర్శకత్వం: డాలీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉగాది పండుగ ముందే ...
READ MORE
అంబర్ పేట్ లో తిరుగులేని నాయకుడు కిషన్ రెడ్డి.!!
తెరాస నాయకులు v/s జంప్ జిలానీలు.. కేసిఆర్ కు కొత్త
దేశ ద్రోహం కేసు ఎదుర్కుంటున్న అర్బన్ నక్సల్ కన్హయ కుమార్
అట్టర్ ఫ్లాప్ అయిన హైద్రాబాద్ మెట్రో రైల్.! కారణాలేంటి.??
చైనా లో ఉనికి కోల్పోనున్న క్రైస్తవమతం.! తాజాగా మరో దారుణ
పిల్లల్లో “ఆటిజం” నిర్మూలనకు అందరూ కృషి చేయాలి – డా.కె.లక్ష్మణ్
దీక్ష హైలెట్ కోసం బాలయ్యను పణంగ పెట్టి బలిచేసిన చంద్రబాబు..??
తెలంగాణ ఉద్యమ కెరటం..వంజరి నేత కరిపె రాజు వంజరికి జన్మధిన
ఎగ్జిట్ పోల్స్ అన్నీ నరేంద్ర మోడి కి క్లీన్ మెజారిటీ..!!
బ్రేకింగ్ న్యూస్ – పాక్ పై యుద్ద విమానాలతో విరుచుకుపడ్డ
మదరసాల్లో గాయత్రీ మంత్రం.. దేవ భూమి విలువ చాటుతున్న ఏక‌త్వంలో
చిరుజల్లుల పలకరింపుతో చల్లబడిన భాగ్యనగరం.!!
రాజ్యసభ ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీ లో టెన్షన్.!!
ఈ బల్లి ధర వింటే షాక్ అవుతారు..?
సన్నీలియోన్ కండోమ్ యాడ్ వివాదం.. హిందూ సంస్థల ఆగ్రహం.
ఇదేం ఆచారం.? భక్తుల ఆగ్రహానికి గురవుతున్న శాంతలింగేశ్వర స్వామి పూజా
తెలుగు రాష్ట్రాలలో సంచలనం.. వివేకాది సహజ మరణం కాదు హత్య.!!
ముస్తాబవుతున్న గువ్వ గోరింక.. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో మీ ముందుకు.. త్వరలో.
“లాల్” లో “నీల్” స్థానం శూన్యం.! దళితులపై కపట ప్రేమ
నేతలంతా ఓట్ల వేటలో మునిగితే.. మోడీ ఏం చేస్తున్నారో తెలుసా.!!
సినీ క్రిటిక్ కత్తి మహేష్ నిజంగా ఇంత నీచుడా..? రేపిస్టా..??
తెలంగాణ గిరిజన కుంభమేళా.. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర.!!
సోషల్ మీడియా లో రజీనీ కొత్త చిత్రం ఫోటోలు వైరల్.!!
అయ్యో పాపం రాహుల్ గాంధీ.. ఎంత పనైపోయింది.!
పవర్ స్టార్ అభిమానులకు పండుగే.. రివ్యూలో కాటమరాయుడు సూపర్ హిట్.
Facebook Comments
Top
error: Content is protected !!