
తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బతుకమ్మ చీరల పంపిణి గందగోళానికి దారి తీసింది. ఆదార్ కార్డు రేషన్ కార్డు ఉంటేనే చీరలను ఇస్తామని చెప్పిన కేసీఆర్ సర్కార్ తీరు వివాదాస్పదం అవుతోంది. సిరిసిల్ల నేతన్నలకు అండగా నిలిచేందుకు ఈ బతుకమ్మ చీరలను అందిస్తున్నామని చేనేత చీరతో ఆడబిడ్డలు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారని ప్రగాడ్బాలు పలికిన కేసీఆర్ సర్కార్ నాసిరకం చీరలు అంటగట్టాడంటు మహిళ లోకం భగ్గుమంటోంది. జగిత్యాల, కరీంనగర్ , మంచిర్యాల జిల్లాలో చీరల పంపిణీ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. నాసిరకం చీరలు ఇస్తున్నారనే కారణంతో మహిళల ఆందోళన బాట పట్టారు. జగిత్యాల జిల్లాల్లో అయితే ఏకంగా బతుకమ్మ చీరలను దహనం చేసి మహిళలు తమ నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ , కరీంనగర్ , మంచిర్యాల , నిర్మల్ లోను అదే పరిస్థితి కనిపించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక ఈ ఘటనలతో ప్రభుత్వం పై ప్రతిపక్షాల మాటల తూటాలు ఎక్కుపెట్టాయి. నాసిరకం చీరలు పంచి తెలంగాణ ఆడబిడ్డలను అవమానించాయని విమర్శించాయి. ఎంత పేదింటి ఆడబిడ్డ అయినా రాష్ట్ర పండుగకి ఉన్నంతలో మంచి చీర కొనుక్కుంటుందని.. తెలంగాణ పండుగకి ఆడబిడ్డలకి పుట్టింటి కానుక అని చెప్పిన కేసీఆర్ సర్కార్ పాలిస్టర్ చీరలు అంటగట్టి ఇలా అనుమానించడం ఏ మాత్రం మంచిది కాదని యావత్ తెలంగాణ మహిళా లోకం అగ్గి మీద గుగ్గిలం అయింది.
బతుకమ్మ చీరల పంపిణితో లేని పంచాయితిని ముందట వేసుకుంది తెలంగాణ సర్కార్. ఇప్పుడు ఈ చీరలు ప్రతిపక్షాలకు హస్త్రాలుగా మారబోతున్నాయి. త్వరలో సింగరేణి లో జరగనున్న ఎన్నికల్లో బతుకమ్మ చీరల పంచాయితి టీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ కు పెద్ద దెబ్బ కొట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. ఆ తరువాత జరగబోయే స్థానిక ఎన్నికలకు సైతం ఈ చీరలు చుక్కలు చూపించడం ఖాయం. ఇప్పటికే బతుకమ్మ చీరల పై ఎలా స్పందిచాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు అదికార నేతలు. ఈ నేపథ్యంలో సరైన అస్త్రాలు సందించకపోతే మాత్రం మొదటికే మోఒసం వచ్చినా రావచ్చు. చీరల పంచాయితి ఇంకా ఎక్కడి వరకు వెళ్లుద్దో చూడాలి.