You are here
Home > తాజా వార్త‌లు > స్వ‌ర్గం నుండి ఓ చిన్నారి ఆవేద‌న‌.. అంకుల్ మీకు మేం ఏం పాపం చేశాం.

స్వ‌ర్గం నుండి ఓ చిన్నారి ఆవేద‌న‌.. అంకుల్ మీకు మేం ఏం పాపం చేశాం.

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ క‌థ‌నం ప్ర‌తి ఒక్క‌రి హృద‌యాల‌ను క‌దిలిస్తోంది. క‌న్నీటి సంద్రంలో ముంచుతుంది. ప్ర‌భుత్వాల చేత‌గాని చ‌ర్య‌ను ప్ర‌శ్నిస్తోంది. ఓ నిండు ప్రాణం బ‌లికావాడానికి ప్ర‌ధాన కార‌ణాల‌ను క‌ళ్ల‌ముందు చూపుతుంది. అంకుల్ నేను కూడా మీ క‌న్న‌బిడ్డ‌లాంటి దాన్నే క‌దా మ‌రీ మీ వాళ్ల‌కో న్యాయం మాకో న్యాయ‌మా అంటూ స్వ‌ర్గం నుండి ప్ర‌శ్నిస్తోంది. ఎలాగు నేను మిమ్మ‌ల్ని చూడ‌లేను క‌నీసం నాలాంటి వాళ్లను ఇంకా ఇక్క‌డికి ఇంత త్వ‌ర‌గా పంప‌కండి అంకుల్ అంటూ వేడుకుంటోంది.

డియర్ కేటిఆర్ అంకుల్,
నా పేరు భూమిక. నా వయసు 8 ఏళ్ళు. ఉప్పల్ లో ఉంటాము. జాన్సన్ అండ్ జాన్సన్ గ్రామర్ స్కూల్, నాచారం లో సెకండ్ క్లాస్ చదువుతున్నాను. ఈ రోజు పొద్దున్నే నేను మా అక్క అమ్మతో కలిసి స్కూటీ మీద స్కూల్ కి వెళుతున్నాము. రోడ్డు మీద పెద్ద గుంత. అమ్మ బండి స్లో చేసింది. మా వెనక వస్తున్న లారీ అంకుల్ మా బండిని లారీతో గుద్దేసాడు. అంతే అమ్మ, నేను, అక్క కింద పడిపోయాం. నా తల బలంగా నేలకి గుద్దుకుంది. రక్తం కారిపోతోంది. అమ్మకి కూడా దెబ్బలు తగిలాయి, స్పృహ కోల్పోయింది. అక్కడ ఉన్న ఓ అంకుల్ నన్ను తన చేతుల్లో ఎత్తుకుని ఆసుపత్రికి తీసుకెళ్తున్నాడు, నా తల నుంచి రక్తం కారిపోతూ ఉంది. ఐదు నిమిషాల్లో ఆసుపత్రికి చేరాము, డాక్టర్లు నన్ను చూసారు. నేను చనిపోయానట . అక్కడ నుంచి నన్ను గాంధీ ఆసుపత్రి మార్చురీకి తీసుకెళ్ళిపోయారు. ఇంకొక్క అయిదు నిమిషాలు ఉంటే రోల్ నంబర్ 28 అంటే హాజరు పలకాల్సిన నేను మార్చురీ లో 28 నంబర్ బాక్సులో శవంగా మిగిలాను అంకుల్. ఇవాంకా వస్తోందని చాలా చోట్ల రోడ్లు బాగు చేసారట. మా కాలనీకి కూడా ఇవాంకా వచ్చి ఉంటె నేను బ్రతికేదాన్ని కదా అంకుల్. ప్రభుత్వాన్ని మేమేమైనా వజ్ర వైడూర్యాలు అడుగుతున్నామా అంకుల్. గుంతలు లేని రోడ్లే కదా అడుగుతున్నాం.

ఎన్ని నెలల నుంచి ఈ రోడ్లు ఇంత అధ్వాన్నంగా ఉన్నాయో తెలుసా అంకుల్. మీరు, కెసిఆర్ అంకుల్ రోడ్లు బాగుచేయమని అధికారులకి చెప్పారని చాలా సార్లు పత్రికల్లో వచ్చింది. అయినా రోడ్లు బాగు కాలేదు. రోడ్ల మీద గుంతలు లేకుండా చేయడం ఏమైనా రాకెట్ సైన్సా అంకుల్. అదే మంటే అధికారులు బీటీ కి నీటికి పడదు అని సాకులు చెప్పి మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. దేశమంతా వర్షాలు పడడం లేదా అక్కడ బీటీ రోడ్లు లేవా? అక్కడ రోడ్లు ఇంత అధ్వాన్నంగా లేవు కదా అంకుల్. అయినా మన అసలు రోడ్లు వేసేటప్పుడు క్వాలిటీ ఉంటె కదా అంకుల్, కనీసం పదేళ్ళు ఉండాల్సిన రోడ్లు పది నెలలు కూడా ఉండడం లేదు. ఇంత నాసిరకంగా రోడ్లు వేసినందుకు ఒక్క ఆఫీసర్ మీద అయినా, ఒక్క కాంట్రాక్టర్ మీద అయిన చర్య తీసుకున్నారా? అధికారులకి మీరంటే భయం ఉంటె కదా అంకుల్ సరిగ్గా పనిచేయడానికి.

ఈ ఆఫీసర్లకి, కాంట్రాక్టర్లకి, నాయకులకి కూడా పిల్లలు ఉంటారు కదా. రేపు వాళ్ళ పరిస్థితి అయినా ఇంతే కదా. ఎందుకు ఇంత చిన్న విషయం అర్థం కాదు. మాబోటి సామాన్యుల ప్రాణాలు అంటే అంత లోకువా అంకుల్. నేనే కాదు అంకుల్ ఇంకెంతో మంది నా లాగా యాక్సిడెంట్ లలో చనిపోయినవారి శవాలు ఇక్కడ కుప్పలుగా ఉన్నాయి. అంకుల్ నా చావుతో నైనా మన హైదరాబాద్ రోడ్లు బాగుపడాలి. మీరు చాలా సమర్థులు అని మీకు చాలా అవార్డులు వస్తున్నాయి. మీరు తలచుకుంటే ఈ రోడ్లు బాగుపడతాయి. ఒక వారం కేవలం రోడ్ల సమస్య మీదే మీరు పనిచేయండి. పని చేయని అధికారులని పీకి పారెయ్యండి. కాంట్రాక్టర్లు తప్పు చేస్తే శిక్ష వేయండి. ఏమైనా చేయండి. రోడ్లు మాత్రం బాగు చేయండి అంకుల్. మా అక్క, అమ్మ, నా క్లాస్ మేట్స్, నా లాంటి మరెంతో మంది పిల్లలు, పెద్దల ప్రాణాలు, ఆరోగ్యం కాపాడండి. చివరిగా, నా తోటి పిల్లలకి నా విజ్ఞప్తి, బండి నడిపేవారే కాదు, వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోండి. కేటిఆర్ అంకుల్, మీరు మాత్రం మరో ప్రాణం బలికాకముందే రోడ్లు బాగుచేయించండి.

ఇట్లు..
ఎప్పటికీ మిమ్మల్ని చూడలేని..
భూమిక.

Note: ఈ రోజు అంటే 19న ఉప్పల్ లో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన భూమిక, రహదారి భద్రత పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్న i am not an idiot సంస్థ వ్యవస్థాపకులు, లోక్ సత్తా పార్టీ నగర నాయకులు అయిన దోసపాటి రాము మేనకోడలు.

Related Posts
ప్రశ్నిస్తే.. కేసులు పెట్టడం అప్రజాస్వామ్యం.!!
తాజాగా ఖమ్మం జిల్లా కామేపల్లి హరిశ్చంద్ర పురం లో జరిగిన ఘటన కారణంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం కట్టిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణాల్లో నాణ్యత లోపించిందని అక్కడ కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లను ...
READ MORE
చీర్యాల నరసింహుడి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ని ఆహ్వానించిన ఆలయ చైర్మణ్.!!
తెలంగాణ ప్రముఖ ఆలయం చీర్యాల శ్రీశ్రీశ్రీ లక్ష్మి నృసింహ స్వామి దేవాలయంలో ఈ నెల 09 తేదీ నుండి 14 వ తేదీ వరకు జరగనున్న స్వామి వారి బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని కలిసి ...
READ MORE
మల్లేపల్లి డివిజన్ లో బ్రాహ్మణులంతా బీజేపీ కి అండగా ఉండాలి.. డా.గిరిధరచార్యులు
మల్లేపల్లి డివిజన్ లో పర్యటించిన ప్రముఖ విద్యావేత్త బీజేపీ దివ్యాంగ్ సెల్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ డా.గిరిధరాచార్యులు గ్రేటర్ ఎన్నికల్లో మల్లేపల్లి డివిజన్ లో బ్రాహ్మణ సామాజిక వర్గం అంతా బీజేపీ కి అండగా ఉండాలని, బీజేపీ అభ్యర్థి ఉషా పవన్ ...
READ MORE
కేంద్రం నుండి పిలుపు ఢిల్లీ చేరుకున్న కిషన్ రెడ్డి, దాదాపు కేంద్ర మంత్రి బెర్త్ ఖరారైనట్టే.!!
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించిన భాజపా సీనియర్ లీడర్ కిషన్ రెడ్డి కి నరేంద్ర మోడి కొత్త క్యాబినెట్ లో కేంద్ర మంత్రి పదవి దాదాపు ఖాయమైనట్టేనని తెలుస్తోంది. ఇందుకోసం కేంద్రం నుండి పిలుపు మేరకు ఇప్పటికే ...
READ MORE
ఏకమవుతున్న చంద్రబాబు వ్యతిరేకులు.! మోత్కుపల్లి తో ముద్రగడ మంతనాలు.!!
బ్రేకింగ్ న్యూస్ :- కాపు రిజర్వేషన్ ఉద్యమకారులు సీనియర్ పొలిటీషియన్ ముద్రగడ పద్మనాభం భేటీ కావడం సంచలనం కలిగిస్తోంది. ఇటీవలి నుండే చంద్రబాబు నాయుడు పై మోత్కుపల్లి నర్సింహులు తీవ్రమైన ఆరోపనలు చేయడం తెలిసిందే.. ఎన్టిఆర్ ను చంపింది కూడా చంద్రబాబు ...
READ MORE
టీవి5 రిపోర్టర్ పై దాడి.. లైవ్ లోనే చితకబాదిన డాక్టర్.
రాజమండ్రి టీవి5 స్టాప్ రిపోర్టర్ సురేష్ పై దాడి జరిగింది. లోకల్ లో ఉండే ఓ డాక్టర్ కు సంబందించిన ఓ హోర్డింగ్ విషయంలో తలెత్తిన గొడవ చిలికిచిలికి గాలి వానగా మారింది. ముందుగా సదరు డాక్టర్ తో మాట్లాడేందుకు వచ్చిన ...
READ MORE
పండుగల మాసానికి స్వాగతం.. శాకాహారం జిందాబాద్.
శ్రావణ మాసం తెలుగు పంచాంగంలో పండుగలకు పుట్టినిళ్లు. ఈ మాసంలో మహిళా మణులు అత్యంత భక్తితో చేసే పండుగలే ఎక్కువ. మంగళగౌరి వ్రతం, నాగుల పంచమి, భానుసప్తమి, పుత్రా ఏకాదశి, దామోదర ద్వాదశి, వరలక్ష్మి వ్రతం, శ్రీకృష్ణాష్టమి ఇలా ఆడపడుచులు జరుపుకునే ...
READ MORE
టెక్నాలజీ యుగంలోనూ మూఢనమ్మకానికి “బలి” అయిపోతున్న మనిషి.!!
21వ ఆధునిక శతాబ్దం లోనూ టెక్నాలజీ తో పరుగులు తీస్తున్న తరుణంలోనూ.. అంతరిక్షానికి విహారయాత్రకు వెలుతున్న ఈ కాలంలోనూ.. దురాచారం నుండి బయటపడలేకపోతున్నాడు సగటు మనిషి. ఇంకా ఆ దురాచారాలకి బలైపోతున్నాడు. ** హైద్రాబాద్ చిల్కనగర్ లో జరిగిన దారుణం సంధర్భంగ ...
READ MORE
అయ్యప్ప ఆలయాన్ని అపవిత్రం చేసిన మహిళకు సొంత ఇంట్లో శిక్ష పడింది.!!
భారతదేశం అంటేనే ఆచారాలు సాంప్రదాయాలు సంస్కృతికి భక్తికి నిదర్శనం. అందుకే భారతదేశాన్ని వేద భూమి అంటారు. కోర్టులు రాజ్యాంగాలు వచ్చి కొంత కాలమే అయినా.. అనాది కాలం నుండే మన దేశం సనాతన ధర్మం అనే పునాదిపై నిలబడి ఉంది. అయితే ...
READ MORE
ఎవరి వ్యాపారం కోసం రాష్ట్రంలో 5443 స్కూల్లని మూసేసారు.? ఇందుకేనా జనాలు మీకు ఓట్లేసింది.??
ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన పై కాగ్(CAG) రిపోర్ట్ సంచలన విషయాలను బహిర్గతం చేసింది. ముఖ్యంగా విద్యా వ్యవస్థ ను ఏ విధంగ నాశనం చేస్తున్నారో బట్టబయలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 5443 పాఠశాలలను చంద్ర బాబు ...
READ MORE
మోగిన బడి గంట.. సెలవులకిక టాటా..
రెండు నెలల పాటు ఆనందంగా, సంతోషంతో ఆడుతూ పాడుతూ గడిపేశారు. అప్పుడే వేసవి సెలవులు ముగిశాయి. ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన సెలవులకు వీడ్కోలు చెప్పి పిల్లల ఇక బడి బాట పట్టనున్నారు. అమ్మమ్మ తాతయ్యలతో కలిసి పల్లెటూర్లలో పొలాల గట్లపైన ...
READ MORE
రాజీనామా పై క్లారిటీ ఇచ్చిన మేయర్ బొంతు రామ్మోహన్.!!
మెట్రో రైల్ ప్రారంభానికి ప్రధాని మోడి హైద్రాబాద్ నగరానికి వచ్చిన విషయం తెలిసిందే.. అంతే కాదు అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ బిజినెస్ సదస్సు జరుగుతున్నదీ.. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు అమెరికా అధికారిక సలహాదారు ఇవాంక ట్రంప్ ...
READ MORE
కన్నడ హీరో ఉపేంద్ర సంచలన నిర్ణయం. సొంతపార్టీనా లేక భాజపానా..??
శాండల్ వుడ్ హీరో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తెలుగు వారికి కూడా పరిచయమున్న పేరు. తాజాగా రాజకీయ రంగప్రవేశం చేయనున్నటు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఒక సినిమాలో నచిస్తున్నాను అది పూర్తవగానే రాజకీయంగ పూర్తి అడుగులేయనున్నటు తెలిపాడు. అయితే గత ...
READ MORE
స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధన అకౌంట్ల వివరాలు గోప్యం.. కారణం.??
మన దేశం నుండి నల్లధనాన్ని తరలించి చాలామంది స్విట్జర్లాండ్ లోని స్విస్ బ్యాంక్ లో దాచుకున్న ఖాతాల వివరాలు సమాచార హక్కు క్రింద ఇవ్వడం కుదరదని ఈ విషయం సమాచార హక్కు చట్టం 8(1)A, 8(1)(f) ప్రకారం మినహాయింపు ఉందని ప్రభుత్వం ...
READ MORE
సిట్‌ విచారణకు సహకరిస్తానంటూనే యూ టర్న్ తీసుకున్న ఛార్మి.
డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న హీరోయిన్‌ ఛార్మీ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు.  సిట్‌ విచారణకు సహకరిస్తానంటూ తెలిపిన ఛార్మీ అనూహ్యంగా న్యాయస్థానం తలుపుతట్టారు. ఆర్టికల్‌ 20 సబ్‌ క్లాజ్‌ 3 ప్రకారం బలవంతంగా రక్త నమూనాలు సేకరించవద్దంటూ ఆమె తరఫు ...
READ MORE
నిజాం పేట్ లో గల్లంతై మహరాష్ట్ర దాదర్ లో తేలింది. పూర్ణిమ సాయి మిస్సింగ్ కథ సుఖాంతం.
హైదరాబాద్ కూకట్‌పల్లి నిజాంపేట్‌ నుంచి 40 రోజుల క్రితం అదృశ్యమైన పదోతరగతి బాలిక పూర్ణిమ ఆచూకి ముంబైలో దొరికింది. జూన్‌ ఏడున స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పిన పూర్ణిమ తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు 14 ...
READ MORE
జేసీ కి మీసం తిప్పి సవాల్ విసిరిన సిఐ మాధవ్ జాబ్ కి రిజైన్..ఎందుకో తెలుసా.??
త్రైత సిధ్దాంత భగవద్గీత అంటూ అనంతపురంలో భారీ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్న ప్రభోదానంద గొడవ విషయంలో సవాల్లు ప్రతి సవాల్లు విసురుకున్నారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరియు పోలీస్ అధికారుల సంఘం నాయకుడు సీఐ ...
READ MORE
మేడ్చల్ టీఆర్ఎస్ టిక్కెట్ కన్ఫం చేసిన కేసిఆర్..? ఎవరో తెలుసా..??
ముందస్తు ఎన్నికలకు జిందాబాద్ కొట్టి తొమ్మిదినెలలు ముందే అదృష్టాన్ని పరిక్షించుకుంటున్న గులాబి బాస్ కేసిఆర్.. ఆ దిశలో అందరికంటే ముందుగానే ఏకంగ 105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి కేవలం 14 అసెంబ్లీ స్థానాలను మాత్రమే పెండింగ్ లో పెట్టడం జరిగింది. ఇలా ...
READ MORE
నిమిషానికొక నీతి కథ వల్లెవేసే రేవంత్ రెడ్డి వేల కోట్ల అక్రమార్జన ఎలా చేసాడు.??
నీతులు పక్కోడికి చెప్పడానికే పనికొస్తాయని మరోసారి రుజువైంది.. నీతీ నిజాయతీ అంటూ పిట్ట కథలు చెప్పడంలో దిట్ట అయిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. మరి ఎన్నికల అఫిడవిట్లో మూడు కోట్లు నాలుగు కోట్లు చూపించి, ఆయనా మరియు ఆయన ...
READ MORE
ప్రకాష్ రాజ్ పరువు తీసిన మహేష్ అభిమానులు.!!
ప్రముఖ తెలుగు సినిమా కథానాయకుడు మహేష్ బాబు నూతన సినిమా "భరత్ అనే నేను" చిత్రం ఆడియో ఫంక్షన్ లో సీనుయర్ నటుడు ప్రకాష్ రాజ్ వేదిక పై మాట్లాడుతుండగా ఒక్క సారిగ అభిమానులంతా మోడీ మోడీ అంటూ గట్టిగా నినాదాలు ...
READ MORE
ఈ ఒక్క విషయంలో మన దేశం కంటే చైనా నూరువాళ్లు నయం.
చైనా టెక్నాలిజిలో దిట్ట. అక్కడ ప్రమాదాలు తలెత్తినా జంకకుండా ధైర్యంతో అత్యంత సాహసంతో కేవలం అతి కొద్ది సమయంలో ప్రాణాలను కాపాడుతారు. మరీ మన వాళ్లు..? మనం 40 అడుగుల లోతులో ఉన్న పాపని 200 అడుగులోకి పారేసుకున్నాం. చైనా మాత్రం ...
READ MORE
బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు..!! రాజకీయ కోణం ఉంది.??
కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రధాన అనుచరుడు నల్గొండ మున్సిపల్ చైర్మణ్ లక్ష్మి భర్త కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కినై.. కాగా బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభ నిర్వహించిన కాంగ్రెస్ అధిష్టానం అధికార పార్టీ టీఆర్ఎస్ పై ...
READ MORE
భారతదేశం లో వాట్సాప్ దుకాణం ఇక బంద్ కానుంది.??
భారతదేశం లో రామ్ దేవ్ బాబా అంటే వ్యక్తి కాదు అదొక బ్రాండ్.. యోగా గురువుగ అందరికీ పరిచయమే అయినా.. ప్రపంచ వ్యాపార దిగ్గజాలకు వణుకు పుట్టించగల సామర్థ్యం ఉన్న వ్యక్తి. తన పతాంజలి సంస్థ ద్వారా ప్రస్తుతం దేశంలోనే టాప్ బిజినెస్ ...
READ MORE
బతకాలని చేసిన పోరాటంలో క్యాన్సర్ గెలిచింది పాప కన్నుమూసింది.
మానవత్వం కానరాక ఓ పసి ప్రాణం విధితో పోరాడలేక ప్రాణాలు వదిలింది. క్యాన్సర్ జయించాలని చేసిన పోరాటంలో ఆ చిన్నారి ఓడిపోయింది. పేదరికం మరో సారి వైద్యం ముందు నిలవలేక కన్నీళ్లతో కుప్పకూలిపోయింది. గత నెల 19 న "చిన్నారి తల్లికి ప్రాణం ...
READ MORE
తిరుమలగిరి ఆర్టీవో స్వాతి గౌడ్ సస్పెండ్..
అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలో తిరుమలగిరి ఆర్టీవో అధికారిణి స్వాతి గౌడ్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల శ్రీకాంత్ రెడ్డి అనే లారీ ఓనర్ ను బౌన్సర్లను పెట్టి మరీ కొట్టించారన్న ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. సీసీటీవి ఫుటేజీలో ఈ ...
READ MORE
ప్రశ్నిస్తే.. కేసులు పెట్టడం అప్రజాస్వామ్యం.!!
చీర్యాల నరసింహుడి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ని ఆహ్వానించిన ఆలయ చైర్మణ్.!!
మల్లేపల్లి డివిజన్ లో బ్రాహ్మణులంతా బీజేపీ కి అండగా ఉండాలి..
కేంద్రం నుండి పిలుపు ఢిల్లీ చేరుకున్న కిషన్ రెడ్డి, దాదాపు
ఏకమవుతున్న చంద్రబాబు వ్యతిరేకులు.! మోత్కుపల్లి తో ముద్రగడ మంతనాలు.!!
టీవి5 రిపోర్టర్ పై దాడి.. లైవ్ లోనే చితకబాదిన డాక్టర్.
పండుగల మాసానికి స్వాగతం.. శాకాహారం జిందాబాద్.
టెక్నాలజీ యుగంలోనూ మూఢనమ్మకానికి “బలి” అయిపోతున్న మనిషి.!!
అయ్యప్ప ఆలయాన్ని అపవిత్రం చేసిన మహిళకు సొంత ఇంట్లో శిక్ష
ఎవరి వ్యాపారం కోసం రాష్ట్రంలో 5443 స్కూల్లని మూసేసారు.? ఇందుకేనా
మోగిన బడి గంట.. సెలవులకిక టాటా..
రాజీనామా పై క్లారిటీ ఇచ్చిన మేయర్ బొంతు రామ్మోహన్.!!
కన్నడ హీరో ఉపేంద్ర సంచలన నిర్ణయం. సొంతపార్టీనా లేక భాజపానా..??
స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధన అకౌంట్ల వివరాలు గోప్యం..
సిట్‌ విచారణకు సహకరిస్తానంటూనే యూ టర్న్ తీసుకున్న ఛార్మి.
నిజాం పేట్ లో గల్లంతై మహరాష్ట్ర దాదర్ లో తేలింది.
జేసీ కి మీసం తిప్పి సవాల్ విసిరిన సిఐ మాధవ్
మేడ్చల్ టీఆర్ఎస్ టిక్కెట్ కన్ఫం చేసిన కేసిఆర్..? ఎవరో తెలుసా..??
నిమిషానికొక నీతి కథ వల్లెవేసే రేవంత్ రెడ్డి వేల కోట్ల
ప్రకాష్ రాజ్ పరువు తీసిన మహేష్ అభిమానులు.!!
ఈ ఒక్క విషయంలో మన దేశం కంటే చైనా నూరువాళ్లు
బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు..!! రాజకీయ కోణం
భారతదేశం లో వాట్సాప్ దుకాణం ఇక బంద్ కానుంది.??
బతకాలని చేసిన పోరాటంలో క్యాన్సర్ గెలిచింది పాప కన్నుమూసింది.
తిరుమలగిరి ఆర్టీవో స్వాతి గౌడ్ సస్పెండ్..
Facebook Comments
Top
error: Content is protected !!