
అరవ చిత్రాలకు తెలుగు నాట రెడ్ కార్పెట్ పరుస్తూ తెలుగు చిత్రాలను తొక్కేస్తున్నారంటూ ఒక్కడు మిగిలాడు టీం ఫైర్ అయింది. ఎంత కష్టపడి చెమటోడ్చి సినిమా తెర కెక్కిస్తే మన వాళ్లే మనలని తొక్కేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక్కడు మిగిలాడు డైరక్టర్ అజయ్ నూతకి. చారిత్రాత్మక కథతో తెరపైకి వస్తున్నామని ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి చిత్రాన్ని నిర్మించామని ట్రైలర్ చూసిన అభిమానులు ఎంతో ఆతృతగా చిత్రం కోసం ఎదురు చూస్తుంటే థియోటర్ యజమానులు తొక్కేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మంచు మనోజ్ నటించిన ఒక్కడు మిగిలాడు చిత్రం విడుదలవుతున్న రోజునే విజయ్ నటించిన అరవ చిత్రం అదిరింది సైతం రిలీజ్ అవుతుంది. అయితే ఈ చిత్రానికి ఎక్కువ థియోటర్లు కెటాయించి తెలుగు చిత్రమైన ఒక్కడు మిగిలాడును ఒంటరి చేశారని చిత్ర యూనిట్ థియోటర్ యజమానులతో వాగ్వివాదానికి దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది.
ఏషియన్ సినిమాస్ కార్పొరేట్ ఆఫీస్ వద్ద ‘ఒక్కడు మిగిలాడు’ చిత్ర యూనిట్కి, థియేటర్ యాజమాన్యానికి మధ్య రగడ మొదలైంది. డబ్బింగ్ చిత్రానికి భారీగా థియోటర్లు కట్టబెడుతు తమకు అన్యాయం చేస్తున్నారని ఒక్కడు మిగిలాడు ఆరోపించింది. విజయ్ అదిరింది చిత్రానికి థియోటర్లు ఎలా కట్టబెట్టారో తమ సినిమాకి కూడా థియేటర్లు అలాగే ఇవ్వాలంటూ పట్టుబట్టింది. తమపై ఏషియన్ సినిమా అధినేత సునీల్ కక్ష గట్టారని ఒక్కడు మిగిలాడు టీం ఆరోపించింది. థియోటర్ల కెటాయింపులో తమకు అన్యాయం జరిగిందని అడిగేందుకు వస్తే ఏసియన్ అదినేత బెదిరించారని తిరిగి తమ మీదకే వచ్చి చంపుతావా చంపుతావా అంటూ కొట్టేందుకు వచ్చారని ఆరోపించారు చిత్ర దర్శకుడు. ఆయనే రెచ్చగొట్టి ఉల్టా ఆయనే థియేటర్స్ ఇవ్వకుండా కథలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బింగ్ సినిమాలకే ప్రాముఖ్యం ఇవ్వాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కనీసం తమిళ ఇండస్ట్రీలో తెలుగు నటులకు అవకాశాలు కూడా ఇవ్వరని పూచిక పుల్లలా తీసి పారేస్తారని అలాంటి వాళ్లకు థియోటర్లు కట్టబెట్టి నాటకాలు ఆడుతున్నారని ఏసియన్ సంస్థపై ఫైర్ అయ్యారు ఒక్కడు మిగిలాడు డైరక్టర్.
అయితే ఈ ఘటనపై ఏషియన్ థియేటర్ యజమాని సునీల్ స్పందన మరోలా ఉంది. 100 మందిని వెంట తెచ్చుకుని అజయ్ బెదిరించారని ఆరోపిస్తున్నారు. అదే రోజు ఇంకా చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. వాటికి కూడా థియేటర్స్ ఇవాల్సి ఉంది. ఇలా రౌడీయిజం చూపిస్తే థియేటర్స్ రావు. ఓపిక పడితేనే థియేటర్స్ ఇస్తామని సమాదానం ఇచ్చారు. ఏది ఏమైన వివదాల మధ్య విడుదలవుతున్న అదిరింది , ఒక్కడు మిగిలాడు చిత్రాలు చివరికి థియోటర్ల విషయంలో కూడా వివాదంలో ఇరుక్కున్నాయి. చూడాలి అదిరింది తెలుగు ఎంత అదురుద్దో.. థియోటర్లు దొరక్క ఒక్కడు మిగిలాడు ఎలా మారుద్దో.