
తెలుగు మీడియా పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారయింది. కుప్పలు కుప్పలుగా వస్తున్న తెలుగు న్యూస్ ఛానల్లు ఏడాది తిరక్కుండానే బిస్తరి కట్టేస్తున్నాయి. డక్క ముక్కిలి తిని కింద మీద పడి ఉన్నామ అంటే ఉన్నాం అనేలా మరి కొన్ని ఛానళ్లు నెట్టుకొస్తున్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి వచ్చి చేరింది ఎక్స్ ప్రెస్ న్యూస్ ఛానల్. జీతాల కష్టాలతో ముప్పు తిప్పులు పెట్టిన సీవిఆర్ ఛానల్ ను మించిపోయి జీతాలు ఇవ్వకుండా ఉండడంలో మేము ఎక్స్ ప్రెస్ లా పారిపోతున్నాం అని నిరుపిస్తోంది ఎక్స్ ప్రెస్ న్యూస్ ఛానల్ యాజమాన్యం. మొన్నటి రాక ఇగ ఇస్తాం అగో ఇస్తాం అంటూ బుకాయించిన ఎక్స్ ప్రెస్ యాజమాన్యం ఇప్పుడు మాత్రం ఏకంగా ఫ్లేట్ పిరాయింది. దాదాపుగా 5 నెలల జీతాలను ఇవ్వకుండా ఉద్యోగులను అరిగోష పుచ్చుకుంటోంది. దీంతో ఇప్పటి దాకా ఉన్న లోగుట్టు వ్యవహారాలు బజారున పడ్డాయి.
5 నెలలుగా జీతాలు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతోంది ఎక్స్ ప్రెస్ యాజమాన్యం. ఇక ఆర్థిక పరంగా ఇబ్బందులు తారస్థాయికి చేరడంతో వెంటనే జీతాలు ఇవ్వాలంటూ ధర్నా కు దిగారు ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు. అప్పటి వరకు ప్రసారాలు కొనసాగించేది లేదంటు ఆఫీస్ లో నే ధర్నా చేపట్టారు. పండుగ పబ్బాలు తిండి తిప్పలు అన్ని వదిలేసి ఆఫీస్ లోనే ఉంటూ ధర్నా చేస్తున్నారు.
ఈ ధర్నా ఈ రోజుతో 5 వ రోజుకు చేరిన యాజమాన్యంలో మాత్రం చలన లేదు. దీంతో ఉద్యోగుల ఆవేశం కట్టలు తెచ్చుకుంది.. మేము చచ్చినా పట్టించుకోదా మాతో ఇన్నాళ్లు పని చేయించుకుని జీతాలు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న యాజమాన్యానకి గట్టి బుద్ది చెప్పే వరకు నిరసన ఆపేదే లేదంటున్నారు ఉద్యోగులు.తమ పరిస్థితి అర్థం చేసుకుని జర్నలిస్ట్ సంఘాలు సహకారం అందిచాలని తమ కుటుంబ పరిస్థితులను చక్కదిద్దుకునేందుకు రావాల్సిన జీతాలను ఇప్పించాలని కోరుతున్నారు. యాజమాన్యాలతో ఎన్ని సార్లు చర్చలు జరిపినా ఫలితం లేదని… అంతేకాక యాజమాన్యం ఇప్పుడు మా కుటుంబాలను నడి రోడ్డు మీద నిలుచోబెట్టి ఛోధ్యం చూస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరీ ఎక్స్ ప్రెస్ యాజమాన్యం ఎప్పుడు దిగి వస్తుందో.. ఉద్యోగుల కష్టాలను ఎప్పుడు తొలగిస్తుందో చూడాలి. ఇలాంటి ఛానళ్లు తెలుగు మీడియా పరువును ఉద్యోగులు కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయు. గతంలో సీవిఆర్, ఐ న్యూస్ ఛానళ్ల ఉద్యోగులు ఇలాగే వారాలు వారాలు నిరసన దీక్షలు చేపడితే గాని వారికి న్యాయం జరగలేదు. మరిప్పుడు ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు కూడా అదే దారిలో వెళుతున్నా న్యాయం ఎప్పుడు దక్కుతుందో మాత్రం తెలియడం లేదు.