
తాజాగా కేంద్రం తీసుకున్న దేశ వ్యాప్త గో వధ నిషేదం తీవ్ర దుమారాన్ని లేపుతోంది. ఆవులను, బర్రెలను, ఒంటెలను అనుమతులు లేకుండా అమ్మకూడదని.. కభేళాలకు ఎట్టి పరిస్థితిలో తరలించకూడదని కేంద్రం ఆర్డర్స్ పాస్ చేసింది. దీంతో ప్రతిపక్షాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అయితే ఏకంగా నడిరోడ్టుపై పచ్చిమాంసం తింటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే యువతను, పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాన్ని అడ్డుపెట్టుకుని బీఫ్ అమ్మకాలను సాగిస్తోంది. ఇంత రచ్చ ఎందుకు..? అసలు భారత దేశంలో గో మాంసం తినే వర్గం ఎవరు..? గో మాంసానికి మతానికి లింక్ ఎక్కడ..? అత్యధిక శాతం హిందువులున్న దేశంలో గో వధ నిషేదం అమలుకు భారీ వ్యతిరేకతకు కారణం ఏంటి..?
ఇప్పుటిక్కడ జనాభా లెక్కల చిట్టా విప్పితే తప్ప గో వధ అనుకూల, వ్యతిరేకతకు గల కారణాలు తెలియవు. జనాభా లెక్కల ప్రకారం 2001 లో భారత దేశ జనాభా 101 కోట్లు.. 2011 కి వచ్చేసరికి 10 ఏళ్లలో 10 కోట్లకు పెరిగి భారత జనాభా 121 కోట్లకు చేరింది. అయితే ఇంతగా జనాభా పెరిగినా హిందూ జనాభా మాత్రం 0.7 శాతం తగ్గింది. అదే సమయంలో ముస్లిం 0.8 శాతం, క్రైస్తవ జనాభా 1.3 శాతం పెరిగింది. ఇక్కడ శాతాల్లో తేడా చిన్నగానే కనిపించినా హిందువుల కంటే హిందువేతర మతాల పెరుగుదల రెట్టింపుగా ఉన్న మాట వాస్తవం. దీంతో భారత దేశంలో రాబోయే కాలంలో హిందు జనాభా అమాంతం తగ్గిపోయినా ఆశ్చర్యం లేదంటున్నారు నిపుణులు.
ఇక అసలు విషయానికి వస్తే.. కబేళాల కోసం పశువుల అమ్మకాలను నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం తీసుకుంది. దీనిపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. బీఫ్ ను కేవలం ఒకే మతం వారు తినరని హిందువుల్లో ఉన్న కొన్ని వర్గాలు కూడా తింటాయని బహిరంగంగానే బదులిస్తున్నారు. ముసలి గొడ్లను రైతులు ఆదాయ వనరుగా చేసుకుని కభేళాలు అమ్మేస్తారని.. కేంద్రం నిర్ణయంతో రైతులు నిండా మునిగిపోయే అవకాశం ఉందని మరో వాదన. ఏది ఎలా ఉన్నా.. కేరళలో వినూత్ననిరసనలు హోరెత్తుతున్నాయి. రోడ్లపై బీఫ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ… తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అక్కడి గో వధ వ్యతిరేక వర్గం.
కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్నారు. మోడీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం బ్లాక్ డే పాటిస్తామని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రకటించింది. నోటిఫికేషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డీఎంకే లాంటి పార్టీలు కోరుతున్నాయి. కేంద్ర నిర్ణయాన్ని సమాఖ్య వ్యవస్థపై దాడిగా అభివర్ణించారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. రంజాన్ మాసం ఆరంభంలోనే కేంద్రం తీసుకున్న చర్య తమపై ప్రత్యక్ష దాడిగా మైనారిటీలు భావించే ప్రమాదం ఉందన్నారు. నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ప్రధానికి లేఖ రాశారు. ప్రజల ఆహారపు అలవాట్లను నియంత్రించే హక్కు కేంద్రానికి లేదని పుదుచ్చేరి సీఎం వి.నారాయణస్వామి తేల్చిచెప్పారు.
ఇదంతా జరుగుతున్నా కేంద్రం మాత్రం అసలు వెనక్కి తగ్గే పరిస్థితే లేదని తేల్చి చెప్పింది. గోవద నిషేదం వల్ల నిబంధనలకు విరుద్ధంగా జరిగుతున్న పశువుల అమ్మకాలతో పాటు స్మగ్లింగ్‌ను కూడా అరికట్టే అవకాశం ఉందన్నది కేంద్రం వాదన. ఈ నిర్ణయం లో హిందు వర్గానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలేవో.. నాయకులెవరో తేలిపోతుందని సైతం చెపుతుంది. ఏది ఏమైనా ఆహర నియమాల్లో మార్పనేది మానవనైజం. పుట్టుకతో ఏది ఇష్టం ఉంటే అదే తినడం అలవాటే అయినా పర్యావరణ మార్పులతో ఎన్నో రకాల తిండి అలవాట్లను మార్చుకున్న. మార్చుకుంటున్న జాతి మనది. ఇప్పటికిప్పుడు గో వదపై యుద్దం చేయాల్సిన అవసరం రాజకీయ నాయకులకు తప్ప గంగా జమునా తహజీబ్ అని చెప్పుకునే సామాన్య ప్రజలకి కాదన్నది ఫైనల్ సమాధానం. అయినా మా తిండి మా ఇష్టం మీరెవరు అడ్డుకోవడానికి ఇది ఎప్పుడు వినిపించే ప్రశ్నే .










