You are here
Home > తాజా వార్త‌లు > అంబేద్కర్ చూపిన మార్గం ఇదేనా…?

అంబేద్కర్ చూపిన మార్గం ఇదేనా…?

“డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భౌతికంగా దూరమై ఏడు దశాబ్దాలు గడచినా, ఆయన రగిలించిన స్పూర్తి ఇంకా కొనసాగుతోంది. బడుగు బలహీన వర్గాలు తమకు న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం పోరాడి సాధించుకుంటున్నాయి. కానీ ఎక్కడో లోపం జరుగుతోంది. ఈ రోజున బాబాసాహెబ్ పేరును దుర్వినియోగం చేస్తున్నవారు పెరిగిపోయారన్నది నిజం.”

తరతరాల చరిత్రకు ఊపిరి పోసి.. అంటరానితనాన్ని మంటల్లో కాల్చేసి. బడుగు బలహీన వర్గాలకు తన మేదా శక్తితో ప్రాణం పోసిన మేధావి ఆయన. భారత దేశచరిత్ర గతిని స్థితిని మార్చిన ధీశాలి ఆయన. అణగారిన వర్గాల హక్కులు, అభ్యున్నతి కోసం పోరాడిన యోధుడు ఆయన. కుల వివక్షతను కూకటి వేళ్లతో తొలగించాలని ఆశించి భారత రాజ్యాంగానికి ప్రాణం పోశారు డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేద్కర్. ఆధునిక భారత దేశ చరిత్రను ప్రభావితం చేసిన మహనీయుల్లో అగ్రగామి.. స్వతంత్ర భారత దేశ తొలి న్యాయశాఖ మంత్రి, భారత రాజ్యాంగ నిర్మాత. స్వాతంత్రోద్యమ నేత, గొప్ప దేశ భక్తుడు, న్యాయవాది, సామాజిక శస్త్రవేత్త, చరిత్రకారుడు, రచయిత, ఉపన్యాసకారుడు. ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే..

మహర్ కుటుంబంలో పుట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్నప్పటి నుంచే పేదరికం కన్నా ఎక్కువగా అంటరానితనం, కుల వివక్షను ఎదుర్కొన్నారు. సమాజంలో అడుగడుగునా అవమానాలు భరిస్తూనే ఎంతో పట్టదలతో ఉన్నత చదువులు చదివారు. భారత దేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందేందుకు పోరాటం తీవ్రమైన రోజుల్లో.. స్వాతంత్ర్యంతో పాటు అస్పృశ్యతకు వ్యతిరేకంగా అదే స్థాయి ఉద్యమం జరగాలని భావించారు అంబేద్కర్.

అంటరానితనానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపట్టారు. సమాజంలో అణగారిన వర్గాల హక్కులు, సంక్షేమం కోసం పోరాడారు. స్వతంత్ర భారత దేశ తొలి న్యాయ శాఖమంత్రిగా, రాజ్యాంగ పరిషత్ ఛైర్మన్ బాధ్యతలు నిర్వహించారు బాబాసాహెబ్. ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నింటినీ అధ్యయనం చేసి మన దేశానికి అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించేందుకు విశేషంగా కృషి చేశారు. చదువు, ఉద్యోగం, రాజ్యాధికారం మాత్రమే అణగారిన వర్గాల కష్టాలను తీర్చేందుకు పరిష్కారం అని భావించిన అంబేద్కర్ రిజర్వేషన్లను పొందుపరిచారు.

హిందూ సమాజానికి రాచపుండులా దాపురించిన కుల వ్యవస్థను నిర్మూలించేందుకు జీవితాంతం పోరాడారు. హిందూ మతాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్న అంబేద్కర్ విదేశీ మతాలను అవలంభించేందుకు తిరస్కరించారు. జీవిత చరమాంకంలో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భౌతికంగా దూరమై ఏడు దశాబ్దాలు గడచినా, ఆయన రగిలించిన స్పూర్తి ఇంకా కొనసాగుతోంది. బడుగు బలహీన వర్గాలు తమకు న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం పోరాడి సాధించుకుంటున్నాయి. కానీ ఎక్కడో లోపం జరుగుతోంది. ఈ రోజున బాబాసాహెబ్ పేరును దుర్వినియోగం చేస్తున్నవారు పెరిగి పోయారన్నది నిజం.

రిజర్వేషన్లు పరిమిత కాలం ఉండాలని అంబేద్కర్ భావించారు. కానీ ప్రస్తుత నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రిజర్వేషన్లను తాయిలంగా మార్చేశారు. రిజర్వేషన్లను పొడగిస్తూ పోతున్నారు. ఇవి కొన్ని వర్గాలకు పరిమితం అవుతున్నాయి. దక్కిన వారే మళ్లీ మళ్లీ పొందుతున్నారు. రిజర్వేషన్లు న్యాయంగా అందాల్సిన వారు ఇంకా పోరాడుతూనే ఉన్నారు. ప్రస్తుతం కొన్ని అగ్ర కులాలు సైతం రిజర్వేషన్లు కావాలంటూ ఉద్యమాలకు దిగాయి.. చివరకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చేందుకు బరితెగించాయి ప్రస్తుత ప్రభుత్వాలు. కుల నిర్మూళన ద్వారానే సమ సమాజ నిర్మాణం సాధ్యమని బాబాసాహెబ్ అంబేద్కర్ చేప్పేవారు. దురదృష్లవశాత్తు కులాల పేరిట ఉద్యమాలు కుంపట్లుగా మారి దేశ సమగ్రత, సామరస్యానికి విఘాతంగా కలిగించేవిగా మారాయి. అవి అగ్రవర్ణాలవి కావచ్చు. బడుగు బలహీనవర్గాలని కావచ్చు. ఈరోజున ప్రతి ఒక్కరూ అంబేద్కర్ పేరును వాడుకుంటున్నారు. కానీ ఆయనను అర్థం చేసుకున్నవారు, విధానాలను అనుసరిస్తున్నవారు చాలా అరుదు. ఇప్పటికి ఇంకా పల్లెల్లో బలిసిన అగ్ర వర్ణాల అధికారం కొనసాగితోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో అధికారం కూడా అగ్రవర్ణాల చేతుల్లోనే ఉంది. తక్కువ కులం అనే పిలుపు ఇంకా వినిపిస్తూనే ఉంది. అంబేద్కర్ చూపిన మార్గం లో నడవటం ఆపేసి కొత్త దారులు వేసుకుని ప్రతి ఒక్కరు భీమ్ జీ పేరును మాత్రమే వాడేసుకుంటున్నారు. కుల కూకటి వేళ్లతో పెకిలించ బడ్డనాడే అంబేద్కర్ కలలు గన్న సమాజం సిద్దించినట్టు. ముందు మనం తక్షణం చేయాల్సిన పని కూడా ఇదే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడు కోరుకున్న సమాజ నిర్మాణం కోసం మనమంతా అంకితం అవుదాం జై భీమ్. 

Related Posts
ఓ వైపు డంపింగ్ యార్డ్, మరో వైపు కరోనా.. జవహర్ నగర్ ప్రజల ఆరోగ్యం.??
ఈ నెల 25 న చెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రి లో జవహర్ నగర్ బీజేఆర్ కు చెందిన రవికుమార్ (35) కరోనా వైరస్ తో తీవ్రంగా బాధపడుతూ.. వైద్యం అందక కనీసం ఆక్సిజన్ కూడా అందక మరణించాడు. చనిపోయే ముందు సెల్ఫీ ...
READ MORE
HYDERABAD: TELANGANA: 02/03/2016: Good luck: Intermediate students check out their hall ticket numbers outside an Intermediate Examination Centre at Mahbubia Girls High school in Hyderabad on Wednesday.  Photo: G. Ramakrishna
నిమిషం ఆల‌స్యం అయినా అనుమ‌తించ‌బోమ‌న్న నిబంధ‌న విద్యార్థులకు తీర‌ని ఆవేద‌న‌ను మిగిల్చింది. ఏడాది పాటు క‌ష్ట‌ప‌డి చ‌దివిన చ‌ద‌వులు ఒక్క నిమిషం ఆల‌స్యం కార‌ణంగా బుర‌ద‌లో పోసిన ప‌న్నీరులా మారాయి. హైద‌ర‌బాద్, రంగారెడ్డి జిల్లాల్లో చాలా చోట్ల‌ ఈ ప‌రిస్థితి నెల‌కొంది. విద్యార్థులు, ...
READ MORE
దేశం కంటే కూడా తెలంగాణ లో మూడు రెట్లు అధికంగా కరోనా కేసులు నమోదు.
కరోనా వైరస్ పై దేశ వ్యాప్తంగా విడుదలైన వివరాలను చూస్తే, తెలంగాణ ప్రజలు ఎంత ప్రమాదంలో ఉన్నారో బహిర్గతం అవుతున్నది. దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న కరోనా కేసుల కంటే తెలంగాణలో నమోదవుతున్న కేసుల సంఖ్య మూడు రెట్లు అధికంగా ఉండడం సంచలనంగా ...
READ MORE
గవర్నర్ రాజీనామా.. ఎంపీగ పోటీ.!!
కేరళ మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మిజోరాం గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ తాజాగా గవర్నర్ పదవికి రాజీనామా చేసారు. కాగా ఆయన త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన సొంత రాష్ట్రం అయిన కేరళ లోని తిరువనంతపురం నియోజకవర్గం నుండి ...
READ MORE
మరో 27 వస్తువుల పై తగ్గిన GST.!
కేంద్ర ప్రభుత్వం మరో 27 రకాల వస్తువులపై జిఎస్టీ భారాన్ని తగ్గించింది.. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరున్ జైట్లీ ఆధ్వర్యంలో నిన్న జరిగిన 22వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు రకాల వస్తువుల పై జిఎస్టీ ధరలను మార్పులు చేసారు. దీంతో ...
READ MORE
దర్యాప్తు అధికారిని టార్గెట్ చేసిన డ్రగ్స్ మాఫియా..
హైద్రాబాద్ లో మహా వృక్షం లా పాతుకుపోయిన డ్రగ్స్ మాఫియా పై లోతుగ దర్యాప్తు చేస్తున్న ఓ పోలీస్ ఉన్నతాధికారిపై అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా బెదిరింపులకు దిగడం చర్చనాయాంశం అవుతోంది. ఇప్పటికే చాలామందిని వరుస బెట్టి విచారిస్తుండడంతో ఈ విషయం అంతర్జాతీయ మాఫియాకు ...
READ MORE
షా నజర్ నల్గొండ పైనే ఎందుకు..? నల్గొండ ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం దొరికేదెప్పుడు..?
గతంలో తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు నల్గొండలోనే సభ పెట్టిండు అమిత్ షా. ఇక తాజా టూర్ లో సైతం నల్గొండే కేంద్రబిందువైంది. ఆ రోజు నల్గొండ ఫ్లోరైడ్ సమస్యను ప్రస్తావించారు అమిత్ షా. ఇందుకు అనుగుణంగానే ఈసారి మీటింగ్ కు ముందుగానే ...
READ MORE
ఫేక్ అకౌంట్ల తో తప్పుడు రాతలు రాస్తే కటకటాలే.. తెలంగాణ సర్కార్ సీరియస్ వార్నింగ్.
* ఫేస్ బుక్ లో ఇకపై ప్రజా ప్రతినిధులు, మంత్రుల పేర్లతో ఫేక్ అకౌంట్లకు చెక్ * ప్రభుత్వ సంస్థల పేర్లతోనూ సంబంధం లేని వ్యక్తులు ఫేస్ బుక్ లో ఇతర సోషల్ సైట్లలో అకైంట్లు, పేజీలను నిర్వహించరాదు * నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన ...
READ MORE
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ లొల్లంతా..?
ఓటు బ్యాంకు రాజకీయాలకు తెలంగాణ ప్రభుత్వం తెరలేపిందని బీజేపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అసెంబ్లీ లో ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో నిజాలు మాట్లాడితే సభ నుండి బయటక పంపించారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు ప్రభుత్వం తూట్లు ...
READ MORE
ఇంట్లో తల్లి లేనిది చూసి నాలుగేండ్ల పసిపాప పై అత్యాచారం చేసిన CPM నేత.!!
కేరళ రాష్ట్రం లో మరో ఘోరం బయటపడింది. అధికారంలో ఉన్న కమ్యునిస్టుల పై ఇప్పటికే అనేక ఆరోపనలొస్తున్న నేపథ్యం లో మొన్నీమధ్యే జరిగిన జమ్ము లో ఎనిమిదేండ్ల బాలిక హత్యాచారం.. మరియు సూరత్ లో ఎనిమిదేండ్ల బాలికపై హత్యాచారం ఇవన్నీ మరవకముందే ...
READ MORE
దేశ రాజధానిలో బాబు మిస్సింగ్.. ఆ ఆరుగంటలు ఎక్కడికెళ్లినట్టు..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. ఒకటి కాదు రెండు కాదు ఆరు గంటలు దేశ రాజధానిలో మాయమయ్యారు. ప్రత్యేక సెక్యూరిటికి తెలియకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పుడు ఈ విషయం పై పెద్ద చర్చే నడుస్తోంది. ఇంతకి ...
READ MORE
కరోనా ఎఫెక్ట్.. డీఎస్పి పై కేసు నమోదు.!!
దేశమంతా ఇపుడు కరోనా వైరస్ వల్ల ప్రమాదం ఎదుర్కొంటోంది.ముఖ్యంగా విదేశాల నుండి వచ్చిన వారి మూలంగానే మన దేశంలో కి కరోనా చొచ్చుకొచ్చింది.మార్చి 1 నుండి దేశం లోకి ఎంట్రీ ఇచ్చిన వారి వల్ల ఈ ప్రమాదం మరింత ఎక్కువ.ఈ నేపథ్యంలో ...
READ MORE
మరోసారి కూడా మోడీ గెలిస్తేనే.. ముస్లింలకు రక్షణ – పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
భారత శత్రు దేశం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజా వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తోంది. నిన్న మొన్నటి దాక నరేంద్ర మోడి కి వ్యతిరేకంగ మాట్లాడిన ఇమ్రాన్ సడన్ గ ఫ్లేట్ ఫిరాయిస్తూ ఓ ఛానల్ కి ఇంటర్యూ ఇస్తూ మోడీకి ...
READ MORE
యూరప్ దేశంలో ఒక దేశ ద్రోహిని ఉరితీసిన రోజే నేటి “వాలెంటైన్ డే”(లవర్స్ డే).!!
దాదాపు 1500 సంవత్సరాల క్రితం నాటి యూరప్ దేశంలో క్లోడియస్ 2 అనే రాజు పరిపాలన ఉండేది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగ దేశ రక్షణ కోసం నియమించబడ్డ సైన్యంలో కొన్ని నియమనిబంధనలు ఉండేవి. అందులో ముఖ్యమైనది సైన్యంలో పని చేస్తున్న సైనికులు ...
READ MORE
రణరంగమైన ధర్నా చౌక్. తేలిపోయిన అసలు కథ.
ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్‌ను కొనసాగించాలని సోమవారం అఖిలపక్షం ఆందోళన నిర్వహించింది. ఈ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ధర్నా చౌక్‌ను ఎట్టి పరిస్థితుల్లో తరలించరాదని అఖిలపక్ష నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టగా, ధర్నాచౌక్‌ తరలించాల్సిందేనని కొందరు నిరసన చేపట్టారు. ఇరువర్గాలు ...
READ MORE
ఎందుకు చైతూ మనకీ యుద్దాలు.. రణం మానుకో మనం ఏలుకో.
లవర్ బాయ్ హఠాత్తుగా కత్తిపట్టుకుని యుద్దరంగం లోకి దూకితే ఏమవుతుంది. ఆ ఏమవుద్ది అదృష్టం కలిసొస్తే.. లక్కు మరీ నక్కతోక లా చాంతాండత ఉంటే ఏదో బ్రతికి బట్టకట్టగలుతాడు. లేదంటేనా అటునుండి అటే అంతా అస్సామే. ఇప్పుడు అదే జరిగింది. అక్కినే ...
READ MORE
విద్యార్థి ఉద్యమం నుండి జాతీయ స్థాయికి ఎదిగిన ఒక నాయకుడి ప్రయాణం.!
ఈరోజు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు జన్మదినం సందర్భంగా ఈ ప్రత్యేక ఆర్టికల్. తెలంగాణ కరీంనగర్ జిల్లా లో రైతు ఉద్యమాలు ప్రత్యేకించి పసుపు రైతు కోసం దేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేసి ఉద్యమ నాయకుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి, ...
READ MORE
అందరి మనసులను కదిలిస్తున్న గోవా ముఖ్యమంత్రి వర్క్ కమిట్మెంట్..!!
ఈ దేశం లో పంచాయతి వార్డ్ మెంబర్ నుండి ప్రధాన మంత్రి వరకైనా గెలిచేంత వరకే తర్వత జనాలంటే చిన్నచూపే అనే చర్చ సాగూతూనే ఉంది. అందుకేనేమో ఓట్లేసే జనాలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు.. అవకాశం చిక్కినప్పుడే ఉపయోగం పొందాలని భావిస్తున్నారు. ...
READ MORE
కేసీఆర్ సర్వేతో మంత్రులకు.. ఎమ్మెల్యేలకు ముచ్చమటలు… ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే సీట్లు ఇవే…
సీఎం కేసీఆర్ తన సర్వేతో ఎమ్మెల్యేలు, మంత్రులకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏ ఒక్క నాయకున్ని పాలనలో పని తీరుపై ప్రశ్నించని ముఖ్యమంత్రి.. ఈ సర్వేతో ఒక్క సారిగా ఉగ్రరూపం చూపించారు. సర్వేలో పాలన సరిగ్గా లేదని ...
READ MORE
CAA కు వ్యతిరేకంగ విషప్రచారం చేస్తూ హింసకు పాల్పడినందుకు నష్టపరిహారం చెల్లిస్తున్న ముస్లింలు.!!
దేశం లో ఇపుడు జరుగుతున్న CAA వ్యతిరేక మరియు అనూకూల ర్యాలీల సంధర్భంగ పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాగా ప్రస్తుతానికి ప్రజల్లో ముఖ్యంగ ముస్లింలలో అవగాహన పెరుగుతుండడంతో దాదాపు తగ్గుముఖం పట్టిన వ్యతిరేక ఆందోళనలు అదే సమయంలో ...
READ MORE
తెలంగాణ లో కదులుతున్న కాంగ్రెస్ పునాదులు, రేవంత్ రెడ్డి కోమటి రెడ్డి భాజపా లోకి.?
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కి గడ్డు కాలం నడుస్తోంది. ఇక తెలంగాణ లో అంచనాలకు మించి ఓ మూడు స్థానాలు గెలిచి పర్వాలేదనిపించింది కాంగ్రెస్. కానీ ఆ సంతోషం ఎంతో కాలం లేనట్టే అనిపిస్తోంది. ఇప్పటికే గెలిచిన 18 మంది ...
READ MORE
సినారే ఇక లేరు.. కవి సామ్రాట్ కు కన్నీటి వీడ్కోలు.
తెలంగాణ ముద్దు బిడ్డ సిరిసిల్ల జిల్లా హమూజీపేట వాసి యావత్ ప్రపంపచానికి చిరపరిచితుడు కవి, రచయిత సినారే ఇక లేరు. సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం ఉదయం హైదరబాద్ లో కన్నుమూశారు. ఈ విషాద వార్త వినగానే తెలుగు ప్రపంచం ...
READ MORE
హైద్రాబాద్ విద్యార్థినికి డాక్టరేట్ ప్రధానం చేసిన ఓయు
ఉస్మానియా యూనివర్శిటీ లో ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ పీజీ పూర్తి చేసి "ఏ నోవల్ గ్రీన్ సింథెసిస్ ఆఫ్ సిల్వర్ నానో పర్టికల్స్ ఫాం అన్ ఇండియన్ మెడిసినల్ ప్లాంట్ సోమిద ఫెబ్రిఫుగ - స్పెక్ట్రువల్, స్ట్రక్చువల్, క్యాటలైటిక్, మెర్క్యూరీ సెన్సింగ్ ...
READ MORE
మీసాలు తీసేసి గడ్డాలు పెంచే ముస్లింలంతా మత మౌఢ్యులు – వసీం రజ్వీ
ముస్లింలలో చాలా మంది మీసాలు పూర్తిగ తీసేసి గడ్డాలు విపరీతంగ పెంచి కనిపిస్తుంటారు. ఈ విషయమై ఉత్తర్ ప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వసీం రజ్వీ వివాదస్పద వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం వసీం రజ్వీ చేసిన వ్యాఖ్యలు దుమారం అవుతోంది. మీసాలు ...
READ MORE
వనపర్తి చేరుకున్న జన చైతన్య యాత్ర.. కదం తొక్కుతున్న కాషాయదళం.!!
తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షులు డా.కే.లక్ష్మణ్ చేపట్టిన జన చైతన్య యాత్ర మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి చేరుకుంది. ఈ సభకు భాజపా జాతీయ పార్టీ అధికార ప్రతినిధి డా.సంబిత్ పాత్ర హాజరయ్యారు. ఈ సంధర్భంగ డా.కే.లక్ష్మణ్ మాట్లాడుతూ.. ...
READ MORE
ఓ వైపు డంపింగ్ యార్డ్, మరో వైపు కరోనా.. జవహర్
ఏడాది చ‌దువుని మింగేసిన నిమిషం ఆల‌స్యం
దేశం కంటే కూడా తెలంగాణ లో మూడు రెట్లు అధికంగా
గవర్నర్ రాజీనామా.. ఎంపీగ పోటీ.!!
మరో 27 వస్తువుల పై తగ్గిన GST.!
దర్యాప్తు అధికారిని టార్గెట్ చేసిన డ్రగ్స్ మాఫియా..
షా నజర్ నల్గొండ పైనే ఎందుకు..? నల్గొండ ఫ్లోరైడ్ సమస్యకు
ఫేక్ అకౌంట్ల తో తప్పుడు రాతలు రాస్తే కటకటాలే.. తెలంగాణ
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ లొల్లంతా..?
ఇంట్లో తల్లి లేనిది చూసి నాలుగేండ్ల పసిపాప పై అత్యాచారం
దేశ రాజధానిలో బాబు మిస్సింగ్.. ఆ ఆరుగంటలు ఎక్కడికెళ్లినట్టు..?
కరోనా ఎఫెక్ట్.. డీఎస్పి పై కేసు నమోదు.!!
మరోసారి కూడా మోడీ గెలిస్తేనే.. ముస్లింలకు రక్షణ – పాక్
యూరప్ దేశంలో ఒక దేశ ద్రోహిని ఉరితీసిన రోజే నేటి
రణరంగమైన ధర్నా చౌక్. తేలిపోయిన అసలు కథ.
ఎందుకు చైతూ మనకీ యుద్దాలు.. రణం మానుకో మనం ఏలుకో.
విద్యార్థి ఉద్యమం నుండి జాతీయ స్థాయికి ఎదిగిన ఒక నాయకుడి
అందరి మనసులను కదిలిస్తున్న గోవా ముఖ్యమంత్రి వర్క్ కమిట్మెంట్..!!
కేసీఆర్ సర్వేతో మంత్రులకు.. ఎమ్మెల్యేలకు ముచ్చమటలు… ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే
CAA కు వ్యతిరేకంగ విషప్రచారం చేస్తూ హింసకు పాల్పడినందుకు నష్టపరిహారం
తెలంగాణ లో కదులుతున్న కాంగ్రెస్ పునాదులు, రేవంత్ రెడ్డి కోమటి
సినారే ఇక లేరు.. కవి సామ్రాట్ కు కన్నీటి వీడ్కోలు.
హైద్రాబాద్ విద్యార్థినికి డాక్టరేట్ ప్రధానం చేసిన ఓయు
మీసాలు తీసేసి గడ్డాలు పెంచే ముస్లింలంతా మత మౌఢ్యులు –
వనపర్తి చేరుకున్న జన చైతన్య యాత్ర.. కదం తొక్కుతున్న కాషాయదళం.!!
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!