You are here
Home > తాజా వార్త‌లు > అమర్నాథుడి దర్శనానికి ఎందుకింత అవాంతరాలు..??

అమర్నాథుడి దర్శనానికి ఎందుకింత అవాంతరాలు..??

ప్రపంచ స్వయంభు శివలింగ ఆలయాల్లో ఎంతో ప్రాముఖ్యత ప్రాచీనత కల్గిన శివాలయం అమర్నాథ ఆలయం. ఈ ఆలయం భారత దేశంలో ఉండడమంటే భారత భూమి దైవ భూమీ అని పిలవడానికి ఒక కారణం.

ప్రతి ఏటా మే , జూన్ , జూలై , ఆగస్ట్ నెలలు వచ్చాయంటే చాలు మన సైనికులకు సవాల్ గా మారుతుంది. కారణం ఈ నెలల్లోనే అమర్నాథుడి ఆలయం తెరుచుకోవడమే. మిగతా రోజుల్లో అమర్నాథ గుహ మొత్తం మంచుతో కప్పబడే ఉంటుంది. ఈ మాసాల్లోనే దట్టమైన మంచు కరిగి భక్తులకు దర్శనం ఇస్తాడు అమర్నాథుడు.

ఈ యాత్ర కోసం భక్తులు ఎంత తాపత్రయంతో ఎదురు చూస్తారో.. అంతే అదును కోసం చూస్తారు ఉగ్రవాదులు. ఉగ్రమూకల బారి నుండి యాత్రికులను క్షేమంగా గమ్యాలకు చేర్చడం కోసం సైన్యం కంటికి కునుకు లేకుండా అత్యంత భీకరమైన మైనస్ డిగ్రీల చలిలో యాత్రికులకు రక్షణ వలయంగా ఉంటారు.

దాడి చేస్తాం అని ఉగ్రవాదులు ఎన్ని హెచ్చరికలు చేసినా ఏ ఒక్క శివ భక్తుడు కూడా ఆ హెచ్చరికలను లెక్కచేయడు. అంతటి ప్రేమా విశ్వాసం ఆ అమర్నాథుడంటే..! ఏడాదికేడాది ఇంకా పెరుగుతున్నారే తప్ప యాత్రికులు తగ్గడం లేదు.

ఎన్నో రకాల పరీక్షలు , జాగ్రత్తల తర్వాతే యాత్రకు అనుమతినిస్తున్నది ప్రభుత్వం. అయినా వేలాదిగా భక్తులు వస్తునే ఉన్నారు. జీవితంలో ఒక్కసారైనా అమర్నాథుడిని దర్శించాలని భావిస్తాడు ప్రతి హిందువు.

ఉగ్రమూకలే కాదు యాత్ర చేసే దారి సైతం ఎంతో సాహసంతో కూడుకున్నదే. అత్యంత ప్రమాదకరమైన లోయలు మంచు దారుల్లోనే ప్రయాణం చేయాలి.
కానీ అమర్నాథుడి దర్శనం ముందు అవన్నీ దిగదుడుపే. అత్యంత ప్రాచీన పురాణాల్లోనూ అమర్నాథ శివలింగం గురించి ప్రస్తావన ఉంది.
తన సతీమణి పార్వతీ దేవికి శివుడు ఈ ప్రాంతంలోనే జ్ఞానబోధ చేసాడని ప్రతీతి. అందుకే పరమ పవిత్ర క్షేత్రమైంది అమర్నాథ గుహ.

తెల్లటి మంచు గుహలో మంచు రూపంలో దర్శనమిస్తాడు శివుడు. కాలక్రమంగా సహజసిద్దంగా ఏర్పడుతుంది గుహలోని శివలింగం. కాబట్టే ఈ మంచు లింగం దర్శనం అంటే జన్మజన్మల పుణ్య ఫలం అంటారు అంతా.

అయితే ఇదే అదునుగా భావిస్తున్న ఉగ్రవాదులు భక్తులను లక్ష్యంగా చేసుకుని యాత్ర సమయంలో దాడులకు తెగబడడం చంపేయడం.. ఆ దాడిలో రక్షణగా నిలిచే సైనికులకు సైతం తీవ్రంగా గాయాలవుతూనే ఉంది. తాజాగా కూడా పదిహేను మంది అమాయక భక్తులను పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. అత్యంత పాశవిక చర్యను దేశం తిప్పికొడుతూనే ఉంది.

ఉగ్రవాదుల పిరికి చర్య అని ఈ ఘటనను ఖండించారు ప్రధాని నరేంద్ర మోడి. ప్రతిపక్ష నేతలు కూడా తీవ్రంగా ఖండించారు. భద్రతను ఇంకా కట్టుదిట్టం చేసారు. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా శివుని భక్తులు వెనకడుగు వేస్తారని అనుకుంటే ఉగ్రవాదుల కంటే మూర్ఖులు ఇంకెవరు ఉండరేమో మరి.

కులమతాలకు అతీతంగా హక్కున చేర్చుకునే ఈ కర్మభూమిలో ఇలాంటి మారణకాండను సృష్టిస్తున్న ఉగ్రవాదులకు ఎదురుదాడితోనే బుద్ది చెప్పాలి ఎక్కడికక్కడే ఉగ్రమూకలను ఏరి పారెయ్యాలంతే.. !! అందుకు దేశంలోనే మనలోనే అంతర్యుద్ధం మొదల్లవాలి. శాంతి సందేశాలు పంపుతున్నంత కాలం ఇలా అమాయక భక్తులు దేశ సేవకులు సైనికులు పవిత్ర కర్మభూమిలో నేలకొరుగుతూనే ఉంటారు.

— రాంబాబు. డి

Related Posts
నేడు బాబు జగ్జీవన్ రాం 109వ జయంతి
దళిత జాతి ఉద్దారకుడు అంబెద్కర్ కు సమకాలీకుడు బాబు జగ్జీవన్ రాం జయంతి నేడు. బీహార్ రాష్ట్రం షాబాద్ జిల్లా లోని ఛాందా గ్రామంలో ఆదర్శ పుణ్య దంపతులైన శిబిరం మరియు బసంతి దేవి దంపతులకు 1908 ఏప్రిల్ 5 న ...
READ MORE
పొంగి పొర్లుతున్న విషపు నాలా కింద నాచారం జనాల బతుకులు విలవిల.!
కొన్ని నెలల కిందటే నెల రోజులపాటు రహదారి పై రాకపోకలను బంద్ చేసి మరీ నాచారం నాలాను మరమ్మతులు చేసారు.. ఇందుకోసం ప్రభుత్వం లక్షల రూపాయలను ఖర్చు చేసింది. కానీ ఒకరోజు కురిసిన వానకే మల్లీ నాలా పొంగి పొర్లి జనాల ...
READ MORE
ముస్తాబవుతున్న గువ్వ గోరింక.. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో మీ ముందుకు.. త్వరలో.
మానవ సంబంధాలు కనుమరుగవుతున్న ప్రస్తుత ప్రపంచంలో ఇద్దరు ప్రేమికుల మధ్య జరగిన సంఘటనలకు రూపమే గువ్వగోరింక చిత్రం. వినూత్నమైన సినిమాలకు పట్టం కడుతున్న తెలుగు ప్రేక్షకుల అభిరుచిపై నమ్మకంతో. ఆకార్ మూవీస్ సంస్థ  ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో.. పూర్తి సహజమైన పాత్రలతో.. ...
READ MORE
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో టీడీపీ కౌన్సిలర్ రాజీనామా.!!
చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ టీడీపీ కి "షాక్" తాకింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినప్పటికీ మున్సిపాలిటీ యంత్రాంగం అంతా టీడీపీదే పై చేయి అయినప్పటికీ.. టీడీపీ కౌన్సిలర్ జి. సుమంత్ కళ్యాణ్ తన కౌన్సిలర్ పదవికి రాజీనామా ...
READ MORE
ఇక ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడమే – సుబ్రహ్మణ్య స్వామి
ప్రముఖ న్యాయవాది రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి తాజాగా జరిగిన ఆర్టికల్ 370, 35ఏ రద్దు పై స్పందించారు. నరేంద్ర మోడి అమిత్ షా లు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ఇక ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారికి లక్షలాది మంది ...
READ MORE
తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.
తెలంగాణ రాష్ట్రం మూడేళ్లు పూర్తి చేసుకుని జూన్ 2 న ఘనంగా నాలుగవ ఏడాదిలోకి అడుగు పెట్టింది. మన స్వరాష్ట్ర వేడుకలు, ఆవిర్భావ దినోత్సవం పండుగా సంబురాలు ఘనంగానే సాగాయి. కానీ అక్కడక్కడ కొన్ని అనుకోని ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని ...
READ MORE
5 రూపాయల డాక్టరు ఇకలేడు.. నివాలి అర్పించిన అశేషజనవాహిని.!!
చెన్నై లోని వాషర్ మెన్ పేట లో ఉండే ఒక సాధారణ డాక్టర్ వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజల అభిమానం సొంతం చేసుకున్నాడంటే నమ్మశక్యం కాదేమో కానీ, ఆ ఘనత సొంతం చేసుకున్నాడు 5 రూపాయల డాక్టర్ జయచంద్రన్. అవును ...
READ MORE
అర‌వ‌గోల అయిపోయిందా.. ఇక మ‌న‌  తెలుగు లోకంలోకి రండి.
వారం రోజుల నుంచి ఒక‌టే మోత‌. పొద్దున లేచింది మొద‌లు మ‌ళ్లీ తెల్లారే వ‌ర‌కు రికం లేకుండ ఒక‌టే వార్త. త‌మిళ‌నాడులో అద‌యింది. త‌మిళ‌నాడులో ఇద‌యింది.. అమ్మ ఆత్మ గోసించింది.. ప‌న్నీరు జ‌ల్లైంది శ‌శిక‌ళ క‌న్నీరై పారింది ఇదే వార్త‌లు పాడిందే ...
READ MORE
ఇమ్రాన్ ఖాన్ ను ఫుట్ బాల్ అడుకుంటున్న డైరెక్టర్ వర్మ..!!
సంచలనాల సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా పుల్వామా ఘటనపై తనదైన శైలిలోస్పందిస్తూ.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను చెడుగుడు ఆడుకుంటున్నారు. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించిన ఆర్జీవీ ఇమ్రాన్ ఖాన్ పై విరుచుకుపడ్డారు.ఇమ్రాన్ ఖాన్ ను ...
READ MORE
సిఎం కేజ్రివాల్ ఆద్వర్యంలో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ పై దాడి చేసిన ఆప్ ఎంఎల్ఏ లు.!!
ఢిల్లీ లో అధికారులు, అధికార పార్టీ ఎంఎల్ఏ ల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా ఆప్ ఎంఎల్ఏ లు అజయ్ దత్, ప్రకాశ్ జర్వాల్ తనని ఇంటికి పిలిపించుకుని మరీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ ఆధ్వర్యంలోనే తనపై దాడి చేసారని ...
READ MORE
ఓడిపోయిన కోమటోల్లు.!!
గత నెలరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లేనూ వాడీవేడిగా జరుగుతున్న తంతు ఏదైనా ఉందంటే.. అది కంచె ఐలయ్య కు కోమటోల్లకు జరుగుతున్న యుద్ధం అని చెప్పొచ్చు.. ఇంకా ఆ నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నై.. కాగా కంచె ఐలయ్య రాసిన "సామాజిక స్మగ్లర్లు ...
READ MORE
కార్పోరేట్ దందా కు బలైపోతున్న తెలుగు విద్యా కుసుమాలు.!
తెలుగు రాష్ట్రాలలో కార్పోరేట్ కాలేజ్ భూతం జడలు విప్పుతోంది. కోటి కలలతో ఎన్నో ఆశయాలతో వెల్లి చిక్కుబడిపోయిన విద్యార్ధులను మింగేస్తోంది ఈ కార్పోరేట్ భూతం. పోయిన వారమే కడప లో ఓ విద్యార్థిని బలైపోగా.. రెండు రోజుల క్రితమే మాదాపూర్ లో మరో ...
READ MORE
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మంచి ర్యాంకును పొందడం అంటే అంత సులభం కాదు..
మరోసారి ప్రపంచ బ్యాంకు మన ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికెత్తేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన దేశం 130 స్థానం నుండి ఏకంగ 100 వ ర్యాంకు ను సాధించడం తాజాగా అంతర్జాతీయంగ చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలో వరల్డ్ ...
READ MORE
కుటుంబాన్ని మొత్తం మింగేసిన మూఢ నమ్మకం.! ఢిల్లీలో అత్యంత దారుణమైన ఘటన.!!
గతంలో ఎన్నడూ వినని విధంగా చూడని విధంగ దేశ రాజధాని ఢిల్లీ నగరం లో ఓ విషాధ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. సాధారణంగా మూఢ నమ్మకం వలన క్షుద్ర పూజల కోసం కొందరు ...
READ MORE
డా.చెన్న క్రిష్ణా రెడ్డి కి ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ గ పదోన్నతి.!
ఉస్మానియా యూనివర్శిటీ మ్యాథ్స్ ఫ్యాకల్టీ డా.చెన్న క్రిష్ణా రెడ్డి కి అస్సోసియేట్ ప్రొఫెసర్ నుండి ప్రొఫెసర్ గ పదోన్నతి లభించింది. డా.చెన్న క్రిష్ణా రెడ్డి ప్రముఖ జాతీయ వాదిగ పేరు గడించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో జ్వేష్ట నాయకులుగ ...
READ MORE
పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పాలి – ఏబీవీపీ నేత శ్రీహరి
జమ్ము కాశ్మిర్ పుల్వామా లో మన సైన్యం పై పాకిస్తాన్ ఉగ్రమూక జరిపిన దాడిని ఏబీవీపీ నగర కార్యదర్శి శ్రీహరి తీవ్రంగ ఖండించారు. ఈ సంధర్భంగ ఉస్మానియా యూనివర్శిటీ లో విధ్యార్థులు కార్యకర్తలతో కలిసి పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ ను దగ్ధం ...
READ MORE
రేవంత్ రెడ్డి కి TPCC కన్ఫాం ఐతే.. సీనియర్లు ఏం చేయనున్నారు.?
నేనే తెలంగాణ తెచ్చినా అని చెప్పుకుంటున్న TRS పార్టీ రెండో సారి అధికారంలో ఉన్నది, మరో వైపు తెలంగాణ భవిష్యత్తు బాగుండాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మాతోనే సాధ్యం అని రాష్ట్రం లో TRS పార్టీ కి మేమే ప్రత్యామ్నాయం అని ...
READ MORE
గ్యాస్ సిలిండర్ల పేలుడు మాట ఇక వినిపించదు..
గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి మరో నలుగురికి గాయాలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం సిలిండర్ దాటికి కుప్పకూలిన ఇంటి పై కప్పు. గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదం.. ఇలాంటి వార్తలు నిత్యం వింటునే ఉంటాం. గ్యాస్ సిలిండర్ పేలుళ్ల ...
READ MORE
దీదీ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన యోగీ ఆదిత్యానాథ్.!!
మొన్న పశ్చిమ బెంగాల్ కి యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ టూర్ ను అడ్డుకుంటూ ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతులు ఇవ్వని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు యోగీ ఆదిత్యానాథ్.హెలికాప్టర్ ల్యాండింగ్ కు ...
READ MORE
విద్యార్ధుల చదువును ఏకాగ్రతను మింగుతున్న “పబ్ జి” గేమ్..!!
సమాజంలో ఏది ఎక్కువైనా అది వ్యసనంగానో విషంగానో పరిణమిస్తుంది. వర్షాలు పడకుండ ఉంటే కరవంటారు అనావృష్టి అంటారు. అదే వర్షాలు ఎక్కువగ పడితే అదికూడా కరువే అంటారు అతివృష్టి గ పేర్కొంటారు.అదే విధంగ మనిషికి కాలక్షేపం(Entertainment) కావాలి కానీ అది ఎక్కువైతే ...
READ MORE
పుట్టిన రోజు వేడుకలు వద్దన్న సూపర్ స్టార్.!!
ఆయన ఒక్కసారి చేఎత్తి అభివాదం చేస్తే చాలు కోట్లాది మంది అభిమానులు పులకించిపోతారు. పేరుకు తమిలుడే అయినప్పటికీ దేశ విదేశాల్లో ఎవరికీ అందనంత క్రేజ్ సంపాదించిన ఎవర్ గ్రీన్ క్రేజీ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. మరి రజినీకాంత్ కంటే అందమైన హీరోలు ...
READ MORE
రికార్డ్ లు బ్రేక్ చేసిన బాలాపూర్ లడ్డూ.. రూ.15లక్షల 60వేలు.
బాలాపూర్ లడ్డూ వేలంపాట ఈ ఏడాది కూడా ఘనంగా కొనసాగింది. ఏడాదికేడాది రికార్డులను బ్రేక్ చేస్తూ భక్తి భావంతో విఘ్నేశ్వరుని లడ్డూను దక్కించుకుంటున్నారు భక్తులు. ఈ ఏడాది ప్రఖ్యాత బాలాపూర్‌ లడ్డూ వేలం పాట ముగిసింది. గతేడాది రికార్డును బ్రేక్‌ చేస్తూ ...
READ MORE
మొన్నటిదాక నోటి దూల చూపించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడెక్కడా.!! నిలదీస్తున్న నెటిజన్లు.!!
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు అక్కడ ఒక సంచలన సంఘటన చోటు చేసుకుంది, అదే సీనియర్ మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య. అప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే.. కనీసం ఇప్పుడైనా పొత్తుల ప్రభుత్వం ఏర్పడింది కానీ ...
READ MORE
కాటికి కాలుసాపే వయసులో గిదేం పాడుబుద్దిరా ముసలోడా.!!
*85 ఏండ్ల వృద్ధుడు 6వ తరగతి 7వ తరగతి బాలికలపై అత్యాచారం *ఏడాది నుండి స్థానికంగ ఉన్న 6 మంది బాలికల పట్ల అసభ్యంగ ప్రవర్తిస్తున్న వృద్ధ కామాంధుడు *వృద్ధుడు రైల్వే రిటైర్డ్ ఉద్యోగి, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన దారుణం కాప్రాలో ...
READ MORE
పోలింగ్ ముగిసింది.. కింగ్ ఎవరు కింగ్ మేకరెవరు.??
తెలంగాణ లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు సమరాన్ని తలపించి మొత్తానికి పోలింగ్ తో ముగిసింది. ఇక ఈ నెల పదకొండు తేది నాడు అభ్యర్థుల భవితవ్యం తో పాటు పార్టీ ల బలబలాలు కూడా బహిర్గతం కానుంది. ముందస్తుకు వెల్లినందుకు కేసిఆర్ కు ...
READ MORE
నేడు బాబు జగ్జీవన్ రాం 109వ జయంతి
పొంగి పొర్లుతున్న విషపు నాలా కింద నాచారం జనాల బతుకులు
ముస్తాబవుతున్న గువ్వ గోరింక.. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో మీ ముందుకు.. త్వరలో.
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో టీడీపీ కౌన్సిలర్ రాజీనామా.!!
ఇక ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడమే
తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.
5 రూపాయల డాక్టరు ఇకలేడు.. నివాలి అర్పించిన అశేషజనవాహిని.!!
అర‌వ‌గోల అయిపోయిందా.. ఇక మ‌న‌ తెలుగు లోకంలోకి రండి.
ఇమ్రాన్ ఖాన్ ను ఫుట్ బాల్ అడుకుంటున్న డైరెక్టర్ వర్మ..!!
సిఎం కేజ్రివాల్ ఆద్వర్యంలో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ పై దాడి
ఓడిపోయిన కోమటోల్లు.!!
కార్పోరేట్ దందా కు బలైపోతున్న తెలుగు విద్యా కుసుమాలు.!
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మంచి ర్యాంకును పొందడం
కుటుంబాన్ని మొత్తం మింగేసిన మూఢ నమ్మకం.! ఢిల్లీలో అత్యంత దారుణమైన
డా.చెన్న క్రిష్ణా రెడ్డి కి ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ గ
పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పాలి – ఏబీవీపీ నేత శ్రీహరి
రేవంత్ రెడ్డి కి TPCC కన్ఫాం ఐతే.. సీనియర్లు ఏం
గ్యాస్ సిలిండర్ల పేలుడు మాట ఇక వినిపించదు..
దీదీ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన యోగీ ఆదిత్యానాథ్.!!
విద్యార్ధుల చదువును ఏకాగ్రతను మింగుతున్న “పబ్ జి” గేమ్..!!
పుట్టిన రోజు వేడుకలు వద్దన్న సూపర్ స్టార్.!!
రికార్డ్ లు బ్రేక్ చేసిన బాలాపూర్ లడ్డూ.. రూ.15లక్షల 60వేలు.
మొన్నటిదాక నోటి దూల చూపించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడెక్కడా.!! నిలదీస్తున్న
కాటికి కాలుసాపే వయసులో గిదేం పాడుబుద్దిరా ముసలోడా.!!
పోలింగ్ ముగిసింది.. కింగ్ ఎవరు కింగ్ మేకరెవరు.??
Facebook Comments
Top
error: Content is protected !!