
రామాయణం పై ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఆరోపణలు చేసాకు కొందరు నాస్తికులు. నేటికీ రామాయణం ఒక కల్పిత గాథ అనీ అసలు రాముడే లేడని, రాముడు వానరసేనతో కలిసి నిర్మించిన రామసేతు నిర్మాణం లేనే లేదనీ.. అనే వారు కూడా ఉన్నారు.
తాజాగా రామసేతు పై పరిశోధనలు జరిపిన అమెరికా సైన్స్ ఛానెల్ పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. రామసేతు నిర్మాణం వాస్తవమే అని తేల్చి చెప్పింది.
దీంతో ఇంతకాలం రామాయణం పై విమర్శలు చేసేవారి నోర్లు మూతపడ్డటైంది.
రామసేతు నిర్మాణం భారత్ ను శ్రీలంకను కలుపుతూ ఉంటుంది. దాదాపు 50 కిలోమీటర్ల పొడవు ఉండే రామసేతు.. పూర్తిగ ఇసుక శక్తి కలిగిన సున్నపురాయితో నీటితో తేలియాడేలా నిర్మించడం జరిగిందని తన పరిశోధనలో తేలినట్టు పేర్కొన్నారు పరిశోధకులు.
కానీ ఆ కాలంలో ఇంత శక్తిమంతమైన వారధిని నిర్మించడం సాధారణ మానవులకు అసాధ్యం అని తేల్చారు. ఈ రామసేతు నిర్మాణం సరాసరి 7000 సంవత్సరాల క్రితందని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా సైన్స్ ఛానెల్ పరిశోధనలను వెల్లడించడంతో ప్రపంచ వ్యాప్తంగా మరోసారి రామాయణం పై చర్చలు జరుగుతున్నై.
అయోధ్య లో రామ మందిరం నిర్మాణానికి హిందూ ధర్మ కార్యకర్తలకు ఈ పరిశోధన ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.
యుగాలు మారినా.. రాముడి కాలం ముగిసినా నేటికీ భారతీయులకూ.. సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ రాముడే ఆధర్శం.. రాముడినే ప్రభువుగ కొలుస్తున్నారు. రామాయణాన్ని అత్యంత భక్తితో పూజిస్తున్నారు. ఈ పూజలన్నీ కల్పితం కాదని రాముడు వాస్తవ దైవం అని తాజాగా ఆధునిక సైన్సు కూడా తేల్చి చెప్పడం ప్రతీ ఒక్క భారతీయుడికీ గర్వకారణమే..!!


