You are here
Home > సామాన్యుడు > విషం కాదు గోదారమ్మ నీళ్లు కావాలి.. ఎండి ఎడారయ్యే పల్లెలు కాదు పచ్చని బంగారు నేలలు కావాలి..

విషం కాదు గోదారమ్మ నీళ్లు కావాలి.. ఎండి ఎడారయ్యే పల్లెలు కాదు పచ్చని బంగారు నేలలు కావాలి..

పచ్చదనం అల్లుకున్న పల్లెలు కాలకూట విషాన్ని మింగి ఎండి ఎడారి కానున్నాయని తెలిసి.. ఒక వ్యక్తి శక్తిగా మారి పల్లెలను కాపాడుకునేందుకు పోరాటానికి దిగితే.. అడుగడుగునా అడ్డుకునేందుకు దుష్టశక్తులు కుటిల యత్నాలు చేస్తున్నాయా..? వ్యవస్థలో తప్పును ఎత్తి చూపి సరైన మార్గంలో వెళ్లకతప్పదని కొత్త దారిని ఎంచుకుంటే ఆ దారిని పూర్తిగా మూసివేయాలని కుట్రలు పన్నుతున్నారా..? పల్లె ప్రగతికి పచ్చని అందాలని కానుకగా ఇవ్వాలని
కోరుకోవడమే ఆ వ్యక్తి చేసిన తప్పా..? విషనాగులను అడ్డుకునేందుకు విశ్వమానవ వేదికను ఏర్పాటు చేసుకుని ముందుకు నడిస్తున్న ఆ వ్యక్తిని పగ పట్టిందెవరు..? దేశానికి పట్టుకొమ్మలైన పల్లెలను కాపాడుకునేందుకు చేస్తున్న అతని పోరాటాన్ని అనగదొక్కిందెవరు.? అధికార దర్పానికి ఓ సామాన్యుడు ఆహుతి అవ్వాల్సిందేనా..? తన ఆశయం నీరు గారాల్సిందేనా..? అందరి గొంతుకగా నినదించిన ఆ గొంతు ఇప్పుడెందుకు బంధీ అయింది..?

స్నేహితుని కోసం తన వంతుగా అక్షరగళాన్ని వినిపించిన జర్నలిస్ట్ thulasi.chandu మాటలు యథాతథంగా…

వాళ్లు చేతులు అడ్డం పెట్టారు.. నువ్వు ప్రకాశించడం మానెయ్ !!

శ్రీకాకుళంలో పాత్రికేయుడిగా ఉన్నప్పుడు నీ జీతం నువ్వు తీసుకుంటూ, కన్నెధార కొండ వైపు తిరిగి చూడకుండా ఉంటే నాటి మంత్రులు నీపై దాడులకు తెగబడే వాళ్లే కాదు. ఇవాళ వార్త రాసి రేపు దాన్నే అధికారగణానికి అనుకూలంగా తిరగరాస్తూ కూడా జర్నలిస్టులుగా చెలామణీ అయ్యే మెజారిటీ పాత్రికేయకులంలో చెడబుట్టావేమో. గిరిజనుల గురించి నీకెందుకు. వాళ్ల గుండె చప్పుడుకూ, కన్నెధార కన్నీటి ధారలకూ ఆ నాటి ఈనాడును తెరచాపగా ఎత్తిపట్టావ్. ఫలితంగా కన్నెధార గిరిజనుల గూడాల్లో నీపై ఉన్న ప్రేమాభిమానాలు, నాటి మంత్రి ధర్మాన గుండెల్లో నువ్వంటే ఉన్న భయం ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసి ఉండొచ్చు. కన్నెధారపై ఎవరి కన్నూ పడకుండా నాటి నీ కథనాలు ఇప్పటికీ కాపలా కాస్తూ ఉండొచ్చు. కానీ నీకేమొచ్చింది వాటి వల్ల..? అంతటితో పాత్రికేయుని ముసుగులో నీ ప్రజాపోరాటాలను వదిలిపెట్టాల్సింది. ఆ తర్వాత ఏకంగా ముసుగు తీసి, రాజీనామా చేసి పూర్తి స్థాయి ఉద్యమకారుడిగా ఎందుకయ్యావ్..?

కన్నబిడ్డలే కావాలని వదిలించుకున్న వృద్ధుల గురించీ, కన్నవారే వద్దని దూరం పెట్టిన వికలాంగుల గురించి, వీధుల్లో బిక్షాటన చేసే నిర్భాగ్యుల గురించి నీకెందుకు..? ప్రపంచంలోని ప్రతి మనిషీ నా వాడే అని విశ్వమానవ వేదిక పెట్టావ్. వృద్ధులనూ, వికలాంగులనీ విహారయాత్రకు తీసుకెళ్లిన మొదటిరోజే నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థమైపోయింది. గోదావరి ఒడ్డున పుట్టిన వికలాంగులు ఎప్పుడూ ఆ తీరంలో ఆడుకోలేదట తులసీ అని తెగబాధపడిపోయావ్. వాళ్లను ఫస్ట్ టైమ్ సముద్ర తీరానికి తీసుకెళ్లిన రోజు వాళ్ల కళ్లలో నిన్ను చూసి కూడా ఊహించాను ఇలాంటి రోజు ఒకటొస్తుందని. నీకెందుకు అంత మానవత్వం..? ఇలా ఎవరైనా అంటే చె గెవారా, భగత్ సింగ్, అల్లూరి, కారల్ మార్క్స్ అని క్లాస్ తీసుకుంటావ్. ముప్ఫై ఏళ్ల నీ వయసుకీ నీ మాటలకూ, చేతలకూ ఏమైనా సంబంధముందా.. ? నువ్వే అనుకుంటే నిన్ను మించిన నీ సహచరి. ఆమె డాక్టర్ చదివింది కదా.. ఏ కార్పొరేట్ హాస్పిటల్లోనో చేరి లక్షలు వెనకేసుకోకుండా పాలకొల్లులో మీకేంపని..? అంత పెద్ద చదువు చదివిన జ్ఞానేశ్వరి మంచి జీవితాన్నీ, అయిన వాళ్లనూ వదిలి నీ వృద్ధాశ్రమానికి రావడమంటే కోరి కష్టాలను తెచ్చుకోవడం కాదా..? పెళ్లైన మర్నాడు నుంచే ఆ కష్టాలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా అనుభవిస్తున్నా ఆమె నిన్ను మార్చే ప్రయత్నం చెయ్యలేదు.
అక్కడున్న ఆడవాళ్లు తాగుబోతు భర్తల్ని భరించలేక పిల్లల్ని చదివించే మార్గం లేక ఆగమాగం అవుతోంటే మీ ఇద్దరికీ ఏంటి..? వాళ్లతో గోదారమ్మ ఫుడ్స్ పేరుతో ఆహారపదార్థాలు తయారు చేయించి స్వయం ఉపాధి మార్గం చూపినంత మాత్రాన మీకు ఒరిగిందేంటి..? రక్తదాన శిబిరాలు, అనాధ శవాలకు దహన సంస్కారాలు చేయించండం, గల్ఫ్ దేశాల్లో మోసపోయిన వారికి అండగా నిలవడం వంటివి చేస్తూ మీరేం సాధించారు..? ఓ నీలి సైన్యాన్ని తప్ప..!!

‘ఉద్యోగం వదిలి వృద్ధాశ్రమం పెట్టుకున్నోడివి నీకు ఉద్యమాలెందుకు బాస్’.. మీ పాలకొల్లు ఎమ్మెల్యేనే కాదు.. నేను కూడా అడుగుతున్నా చెప్పు.. ? మెగా ఆక్వాఫుడ్ పార్క్ వద్దని ఆ ప్రాంత రైతులు రెండేళ్లుగా తిరుగుబాటు చేస్తున్నారు. అప్పుడు ఎవరూ వాళ్ల గొడవ పట్టించుకోలేదు. వాళ్ల గొడవ నీకెందుకంటే, రైతు బాధ మన బాధ కదా అనే సో కాల్డ్ ఆన్సర్ ఉంటుంది నీ దగ్గర. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ దృష్టికి తెస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆలోచించావేగానీ, నువ్వు సమస్యల్లో పడతావని ఎందుకు ఊహించలేదు..? పవన్ కల్యాణ్ ఒక్క ప్రెస్ మీట్ పెట్టి హీట్ పెంచాడు, అప్పట్నుంచే కదా అధికారయంత్రాంగం నీపై వేట మొదలు పెట్టింది. ఆ రోజు అంత పెద్ద మాటలు చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడేమైపోయాడో చూశావా..? ఆ తర్వాత నీ వృద్ధాశ్రమానికి అర్థరాత్రి నిప్పు పెట్టారు, నీపైనా, నీకు మద్దతుగా నిలబడ్డ Journalist Ravi పైనా హత్యాయత్నాలు చేశారు. నువ్వొక దళిత వ్యతిరేకివని పాలకొల్లంతా ఫ్లెక్సీలు కట్టారు, నీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. ఆ ప్రాంత రైతులు, ఆందోళన చేస్తున్న మహిళలైనా నీకు నచ్చచెప్పకపోగా వాళ్ల గుండె ఘోషకు నువ్వే గొంతకవు అన్నంతగా ఉద్యమానికి కాలు దువ్వారు. ప్రతి ఇంటి ముందూ పోలీసుల్ని పెట్టినా, నెలల పాట 144 సెక్షన్ పెట్టినా.. వందల మందిని అరెస్టులు చేసినా ఆ వార్తలు ఎందుకు ప్రధాన పత్రికల్నీ, మీడియానూ తాకడం లేదో మాజీ జర్నలిస్టుగా నీ అనుభవం నీకు చెప్పలేదా..? గొంతేరు కాల్వ విషతుల్యం అయిపోతే నీకేంటి.. ? వ్యర్థ రసాయనాలు గోదారిలో, రైతుల పొలాల్లో కలిస్తే నీకేంటి..? వాటి వల్ల నువ్వు, నీ వృద్ధాశ్రమం నష్టపోతారా, లేదా కదా. మహా అయితే పచ్చని గోదారి కొన్నాళ్లకు కాలుష్యకాసారమౌతుంది. 15 వందల మందికి ఉద్యోగాలొస్తాయి. లక్షలాది రైతులు పంటలు పండక, నీళ్లు లేక వలసబాట పడతారు. లేదా రాయలసీమ, తెలంగాణల్లోలాగా గోదావరిలోనూ రైతు ఆత్మహత్యల వార్తల్ని చదువుతాం. హైదరాబాద్ ఆసుపత్రులు గోదావరి క్యాన్సర్ రోగులతో నిండిపోతాయేమో. అంతే కదా. అయినా నీకెందుకు..?

అధికారంలో ఉన్నవాళ్ల అడుగులకు మడుగులొత్తాలేగానీ ప్రశ్నిస్తావా..? మీపై అట్రాసిటీ కేసులు పెట్టాక కూడా ఫేస్ బుక్ వేదికగా ఎమ్మెల్యేని ‘పాలకొల్లు నియంత’ అని సంభోదించావంటే ఏం చూసుకొని అంత ధైర్యం..? వాళ్లు తలచుకున్నారు.. నువ్వు మళ్లీ నీ వృద్ధులు, వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన విహారయాత్ర రోజే నిన్ను అరెస్ట్ చేశారు. నువ్వు తలచుకుంటే ఏం చెయ్యగలవు. మహా అయితే.. పాలకొల్లులోని యువతనంతా నీ నీలి సైన్యంగా ఉద్యమసైన్యంలోకి లాక్కొచ్చినట్లు.. నరసాపురం సబ్-జైల్లోని ఖైదీలను కూడా నీ సైన్యంగా, నీ అభిమానులుగా మార్చుకోగలవు. పాలకొల్లులోని యువత బుర్రల్లోకి చె గెవారాను ఎక్కించినట్లే ఖైదీల మనసుల్లోకి ఆ విశ్వ మానవుడిని ఇంజక్ట్ చెయ్యగలవు. అక్కడున్నా.. నీ అభిమానుల గుండెల్లో మెలిపెట్టే పోరాటానివై ఆక్వాపార్క్ నిప్పు ఆరిపోకుండా కాపాడగలవు. అవసరమైతే మరోసారి పాలకొల్లు నియంత పాలనకిందికి రాకుండా ఉద్యమ కార్యాచరణ ప్రకటించగలవు. అంతే కదా. జైల్లో పెడితే ఏం చేస్తావని అడిగినప్పుడు నువ్వన్న మాటలు మరచిపోలేదు. ‘స్వాతంత్ర్య పోరాటంలో లేము.. అడవుల్లో అన్నల్లా బతికేంత పెద్ద త్యాగం చెయ్యలేదు. ఇలా రైతాంగ పోరాటంలో పాల్గొన్న కారణంగా రాజ్యం కక్ష సాధించినా నాకు అదొక గొప్ప అవకాశమే’ అన్నావ్. ఇక నీలాంటి వారిని మార్చడం సాధ్యం కాదు. మారిపోవడం తప్ప.. !
..కానీ మిత్రమా ఈ జైలు జీవితమే నీ భవిష్యత్తు ఉద్యమ కార్యాచారణ రచించుకోవడానికి ఆటంకం లేని వేదిక అని తెలిస్తే మీ నియంతకు నిద్ర పడుతుందంటావా.. ??!!

–తులసి, నీ స్నేహితురాలు

(పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో వస్తున్న మెగా ఆక్వాఫుల్ పార్కుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న Mallula Suresh అరెస్టయినందుకు బాధ లేదు.. అది ఊహించినదే. కానీ అతను ప్రేమతో నిర్మించుకున్న విశ్వమానవ వేదిక అనే వ్యవస్థను నాశనం చేసే కుట్ర జరుగుతోంది. అతను జైలు నుంచి తిరిగి వచ్చేలోపు విశ్వమానవ వేదికను ఖాళీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జరుగుతున్న ఘోరాలను గురించి రాయడం తప్ప ఏమీ చెయ్యలేకపోతున్న నిస్సహాయతకు బాధేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఓ గొప్ప నాయకుడిని మాత్రం ఊహిస్తున్నా..) 

Related Posts
అడుగడుగునా ఉద్దానాలు.. కిడ్నీ వ్యాదితో ఆదిలాబాద్ తండాలు విలవిలా.
ప్రాణాలు తోడేసే కిడ్ని వ్యాది ఆ గ్రామాలను పట్టిపీడుస్తోంది. పిల్లాజల్లా ముసలి ముతక అన్నా తేడా లేకుండా ప్రాణాలు తీసేస్తోంది. కిడ్నీ రక్కసి కోరలకి అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ వణికిపోతోంది. మారు మూల గ్రామాలైన గురుజ , లొద్దిగూడా , ...
READ MORE
“ఐ లవ్ మై విలేజ్.. ఐ హేట్ మై విలేజర్స్”. “ఊరిని ఇష్ట‌ప‌డే గౌస్ కొడుకు… అజ్జు”
కులాల కంపుతో మతాల రొచ్చుతో గ్రామాలు ఎలా కుల మతాల గొడవల్లోకి వెళ్లిపోతున్నాయో.. తరతరాల బంధాలు ఎందుకు తెగిపోతున్నాయో చెప్పే ప్రయత్నం చేశాడు తురకొల్ల పొలగాడు. నిజానికి అవి గుండె పిండేసే మాటలు.. గుండెలని గుణపాల్లా గుచ్చేసే సూటిపోటిఒ మాటలను చూసిన ...
READ MORE
బతుకుదెరువు కోసం పట్టణానికొచ్చింది. విధీ ఆడిన వింతనాటకంలో కాలు కోల్పోయింది.
పొట్ట కూటికోసం పట్టణానికి వచ్చింది.. ఏదోలా ఓ చిన్న ఉద్యోగాన్ని సంపాదించుకుంది. బ్రతుకు దెరువుకి ఓ దిక్కు దొరికింది అని అనుకుంటడగానే హఠాత్తుగా సంబవించిన ప్రమాదం ఆ యువతి జీవితాన్ని అందకారం చేసింది. ఎన్నో కలలు కన్న ఆ యువతి ఏకంగా ...
READ MORE
CAA కు వ్యతిరేకంగ విషప్రచారం చేస్తూ హింసకు పాల్పడినందుకు నష్టపరిహారం చెల్లిస్తున్న ముస్లింలు.!!
దేశం లో ఇపుడు జరుగుతున్న CAA వ్యతిరేక మరియు అనూకూల ర్యాలీల సంధర్భంగ పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాగా ప్రస్తుతానికి ప్రజల్లో ముఖ్యంగ ముస్లింలలో అవగాహన పెరుగుతుండడంతో దాదాపు తగ్గుముఖం పట్టిన వ్యతిరేక ఆందోళనలు అదే సమయంలో ...
READ MORE
ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులో మోజో టీవీ మాజీ సీఈవో రేవతి అరెస్ట్..!!
సనాతన ధర్మం లో అత్యంత పవిత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం విషయం లో సుప్రీంకోర్టు కల్పించుకుని యుక్త వయసు ఆడవారికి కూడా ఆలయ దర్శనం కల్పించాలని చెప్పడంతో, యావత్ హిందూ సమాజం కల్లు గప్పి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తూ ...
READ MORE
ఆలోచనలు దారితప్పితే.. జీవితం అతలాకుతలం.!! హంతకురాలు స్వాతి విషాద కథ.!!
మంచి భర్త.. ఇద్దరు పిల్లలు కుటుంబానికి ఏం కావాలంటే అది చేసిపెట్టే భర్త. ఇది గతేడాది భర్త సుధాకర్ రెడ్డి ని చంపి తన భర్త స్థానం లో ప్రియుడి మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేసి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసి ఎట్టకేలకు ...
READ MORE
రాజస్థాన్ లో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం కోట ఆసుపత్రిలో 100 మంది పసిపిల్లల మృతి.!!
కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్ లో అభం శుభం తెలియని పసి పిల్లల మృత్యుఘోష మోగుతూనే ఉంది. మొన్నటికి మొన్ననే 77 మంది పిల్లలు మరణించిగా ఆ తర్వాత కూడా అలాగే పిల్లల మరణాలు జరుగుతూనే ఉన్నాయి, ఇక ఈరోజుతో ...
READ MORE
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
మీకు ఇప్పుడు ఓ బ్రహ్మండమైనా.. చిత్ర విచిత్ర అద్బుత అమోఘమైన పరీక్ష పెడతాం. పాసయ్యారో బలి బలి బలిరా బలి మీరే తెలుగులో నిజమైన నిఘంటువని కీర్తిస్తాం. యెహే ఈ సోదంతా ఏంటి పాయింట్కి రా అనేగా.. అక్కడికే వస్తున్నా. తెలుగును ...
READ MORE
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగ నేడు పాకిస్తాన్ పై భారత్ జరిపిన వైమానిక దాడి విజయవంతం కావడంతో.. దాదాపు 400 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు హతం కావడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.ఈ క్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ...
READ MORE
పాకిస్తాన్ జిందాబాదన్న యువతికి బెయిల్ ఇవ్వొద్దని సొంత తండ్రే అంటున్నాడు ఎందుకని.?
బెంగళూర్ లో CAA కి వ్యతిరేకంగ ఎంఐఎం పార్టీ నిర్వహించిన సభలో అసదుద్దీన్ తో వేదిక పంచుకున్న అమూల్య లియోనియో అనే యువతి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ హల్ చల్ చేయడం వెంటనే బెంగళూర్ పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకుని ...
READ MORE
జయమ్మను వరించిన తెలంగాణ ఉత్తమ స్టాఫ్ నర్స్ అవార్డ్.
నర్స్.. ఈ మాటకు నిర్వచనం ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ. నిజమే పుట్టగానే తల్లి గర్భం నుండి ఆమె చేతుల్లోకే సగం లోకం వెళ్లేది. ధరించే దుస్తుల్లానే వారి మనసులు సైతం స్వచ్చంగా తెల్లగా మెరిసేవి. అయితే ఎక్కడో ఓ లోటు.. ...
READ MORE
కాషాయం కలల్ని సాకారం చేస్తున్న కేశవ్ జి జన్మధినం నేడు.!!
దేశం కోసం.. ధర్మం కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రముఖ జాతీయవాది విశ్వహిందూ పరిషత్ జాతీయ నాయకులు జార్ఖండ్ ప్రాంత ప్రచారక్ కేశవ్ జి జన్మధినం సంధర్భంగ జాతీయ స్థాయి నేతలంతా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా కేశవ్ జి తెలంగాణ వరంగల్ ...
READ MORE
ఘనంగా భాజపా యువనాయకుడు నరేష్ జన్మధిన వేడుకలు.!!
రంగారెడ్డి జిల్లా స్వఛ్చభారత్ కన్వీనర్ భాజపా యువనాయకుడు నరేష్ జన్మధిన వేడుకలు జిల్లా ముఖ్యనాయకులు కార్యకర్తల సమక్షంలో ఘనంగ జరిగాయి. జిల్లా నాయకులంతా నరేష్ ని కలిసి మిఠాయిలు తినిపిస్తూ హంగామా చేసారు. తద్వారా నరేష్ లాంటి యువనాయకుడు సమాజానికి చాలా ...
READ MORE
అమెరికా లో హిందూ పూజారి పై అమానుష దాడి.. ఆసుపత్రిలో చికిత్స.!!
అమెరికా లో మరోసారి మత విద్వేషం ప్రాంతీయ విద్వేషం బయటపడింది. ఇతర దేశాలకు నీతులు వల్లెవేస్తూ ఓవరాక్షన్ చేసే అమెరికా.. తన దేశంలో జరిగే మత ఘర్షనలను ప్రాంతీయ ఘర్షనలను సైకోల మారణకాండ పై మాత్రం నోరు మెదపదు. తాజాగా అమెరికా ...
READ MORE
తొలి ఏకాదశి.. హిందువుల ఆది పండుగ ప్రత్యేకం..
ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి 'శయన' ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహవిష్ణువు పాల కడలిపై శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. సంవత్సరంలో ...
READ MORE
సెలవులొచ్చేశాయోచ్… ఇక అల్లరే అల్లరి.
సెలవులొచ్చేశాయోచ్.. తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలకు ఈరోజుతో సెలవులు. ఎండలు మండిపోతున్నాయి.. అడుగు తీసి అడుగు వేయాలంటే సూర్యుడు తాపానికి గిర్రున తిరిగి కిందపడటం ఖాయం. ఇక ఇలాంటి ఎండల్లో పిల్లలు స్కూల్ అంటే నరకమే... అందుకే తెలంగాణ ప్రభుత్వం ఎండ కాలం ...
READ MORE
తెలంగాణ లో పోలీస్ రాజ్యం.. అమాయకుల పై విరుగుతున్న లాఠీలు.!!
భారత దేశానికి ఆత్మ గ అభివర్ణించే స్వామీ వివేకానంద యొక్క జయంతి సందర్భంగా జనగాం లో ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ లను జనగాం మున్సిపల్ సిబ్బంది తొలగించడం తో ఇందుకు నిరసనగా ఫ్లెక్స్ లను ఏర్పాటు చేసిన బీజేపీ శ్రేణులు జనగాం ...
READ MORE
కనులు చూడని లోకాన్ని తన గొంతుతో నడిపిస్తున్న 12 ఏళ్లు కుర్రాడు.
"ఈ లోకం గుడ్డిది.. ఏం చెప్పినా నమ్మేస్తుంది.. ఈ లోకం మూగది నిజాన్ని మాట్లాడే ధైర్యం చేయదు.. ఈ లోకం చెవిటిది సమాజ బాగు కోసం ఏ మంచిని వినిపించుకోదు.. ఈ లోకం అడుగులు వెనక్కి చూపులు ముందుకి... ఈ లోకం ...
READ MORE
శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థుల మృత్యు ఘోష.! తల్లిదండ్రుల ఆశలు అడియాస.!!
తెలుగు రాష్ట్రాలలో కార్పోరేట్ కళాశాలలలో మరోసారి విద్యార్ధుల మృత్యు ఘోష తాండవిస్తోంది. గతం నుండి ఎందరో విద్యార్ధులు కార్పోరేట్ కాలేజ్ ల యాజమాన్యాల వేధింపులు భరించలేక అసువులు బాసారు. లక్షల ఫీజులు కట్టాలి లేదంటే, పిల్లలకు అటు కాలేజ్ క్లాస్ రూం ...
READ MORE
తెలంగాణ ఉద్యమకారుడు యువ ప్రజానాయకుడు జర్నలిస్ట్ కొండేరు రాకేష్ జన్మధిన వేడుకలు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కొండేరు రాకేష్ జన్మధిన సంధర్భంగ పలువురు ప్రజా రాజకీయ విద్యార్థి నాయకుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నై కొండేరు రాకేష్ కు. గతంలో జాతీయవాద విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ విద్యార్థి సమస్యలపట్ల అంకిత భావంతో ...
READ MORE
ఉద్యమాన్ని ఉదృతం చేసిన బీజేవైఎం, రాష్ట్ర ఉపాధ్యక్షుడిపై పోలీసుల ప్రతాపం.!!
ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్లక్ష్యం మూలంగ అసువులు బాసిన విద్యార్ధుల చావుకు తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలని వారి కుటుంబాలకు న్యాయం చేయాలని, తక్షణమే విద్యాశాఖ మంత్రి ని ముఖ్యమంత్రి కేసిఆర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమానికి పిలుపునిచ్చింది తెలంగాణ భారతీయ ...
READ MORE
ఆద‌ర్శ రైతుకు అరుదైన‌ అవార్డ్.. సీఎం కేసీఆర్ కు వ్యవసాయ నాయకత్వ అవార్డు.
ఉద్య‌మ నాయ‌కుడు స్వ‌యంగా రైతుగా విజ‌యాలు అందుకున్న తెలంగాన ముఖ్య‌మంత్రికి మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. భారత ఆహార, వ్యవసాయ మండలి ఆయనను ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్-2017 అవార్డుకు ఎంపిక చేసింది. కేసీఆర్ అంటే ఫాం హౌజ్, ఫాం హౌజ్ ...
READ MORE
ట్రాఫిక్ కానిస్టేబుల్ పై చెప్పుతో దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ మహిళా నేత.
నిబంధనలను ఉల్లంఘిస్తూ బైక్ పై ట్రిపుల్ డ్రైవింగ్ ఫోటో తీసిన విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్కుటుంబ సభ్యులతో కలిసి చెప్పుతో దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ మహిళా నేతహైద్రాబాద్ మౌలాలీ కమాన్ వద్ద మహ్మద్ గౌస్ అనే వ్యక్తి మరో ఇద్దరు వ్యక్తులతో ...
READ MORE
బీపీ ( గుండె జబ్బు ) అపోహలు.. వాస్తవాలు.
నేటి ప్రపంచంలో గుండె జబ్బులపై చాలా అపోహలున్నాయి. చాతి నొప్పి రావడమే ఆలస్యం దాన్ని లైట్ గా తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వారు కొందరైతే.. ఏ సమస్య లేకున్న హైరాన పడి ఆస్పత్రులకు పరుగులు తీస్తున్న వారు మరికొందరు. అందుకే ...
READ MORE
కట్టా – మీఠా సార్ కు అరుదైన గౌరవం.. జ‌స్టిస్ ఆవుల సాంబ‌శివ‌రావు పుర‌స్కారానికి ఎంపిక‌.
న‌మ‌స్తే తెలంగాణ దినప‌త్రిక ఎడిట‌ర్ క‌ట్టా శేఖ‌ర్ రెడ్డికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఈ ఏడాది జ‌స్టిస్ ఆవుల సాంబ‌శివ‌రావు పుర‌స్కారానికి ఆయ‌న ఎంపిక‌య్యారు. తెలుగు విశ్వవిద్యాలయం ఈ పురస్కారాన్ని ఈనెల 24న ప్ర‌దానం చేయ‌నుంది. ఈ ఏడాది జ‌స్టిస్ ఆవుల ...
READ MORE
అడుగడుగునా ఉద్దానాలు.. కిడ్నీ వ్యాదితో ఆదిలాబాద్ తండాలు విలవిలా.
“ఐ లవ్ మై విలేజ్.. ఐ హేట్ మై విలేజర్స్”.
బతుకుదెరువు కోసం పట్టణానికొచ్చింది. విధీ ఆడిన వింతనాటకంలో కాలు కోల్పోయింది.
CAA కు వ్యతిరేకంగ విషప్రచారం చేస్తూ హింసకు పాల్పడినందుకు నష్టపరిహారం
ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులో మోజో టీవీ మాజీ సీఈవో
ఆలోచనలు దారితప్పితే.. జీవితం అతలాకుతలం.!! హంతకురాలు స్వాతి విషాద కథ.!!
రాజస్థాన్ లో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం కోట ఆసుపత్రిలో 100
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
పాకిస్తాన్ జిందాబాదన్న యువతికి బెయిల్ ఇవ్వొద్దని సొంత తండ్రే అంటున్నాడు
జయమ్మను వరించిన తెలంగాణ ఉత్తమ స్టాఫ్ నర్స్ అవార్డ్.
కాషాయం కలల్ని సాకారం చేస్తున్న కేశవ్ జి జన్మధినం నేడు.!!
ఘనంగా భాజపా యువనాయకుడు నరేష్ జన్మధిన వేడుకలు.!!
అమెరికా లో హిందూ పూజారి పై అమానుష దాడి.. ఆసుపత్రిలో
తొలి ఏకాదశి.. హిందువుల ఆది పండుగ ప్రత్యేకం..
సెలవులొచ్చేశాయోచ్… ఇక అల్లరే అల్లరి.
తెలంగాణ లో పోలీస్ రాజ్యం.. అమాయకుల పై విరుగుతున్న లాఠీలు.!!
కనులు చూడని లోకాన్ని తన గొంతుతో నడిపిస్తున్న 12 ఏళ్లు
శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థుల మృత్యు ఘోష.! తల్లిదండ్రుల
తెలంగాణ ఉద్యమకారుడు యువ ప్రజానాయకుడు జర్నలిస్ట్ కొండేరు రాకేష్ జన్మధిన
ఉద్యమాన్ని ఉదృతం చేసిన బీజేవైఎం, రాష్ట్ర ఉపాధ్యక్షుడిపై పోలీసుల ప్రతాపం.!!
ఆద‌ర్శ రైతుకు అరుదైన‌ అవార్డ్.. సీఎం కేసీఆర్ కు వ్యవసాయ
ట్రాఫిక్ కానిస్టేబుల్ పై చెప్పుతో దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ మహిళా
బీపీ ( గుండె జబ్బు ) అపోహలు.. వాస్తవాలు.
కట్టా – మీఠా సార్ కు అరుదైన గౌరవం.. జ‌స్టిస్
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!