
ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న బాహుబలి – 2 రానే వచ్చింది. 13 సెకన్ల షార్ట్ షార్ట్ ట్రైలర్ తో టాలీవుడ్ అభిమానులని మరింత ఉత్కంఠతకు గురి చేసింది. మార్చి 16 వరకు ఎదురు చూడక తప్పదంటూ బాహుబలి చిత్ర దర్శకుడు జక్కన్న ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపారు. బాహుబలి తో రికార్డులు కొల్లగొట్టి బాహుబలి -2 తో మరిన్నిరికార్డులు తన ఖాతాలో వేసుకునేందుకు సిద్దమైంది. వచ్చే నెల 28న భారీ స్థాయిలో విడుదలకు సిద్దమవుతుంది. దేశ వ్యాప్తంగా ఎదురుచూస్తున్న అభిమానులకు హోళి సంధర్భంగా విడుదల చేసిన 13 సెకన్ల షార్ట్ ట్రైలర్ వావ్ బాహుబలి అనిపించేలా చేసింది. ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలు అత్యంత అద్భుతంగా ఉంటాయని చెప్పిన రాజమౌళి కేవలం 13 సెకన్లతో ఆ యుద్దం ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలిపాడు. 13 సెకన్లలో ప్రభాస్ రక్తం కళ్లజూసి వామ్మో ఈ యుద్దం ఏ రేంజ్ లో ఉంటుందబ్బా అనేలా చేశాడు. ఇక పూర్తి ‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్ చూడలంటే మాత్రం ఈ నెల 16న వరకు ఆగాల్సింది. ఇక సినిమా చూడలంటే మాత్రం ఏప్రిల్ 28 వరకు ఆగక తప్పదు.