You are here
Home > సామాన్యుడు > ఇదెక్కడి న్యాయం..?

ఇదెక్కడి న్యాయం..?

ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాప కుడు, విప్లవ ప్రజాస్వామిక వేదిక సహాయ కార్యదర్శి ప్రొఫెసర్ సాయిబాబాకు యావ‌జ్జీవ కారాగార శిక్ష విధించింది గ‌డ్చిరోలి కోర్టు. మాహోయిస్టుల‌తో సంబందాలు ఉన్నాయ‌న్న కార‌ణంగా సరిగ్గా మే 9, 2014న కాలేజీలో పరీక్షలు నిర్వహించి వస్తున్న సమ యంలో దారికడ్డంపడి కళ్ళకు గంతలు కట్టి మ‌రీ ఎత్త్తుకుపోయారు పోలీసులు. దారుణంగా చిత్రహింస‌లు గురి చేస్తు నాగపూర్ కేంద్ర కారాగారంలో ‘అండా సెల్’ అని పిలిచే గాలీ వెలుతురు సోకని ఇరుకు గదిలో నిర్బంధించారు. మావోయిస్టులతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్త్తున్నాడని ఆరోపణ చేసి అత్యంత అమానవీయ పరిస్థితుల్లో నాగపూర్ సెంట్రల్ జైల్లో పడవేశారు. ఆ త‌రువాత వాత‌వ‌ర‌ణం అనుకూలించ‌క అనారోగ్యం పాలై చిక్కి శ‌ల్యం అయ్యాడు ప్రొపెస‌ర్ సాయిబాబ‌.

90 శాతం అంగ వైకల్యంతో తీవ్ర రక్తపోటు, గుండె జబ్బు, భుజాల నరాల క్షీణత, వెన్నెముక నొప్పి ఉన్న ఒక్క వ్య‌క్తిని ప‌నికి రాని ఆరోప‌ణ‌ల‌తో రాజ‌కీయ క‌క్ష‌ల‌తో జైల్లో చిత్ర‌హింస‌ల‌కు గురి చేశారు. తీరా అరెస్ట్ అయిన మూడేళ్ల‌కు యావ‌జ్జీవ కారాగార శిక్ష విదిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇది న్యాయ‌మా… నేరం నిరూపించి ముద్దాయికి శిక్ష నిర్ణయించడం కాకుండా, నేరారోపణకు గురైన వ్యక్తే తాను నిర్దోషినని నిరూపించుకునే వరకూ శిక్షను అమలు చేయవచ్చు. ఆ శిక్ష కూడా ఎంత అమానుషంగా ఉంటుందో సాయిబాబా కేసే ఉదాహరణ. ఆయనకు శారీరక వైకల్య సమాన అవకాశాల చట్టం ప్రకారం చక్రాల కుర్చీ కదలికలకు కావల్సిన సౌకర్యాలు ఇవ్వలేదు. మనిషి సహకారం లేనిదే కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిని పట్టించుకోకుండా ఒంటరి ఖైదులో ఉంచారు. ఇప్పుడు యావ‌జ్జీవ శిక్ష విదించారు ఇది మ‌న చ‌ట్టాలు.. ఇవి మ‌నం పాటిస్తున్న న్యాయాలు.

ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ మాట‌ల్లో…

మనుషుల్ని చంపిన వారు జనాల్లోనే దర్జాగా తిరుగుతున్నారు.. బ్యాంకులకు కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయినోళ్ళు వున్నారు.. దోపిడీలు చేసినోళ్ళు, జనాన్ని నిలువునా ముంచినోళ్ళు అందరూ బాగానే బతుకుతున్నారు.. కానీ ఆదివాసీ, గిరిజన హక్కుల కోసం పోరాడిన ప్రొఫెసర్ మాత్రం జీవితఖైదు తో జైలుకు వెళ్తున్నాడు..
……………
ఎక్కడో ఆంధ్రాలో అమలాపురంలో పుట్టి, ఉన్నత చదువులు చదివి, ఢిల్లీ లో యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఎదిగిన మన తెలుగోడు.. తనకు సంబంధం లేని.. ఏ బంధము లేని ఛత్తీస్ ఘడ్ ఆదివాసీల కోసం, వారి అస్తిత్వం కోసం, అమాయక గిరిజనం హక్కుల కోసం ప్రశ్నించాడు.. అందుకే మావోయిస్టులతో సంబంధాలున్నాయనే కారణాలతో మహారాష్ట్ర ఖాకీలు అరెస్ట్ చేశారు.. ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.. ఇప్పుడు గడ్చిరోలి కోర్టు సాయిబాబా కి జీవిత ఖైదు.. విధించింది..
………..
ఇంతకీ ఇప్పుడు జీవితఖైదు విధింపబడిన ఆ ప్రొఫెసర్.. కనీసం రెండు కాళ్ళు కదపలేని, ఒక చేయి చచ్చుబడి పోయిన..నడుము నుంచి సగం శరీరం తన అధీనం లేని వ్యక్తి. ఇది మ‌న చ‌ట్టాలు.. ఇవి మ‌నం పాటిస్తున్న న్యాయాలు.

అశోక్ వేములపల్లి ( సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ )

Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!