
విజయం అపజయాల మాటలు.. ఘన చరిత్రలు.. తాతల మీసాల సంపెంగ నూనే కథలు ఈ ట్రెండ్ యుగంలో పనికి రావడం లేదు. కోట్లకు కోట్లు లాభాలు ఆర్జించాలని తప్పుడు దారిలో నడుస్తున్న వాడు సైతం ఒక్క ఆదారం.. ఒకే ఒక్క ఆధారం దొరికితే చాలు.. మళ్లీ జన్మలో తలెత్తుకుని బ్రతకకుండా చేస్తోంది సోషల్ మీడియా. నాదే సామ్రాజ్యం, నేను చెప్పిందే వేదం, నేను చూపించిందే వార్త అంటోంది తెలుగు మీడియా. ఇప్పుడీ రెండు మీడియాల మధ్య ప్రచ్చన్న యుద్దం మొదలైంది. చివరికి కార్పోరేట్ దిగ్గజాలను సైతం గజగజ వణికించేందుకు వన్ మెన్ ఆర్మీలు సిద్దమవుతున్నాయి. ఇంతకీ ఈ మీడియాల మధ్య యుద్దం ఏంటి.. ఎవరిని జనం నమ్ముతున్నారు.. రేపటి తరం ఏం కోరుకుంటోంది…? ఓ లుక్కేద్దాం.
సోషల్ మీడియా.. సెల్ చేతిలో ఉంటే చాలు సొళ్లును పక్కనెట్టి అసలైన దమ్ము చూపించే సత్తా ఉంటే నీకు నువ్వే రారాజువని నిరూపిస్తోంది. ఒకప్పుడు రోజులు పట్టిన వార్త.. ఆ తరువాత గంటలకు.. ఆ తదుపరి నిమిషాలకు మారి.. ఇప్పుడు తాజాగా క్షణాల్లో వీక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఏది నిజం ఏది అబద్దం.. ఏది అభూత కల్పన.. ఏది సాక్ష్యం అనే వివరణ కూడా క్షణాల్లో తేలిపోతోంది. చివరికి తప్పు చేసిన వాడు సైతం తలెత్తుకోలేని పరిస్థితిని కల్పించి విజయం సాదిస్తోంది. ఇది ఒక సైడ్ మాత్రమే మరో సైడ్ చెప్పుకునే ముందు తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా వెలుగెంతో చూద్దాం.
కాకలు తీరిన ఉద్దండపిండాలను సైతం మట్టి కరిపించిన చరిత్ర ఎలక్ట్రానిక్ మీడియాది. దేశ స్వాతంత్ర్యం ముందు నుండి ఇప్పటి వరకు ఫ్రింట్ మీడియా తన సత్తా తాను చూపిస్తూనే ఉంది. దాని చరిత్ర లోతుల్లోకి భవిష్యత్ వర్తమాన ప్రస్తావనలోకి వెళ్లడం లేదు. కేవలం ఎలక్ట్రానిక్ మీడియా గురించి ప్రస్తావన. ఫ్రింట్ నుండి ఓనమాలు దిద్దుకున్న ఎలక్ట్రానిక్ మీడియా.. తాతకు దగ్గులు నేర్పుతోంది. ఓకే అదే విజయం అని మురిసిపోవడమే ఇప్పుడు దానికి వచ్చిన అసలు సమస్య. తాతను తన్నేవాడుంటే వాడి తలదన్నెవాడు పుట్టుకు రాకుండా పోడు ఇప్పుడు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా పరిస్థితి కూడా అదే.
కార్పొరెట్ దిగ్గజాల చేతిల్లోకి.. రాజకీయ నాయకుల హస్తల్లోకి వెళ్లిన తెలుగు మీడియా మూడు పువ్వులు ఆరుకాయలుగా బాగానే విరాజిల్లింది. ఇప్పుడు కూడా అదే రేంజ్ లో వెలుగుతోందనే భ్రమల్లో ఉంది. మేము చెప్పిందే వేధం అన్న తరహాలో ఛానల్ ఛానల్ కో వార్త ప్రసారం అయి ఒక సమస్య వంద రకాలుగా వేల బావాలను చూపించే సరికి వీక్షకుడికి చిర్రెత్తుకొచ్చింది.
రాజకీయ కోణంలో చావు వార్తలను మలచి తనకు అనూకులంగా మార్చుకుని సాదిస్తున్న విజయాన్నే మొత్తం వీక్షకుడి విజయంగా భావిస్తోంది. ఎడిటింగ్ లు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లు వీర లెవల్లో దట్టించి ఇదే నిజం అన్నట్టుగా వార్తను వండి వార్చింది. ఇదంతా గతం వర్తమానం మారింది. ఏ వార్త మంచో ఏ వార్త చెడో ఏది అభూత కల్పనో క్షణాల్లొక వీక్షకుడు పసి గట్టేస్తున్నాడు. అంతే కాదు నమ్మకాన్ని నిలబెట్టుకోలేని ఛానళ్ల జోలికి కూడా పోవడం లేదు. దీంతో మార్కెట్ లేక టీఆర్పీ రేట్లు డమాల్ అయి.. చివరకి ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించుకోని పరిస్థితికి దిగజారాయి. ఇలాంటి పరిస్థొతిల్లోనే పోటీకి వచ్చిన సోషల్ మీడియాను ఎదుర్కోలేక బొర్లా పడుతున్నాయి.
అయితే సోషల్ మీడియా చెప్పేదంతా నిజమే అనుకుంటే పొరపాటే.. అక్కడ కూడా అభూత కల్పనలు, భూతులి, రోతలకు కొదువలేదు. కేవలం ప్రత్యక్షంగా జరిగిందే నిజమని నమ్మి నిర్ణయం తీసుకోవడం మాత్రమే సోషల్ మీడియాలో కన్పిస్తోంది. తెర వెనుక జరిగిన తంతంగాన్ని తెలుసుకునేందుకు అవకాశం లేకుండానే నిర్ణయాన్ని చెప్పేస్తోంది. దీంతో వంద ఘటనల్లో కేవలం 60% శాత్రమే విజయం సాదిస్తున్నాయని.. సోషల్ మీడియాను నమ్మేలా చేస్తున్నాయని సర్వేలు చెపుతున్నాయి. ఈ పోటీ ప్రపంచంలో క్షణం లో కళ్ల ముందు జరిగేదే నిజం కాదని చెప్పే సాహసం సోషల్ మీడియా చేయలేకపోతోంది. దీంతో 50% విజయాన్ని దక్కించుకున్న ఎలక్ట్రానిక్ మీడియాకే మార్కులు ఎక్కువ పడుతున్నాయి. అయితే విశ్వస నీయతలో మరింత రాటు దేలితే సోషల్ మీడియా దాటికి ఎలక్ట్రానిక్ మీడియా బోర్డు తిప్పేయడం ఖాయంగా కన్పిస్తోంది. కార్పోరెట్ సామ్రాజ్యం కాదు సామాన్యుడి సామ్రాజ్యందే అంతిమ విజయం అని తెలిపే సోషల్ మీడియాకు ఇప్పుడో నమ్మకమైన శక్తి కావాలి అప్పుడే పూర్తి విజయం.
























