
ఆర్టీసీ డ్రైవర్ ఈ పేరు వినగానే ఓ సైదులు, ఓ రమేష్ గుర్తుకు వస్తారు. ఎందుకంటే వారి ప్రాణాలు పోతున్నా ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి చివరికి ఊపిరి వదిలిన గొప్ప ఆర్టీసీ డ్రైవర్లు. తాజాగా మిర్యాలగూడ వద్ద 37 మందిని ప్రాణాలను కాపాడి గుండెపోటుతో మరణించిన ఆర్టీసీ డ్రైవర్ అన్న సైదులు కర్తవ్యాన్ని గుర్తు చేసుకున్నాం. కానీ కొందరు మాత్రం ఆ వృత్తికే కలంకం తెచ్చేలా ప్రవర్తిస్తు ప్రయాణికుల చేతిలో దెబ్బలు తింటున్నారు. మరీ కొంత మంది అయితే ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. ఇలాంటి ఓ ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
బస్ లో ఉన్న ప్రయాణికుల ప్రాణాలను గాలికి వదిలేసి ఛోద్యం చేస్తు బస్ నడుపుతున్నాడు ఈ డ్రైవర్. సెల్ ఫోన్ ను పదే పదే చూసుకుంటు ద్యాసంతా ఫోన్లో నే పెట్టి డ్రైవింగ్ చేస్తున్నాడు. ప్రయాణికులు ఎంత వారించిన వినకుండా తన పని తాను చేస్తున్నాడు ఈ డ్రైవర్. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానం చేర్చాల్సిన డ్రైవర్ ఇలా సర్కస్ పీట్లు చేస్తుంటే ప్రయాణికులు మాత్రం తమ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని ప్రయాణించారు. కడప నుంచి కర్నూలు వెళ్తున్న ఈ బస్ ఆ బస్సు డ్రైవర్ చేసిన ఫీట్లతో ప్రయాణికులంతా భయంభయంగా ప్రయాణం చేశారు. ఓ ప్రయాణికుడు ఇందుకు సంబందించిన వీడియాను తీసి ఫేస్ బుక్ లో అఫ్ లోడ్ చేశాడు. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. ప్రయాణికుల ప్రాణాల కంటే ఈ డ్రైవర్ కి ఫోనే ఎక్కువైనట్టుగా ప్రపంచమంతా ఫోన్ లోనే ఉన్నట్టుగా ప్రమాదకరంగా డ్రైవింగ్ చేశాడు. అసలే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఒకవేళ ఏమైనా జరుగుంటే ఫోన్ ప్రాణాలను తిరిగిస్తుందా అని నెటిజన్లు ఆ డ్రైవర్ పై మండిపడుతున్నారు. వెంటనే ఆ డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి డ్రైవర్ల వల్ల మొత్తం ఆర్టీసీకే చెడ్డ పేరు వస్తుందని గొప్ప డ్రైవర్ల కర్తవ్యం గుర్తుకు లేకుండా పోతుందని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.