You are here
Home > ది ఫోర్త్ ఎస్టేట్ > సొంత ఊర్లో యువకుల మరణాలపై జనసేన నోరు మెదపడా…?

సొంత ఊర్లో యువకుల మరణాలపై జనసేన నోరు మెదపడా…?

మొగల్తూరు ఆనంద ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ పొట్టన పెట్టుకున్న యువకుల మరణాలపై ప్రశ్నించే పార్టీ సమాధానం ఏది.. ప్రశ్నించేందుకే తమ పార్టీ అని.. ఎక్కడ ఎప్పుడు ఏ అన్యాయం జరిగినా నిగ్గదీసి అడుగుతానని.. నినదించడం.. నిలదీయడమే.. జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశ్యం అని చెప్పిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంత గ్రామంలోనే జరిగిన మారణహోమానికి ఏ సమాధానం ఇస్తారు..?ఈ మారణహోమం జరుగుద్ది అని ముందే ఊహించి ఓ విఫ్లవంలా ఓ యువకుడు పల్లెలను.. ప్రజలను కాపాడాలని పోరాటం చేస్తే అతడిని కటకటాల పాలు చేశారు. ప్రభుత్వానికి ఎదురు తిరిగితే ప్రాణాలు పోవాల్సిందేనా..? అన్యాయంగా కేసుల పాలు కావాల్సిందేనా..? అన్ని ప్రశ్నలలాగే అంతా అయిపోయాక తీరిగ్గా వచ్చి ప్రశ్నిస్తారా..? లేక అభిమానులను గుండెల్లో పెట్టి చూసుకునే రియల్ హీరోలా వెంటనే స్పందించి నిజాన్ని నిగ్గుతేలుస్తారా..? పవనుడి ముందు ఇప్పుడు వంద ప్రశ్నలు ఉప్పెనలా ముంచెత్తేందుకు సిద్దంగా ఉన్నాయి. ఇక రీలో.. రియలో తేల్చుకోవాల్సింది పవర్ స్టారే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు….. ఓ సీనియర్ జర్నలిస్ట్ లేఖ

పవన్ జీ… మీరి మధ్య అనంతపురం సభలో మాట్లాడుతూ మీకు ఎలాంటి నాయకులు కావాలో చెప్పారు. యుద్ధట్యాంకులు ఎదురొచ్చినా, ఫిరంగులు దూసుకొచ్చినా నిలబడి పోరాడే యువనాయకుల కోసమే ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. అలాంటి యువకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. నాకు తెలిసిన ఓ యువవిప్లవకారుడి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలనిపించింది. మీకే ఎందుకు చెప్పాలనిపించిందంటే.. అతని ప్రస్తుత కారాగార పరిస్థితికి మీరూ పరోక్ష కారణం కనుక..!!
అవును అతను మీరు కోరుకున్న లక్షణాలున్న యువకుడే. పదేళ్లక్రితం జర్నలిస్టుగా కెరియర్ ప్రారంభించినప్పట్నుంచి తన అణువణువునూ విశ్వమానవుడు ‘చె గెవారా’తో నింపుకున్న అరుదైన యువకుడు. చె గెవారాను శ్వాసించడం కాదు.. ఆ విప్లవకారుడి అడుగుజాడల్లో నడిచాడు. జర్నలిస్టుగా అణగారిన వర్గాల గొంతుక తానయ్యాడు. నాటి అమాత్యులు కన్నెధారకొండపై కన్నేస్తే గిరిజనులకు అండగా ఆ కొండకు తన కథనాలతో రక్షణకవచమయ్యాడు. జర్నలిస్టుగా తాను అనుకున్నది పూర్తిగా చెయ్యలేకపోతున్నానని భావించినప్పుడు ఆ వృత్తి నుంచి బయటికొచ్చి ‘చె గెవారా’ సిద్ధాంతాలను యువతలోకి ఎక్కించడమే లక్ష్యంగా పాలకొల్లులో విశ్వమానవ వేదిక స్థాపించాడు. సేవా కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై పోరాటాలు రెండేళ్లలో ఆ వ్యక్తిని ఓ శక్తిగా మార్చాయి.
ఈ క్రమంలోనే తన కళ్లముందే మెగా ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ రావటం.. అది ప్రకృతికీ, ప్రజలకూ తీరని నష్టమని భావించి ఉద్యమించాడు. అప్పటిదాకా సేవాకార్యక్రమాలతో యువతనంతా ముందుండి నడిపిన వ్యక్తి ఏకంగా జనంలోకి వెళ్లి ఉద్యమించడంతో అధికాపార్టీ ఎమ్మెల్యేకి ఈ యువ ఉద్యమకారుడు రాజకీయ ప్రత్యర్థిలా కనిపించాడు.

మీరు చెప్పిన అధికారమనే యుద్ధ ట్యాంకులు దాడి చేశాయి. కేసులు ఫిరంగుల్లా వేధిస్తే అతను వెనక్కి తగ్గలేదు. ప్రధాన మీడియా అటువైపు దృష్టి పెట్టకముందే మెగా ఆక్వాపుడ్ పార్క్ ఎంతటి ప్రమాదకరమో ఫేస్ బుక్ వేదికగా నిజానిజాలను బయటపెట్టాడు. ఆ ప్రాంత జనంపై జరుగుతున్న దాడులు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా నినదించాడు. ఆ క్రమంలోనే స్థానిక పరిస్థితుల్ని ఎదురించేందుకు తన శక్తి సరిపోదని భావించి బాధిత గ్రామస్తుల్ని తీసుకొని నేరుగా హైదరాబాద్ వచ్చి మిమ్మల్ని కలిశారు. అతను ఏం చెప్పాడో, మీరు ఏం నమ్మారో అంతా మీకు తెలుసు. నాడు మిమ్మల్ని కలవడమే అధికారపక్షం దృష్టిలో అతను చేసిన ప్రధాన తప్పు. పశ్చిమ గోదావరి జిల్లా జోన్ పేజీలను దాటని ఆక్వా ఫుడ్ పార్క్ సమస్య రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశం కావడంతో అతన్నో ప్రమాదకరమైన వ్యక్తిగా భావించి వేటాడటం మొదలుపెట్టారు. ఈ విశ్వమానవుడు తాగి దాడి చేశాడంటూ ఓ అమాయక ఎస్సీ కుర్రాడు అట్రాసిటీ కేసు పెట్టాడు. దారిన పోయే వ్యక్తి తనను ఆశ్రమంలో చేరమని వేధిస్తున్నారని కేసు పెట్టాడు. పాలకొల్లులో వీధివీధినా ఆ యువకుడు దళిత వ్యతిరేకి, అభివృద్ధి నిరోధక శక్తి అనే ఫ్లెక్సీలు వెలిశాయ్.

ప్రపంచ మానవులంతా సమానమేనన్న సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి కుల సంఘాలను రెచ్చగొడుతున్నాడనే కేసు పెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు.. రోజుకో కేసు ఇప్పటికీ పెడుతూనే ఉన్నారు. మీరు గమనించారా.. ఈ కేసుల్లో ఎక్కడా ఆక్వాఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాడిన కేసు మాత్రం లేదు. ఎందుకో తెలుసా.. ఆ కేసులో అరెస్ట్ చేస్తే ‘నేనూ తుందుర్రు వచ్చి అరెస్టవుతా’నని ఆ రోజు ప్రెస్ మీట్ లో మీరన్న మాటలే కారణం. అందుకే అది తప్ప సర్వ కేసులూ పెట్టి అరెస్ట్ చేసి ఇప్పుడు నరసాపురం సబ్-జైల్లో పెట్టారు. అదే సమయంలో విశ్వమానవ వేదికను మూయించే ప్రయత్నం చేస్తున్నారు.


ఇప్పటికే వృద్ధాశ్రమాన్ని ఎందుకు మూసి వేయకూడదో చెప్పాలంటూ కలెక్టర్ నోటీసులిచ్చారు. పెట్టిన కేసులన్నీ చూపుతూ అతి త్వరలోనే రౌడీషీట్ తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే రౌడీషీట్ ఓపెన్ అయిన వ్యక్తి ఎలాంటి స్వచ్ఛంద సంస్థలూ నిర్వహించడానికి వీల్లేదు. విశ్వమానవ వేదికను లేకుండా చేస్తే ఆ విశ్వమానవుడిని లేకుండా చేయడం తేలికని భావిస్తున్నారు. మీకు ఈ లేఖ రాయడానికి ప్రధాన కారణం ఇదే. ఓ మహోన్నత లక్ష్యంతో పనిచేస్తున్న వ్యక్తిని జైల్లో పెట్టి.. అతను స్థాపించిన విశ్వమానవ వేదికను మూసేస్తే ఎవరికి లాభం..? వందలాది మంది యువతలో స్ఫూర్తి నింపుతున్న వ్యక్తిపై కక్ష సాధింపు దేనికి సంకేతం..?
ఇప్పుడు చెప్పండి.. యుద్ధ ట్యాంకులకూ, ఫిరంగులకూ ఎదురొడ్డి నిలబడ్డ యువకుల్ని ఎవరు కాపాడగలరు..? విశ్వమానవుడు మల్లుల సురేష్ కి మీరిచ్చే సలహా, సందేశాలను వినాలని ఉంది. అతను జైల్లో ఉన్నా వేలాది మెదళ్లలో జ్వలిస్తూనే ఉన్నాడు. ఆ ప్రభావంతోనే అడుగుతున్నా.. జనం మధ్య జనం కోసం నిలబడ్డ రియల్ హీరోలను అక్రమ కేసుల నుంచి కాపాడే శక్తి జనసేనకు ఉందా..? ఎలాంటి తప్పు చెయ్యకపోయినా 8 ఏళ్లు జైల్లో పెట్టి అతని జీవితం సర్వనాశనమయ్యాక నిర్దోషివంటూ విడుదల చేసే శక్తి ఈ వ్యవస్థకు ఉందనేందుకు సత్యంబాబే ఉదాహరణ. ఇలాంటి ఇనుప చక్రాల వ్యవస్థ కింద నలిగిపోకుండా మల్లుల సురేష్ లాంటి శక్తివంతమైన యువకుల్ని ఎలా కాపాడుకోవాలి..??? పవన్ ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరా.. ఇస్తే ఈ లేఖకు సమాధానం ఎంత త్వరగా వస్తుందో చూద్దాం. 

Related Posts
వ‌డ్డెర‌బ‌స్తీ కూడా దాట‌ని వందేళ్ల ఉత్స‌వం..? భారీ నిధులు ఎక్క‌డ‌పోయిన‌య్..?
తెలంగాణ రాష్ట్రానికి ఊపిరి.. ఉద్య‌మాల పోరుగ‌డ్డ‌.. మ‌లిద‌శ ఉద్య‌మంలో శ‌త్రువుకు చెమ‌ట‌లు పుట్టించి ఢిల్లీ నాయ‌కుల త‌ల‌లు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాదించి పెట్టి పోరాటాల గ‌డ్డ‌.. ఎంద‌రో అమ‌ర‌వీరుల‌కు అమ్మ‌.. మ‌హోన్న‌తుల‌కు పుట్టినిల్లు మ‌రి అంత‌టి ఘ‌న చరిత్ర క‌లిగిన ...
READ MORE
కఠోర శ్రమతో పేదరికాన్ని జయించిన దివిసీమ వనిత… కృషితో నాస్తి దుర్భిక్షం అని నిరూపించిన రేవతి.
పూరి గుడిసెలో జీవనం... అమ్మనాన్న వ్యవసాయ కూలీలు రెక్కాడితే కాని డొక్కాడని బ్రతుకులు. కూలీలేకుంటే పస్తులుండాల్సిన కడుపేదరికం.. అయిన తన పట్టుదలను మాత్రం వదలలేదు.. చదువు తప్ప తమ దారిద్ర్యాన్ని దూరం చేసే ఆయుధం మరొకటి లేదని ధృడంగా నమ్మింది. పేదింటి ...
READ MORE
పొలాల అమావాస్య ప్రత్యేకత.. గోదారమ్మ కొంగు బంగారంగా సాగే పొలాల పండుగ.
దేశ వ్యాప్తంగా శ్రావణకృష్ణ అమావాస్యగా పిలుచుకునే ఈ పండుగ తెలుగునాట పొలాలమావస్యగా ప్రసిద్ది. పంటపొలాలను రక్షించే పొలాలమ్మ పోలేరమ్మ సాక్షిగా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు రైతులు. ఈ అమవాస్యకు గోదావరి పొర్లి పొర్లి వస్తుందని నానుడి. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో దీనికి ...
READ MORE
5 వేలకు ఆశపడి తీసుకుని ఇప్పుడు లీగల్ గా ఇరుక్కున్న ఏపీ నకిలీ పాస్టర్లు.!!
ఆంధ్ర ప్రదేశ్ లో పాస్టర్లు గా చెలామణి అవుతున్న చాలా మంది మతం మారిన వారు ఇప్పుడు లీగల్ గ ఇరుక్కుపోయారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్సీ సామాజిక వర్గం నుండి బీసీ సామాజిక వర్గం నుండి కొందరు క్రైస్తవ మతం తీసుకుని పాస్టర్లు గా ...
READ MORE
కూతురు పుట్టిందని సంబరపడ్డ మారుతీరావుకు కూతురే శత్రువైంద.?
పుట్టినప్పుడు పండంటి ఆడ బిడ్డ పుట్టిందని సంబరపడ్డ ఆ పిచ్చి తండ్రికి ఆ బిడ్డే తన చావు ను శాసిస్తుందని తెలుసుకోలేకపొయాడు.ఈ ప్రపంచం లో తన బిడ్డ ను గొప్ప గ పెంచాలనుకున్నాడు కానీ ఆ తండ్రే ప్రపంచం నుండి వెళ్లిపోవాల్సి ...
READ MORE
ఆయేషా హత్య కేసు.. సత్యం నిర్దోషి..! మరి దోషులెవరు..?
న్యాయం గెలిచింది. ఎన్నాళ్లకు గెలిచిందనే దానికంటే ఎట్టకేలకు గెలిచింది అని చెప్పడమే ఉత్తమం. తొమ్మిదేళ్ల సుదీర్ఘ పోరాటంలో కఠిన శిక్షను అనుభవించి చేయని తప్పుకు శిక్ష పడి కాళ్లు చేతులు చచ్చుబడిపోయి చివరికి ప్రాణాలతోనే సత్యం న్యాయాన్ని గెలిచాడు. మరీ ఇక్కడ ...
READ MORE
అర్నాబ్ పై కేసుల వర్షం.. రిపబ్లిక్ టీవి వేగాన్ని ఓర్వని టైమ్స్ నౌ.
అనుకున్నదే జరిగింది. రావడం రావడంతోనే సంచలనాలకు కేరాప్ అడ్రస్ గా మారిన రిపబ్లిక్ టీవి అర్నబ్ పై కేసుల వర్షం మొదలైంది. తొలి ప్రసారంలో లాలు  యాదవ్ షాబుద్దిన్ టేపులయో సంచలనం సృష్టించిన రిపబ్లిక్ టీవి.. వరుసగా బాంబులు పేలుస్తునే ఉంది. ...
READ MORE
పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పాలి – ఏబీవీపీ నేత శ్రీహరి
జమ్ము కాశ్మిర్ పుల్వామా లో మన సైన్యం పై పాకిస్తాన్ ఉగ్రమూక జరిపిన దాడిని ఏబీవీపీ నగర కార్యదర్శి శ్రీహరి తీవ్రంగ ఖండించారు. ఈ సంధర్భంగ ఉస్మానియా యూనివర్శిటీ లో విధ్యార్థులు కార్యకర్తలతో కలిసి పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ ను దగ్ధం ...
READ MORE
గీ రోడ్లపై వెల్తే.. చేరేది ఇంటికా నరకానికా.??
పొద్దున లేస్తే హైద్రాబాద్ ని సింగపూర్ చేస్తా కరీంనగర్ ని మలేషియ చేస్తా వరంగల్ ని ఇస్తాంబుల్ చేస్తా అనుడే గానీ అసలు ఈ హైద్రాబాద్ రోడ్ల పరిస్థితి ఈ తెలంగాణ సర్కార్ కల్లకు కనిపిస్తుందా..?? ఒక్కసారి ఇంటి నుండి బయటికెల్తే.. ఏ ...
READ MORE
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సంచలన విషయాలు బయటపెట్టిన బీజేపీ రఘునందన్ రావు.!!
ప్రతిష్టాత్మకంగ నిర్మాణం చేపట్టి పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులను పిలిచీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ దగ్గరుండి ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి తెలంగాణ భాజపా అధికార ప్రతినిధి ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు ...
READ MORE
మీరు వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గ ఉన్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త.!!
ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడకం అనేది సర్వ సాధారణం అయిపోయింది.అంతే కాదు చాలా మంది ఎదో ఒక వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గ వ్యవహరిస్తుంటారు.అయితే ప్రస్తుతం తప్పుడు వార్తలు వైరల్ చేయడం ఎక్కువైంది, వైరల్ ...
READ MORE
మద్యం మత్తలో అతి వేగంగా కారు నడిపి ప్రాణాలు తీసిన యువత.. హైదరబాద్ లో మారని పరిస్థితి.
యువత వేగం మత్తు వీడటం లేదు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న నగరం లో యువకులు మాత్రం మద్యం మత్తులో అతి వేగంగా వాహనాలను నడిపి ప్రాణాలు గాల్లో కలుపు కుంటునే ఉన్నారు. ఇలాంటి ఘటనే ఈ రోజు ఉదయం చైతన్య ...
READ MORE
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ కాదేవి భావవ్యక్తీకరణ కు అడ్టు. అయితే శృతిమించితే మాత్రం తిప్పలు తప్పవంటున్నారు పోలీస్ లు. తాజాగా వరుస పెట్టి జరుగుతున్న సోషల్ మీడియా ఘటనలతో వేగం పెంచారు. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా అందుకు ...
READ MORE
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
అక్క చుట్టమైతే లెక్క చుట్టం కాదన్నది సామెత. కానీ వీళ్లు మాత్రం ఇష్టం ఉన్నట్టుగా రెచ్చిపోతున్నారు. యుగయుగాల చరిత్రకి రక్తపు మరకలంటిస్తున్నారు. అహింస బాటలో సాగిన ఆనాటి రక్షణను.. హింసే పరమో ధర్మం అంటూ సాగుతున్నారు. గోరక్షకుల పేరుతో కిరాతానికి ఒడిగడుతున్న వారి ...
READ MORE
భర్త మృతి వార్తను బ్రేకింగ్‌ న్యూస్‌ గా చదివిన న్యూస్ రీడర్.
భర్త మృతి వార్తను బ్రేకింగ్‌ న్యూస్‌ గా ఓ న్యూస్ రీడర్ చదవిన ఘటన మీడియా ప్రతినిధులను ఆవేదనకు గురి చేస్తోంది.  మీడియాలో పని చేసేవారు భావావేశాలకు లోనుకాకుండా విధులు నిర్వర్తిస్తారని ఈ వార్త నిజం చేసింది.  పలు సందర్భాల్లో వ్యక్తిగత ...
READ MORE
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాద్యక్షులుగ ఎన్నికైన డా.గిరిధరాచార్యులు
జాతీయవాద సిద్దాంతంతో పనిచేస్తూ జర్నలిస్టులకు కొండంత అండగా ఉంటూ దేశవ్యాప్త గుర్తింపు పొందిన జర్నలిస్ట్ అసొసియేషన్ ఆఫ్ తెలంగాణ(JAT) సంస్థ కు రాష్ట్ర ఉపాద్యక్షులుగా ఏకగ్రీవంగ ఎన్నికయ్యారు ప్రముఖ విద్యావేత్త, జర్నలిజం పవర్ ఛానెల్ చైర్మన్ డా.గిరిధరాచార్యులు. ఈ సంధర్భంగ భాగ్యనగర్(హైద్రబాద్) ...
READ MORE
తెలంగాణ ఉద్యమ కెరటం..వంజరి నేత కరిపె రాజు వంజరికి జన్మధిన శుభాకాంక్షలు.!!
తెలంగాణ ఉద్యమకారుడు, అఖిల భారత వంజరి సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరిపె రాజు వంజరి జన్మధినం సంధర్భంగ ఆ సంఘం నాయకులు రాష్ట్ర వ్యాప్తంగ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కరిపె రాజు వంజరి తెలంగాణ ఉద్యమంలో కీలక ...
READ MORE
సచివాలయం కూల్చివేత విషయంలో హైకోర్ట్ లో కేసిఆర్ సర్కార్ కు షాక్.!!
ప్రస్తుతం ఉన్న సచివాలయం కూల్చి ఎర్రమంజిల్ భవన్ ను కూల్చి ఆ స్థలంలో నూతన సచివాలయం అసెంబ్లీ కట్టడానికి భూమి పూజ చేసిన కేసిఆర్ సర్కార్ కు ఆదిలోనే ఆటంకం తగిలింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్ట్ లో ప్రజా ప్రయోజన ...
READ MORE
డ్రైవర్ కం ఓనర్ పథకం దరఖాస్తు చేస్కోవ‌డం ఎలా..? అర్హ‌త‌లు ఏంటి..?
నిరుద్యోగ యువ‌త‌కు ఉపాది క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన ప‌థ‌కం డ్రైవ‌ర్ కం ఓన‌ర్. ఈ ప‌థ‌కంలో భాగంగా హైదరాబాద్ నగరంలో ట్యాక్సీలుగా నడిపే అవ‌కాశం క‌ల్పిస్తోంది తెలంగాణ ప్ర‌భుత్వం. ఆసక్తి ఉన్న నిరుద్యోగ‌ డ్రైవర్లకు మారుతి స్విఫ్ట్ డిజైర్ లను ...
READ MORE
ఓ జర్నలిస్ట్ ఆవేదన.. సాయం చేసే దాతల కోసం ఎదురుచూపు.
నేను ఐన్యూస్ లో జాబ్ చేస్తున్నప్పుడు నా కొలీగ్(అప్పటికే ఆయన ఐన్యూస్ లో జాబ్ మానేశాడు.ఇప్పుడు ఆయన పేరు అవసరము లేదనుకోండి) కు యాక్సిడెంట్ అయ్యింది. కేర్ ఎమెర్జెన్సీ వార్డ్ లో జాయిన్ అయ్యడని తెలిసి మనతోపాటు పని చేసినవాడు అని ...
READ MORE
కనులు చూడని లోకాన్ని తన గొంతుతో నడిపిస్తున్న 12 ఏళ్లు కుర్రాడు.
"ఈ లోకం గుడ్డిది.. ఏం చెప్పినా నమ్మేస్తుంది.. ఈ లోకం మూగది నిజాన్ని మాట్లాడే ధైర్యం చేయదు.. ఈ లోకం చెవిటిది సమాజ బాగు కోసం ఏ మంచిని వినిపించుకోదు.. ఈ లోకం అడుగులు వెనక్కి చూపులు ముందుకి... ఈ లోకం ...
READ MORE
కులాల మధ్య అంతరాలు తగ్గించి,హిందూ బంధువులను ఒక్కటి చేస్తున్న ముని వాహన సేవ.!!
భగవంతుడి స్రృష్టి లో మానవుడు అత్యంత గొప్ప స్రృష్టి అని చెప్పొచ్చు. కానీ ఆ మానవుడు కులాలనే అడ్డు గోడలను నిర్మించుకుని నాది పెద్ద కులం నీది చిన్న కులం నువు అంటరాని వాడివి నువు అగ్రకులవాడివి నువు దళితుడిని హరిజనుడు ...
READ MORE
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగ నేడు పాకిస్తాన్ పై భారత్ జరిపిన వైమానిక దాడి విజయవంతం కావడంతో.. దాదాపు 400 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు హతం కావడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.ఈ క్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ...
READ MORE
బంగారు తెలంగాణలో మూడేళ్లలో సాదించిన బంగారమెంత..?
కేసిఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే  కేసిఆర్. కేసీఆర్ అంటే ఉద్యమం.. ఉద్యమం అంటేనే కేసీఆర్. ఇది 2014 ఎన్నికల ముందు ఇదంతా.. ఆ తర్వాత తెలంగాణ సిద్దించడం.. ఆ తరువాత  జరిగిన ఎన్నికల్లో ఉద్యమ పార్టీకి కనీవినీ ఎరుగని రీతిలో చరిత్రను ...
READ MORE
పాయింట్స్ సరే… మరీ నా గాయాలకు కారణం ఎవరు సార్..?
హైదరబాద్ లో అమలు కాబోతున్న ట్రాపిక్ పాయింట్స్ రూల్స్ పై ప్రజల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. మంచివే కానీ... అంటూ ధీర్ఘంతో కూడిన సమాదానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ.. ట్రాపిక్ రూల్స్ పేరు తో ...
READ MORE
వ‌డ్డెర‌బ‌స్తీ కూడా దాట‌ని వందేళ్ల ఉత్స‌వం..? భారీ నిధులు ఎక్క‌డ‌పోయిన‌య్..?
కఠోర శ్రమతో పేదరికాన్ని జయించిన దివిసీమ వనిత… కృషితో నాస్తి
పొలాల అమావాస్య ప్రత్యేకత.. గోదారమ్మ కొంగు బంగారంగా సాగే పొలాల
5 వేలకు ఆశపడి తీసుకుని ఇప్పుడు లీగల్ గా ఇరుక్కున్న
కూతురు పుట్టిందని సంబరపడ్డ మారుతీరావుకు కూతురే శత్రువైంద.?
ఆయేషా హత్య కేసు.. సత్యం నిర్దోషి..! మరి దోషులెవరు..?
అర్నాబ్ పై కేసుల వర్షం.. రిపబ్లిక్ టీవి వేగాన్ని ఓర్వని
పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పాలి – ఏబీవీపీ నేత శ్రీహరి
గీ రోడ్లపై వెల్తే.. చేరేది ఇంటికా నరకానికా.??
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సంచలన విషయాలు బయటపెట్టిన బీజేపీ రఘునందన్
మీరు వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గ ఉన్నారా.. అయితే
మద్యం మత్తలో అతి వేగంగా కారు నడిపి ప్రాణాలు తీసిన
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
భర్త మృతి వార్తను బ్రేకింగ్‌ న్యూస్‌ గా చదివిన న్యూస్
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాద్యక్షులుగ ఎన్నికైన డా.గిరిధరాచార్యులు
తెలంగాణ ఉద్యమ కెరటం..వంజరి నేత కరిపె రాజు వంజరికి జన్మధిన
సచివాలయం కూల్చివేత విషయంలో హైకోర్ట్ లో కేసిఆర్ సర్కార్ కు
డ్రైవర్ కం ఓనర్ పథకం దరఖాస్తు చేస్కోవ‌డం ఎలా..? అర్హ‌త‌లు
ఓ జర్నలిస్ట్ ఆవేదన.. సాయం చేసే దాతల కోసం ఎదురుచూపు.
కనులు చూడని లోకాన్ని తన గొంతుతో నడిపిస్తున్న 12 ఏళ్లు
కులాల మధ్య అంతరాలు తగ్గించి,హిందూ బంధువులను ఒక్కటి చేస్తున్న ముని
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
బంగారు తెలంగాణలో మూడేళ్లలో సాదించిన బంగారమెంత..?
పాయింట్స్ సరే… మరీ నా గాయాలకు కారణం ఎవరు సార్..?
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!