
అమ్మతనం ఎక్కడైనా అమ్మతనమే. తన బిడ్డకోసం ఈ ప్రపంచాన్నే ఎదురించా సత్తా ఉన్నది ఒక తల్లిలోనే. తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా తొమ్మిది నెలలు మోసి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. తన ఓడిపోతు బిడ్డ రూపంలో విజేతగా నిలవాలనుకుంటుంది. అలాంటి ఓ తల్లి ధీనగాథే ఇది. అయితే అందరు తల్లుల్లా ఈమె మాత్రం కడు పేదరాలో లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమై కన్నబిడ్డను పెంచి పెద్ద చేయాలని దుర్భర పరిస్థితిలో మాత్రం లేదు. కానీ అంతకు మించిన మత్తులో చిత్తై కన్నబిడ్డనే కాదు ఈ ప్రపంచాన్నే మరిచిపోయింది. సరిగ్గా ఏడాది క్రితం ఈ తల్లి చేసిన నిర్వాకం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. సోషల్ మీడియాలో మత్తులో మదర్.. అమ్మలాలన లేక గుక్కపట్టి ఏడుస్తున్నపసిప్రాణం అంటూ ఓ కథనం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఒకే ఒక్క పోటోతో ఆ తల్లి ని అంతా చీదరించుకున్నారు. ఆ పోటోలో ఆమె పడి ఉన్న విదానాన్ని చూసి అసలు తల్లేనా ఈమె అనే అంతా రేంజ్ లో నెటిజన్లు ఫైరయ్యారు. ఈ ఘటన గత ఏడాది అక్టోబర్ లో అమెరికాలోని ఇండియానాలో చోటు చేసుకుంది. ఆ ఫోటో ఇదిగో ఇదే. ఇక్కడ కారు సీట్లోనే పడిపోయి ఉన్న మహిళ పేరు ఎరికా హర్ట్. వయసు కేవలం 26. ఈమె జీవితంలో జరిగిన యధార్థ గాథే ఇప్పుడు మన చెప్పుకోబోయేది. ఈమె కథ చదివాక కొంతలో కొంత అయినా మత్తులో జోగుతున్న వారిలో మార్పు వస్తుందేమో.
ఏడాది క్రితం అక్టోబర్ నెలలో అమెరికాలోని ఎరికా హర్ట్ అనే 26 ఏళ్ల యువతికి సంబంధించిన ఓ ఫోటో వైరల్ అయింది. డ్రగ్స్‌కు బానిసగా మారి మత్తులో జోగుతు నడిరోడ్డు పై కారు నిలిపి వేసి డ్రైవింగ్ సీట్లోనే మత్తులోకి వెళ్లిపోయింది. మన ఇండియాలో అయితే ఎలా చేస్తారో అక్కడ కూడా సేమ్ సేమ్ అలాగే చేశారు. కాపాడటం మాట అటుంచి ఫోటోలు తీసి నెట్ లో పెట్టారు. ఇది చేసింది కూడా మరెవరో కాదు అక్కడి పోలీసులు. అయితే పోలీసులు ఆమె పోటోలో తీయడానికి కారణం లేకపోలేదు. ఆమెతో పాటు వెనక సీట్లో గుక్కపెట్టి ఏడుస్తున్న ఏడాదిన్నర బాబు అక్కడ ఉండటమే. అంతే వెంటనే ఆ బాబును కాపాడి ఆస్పత్రికి తరలించిన పోలీసులు ఆమె పరిస్థితిని అందరికి తెలిసేలా పోటోలు తీసి డ్రగ్స్ మత్తులో కన్నబిడ్డ ప్రాణాలతో చెలగాటమాడిన తల్లి.. షాకింగ్ ఫోటో ఆఫ్ ఎ మథర్..’ అంటూ సోషల్ మీడియాలో ఫోస్ట్ చేశారు. అంతే క్షణాల్లో ఆ ఫోటో తెగ వైరల్ అయింది. ఒక్క అమెరికాలోనే కాదు ప్రపంచ దేశాలన్ని చక్కర్లు కొట్టింది ఆ పోటో.
ఆ తరువాత సరిగ్గా రెండు రోజులకు మత్తు నుండి బయటకు వచ్చిన ఎరికా హర్ట్ అసలు విషయం తెలుసుకుని కుంగిపోయింది. ఆస్పత్రి సిబ్బంది నుండి స్నేహితుల వరకు అంతా దెప్పి పొడవడం అసహ్యించుకోవడంతో అవమానంతో చనిపోవాలని నిర్ణయించుకుంది. అంతే ఆ తరువాత ఏకంగా 12 సార్లు ఆత్మహత్య యత్న ప్రయత్నం చేసింది. మత్తుకు బానిసైన ఎరికా ఆ మత్తు తనను చంపేస్తుందని తెలిసి తనే చావలనకుంది. అయితే కుటుంబసభ్యులు ధైర్యం చెప్పడం పాపను ప్రతి నిమిషం తన వద్దే ఉంచి అమ్మతనం గుర్తుకు వచ్చేలా చేయడంతో ఎరికాలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. కనీసం తన బిడ్డ కోసం అయినా బ్రతకాలని నిర్ణయించుకున్న ఎరికా హర్ట్ డ్రగ్స్‌కు దూరం అవాలంటే ఏం చేయాలన్న దానిపై కసరత్తులు చేసింది.
డాక్టర్లను, నిపుణులను కలిసింది. సలహాలు సూచనలతో తనలో తాను మార్పు తెచ్చుకునేందుకు అనునిత్యం ప్రయత్నం చేసింది. మత్తుకు దూరంగా ఉండేందుకు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. మందులు వాడింది. చివరికి ఎలాగోలా మత్తు అనే పదం వినిపిస్తే ఛీ అనే అంత రేంజ్ కి చేరుకుంది. దీంతో సరిగ్గా ఏడాది తరువాత పూర్తిగా మారిపోయిన ఎర్టికాను చూసి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. స్నేహితులు కూడా క్షమించమని చెప్పి ఎరికా కి దగ్గరయ్యారు.. ఇక అంతా సజావుగా సాగుతున్న తరుణంలో సోషల్ మీడియా మరోసారి గత కాలపు జ్ఞాపకాలను ముందరేసింది. ఫేస్ బుక్ లో యువర్ మెమోరిస్ అని ఎరికా టైమ్ లైన్ పై పోటో ప్రత్యక్షం అయింది. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న ఎరికా మరోసారి అయోమయం లో పడింది. ఏ పోటో అయితే తన జీవితాన్ని అతాలకుతలం చేయలనుకుందో.. ఏ పోటో కారణంగా అయితే తను పూర్తిగా మారిపోయిందో ఆ ఫోటోను డిలీట్ చేయాలా లేదా షేర్ చేయలా తెలియని సందిగ్ధం. అదే సమయంలో పాజిటివ్ గా ఆలోచించిన ఆ మహిళ తనలో వచ్చిన మార్పు తను డ్రగ్స్ నుండి దూరం కావడానికి చేసిన ప్రయత్నాలు.. ప్రస్తుతం తన బిడ్డతో తను సంతోషంగా ఉన్న తీరును వ్యవహరిస్తూ రీ పోస్ట్ చేసింది. అంతే ఎరికా హర్ట్ ఈ సారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా రాత్రికి రాత్రే సెలబ్రెటి అయిపోయింది. ఈ పోస్ట్ ను చూసిన అక్కడి పోలీసులు, మీడియా అంతా కలిసి ఒక ప్రొగ్రాం నిర్వహించారు. ఇండియానాలో మత్తుకు బానిసైన వారందరిని ఒక్క దగ్గరకి చేర్చి ఎరికా హర్ట్ రియల్ స్టోరీని తనతోనే చెప్పించారు. ఎలా మారింది ఎందుకు మారింది మారడానికి ఎంత కష్టపడింది అనే ప్రతి ఒక్క విషయాన్ని ఎరికాతో చెప్పించారు. ప్రతి ఒక్క విషయాన్ని కళ్లకు కట్టినట్టు వీడియోల ద్వారా చూపారు. అంతే ఎరికా ఘటనతో ఇండియానాలో ఒక్క సారిగా 100 మంది ప్రజలు తాము మత్తునుండి దూరంగా వెళ్లాలనుకుంటున్నామని తమని ఈ ప్రపంచం నుండి బయట పడేయమని ఎరికాను కోరారు. ఆమె ఇచ్చిన సలహాలతో ఇప్పుడు వారంతా మత్తు నుండి బయటపడే పనిలో ఉన్నారు. మాతృత్వం ఎప్పుడైనా బిడ్డకోసం గెలవక తప్పదని ఎరికా హర్ట్ మరోసారి తెలియజెప్పింది. అమ్మతనం ఏ దేశం లో అయినా ఒకేలా ఉంటుందని నిరూపించింది.
























